14 జులై, 2015

983. అన్నమ్, अन्नम्, Annam

ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ


భూతాన్యత్త్యద్యతే భూతైశ్చేతి బ్రహ్మాన్నముచ్యతే ప్రాణులచే తినబడును; ప్రాణులను తినును. అట్టి అన్నము పరమాత్మ రూపమే!

:: తైత్తిరీయోపనిషత్ - ఆనన్దవల్లి (బ్రహ్మానన్దవల్లి) ద్వితీయాధ్యాయః, ద్వితీయోఽనువాకః ::
అన్నాద్వై ప్రజాః ప్రజాయన్తే । యాః కాశ్చ పృథివీగ్‍ం శ్రితాః । అథో అన్నేనైవ జీవన్తి । అథైనదపి యన్త్యన్తతః । అన్నగ్‍ం హి భూతానాం జ్యేష్ఠమ్ । తస్మాత్సర్వౌషధ ముచ్యతే సర్వం వైతేఽన్నమాప్నువన్తి । యేఽన్నం బ్రహ్మో పాసతే అన్నం హి భూతానాం జ్యేష్ఠమ్ । తస్మాత్సర్వౌషధముచ్యతే ॥ 1 ॥

అన్నము వలననే సమస్త ప్రజలు పుట్టుచున్నారు. ఈ భూమిని ఆశ్రయించియుండెడివన్నియు అన్నము చేతనే జీవధారణమును చేయుచున్నవి. జీవితకాలముయొక్క అంతమునందు తిరిగి అన్నియు అన్నమునే పొందుచున్నవి. ఇట్లు అన్నము అన్నిటియొక్క జన్మ, స్థితిలయములకు హేతువగుట వలన సమస్త భూతములకు కారణమైయున్నది. ఆ కారణము వలననే అది సర్వమునకు ఔషధముగానున్నది. ఇట్టి సర్వకారణమగు అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసించెడివారు సమస్త స్వరూపమైన అన్నమును పొందుచున్నారు. సర్వమునకు ఔషధరూపమైన అన్నము కారణమై అన్నిటికి ముందు పుట్టినదిగా చెప్పబడుచున్నది



भूतान्यत्त्यद्यते भूतैश्चेति ब्रह्मान्नमुच्यते / Bhūtānyattyadyate bhūtaiśceti brahmānnamucyate Eaten by living beings and also eats them too. Such annam i.e., food is Brahman Itself.

:: तैत्तिरीयोपनिषत् - आनन्दवल्लि (ब्रह्मानन्दवल्लि) द्वितीयाध्यायः, द्वितीयोऽनुवाकः ::
अन्नाद्वै प्रजाः प्रजायन्ते । याः काश्च पृथिवीग्‍ं श्रिताः । अथो अन्नेनैव जीवन्ति । अथैनदपि यन्त्यन्ततः । अन्नग्‍ं हि भूतानां ज्येष्ठम् । तस्मात्सर्वौषध मुच्यते सर्वं वैतेऽन्नमाप्नुवन्ति । येऽन्नं ब्रह्मो पासते अन्नं हि भूतानां ज्येष्ठम् । तस्मात्सर्वौषधमुच्यते ॥ १ ॥

Taittirīya Upaniṣat - Part II, Chapter II
Annādvai prajāḥ prajāyante, yāḥ kāśca pr̥thivīgˈṃ śritāḥ, atho annenaiva jīvanti, athainadapi yantyantataḥ, annagˈṃ hi bhūtānāṃ jyeṣṭham, tasmātsarvauṣadha mucyate sarvaṃ vaite’nnamāpnuvanti, ye’nnaṃ brahmo pāsate annaṃ hi bhūtānāṃ jyeṣṭham, tasmātsarvauṣadhamucyate. 1.

All beings that rest on the earth are born verily from food. Besides, they live on food, and at the end they get merged in food. Food was verily born before all creatures; therefore it is called the medicine for all. Those who worship food as Brahman acquire all the food. Food was verily born before all creatures; therefore it is called the medicine for all. Creatures are born of food; being born, they grow by food. Since it is eaten and it eats the creatures, therefore it is called annam i.e., food.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamannamannāda eva ca ॥ 105 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి