31 మే, 2015

939. వ్యాదిశః, व्यादिशः, Vyādiśaḥ

ఓం వ్యాదిశాయ నమః | ॐ व्यादिशाय नमः | OM Vyādiśāya namaḥ

వివిధామాజ్ఞాం శక్రాదీనాం కుర్వన్ వ్యాదిశః ఇంద్రాదులకును వివిధములైన ఆజ్ఞలను ఆదేశించును కనుక వ్యాదిశః.

विविधामाज्ञां शक्रादीनां कुर्वन् व्यादिशः / Vividhāmājñāṃ śakrādīnāṃ kurvan vyādiśaḥ Since He gives various commands (to maintain the worlds) to Indra and others, He is called Vyādiśaḥ.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

30 మే, 2015

938. విదిశః, विदिशः, Vidiśaḥ

ఓం విదిశాయ నమః | ॐ विदिशाय नमः | OM Vidiśāya namaḥ

వివిధాని ఫలాని అధికారిభ్యో విశేషేణ దిశతీతి విదిశః ఆయా ఫలములకు అధికారము కలవారికి - వారి వారి కర్మములకు తగిన వివిధ ఫలములను విశేషరూపమున ఇచ్చును కనుక విదిశః.

विविधानि फलानि अधिकारिभ्यो विशेषेण दिशतीति विदिशः / Vividhāni phalāni adhikāribhyo viśeṣeṇa diśatīti vidiśaḥ He causes realization of results as per different kinds of actions performed; hence He is Vidiśaḥ.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

29 మే, 2015

937. గభీరాఽఽత్మా, गभीराऽऽत्मा, Gabhīrā’’tmā

ఓం గభీరాత్మనే నమః | ॐ गभीरात्मने नमः | OM Gabhīrātmane namaḥ

ఆత్మా స్వరూపం చిత్తం వా గభీరం పరిచ్ఛేత్తుమశక్యమ్స్యేతి గభీరాఽఽత్మా ఈతని స్వరూపము, ఆత్మ లేదా చిత్తము గభీరము అనగా ఇంతటి పరిమాణముకలదియని నిర్ణయించనలవి కానిది కనుక గభీరాఽఽత్మా.

आत्मा स्वरूपं चित्तं वा गभीरं परिच्छेत्तुमशक्यम्स्येति गभीराऽऽत्मा / Ātmā svarūpaṃ cittaṃ vā gabhīraṃ paricchettumaśakyamsyeti gabhīrā’’tmā Since His ātma, citta i.e., mind cannot be perceived as of definite proportions and cannot be measured, He is called Gabhīrā’’tmā.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

28 మే, 2015

936. చతురశ్రః, चतुरश्रः, Caturaśraḥ

ఓం చతురస్రాయ నమః | ॐ चतुरस्राय नमः | OM Caturasrāya namaḥ

న్యాయసమవేతః చతురశ్రః, పుంసాం కర్మానురూపం ఫలం ప్రయచ్ఛతీతి సముచితమగు రూపము కలవానిని 'చతురశ్రః' అనుట లోక సిద్ధము. పరమాత్ముడు న్యాయసమవేతుడు అనగా న్యాయము ఎన్నడును తనను వదలని ధర్మముగా కలవాడు కావుననే జీవులకు ఎల్లరకును వారి వారి కర్మానురూప ఫలమును ఇచ్చును.

न्यायसमवेतः चतुरश्रः, पुंसां कर्मानुरूपं फलं प्रयच्छतीति / Nyāyasamavetaḥ caturaśraḥ, puṃsāṃ karmānurūpaṃ phalaṃ prayacchatīti One who acts by the rule is Caturaśraḥ. He deals the effects of men's actions according to their karmas.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

27 మే, 2015

935. భయాపహః, भयापहः, Bhayāpahaḥ

ఓం భయాపహాయ నమః | ॐ भयापहाय नमः | OM Bhayāpahāya namaḥ

భయం సంసారజం పుంసామపఘ్నన్ భయాపహః జీవులకు సంసారమువలన కలుగు భయమును నశింపజేయును కనుక భయాపహః.

भयं संसारजं पुंसामपघ्नन् भयापहः / Bhayaṃ saṃsārajaṃ puṃsāmapaghnan bhayāpahaḥ Since He destroys the fear born of saṃsāra or the existence in the world, He is called Bhayāpahaḥ.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

26 మే, 2015

934. జితమన్యుః, जितमन्युः, Jitamanyuḥ

ఓం జితమన్యవే నమః | ॐ जितमन्यवे नमः | OM Jitamanyave namaḥ

మన్యుః క్రోధో జితో యేన సః జితమన్యుః ఎవనిచే మన్యువు అనగా క్రోధము జయించబడినదో అట్టివాడు జితమన్యుః.

मन्युः क्रोधो जितो येन सः जितमन्युः / Manyuḥ krodho jito yena saḥ jitamanyuḥ He by whom manyuḥ i.e., anger is conquered is Jitamanyuḥ.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

25 మే, 2015

933. అనన్తశ్రీః, अनन्तश्रीः, Anantaśrīḥ

ఓం అనన్తశ్రియే నమః | ॐ अनन्तश्रिये नमः | OM Anantaśriye namaḥ

అనన్తా అపరిమితా శ్రీః పరశక్తిరస్యేతి అనన్తశ్రీః అపరిమిత అగు శ్రీ అనగా పరా అను శక్తి కలవాడు కనుక అనన్తశ్రీః.

:: శ్వేతాశ్వరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::
న తస్య కార్యం కరణఞ్చ విద్యతే న తత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే ।
పరాఽస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చ ॥ 8 ॥

ఆ పరమేశ్వరునకు శరీరము, ఇంద్రియ సమూహములు లేవు. ఆ దేవునకు సముడుగాని, అధికుడుగాని కనిపించుట లేదు. ఆ పరమేశ్వరుని పరాశక్తి నానావిధములుగానున్నదని వేదములు ప్రతిపాదించుచున్నవి. ఆ దేవుని పరాశక్తి స్వభావసిద్ధమయినది, జ్ఞానక్రియా బలములు కలది.

अनन्ता अपरिमिता श्रीः परशक्तिरस्येति अनन्तश्रीः / Anantā aparimitā śrīḥ paraśaktirasyeti anantaśrīḥ Since His supreme power i.e., parā śakti is endless and inexhaustible, He is called Anantaśrīḥ.

:: श्वेताश्वरोपनिषत् षष्ठोऽध्यायः ::
न तस्य कार्यं करणञ्च विद्यते न तत्सम श्चाभ्यधिकश्च दृश्यते ।
पराऽस्य शक्तिर्विविधैव श्रूयते स्वाभाविकी ज्ञानबल क्रिया च ॥ ८ ॥

Śvetāśvaropaniṣat - Chapter 6
Na tasya kāryaṃ karaṇañca vidyate na tatsama ścābhyadhikaśca dr̥śyate,
Parā’sya śaktirvividhaiva śrūyate svābhāvikī jñānabala kriyā ca. 8.

The Lord has no body or organs. None is His equal and none is His superior either. He possesses all powers of knowledge and action which are natural to Him. This has been confirmed by the scriptures.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

24 మే, 2015

932. అనన్తరూపః, अनन्तरूपः, Anantarūpaḥ

ఓం అనన్తరూపాయ నమః | ॐ अनन्तरूपाय नमः | OM Anantarūpāya namaḥ

అనన్తాని రూపాణ్యస్య విశ్వప్రపఞ్చరూపేణ స్థితస్యేతి అనన్తరూపః సర్వ ప్రపంచరూపమునను ఉన్న ఈతని రూపములు అనంతములు కావున ఈతడు అనంతములగు రూపములు కలవాడు.

अनन्तानि रूपाण्यस्य विश्वप्रपञ्चरूपेण स्थितस्येति अनन्तरूपः / Anantāni rūpāṇyasya viśvaprapañcarūpeṇa sthitasyeti anantarūpaḥ Endless are His forms who is of the form of the vast universe and hence He is called Anantarūpaḥ.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

23 మే, 2015

931. పర్యవస్థితః, पर्यवस्थितः, Paryavasthitaḥ

ఓం పర్యవస్థితాయ నమః | ॐ पर्यवस्थिताय नमः | OM Paryavasthitāya namaḥ

పరితః సర్వతో విశ్వం వ్యాప్యావస్థిత ఇతి పర్యవస్థితః విశ్వమును అన్ని వైపులను వ్యాపించి నిలిచియున్నవాడు కనుక పర్యవస్థితః.

परितः सर्वतो विश्वं व्याप्यावस्थित इति पर्यवस्थितः / Paritaḥ sarvato viśvaṃ vyāpyāvasthita iti paryavasthitaḥ Since He envelops the universe pervading it everywhere, He is called Paryavasthitaḥ.

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

22 మే, 2015

930. జీవనః, जीवनः, Jīvanaḥ

ఓం జీవనాయ నమః | ॐ जीवनाय नमः | OM Jīvanāya namaḥ

సర్వాః ప్రజాః ప్రాణరూపేణ జీవయన్ జీవనః పరమాత్ముడే ప్రాణ రూపముననుండుచు సర్వ ప్రజలను జీవింపజేయుచున్నాడు కావున జీవనః.

सर्वाः प्रजाः प्राणरूपेण जीवयन् जीवनः / Sarvāḥ prajāḥ prāṇarūpeṇa jīvayan jīvanaḥ In the form of breath, He makes all creatures live and hence He is Jīvanaḥ.

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

21 మే, 2015

929. సన్తః, सन्तः, Santaḥ

ఓం సదభ్యో నమః | ॐ सदभ्यो नमः | OM Sadabhyo namaḥ

సన్మార్గవర్తినః సన్తః; తద్రూపేణ విద్యావినయవృద్ధయే స ఏవ వర్తత ఇతి సన్తః ('సత్‍' అను ప్రాతిపదికముపై ప్రథమావిభక్తిలో బహు వచనమందలి రూపము 'సంతః' అగును. 'ఓం సదభ్యో నమః' కు వివరణ) సన్మార్గవర్తులగు వారిని 'సన్తః' అందురు. పరమాత్ముడే లోకమున విద్యా వినయాదికమును వృద్ధినందించుటకై అట్టి సజ్జనుల రూపముననుండును. కావున పరమాత్మునకే 'సన్తః' అను నామము తగియున్నది. సజ్జనుల వర్తనమును చూచి ఇతరులును వారివలె వర్తించుచు వారివలె విద్యా వినయములను పెంపొందించుకొనెదరని భావము.

सन्मार्गवर्तिनः सन्तः; तद्रूपेण विद्याविनयवृद्धये स एव वर्तत इति सन्तः / Sanmārgavartinaḥ santaḥ; tadrūpeṇa vidyāvinayavr̥ddhaye sa eva vartata iti santaḥ Santas are those who pursue the path to righteousness. In their form, for the promotion of knowledge and humility, He himself stands as an embodiment and hence it is apt to call Him Santaḥ.

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

20 మే, 2015

928. రక్షణః, रक्षणः, Rakṣaṇaḥ

ఓం రక్షణాయ నమః | ॐ रक्षणाय नमः | OM Rakṣaṇāya namaḥ

సత్వం గుణమధిష్ఠాయ జగత్రయం రక్షన్ రక్షణః; నన్ధ్యాదిత్వాకర్తరి ల్యుః సత్త్వ గుణమును ఆశ్రయించి విష్ణురూపమున జగత్రయమును రక్షించుచున్నాడు కనుక రక్షణః. ('రక్ష - పాలనే' అను ధాతువు 'నంది' మొదలగు ధాతువులలోనిదగుటచేత 'ల్యు' ప్రత్యతము వచ్చి 'రక్ష + అన = రక్షణః' అగును.)

सत्वं गुणमधिष्ठाय जगत्रयं रक्षन् रक्षणः; नन्ध्यादित्वाकर्तरि ल्युः  / Satvaṃ guṇamadhiṣṭhāya jagatrayaṃ rakṣan rakṣaṇaḥ; nandhyāditvākartari lyuḥ Taking His stand on the sattva guṇa, He protects the three worlds and hence He is called Rakṣaṇaḥ. ('Rakṣa - pālane' since is a 'nandi' root, when suffixed with 'lyu' - 'rakṣa + ana = rakṣaṇaḥ' is formed.)

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

19 మే, 2015

927. వీరహా, वीरहा, Vīrahā

ఓం వీరఘ్నే నమః | ॐ वीरघ्ने नमः | OM Vīraghne namaḥ

వివిధాః సంసారిణాం గతీః ముక్తిప్రదానేన హన్తీతి వీరహా సంసారుల వివిధ గతులను - వారికి ముక్తిని ప్రదానము చేయుటమూలమున నశింపజేయుచున్నాడు కనుక వీరహా.

166. వీరహా, वीरहा, Vīrahā
741. వీరహా, वीरहा, Vīrahā

विविधाः संसारिणां गतीः मुक्तिप्रदानेन हन्तीति वीरहा / Vividhāḥ saṃsāriṇāṃ gatīḥ muktipradānena hantīti vīrahā By conferring liberation, He destroys the different ways of life of the saṃsārins.

166. వీరహా, वीरहा, Vīrahā
741. వీరహా, वीरहा, Vīrahā
उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

18 మే, 2015

926. దుఃస్వప్ననాశనః, दुःस्वप्ननाशनः, Duḥsvapnanāśanaḥ

ఓం దుస్వప్ననాశాయ నమః | ॐ दुस्वप्ननाशाय नमः | OM Dusvapnanāśāya namaḥ

భావినోఽనర్థస్య సూచకాన్ దుఃస్వప్నాన్ నాశయతి ధ్యాతః స్తుతః కీర్తితః పూజితశ్చేతి దుఃస్వప్ననాశనః దుఃస్వప్నములను నశింపజేయును. అవి రాకుండునట్లు, కనబడకుండునట్లు చేయును. తన ధ్యానమును కాని, స్తుతిని కాని, కీర్తనమును కాని, పూజను కాని చేసినవారికి దుఃస్వప్నములు కనబడవు. సంసారమను దుఃస్వప్నమును నశింప జేయువాడనియు అర్థము చెప్పుకొనవచ్చును.

भाविनोऽनर्थस्य सूचकान् दुःस्वप्नान् नाशयति ध्यातः स्तुतः कीर्तितः पूजितश्चेति दुःस्वप्ननाशनः / Bhāvino’narthasya sūcakān duḥsvapnān nāśayati dhyātaḥ stutaḥ kīrtitaḥ pūjitaśceti duḥsvapnanāśanaḥ When meditated, praised, sung about or worshiped - He wards off the dreams ominous of future unpleasant happenings. Or He can end the bad dream of saṃsāra i.e, worldly existence; this is another interpretation.

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

17 మే, 2015

925. పుణ్యః, पुण्यः, Puṇyaḥ

ఓం పుణ్యాయ నమః | ॐ पुण्याय नमः | OM Puṇyāya namaḥ

స్మరణాది కుర్వతాం సర్వేషాం పుణ్యం కరోతీతి ।
సర్వేషాం శ్రుతిస్మృతిలక్షణయా వాచా పుణ్యమాచష్ట ఇతి వా పుణ్యః ॥

పూణ్యమును కలిగించును. పుణ్యమును వ్యాఖ్యానించును, ప్రవచించును. తన విషయమున స్మరణము మొదలగునవి ఆచరించు వారికందరకును పుణ్యమును కలిగించును. శ్రుతి స్మృతి రూపములగు వాక్కుల ద్వారమున ఎల్లవారికిని పుణ్యమును, పుణ్యకరమగు ధర్మమును వ్యాఖ్యానించును, ప్రవచించును.

687. పుణ్యః, पुण्यः, Puṇyaḥ

स्मरणादि कुर्वतां सर्वेषां पुण्यं करोतीति ।
सर्वेषां श्रुतिस्मृतिलक्षणया वाचा पुण्यमाचष्ट इति वा पुण्यः ॥

Smaraṇādi kurvatāṃ sarveṣāṃ puṇyaṃ karotīti,
Sarveṣāṃ śrutismr̥tilakṣaṇayā vācā puṇyamācaṣṭa iti vā puṇyaḥ.

He confers merit on all who do śravaṇa i.e., hearing etc,. of His name and other forms of devotion. Or by His commands in the form of śruti and smr̥ti, He enables all to do meritorious deeds.

687. పుణ్యః, पुण्यः, Puṇyaḥ

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

16 మే, 2015

924. దుష్కృతిహా, दुष्कृतिहा, Duṣkr̥tihā

ఓం దుష్కృతిఘ్నే నమః | ॐ दुष्कृतिघ्ने नमः | OM Duṣkr̥tighne namaḥ

దుష్కృతీః పాప సఙ్జ్ఞితాః హన్తీతి దుష్కృతిహా ।
పాపకారిణస్తాన్హన్తీతి వా దుష్కృతిహా ॥

పాపములు అను సంజ్ఞకల దుష్కృతులను, చెడుపనులను, వానిని ఆచరించుటవలన కలుగు ఫలములను నశింపజేయును. లేదా పాప కృత్యములను చేయు వారిని హింసించును.

दुष्कृतीः पाप सङ्ज्ञिताः हन्तीति दुष्कृतिहा ।
पापकारिणस्तान्हन्तीति वा दुष्कृतिहा ॥

Duṣkr̥tīḥ pāpa saṅjñitāḥ hantīti duṣkr̥tihā,
Pāpakāriṇastānhantīti vā duṣkr̥tihā.

He destroys sinful actions and results arising out of them and hence He is Duṣkr̥tihā. Or Duṣkr̥tihā can also mean the One who kills evil-doers.

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

15 మే, 2015

923. ఉత్తారణః, उत्तारणः, Uttāraṇaḥ

ఓం ఉత్తారణాయ నమః | ॐ उत्तारणाय नमः | OM Uttāraṇāya namaḥ

సంసారసాగరాదుత్తారయతీతి ఉత్తారణః సంసార సాగరమునుండి పైకి తీసి దానిని దాటించువాడు అత్తారణః.

संसारसागरादुत्तारयतीति उत्तारणः / Saṃsārasāgarāduttārayatīti uttāraṇaḥ Since He rescues mortals from the ocean of Saṃsāra and helps crossing it, He is Uttāraṇaḥ.

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr̥tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

14 మే, 2015

922. పుణ్యశ్రవణ కీర్తనః, पुण्यश्रवण कीर्तनः, Puṇyaśravaṇa Kīrtanaḥ

ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః | ॐ पुण्यश्रवणकीर्तनाय नमः | OM Puṇyaśravaṇakīrtanāya namaḥ

పుణ్యం పుణ్యకరం శ్రవణం కీర్తనం చాస్యేతి పుణ్యశ్రవణకీర్తనః ఎవని విషయమున చేయు శ్రవణముకాని, కీర్తన నామ జపాదులుకాని పుణ్యకరమో అట్టివాడు పుణ్యశ్రవణ కీర్తనః.

:: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఫలశ్రుతి ::
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపిపరికీర్తయేత్ ।
నా శుభం ప్రాప్నుయాత్ కిఞ్చిత్ సోఽముత్రేహ చ మానవః ॥

ఎవడు నిత్యమును దీనిని (విష్ణు సహస్రనామ స్తోత్రమును) వినుచుండునో, ఎవడు సమగ్రముగా సర్వ విధముల దీనిని కీర్తించుచుండునో అట్టి మానవుడు ఈ లోకమున కాని ఆముష్మికమున కాని అశుభమును కొంచెముగనైనను పొందడు.

पुण्यं पुण्यकरं श्रवणं कीर्तनं चास्येति पुण्यश्रवणकीर्तनः / Puṇyaṃ puṇyakaraṃ śravaṇaṃ kīrtanaṃ cāsyeti puṇyaśravaṇakīrtanaḥ The One hearing whose praise or singing his praise begets merit is Puṇyaśravaṇa Kīrtanaḥ.

:: श्री विष्णु सहस्रनाम स्तोत्र फलश्रुति ::
य इदं शृणुयान्नित्यं यश्चापिपरिकीर्तयेत् ।
ना शुभं प्राप्नुयात् किञ्चित् सोऽमुत्रेह च मानवः ॥

Śrī Viṣṇu Sahasranāma Stotra Phalaśruti
Ya idaṃ śr̥ṇuyānnityaṃ yaścāpiparikīrtayet,
Nā śubhaṃ prāpnuyāt kiñcit so’mutreha ca mānavaḥ.

Whoever hears this everyday and whoever utters it will not experience anything that is inauspicious here and hereafter.

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥

13 మే, 2015

921. వీతభయః, वीतभयः, Vītabhayaḥ

ఓం వీతభయాయ నమః | ॐ वीतभयाय नमः | OM Vītabhayāya namaḥ

వీతం విగతం భయం సాంసారికం సంసారలక్షణం వా అభ్యేతి వీతభయః పరమాత్ముడు సర్వేశ్వరుడును, నిత్య స్వయంసిద్ధ ముక్తుడును అగుటచేత ఈతనికి సంసారము వలన భయము కాని, జనన మరణ ప్రవాహ రూప భయముకాని లేదు.

वीतं विगतं भयं सांसारिकं संसारलक्षणं वा अभ्येति वीतभयः / Vītaṃ vigataṃ bhayaṃ sāṃsārikaṃ saṃsāralakṣaṇaṃ vā abhyeti vītabhayaḥ He has no fear of sāṃsāra or pertaining to sāṃsāra i.e., fear of life and death cycles - as He is the Lord of all or ever free.

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥

12 మే, 2015

920. విద్వత్తమః, विद्वत्तमः, Vidvattamaḥ

ఓం విద్వత్తమాయ నమః | ॐ विद्वत्तमाय नमः | OM Vidvattamāya namaḥ

నిరస్తాతిశయం జ్ఞానం సర్వదా సర్వగోచరమస్యాస్తి నేతరేషామితి విద్వత్తమః అందరను మించునంత, మిక్కిలిగా విద్వాంసుడు. ఇతరుల జ్ఞానముల అతిశయములను అన్నిటిని త్రోసివేయజాలునదియు, సర్వ విషయములను గోచరించజేసికొనగలుగునదియునగు జ్ఞానము సర్వదా ఈతనికి మాత్రముగలదు; ఇతరులకు మరి ఎవ్వరికిని లేదు.

निरस्तातिशयं ज्ञानं सर्वदा सर्वगोचरमस्यास्ति नेतरेषामिति विद्वत्तमः / Nirastātiśayaṃ jñānaṃ sarvadā sarvagocaramasyāsti netareṣāmiti vidvattamaḥ He has always the most wonderful knowledge about everything, none else. So, Vidvattamaḥ.

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥

11 మే, 2015

919. క్షమిణాంవరః, क्षमिणांवरः, Kṣamiṇāṃvaraḥ

ఓం దక్షిణాయ నమః | ॐ दक्षिणाय नमः | OM Dakṣiṇāya namaḥ

క్షమావతాం యోగినాం చ పృథివ్యాదీనాం భారధారకాణాం చ శ్రేష్ఠ ఇతి క్షమిణాం వరః క్షమ వీరికి కలదు కావున అట్టివారు క్షమిణః. అట్టి వారిలో శ్రేష్ఠుడు క్షమిణాం వరః. క్షమ కలవారిలో, యోగులలోను భారమును ధరించునవియగు పృథివి మొదలగువానిలోను శ్రేష్ఠుడు.

'క్షమయా పృథివీసమః' ఇతి వాల్మీకివచనాత్ 'ఓర్పు విషయమున పృథివితో సమానుడు' అను వాల్మీకి వచనము ఇట ప్రమాణము.

బ్రహ్మాణ్డమఖిలం వహన్ పృతివీవ భారేణ నార్దిత ఇతి పృతివ్యా అపి వరో వా క్షమిణః శక్తః ।
అయం తు సర్వశక్తిమత్త్వాత్సకలాః క్రియాః కర్తుం క్షమత ఇతి వా క్షమిణాం వరః ॥

పృథివి సకల ప్రాణిజాతపు భారమును మోయుచున్నట్లే విష్ణువు సకల బ్రహ్మాండమును మోయుచున్నాడు. అయినను పృథివి దుష్టుల భారముచే పీడితురాలయినట్లు ఆతడు ఎంత భారము చేతను పీడితుడగుటలేదు. కావున విష్ణువు పృథివికంటెను శ్రేష్ఠుడు అగుచు భారధారణ సమర్థులలో శ్రేష్ఠుడు అగుచున్నాడు.

లేదా క్షమిణః అనగా శక్తులు. ఇతరులు కొన్ని కార్యములు నిర్వహించుటకు మాత్రము శక్తులుకాగా, విష్ణువు సర్వశక్తిమంతుడు అగుటచే సకల క్రియలను ఆచరించుటకును శక్తి కలిగియున్నాడు. కావున ఈతడు శక్తులగు వారందరిలో శ్రేష్ఠుడగుచున్నాడు.

क्षमावतां योगिनां च पृथिव्यादीनां भारधारकाणां च श्रेष्ठ इति क्षमिणां वरः / Kṣamāvatāṃ yogināṃ ca pr̥thivyādīnāṃ bhāradhārakāṇāṃ ca śreṣṭha iti kṣamiṇāṃ varaḥ The most eminent of those who forgive like yogis and carriers of burden like the earth etc vide  'Kṣamayā pr̥thivīsamaḥ' - 'the One equal to earth in forgiveness' mentioned by Vālmīki in Rāmāyaṇa.

ब्रह्माण्डमखिलं वहन् पृतिवीव भारेण नार्दित इति पृतिव्या अपि वरो वा क्षमिणः शक्तः ।
अयं तु सर्वशक्तिमत्त्वात्सकलाः क्रियाः कर्तुं क्षमत इति वा क्षमिणां वरः ॥

Brahmāṇḍamakhilaṃ vahan pr̥tivīva bhāreṇa nārdita iti pr̥tivyā api varo vā kṣamiṇaḥ śaktaḥ,
Ayaṃ tu sarvaśaktimattvātsakalāḥ kriyāḥ kartuṃ kṣamata iti vā kṣamiṇāṃ varaḥ.

Carrying the entire Brahmāṇḍa like the earth with all things on it, the Lord is not afflicted by it and so is greater than the earth in ability of carrying burden.

Kṣamiṇaḥ also stands for persons who are able. Being All powerful, the Lord is able to do all actions with superlative efficiency and hence Kṣamiṇāṃvaraḥ.

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥

10 మే, 2015

918. దక్షిణః, दक्षिणः, Dakṣiṇaḥ

ఓం దక్షిణాయ నమః | ॐ दक्षिणाय नमः | OM Dakṣiṇāya namaḥ

దక్షిణశబ్దస్యాపి దక్ష ఏవార్థః ।
పునరుక్తిదోషో నాస్తి శబ్దభేదాత్ ॥
అథవా దక్షతే గచ్ఛతి హినస్తీతి వా దక్షిణః ।
'దక్ష గతిహింసనయోః' ఇతి ధాతుపాఠాత్ ॥

'దక్షిణః' శబ్దమునకు దక్ష శబ్దమునకు కల అర్థములే కలవు. శబ్ద రూపములు వేరు కావున చెప్పినదే మరల చెప్పుట అను పునరుక్తి దోషము లేదు. లేదా 'దక్ష' - గతి హింసనయోః అను ధాతువు ధాతు పాఠము నందుంటచే ఈ 'దక్షిణ' శబ్దమునకు 'గచ్ఛతి' అనగా అన్ని వైపులకును వ్యాపించుచు పోవును; హినస్తి దుష్టులను హింసించును అను అర్థములును చెప్పవచ్చును.

दक्षिणशब्दस्यापि दक्ष एवार्थः ।
पुनरुक्तिदोषो नास्ति शब्दभेदात् ॥
अथवा दक्षते गच्छति हिनस्तीति वा दक्षिणः ।
'दक्ष गतिहिंसनयोः' इति धातुपाठात् ॥

Dakṣiṇaśabdasyāpi dakṣa evārthaḥ,
Punaruktidoṣo nāsti śabdabhedāt.
Athavā dakṣate gacchati hinastīti vā dakṣiṇaḥ,
'Dakṣa gatihiṃsanayoḥ' iti dhātupāṭhāt.

Dakṣiṇaḥ has the same meaning as Dakṣaḥ. Yet it is not a tautology, as the word is different. Or dakṣate means goes or kills i.e., killer of the wicked.

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥

9 మే, 2015

917. దక్షః, दक्षः, Dakṣaḥ

ఓం దక్షాయ నమః | ॐ दक्षाय नमः | OM Dakṣāya namaḥ

ప్రవృద్ధః శక్తః శీఘ్రకారీ చ దక్షః ।
త్రయం చైతత్ పరస్మిన్నియతమితి దక్షః ॥

మిగుల వృద్ధిని, శుభమును పొందియున్నవాడగు ప్రవృద్ధుడును, శక్తుడును, శీఘ్రముగా ఏ పనినైన చేయువాడును 'దక్షః' అనబడును. పరమాత్మునియందు ప్రవృద్ధి, శక్తి, శీఘ్రకారిత - అను మూడు లక్షణములును కలవు. కావున అతడు 'దక్షః' అనబడుచున్నాడు.

423. దక్షః, दक्षः, Dakṣaḥ

प्रवृद्धः शक्तः शीघ्रकारी च दक्षः ।
त्रयं चैतत् परस्मिन्नियतमिति दक्षः ॥

Pravr̥ddhaḥ śaktaḥ śīghrakārī ca dakṣaḥ,
Trayaṃ caitat parasminniyatamiti dakṣaḥ.

One who has grown-up, able and quick in execution is called Dakṣa. All these three qualities are associated with the Lord, so He is Dakṣaḥ.

423. దక్షః, दक्षः, Dakṣaḥ

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥

8 మే, 2015

916. పేశలః, पेशलः, Peśalaḥ

ఓం పేశలాయ నమః | ॐ पेशलाय नमः | OM Peśalāya namaḥ

కర్మణా మనసా వాచా వపుషా చ శోభనత్వాత్ పేశలః సుకుమారుడు, శోభనుడు. పరమాత్ముడు మనసా, వాచా, కర్మణా కూడ శోభనుడే.

कर्मणा मनसा वाचा वपुषा च शोभनत्वात् पेशलः / Karmaṇā manasā vācā vapuṣā ca śobhanatvāt peśalaḥ Charming by action, by thought and by speech and in body; He is handsome.

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥

7 మే, 2015

915. అక్రూరః, अक्रूरः, Akrūraḥ

ఓం అక్రూరాయ నమః | ॐ अक्रूराय नमः | OM Akrūrāya namaḥ

క్రౌర్యం నామ మనోధర్మః ప్రకోపజః 
        ఆన్తరః సన్తాపః సాభినివేషః ।
అవాప్తసమస్తకామత్వాత్కామాభావాదేవ కోపాభావః ।
తస్మాత్‍క్రౌర్యమస్య నాస్తీతి అక్రూరః ॥

క్రూరుడు కానివాడు. క్రౌర్యము అనునది తీవ్రకోపము అను చిత్తోద్రేకమువలన కలుగునదియు, అభినివేశము అనగా గాఢమగు ఆసక్తితో కూడినదియు, ఆంతరమును అగు సంతాపము అనబడు మనోధర్మము. విష్ణువు అవాప్తసర్వకాముడు అనగా సర్వ ఫలములను పొందియే ఉన్నవాడు కావున అతని చిత్తమున ఏ కామములును లేవు. కావుననే కోపము లేదు. కనుక ఈతనియందు క్రౌర్యము లేదు.

क्रौर्यं नाम मनोधर्मः प्रकोपजः 
        आन्तरः सन्तापः साभिनिवेषः ।
अवाप्तसमस्तकामत्वात्कामाभावादेव कोपाभावः ।
तस्मात्क्रौर्यमस्य नास्तीति अक्रूरः ॥

Krauryaṃ nāma manodharmaḥ prakopajaḥ 
        āntaraḥ santāpaḥ sābhiniveṣaḥ,
Avāptasamastakāmatvātkāmābhāvādeva kopābhāvaḥ,
Tasmātkrauryamasya nāstīti akrūraḥ.

He who is not cruel. Cruelty is a quality of mind. It is born of excess of anger. It is internal and leads to anguish and excitement. The Lord has no wants to cause desire. Being without desire, there is no frustration and no consequent anger. So there is no cruelty in Him hence He is Akrūraḥ.

अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥

6 మే, 2015

914. శర్వరీకరః, शर्वरीकरः, Śarvarīkaraḥ

ఓం శర్వరీకరాయ నమః | ॐ शर्वरीकराय नमः | OM Śarvarīkarāya namaḥ

సంసారిణామాత్మా శర్వరీవ శర్వరీ ।
జ్ఞానినాం పునః సంసారః శర్వరీ ।
తాముభయేషాం కరోతీతి శర్వరీకరః ॥

రాత్రికి కారకుడు. ఇచట శర్వరీ పదమునకు 'రాత్రి వంటిది' అని అర్థము. చేష్టలను, క్రియాప్రవృత్తులను హింసించును - అను వ్యుత్పత్తులచే జీవులను ప్రవృత్తిరహితులను చేయు కాలవిశేషమును 'శర్వరీ' అనదగును. సంసారులకు తమ విషయమున ఆత్మ తత్త్వ వివేక ప్రకాశమును కలుగనీయక మరుగుపడుచుండును కావున 'శర్వరీ' అనదగును.

మరి జ్ఞానులకో? వారికి తమ విషయమున ప్రవృత్తిని ఏమాత్రమును కలిగించజాలకయున్న అవిద్యాకల్పిత సంసారము 'శర్వరీ' అనదగును. సంసారులపై తన మాయను క్రమ్మజేసియు, జ్ఞానులనుండి దానిని తొలగించియు - ఇరువురకును ఈ స్థితిని కలిగించువాడు పరమాత్ముడే కావున అతడు 'శర్వరీకరుడు.'

:: శ్రీమద్భగవద్గీత సాఙ్ఖ్య యోగము ::
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 69 ॥

సామాన్య జనులకును ఏది (పరమార్థతత్త్వము) రాత్రియై (దృష్టికి గోచరము కాక) యున్నదో, దానియందు ఇంద్రియనిగ్రహపరుడు యోగి మేలుకొనియుండును (ఆత్మావలోకనము చేయుచుండును). దేనియందు (ఏ శబ్దాది విషయములందు) ప్రాణులు మేలుకొనియున్నారో (ఆసక్తితో ప్రవర్తించుచున్నారో) అది (విషయజాలము) పరమార్థ తత్త్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును (దృష్టిగోచరముకాక యుండును).

संसारिणामात्मा शर्वरीव शर्वरी ।
ज्ञानिनां पुनः संसारः शर्वरी ।
तामुभयेषां करोतीति शर्वरीकरः ॥

Saṃsāriṇāmātmā śarvarīva śarvarī,
Jñānināṃ punaḥ saṃsāraḥ śarvarī,
Tāmubhayeṣāṃ karotīti śarvarīkaraḥ.

The Maker of night. For those caught in worldly existence of saṃsāra, the ātman is dark as the night as they have no light or knowledge of the ātman. But to the jñāni, saṃsāra is night as they ever dwell in the light of  ātmajñāna. The Lord creates these two kinds of nights and hence He is Śarvarīkaraḥ.

:: श्रीमद्भगवद्गीत साङ्ख्य योगमु ::
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ ६९ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 2
Yā niśā sarvabhūtānāṃ tasyāṃ jāgarti saṃyamī,
Yasyāṃ jāgrati bhūtāni sā niśā paśyato muneḥ. 69.

The self-restrained man keeps awake during that which is night for all creatures. That during which creatures keep awake, it is night to the seeing sage.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

5 మే, 2015

913. శిశిరః, शिशिरः, Śiśiraḥ

ఓం శిశిరాయ నమః | ॐ शिशिराय नमः | OM Śiśirāya namaḥ

తాపత్రయాభితప్తానాం విశ్రామస్థానత్వాత్ శిశిరః చల్లనివాడు. ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆదిదైవికము అను మూడు మిధములగు తాపములచేతను అభితప్తులగువారికి విశ్రామ హేతువు కనుక శిశిరః.

तापत्रयाभितप्तानां विश्रामस्थानत्वात् शिशिरः / Tāpatrayābhitaptānāṃ viśrāmasthānatvāt śiśiraḥ He is called Śiśiraḥ being the place of repose for those afflicted by the three kinds of pains viz., ādhyātmika, ādhibhautika and ādidaivika. He is cool.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

4 మే, 2015

912. శబ్దసహః, शब्दसहः, Śabdasahaḥ

ఓం శబ్దసహాయ నమః | ॐ शब्दसहाय नमः | OM Śabdasahāya namaḥ

సర్వే వేదాః తాత్పర్యేణ తమేవ వదన్తీతి శబ్దసహః శబ్దములను తనకు ప్రతిపాదములనుగా అగీకరించును. సర్వవేదములును అతనియందే తమ తాత్పర్యములద్వార అతనినే చెప్పుచున్నవి కనుక అతడు శబ్దసహుడు.

:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయము 2వ వల్లి ::
సర్వే వేదాయత్పదమాననన్తి
   తపాగ్‍ంసిసర్వాణి చ యద్యదన్తి ।
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి 
   తత్తేపదగ్‍ం సఙ్గ్రహేణ బ్రవీ మ్యోమిత్యేతత్ ॥ 15 ॥

(యమధర్మరాజు చెప్పుచున్నాడు) సమస్త వేదములు ఏ వస్తువును లక్ష్యముగా చెప్పుచున్నవో, కృచ్ఛచాంద్రాయణాది రూపములగు తపస్సులన్నియు ఏ వస్తువును పొందుటయే ప్రయోజనములుగా గలిగి ఆచరింపబడుచున్నవో, ఏ వస్తువును కోరి బ్రహ్మచర్యమును అవలంభించుచున్నారో, అట్టి పరమ పదమును గురించి సంగ్రహముగా చెప్పుచున్నాను. ఆ పరమ పదమే ప్రణవము - ఓం.

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
   మత్తః స్స్మృతి ర్జ్ఞాన మపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
   వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ॥ 15 ॥

నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందున్నవాడను. నావలననే జీవునకు జ్ఞాపకశక్తి, జ్ఞానము, మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడనుగూడ నేనే అయియున్నాను.

सर्वे वेदाः तात्पर्येण तमेव वदन्तीति शब्दसहः / Sarve vedāḥ tātparyeṇa tameva vadantīti śabdasahaḥ He who is declared by the Sabdas or sounds of Vedas as their import is Śabdasahaḥ.

:: कठोपनिषत् प्रथमाध्याय २व वल्लि ::
सर्वे वेदायत्पदमाननन्ति
   तपाग्‍ंसिसर्वाणि च यद्यदन्ति ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति 
   तत्ते पदग्‍ं सङ्ग्रहेण ब्रवी म्योमित्येतत् ॥ १५ ॥

Kaṭhopaniṣat Chapter 1 Canto 2
Sarve vedāyatpadamānananti
   Tapāgˈṃsisarvāṇi ca yadyadanti,
Yadicchanto brahmacaryaṃ caranti 
   Tatte padagˈṃ saṅgraheṇa bravī myomityetat. 15.

I (Yamadharmarāja) tell you briefly of that goal which all the Vedas with one voice propound, which all the austerities speak of, and wishing for which people practice Brahmacarya: it is this, viz, praṇava or ॐ.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
सर्वस्य चाहं हृदि सन्निविष्टो
   मत्तः स्स्मृति र्ज्ञान मपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
   वेदान्तकृद्वेदविदेव चाहम् ॥ १५ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Sarvasya cāhaṃ hr̥di sanniviṣṭo
   Mattaḥ ssmr̥ti rjñāna mapohanaṃ ca,
Vedaiśca sarvairahameva vedyo
   Vedāntakr̥dvedavideva cāham. 15.

I am seated in the hearts of all. From Me are memory, knowledge and their loss. I alone am the object to be known through all the Vedas; I am also the originator of the Vedānta, and I Myself am the knower of the Vedas.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

3 మే, 2015

911. శబ్దాతిగః, शब्दातिगः, Śabdātigaḥ

ఓం శబ్దాతిగాయ నమః | ॐ शब्दातिगाय नमः | OM Śabdātigāya namaḥ

శబ్దప్రవృత్తిహేతూనాం జాత్యాదీనామసమ్భవాత్ శబ్దేన వక్తుమశక్యత్వాత్ శబ్దాతిగః శబ్దములను అతిక్రమించి అనగా శబ్దములకు అందనిరీతిలో వ్యాపించి పోవువాడు.
 
వ్యుత్పన్న శబ్దములు ఏవియైనను జాతి, గుణము, క్రియ అను మూడు లక్షణములు - ఒకటియో లేక వాని సమూహముల అర్థమును చెప్పును. కావున శబ్దములు ఏదేని వస్తువునందు ప్రవర్తించవలయుననిన - అందులకు హేతువులుగా అర్థమునందు జాతి, గుణ, క్రియలు విష్ణునందు అసంభవములు కావున శబ్దముచేనైనను చెప్పుటకు అశక్యుడు కావున అతనిని శబ్దాతిగః అనదగును. 
 
'యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ' (తైత్తిరీయోపనిషత్ 2.4) - 'వాక్కులు మనస్సుతో కూడ ఎవనిని చేరజాలక నిలిచిపోవుచున్నవో' అను ఈ మొదలగు శ్రుతులును; 'న శబ్దగోచరం యస్య యోగిధ్యేయం పరం పదమ్‍' (విష్ణు పురాణము 1.17.22) - 'యోగుల ధ్యానమునకు మాత్రము గోచరము కాదగు ఎవని పరమ తత్త్వము శబ్దమునకు గోచరము కాదో' ఈ మొదలగు స్మృతి వనములును ఇందు ప్రమాణములు.

शब्दप्रवृत्तिहेतूनां जात्यादीनामसम्भवात् शब्देन वक्तुमशक्यत्वात् शब्दातिगः / Śabdapravr̥ttihetūnāṃ jātyādīnāmasambhavāt śabdena vaktumaśakyatvāt śabdātigaḥ The One whose expanse is beyond the reach of words.

He is inexpressible as the elements that enable being spoken of in words like jāti, guṇa and karma i.e., class, quality and action - cannot apply to Him; so, He is Śabdātigaḥ.

'यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह / Yato vāco nivartante aprāpya manasā saha' (Taittirīyopaniṣat 2.4)' - 'from Whom speech returns along with the mind without attaining Him' from śruti and 'न शब्दगोचरं यस्य योगिध्येयं परं पदम् / 'Na śabdagocaraṃ yasya yogidhyeyaṃ paraṃ padam ' (Viṣṇu Purāṇa 1.17.22) - 'Whose supreme abode is to be meditated upon by yogins and is not within the reach of words' from smr̥ti are supporting arguments.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

2 మే, 2015

910. ఊర్జితశాసనః, ऊर्जितशासनः, Ūrjitaśāsanaḥ

ఓం ఉర్జితశాసనాయ నమః | ॐ उर्जितशासनाय नमः | OM Urjitaśāsanāya namaḥ

శ్రుతిస్మృతిలక్షణమూర్జితం శాసనమస్యేతి ఊర్జితశాసనః ఉత్కృష్టము, శక్తిశాలియగు శ్రుతిస్మృతిరూపమగు శాసనము ఈతనిదిగా కలదు.

శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే యస్తే ఉల్లఙ్ఘ్య వర్తతే ।
ఆజ్ఞాచ్ఛేదీ మమ ద్వేషీ మద్భక్తోఽపి న వైష్ణవః ॥

శ్రుతియు, స్మృతియు నా ఆజ్ఞలే. ఎవడు వానిని అతిక్రమించి వర్తించునో వాడు నా ఆజ్ఞను ఛేదించినవాడును, నన్ను ద్వేషించువాడును అగును. వాడు నాయందు భక్తి కలవాడైన వైష్ణవుడు, విష్ణుసంబంధిజనుడు కాజాలడు.

श्रुतिस्मृतिलक्षणमूर्जितं शासनमस्येति ऊर्जितशासनः / Śrutismr̥tilakṣaṇamūrjitaṃ śāsanamasyeti ūrjitaśāsanaḥ His commands are powerful of the nature of Śruti and Smr̥ti.

श्रुतिस्मृती ममैवाज्ञे यस्ते उल्लङ्घ्य वर्तते ।
आज्ञाच्छेदी मम द्वेषी मद्भक्तोऽपि न वैष्णवः ॥

Śrutismr̥tī mamaivājñe yaste ullaṅghya vartate,
Ājñācchedī mama dveṣī madbhakto’pi na vaiṣṇavaḥ.

Śruti and Smr̥ti are in truth My commands. Whoever transgresses them, disobeys Me and is a hater of Me. Though a devotee, He is not a votary of Viṣṇu.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

1 మే, 2015

909. విక్రమీ, विक्रमी, Vikramī

ఓం విక్రమిణే నమః | ॐ विक्रमिणे नमः | OM Vikramiṇe namaḥ

విక్రమః పాదవిక్షేపః శౌర్యం వా ద్వయం చాశేషపురుషేభ్యో విలక్షణమస్యేతి విక్రమీ విక్రమము ఈతనికి కలదు. విక్రమము అనగా పాద విక్షేపము లేదా శౌర్యము అని అర్థము. ఇది ఈతనికి అశేష పురుషుల విక్రమము కంటెను విలక్షణమగునది కలదు.

विक्रमः पादविक्षेपः शौर्यं वा द्वयं चाशेषपुरुषेभ्यो विलक्षणमस्येति / Vikramaḥ pādavikṣepaḥ śauryaṃ vā dvayaṃ cāśeṣapuruṣebhyo vilakṣaṇamasyeti Vikrama is foot, step or valor. Both are distinct in Him from others and hence He is Vikramī.