29 సెప్టెం, 2014

695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ


వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

వసుదేవస్య తనయో వాసుదేవ ఇతీర్యతే వసుదేవుని పురుష సంతానము అనగా తనయుడు కనుక వాసుదేవః.

:: పోతన భాగవతము - దశమ స్కంధము ::
మఱియుం గృష్ణు నుద్దేశించి తొల్లి యీ శిశువు ధవళారుణ పీతవర్ణుండై యిప్పుడు నల్లనైన కతంబునఁ గృష్ణుం డయ్యె, వసుదేవునకు నొక్కెడ జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యె, నీ పాపనికి గుణరూపకర్మంబు అనేకంబులు గలుగుటంజేసి నామంబు లనేకంబులు గలవు. ఈ శాబకుని వలన మీరు దుఃఖంబులఁ దరియింతు, రీ యర్భకునిచేత దుర్జనశిక్షణంబును సజ్జనరక్షణంబును నగు, నీ కుమారుండు నారాయణ సమానుండని చెప్పి తన గృహమ్మున క మ్మునీశ్వరుండు సనియె. నందుండును బరమానందంబున నుండె నంత. (288)

తరువాత గర్గ మహర్షి యశోదా కుమారుని ఉద్దేశించి ఇల అన్నాడు - "ఈ శిశువు పూర్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లనైనాడు కనుక 'కృష్ణు'డని పిలవండి. ఇతడు వసుదేవునకు జన్మించినవాడుగనుక 'వాసుదేవుడు' అని పేరుగూడ చెల్లుతుంది. ఈ బిడ్డడికి గుణములు, రూపములు, కర్మములు ఎన్నో ఉండడంవల్ల ఇంకా ఎన్నో పేర్లు వహిస్తాడు. ఈ బాలునివలన మీరు అన్ని దుఃఖములను అతిక్రమించుతారు. వీని చేత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణా జరుగుతాయి. నాయనా! నీ కుమారుడు నారాయణునితో సమానుడు సుమా! అని చెప్పి గర్గ మహాముని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మహానుభావుడైన ఋషీంద్రుడు తన కుమారుని గురించి మంచిమాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు.

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ



वसुदेवस्य तनयो वासुदेव इतीर्यते / Vasudevasya tanayo vāsudeva itīryate Since He is Vasudeva's son, He is called Vāsudevaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे अष्टमोऽध्यायः ::
प्रागयं वसुदेवस्य क्वचिज्जातस्त्वात्मजः ।
वासुदेव इति श्रीमानभिज्ञाः सम्प्रचक्षते ॥ १४ ॥


Śrīmad Bhāgavata -  Canto 10, Chapter 8
Prāgayaṃ vasudevasya kvacijjātastvātmajaḥ,
Vāsudeva iti śrīmānabhijñāḥ saṃpracakṣate.
14.

Garga Muni indirectly disclosed, “This child was originally born as the son of Vasudeva, although He is acting as your child. Generally He is your child, but sometimes He is the son of Vasudeva.”

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి