31 మార్చి, 2014

513. జీవః, जीवः, Jīvaḥ

ఓం జీవాయ నమః | ॐ जीवाय नमः | OM Jīvāya namaḥ


జీవః, जीवः, Jīvaḥ

ప్రాణాన్ క్షేత్రజ్ఞరూపేణ ధారయన్ జీవ ఉచ్యతే ప్రాణములను నిలుపువాడు అను అర్థమున 'జీవ' శబ్దము ఏర్పడును. పరమాత్ముడే క్షేత్రజ్ఞ రూపమున దేహమునందలి ప్రాణములను నిలుపి ఉంచునుగనుక జీవః.

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః ।
మనష్షష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥ 7 ॥

నా యొక్క అనాదీ, నిత్యమగు అంశయే జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్‍, చక్షు, శ్శ్రోత, జిహ్వ, ఘ్రాణ, మనంబులను ఆరు (ఐదు జ్ఞానేంద్రియములు + మనస్సు) ఇంద్రియములను ఆకర్షించుచున్నది.



प्राणान् क्षेत्रज्ञरूपेण धारयन् जीव उच्यते / Prāṇān kṣetrajñarūpeṇa dhārayan jīva ucyate Supporting the Prāṇa or life in the form of kṣetrajña i.e., the in dweller, He is called Jīvaḥ.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
ममैवांशो जीवलोके जीवभूतस्सनातनः ।
मनष्षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥ ७ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Mamaivāṃśo jīvaloke jīvabhūtassanātanaḥ,
Manaṣṣaṣṭhānīndriyāṇi prakr̥tisthāni karṣati. 7.

It is verily a part of Mine which, becoming the eternal individual soul in the region of living beings, draws the organs which have the mind as their sixth and which abide in Nature.

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

30 మార్చి, 2014

512. సాత్త్వతాం పతిః, सात्त्वतां पतिः, Sāttvatāṃ patiḥ

ఓం సాత్వతాం పతయే నమః | ॐ सात्वतां पतये नमः | OM Sātvatāṃ pataye namaḥ


తత్కరోతి తదాచష్ట ఇతి విచ్ప్రత్యయే కృతే ।
క్విప్రత్యయేణిలోపే చ సాత్త్వతాత్ సాత్త్వదుధ్భవః ॥
సాత్త్వతం నామ యత్తంత్రం తత్కర్తౄణాంచ సాత్త్వతాం ॥
తత్తంత్రస్యోపదేష్టౄణాం యోగక్షేమకరః పతిః ॥
సాత్త్వత వంశప్రభవైర్వైష్ణవైర్యా చ సేవ్యతే ।
ఇతి శ్రీ భగవాన్ విష్ణుః సాత్త్వతాంపతిరుచ్యతే ॥

కౢప్తముగా ఈ నామమునకు అర్థము - సాత్త్వత తంత్ర సంప్రదాయానుయాయుల పతిగా లేదా రక్షకుడై వారి యోగ క్షేమములను కలిగించువాడుగనుక భగవాన్ శ్రీ విష్ణుదేవుని సాత్త్వతాం పతిః అని కీర్తిస్తారు.

సాత్త్వతం అనునది ఒక తంత్రమునకు పేరు. త్రివక్రయను స్త్రీకి కృష్ణునివల్ల పుట్టిన ఉపశ్లోకుడనేవాడు కృష్ణభక్తుడై నారదునికి శిష్యుడై సాత్త్వత తంత్రమనే వైష్ణవస్మృతి గ్రంథాన్ని రచించాడు. స్త్రీలకూ, శూద్రులకూ, దాస జనానికీ ఈ గ్రంథం ముక్తి మార్గమును తెలుపునది.

'తత్కరోతి తదాచష్టే' అను పాణినీయ ధాతు పాఠమునందలి చురాది గణ సూత్రముచే 'ణిచ్‍'(ఇ) ప్రత్యయమురాగా దానిపైని 'క్విప్‍' ప్రత్యయమురాగా, ఆ ప్రత్యయము సర్వలోపిగావున అంతయు లోపించగా ణిచ్‍(ఇ) ప్రత్యయము లోపించగా సాత్వతం అను పదమునకు సాత్వతం తంత్రమును రచించినవారూ, వ్యాయానించువారు అని అర్థము ఆపాదించవచ్చును. సాత్త్వత తంత్ర కర్తలు శత్త్వతులు లేదా సాత్త్వత తంత్రోపదేష్టులు సాత్త్వతులు లేదా సాత్త్వత వంశజులు సాత్త్వతులు. అట్టి సాత్త్వతుల పతీ, రక్షకుడు సాత్త్వతాం పతిః.

:: శ్రీమద్భాగవతే ద్వితీయ స్కన్ధే చతుర్థోఽధ్యాయః ::
నమో నమస్తేఽస్త్వృషభాయ సాత్వతాం విదూరకాష్ఠాయ ముహుః కుయోగినామ్ ।
నిరస్తసామ్యాతిశయేన రాధసా స్వధామని బ్రహ్మణి రంస్యతే నమః ॥ 14 ॥



तत्करोति तदाचष्ट इति विच्प्रत्यये कृते ।
क्विप्रत्ययेणिलोपे च सात्त्वतात् सात्त्वदुध्भवः ॥
सात्त्वतं नाम यत्तंत्रं तत्कर्तॄणांच सात्त्वतां ॥
तत्तंत्रस्योपदेष्टॄणां योगक्षेमकरः पतिः ॥
सात्त्वत वंशप्रभवैर्वैष्णवैर्या च सेव्यते ।
इति श्री भगवान् विष्णुः सात्त्वतांपतिरुच्यते ॥

Tatkaroti tadācaṣṭa iti vicpratyaye kr̥te,
Kvipratyayeṇilope ca sāttvatāt sāttvadudhbhavaḥ.
Sāttvataṃ nāma yattaṃtraṃ tatkartṝṇāṃca sāttvatāṃ.
Tattaṃtrasyopadeṣṭṝṇāṃ yogakṣemakaraḥ patiḥ.
Sāttvata vaṃśaprabhavairvaiṣṇavairyā ca sevyate,
Iti śrī bhagavān viṣṇuḥ sāttvatāṃpatirucyate.

Sāttvatāṃ is the name of a Tantra. So the one who authored it or commented upon it or one who is the leader of the Sāttvata clan or those who adopted the Sāttvata tantra can be called Sāttvatāṃ as per the 'tatkaroti tadācaṣṭe' rule of pāṇini. Pati is lord or protector. Thus Lord Viṣṇu is called Sāttvatāṃ patiḥ since He is the lord of those who follow Sāttvata tantra.

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे नवमोऽध्यायः ::
ददर्श तत्राखिलसात्वतां पतिं श्रियः पतिं यज्ञपतिं जगत्पतिम् ।
सुनन्दनन्दप्रबलार्हणादिभिः स्वपार्षदाग्रैः परिसेवितं विभुम् ॥ १४ ॥

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 9
Dadarśa tatrākhilasātvatāṃ patiṃ śriyaḥ patiṃ yajñapatiṃ jagatpatim,
Sunandanandaprabalārhaṇādibhiḥ svapārṣadāgraiḥ parisēvitaṃ vibhum. 14.

Lord Brahmā saw in the Vaikuṇṭha - the Supreme Lord, who is the Lord of the entire devotee community, the Lord of the goddess of fortune, the Lord of all sacrifices, and the Lord of the universe, and who is served by the foremost servitors like Nanda, Sunanda, Prabala and Arhaṇa, His immediate associates.

:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे चतुर्थोऽध्यायः ::
नमो नमस्तेऽस्त्वृषभाय सात्वतां विदूरकाष्ठाय मुहुः कुयोगिनाम् ।
निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः ॥ १४ ॥ 

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 4
Namo namaste’stvr̥ṣabhāya sātvatāṃ vidūrakāṣṭhāya muhuḥ kuyoginām,
Nirastasāmyātiśayena rādhasā svadhāmani brahmaṇi raṃsyate namaḥ. 14.

Let me offer my respectful obeisances unto He who is the associate of the members of the Yadu dynasty and who is always a problem for the nondevotees. He is the supreme enjoyer of both the material and spiritual worlds, yet He enjoys His own abode in the spiritual sky. There is no one equal to Him because His transcendental opulence is immeasurable.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

29 మార్చి, 2014

511. దాశార్హః, दाशार्हः, Dāśārhaḥ

ఓం దాశార్హాయ నమః | ॐ दाशार्हाय नमः | OM Dāśārhāya namaḥ


దాశార్హః, दाशार्हः, Dāśārhaḥ

విష్ణుర్బ్రాహ్మణ రూపేణ దాశం దానం తమర్హతి ।
దశార్హకులోద్బవత్వాద్వా దాశార్హ ఇతీర్యతే ॥

దాశః అనగా దానము. భగవానుడు ఉత్తమ బ్రాహ్మణుడిగాగానీ, పూజార్హుడగు దైవతముగాగానీ దానమును అందుకొనుటకు అర్హుడుగనుక దాశార్హః. లేదా దశార్హ వంశమున కృష్ణుడుగా జనించినవాడనియైన చెప్పతగును.

:: పోతన భాగవతము - నవమ స్కంధము ::
సీ. జనకుని గృహమున జన్మించి మందలోఁ బెరిఁగి శత్రులనెల్లఁ బీఁచ మణఁచి
     పెక్కండ్రు భార్యలఁ బెండ్లియై సుతశతంబులఁ గాంచి తను నాదిపురుషుఁ గూర్చి
     శరణన్న వారిని గరుణించి పాండవ కౌరవులకు నంతఁ గలహమైన
     నందఱ సమయించి యర్జును గెలిపించి యుద్ధవునకుఁ దత్త్వ మొప్పఁ జెప్పి
తే. మగధ పాండవ సంజయ దశార్హ, భోజ వృష్ణ్యంధకాది సంపూజ్యుఁ డగుచు
     నుర్విభారము నివారించి, యుండ నొల్ల, కా మహామూర్తి నిజమూర్తి యందుఁ బొందె. (730)

ఆ మహావిష్ణువు వసుదేవుని ఇంట పుట్టి వ్రేపల్లెలో పెరిగి శత్రువులను నాశనం చేశాడు. పెక్కుమంది కాంతలను పెళ్ళాడి వందలకొలదిగా కొడుకులను కన్నాడు. ఆదిపురుషుడైన తన్ను గూర్చే అనేక యాగాలను చేశాడు. పాండవ కౌరవుల మధ్య జరిగిన యుద్ధంలో శత్రువులందరిని రూపుమాపి అర్జునుణ్ణి గెలిపించాడు. ఉద్ధవునికి తత్త్వాన్ని తెలియజెప్పాడు. మగధ, పాండవ, సంజయ, మధు, దశార్హ, భోజ, వృష్ణి, అంధక వంశాలకు చెందిన వారిచే పూజింపబడుతుండేవాడు. భూభారాన్ని తొలగించాక ఆ తేజోమూర్తి ఆత్మమూర్తిలో కలిసిపోయాడు.



विष्णुर्ब्राह्मण रूपेण दाशं दानं तमर्हति ।
दशार्हकुलोद्बवत्वाद्वा दाशार्ह इतीर्यते ॥

Viṣṇurbrāhmaṇa rūpeṇa dāśaṃ dānaṃ tamarhati ,
Daśārhakulodbavatvādvā dāśārha itīryate .

Dāśa means charitable offering. Therefore, Lord Viṣṇu in the form of a brāhmaṇa to whom charitable offerings deserve to be made is called Dāśārhaḥ. Or one who in His Kr̥ṣṇa incarnation was born in the lineage of Daśārha is called Dāśārhaḥ.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

28 మార్చి, 2014

510. సత్యసన్ధః, सत्यसन्धः, Satyasandhaḥ

ఓం సత్యసన్ధాయ నమః | ॐ सत्यसन्धाय नमः | OM Satyasandhāya namaḥ


సత్యాసన్ధాఽస్య సంకల్పః సత్యసన్ధోఽత ఉచ్యతే ।
శ్రీవిష్ణుస్సత్యసంకల్ప ఇతి శ్రుతి సమీరణాత్ ॥

సన్ధా అనగా సంకల్పము. సత్యము అనగా సఫలము అగు సంకల్పము ఎవనికి కలదో అట్టివాడు సత్యసంధుడు.

:: ఛాన్దోగ్యోపనిషత్ ఆష్టమః ప్రపాఠకః ప్రథమ ఖణ్డః ::
స బ్రూయా న్నాస్య జరయైత జ్జీర్యతి న వధే నాఽస్య హన్యత ఏత త్సత్యం బ్రహ్మ పుర మస్మిన్ కామా స్సమాహితా ఏష ఆత్మాఽపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోఽపిపాస స్సత్యకామ స్సత్యసఙ్కల్పో యథా హ్యేవేహ ప్రజా అన్వావిశంతి యథానుశాసనం యం యమన్త మభి కామా భవన్తియం జనపదం యం క్షేత్రభాగం తం తమే వోపజీవంతి ॥ 5 ॥

ఈ శరీరమునకు ముసలితనము వచ్చినను, బ్రహ్మమునకు అట్టి వృద్ధాప్యము రాదు. దేహమునకు దెబ్బ తగిలినను ఆత్మకు తగలదు. ఈ బ్రహ్మము సత్యమైనది. శరీరము సత్యము కానిది. బ్రహ్మమునందు సద్గుణములు ఆశ్రయించియున్నవి. ఈ బ్రహ్మము పాపరహితమైనది. పరబ్రహ్మమునకు ముసలితనము, మరణము, దుఃఖము, ఆకలి దప్పిక - ఇవి ఏవియునులేవు. ఆత్మ సత్యకామమైయున్నది (అది తలంచిన ప్రకారము జరుగును). సత్యసంకల్పమైయున్నది. అట్టి ఆత్మను తెలిసికొనవలయును. దానిని తెలిసికొనలేనిచో ఈ లోకమున రాజుయొక్క ఆజ్ఞానువర్తులై అనుసరించువారు ఏయే ఫలమును, ఏయే ప్రదేశమున కోరుదురో, దానినే పొందుదురు. కానీ సమస్తమును పొందునట్లు, సమస్తమును స్వేచ్ఛగా పొందలేరు.



सत्यासन्धाऽस्य संकल्पः सत्यसन्धोऽत उच्यते ।
श्रीविष्णुस्सत्यसंकल्प इति श्रुति समीरणात् ॥

Satyāsandhā’sya saṃkalpaḥ satyasandho’ta ucyate ,
Śrīviṣṇussatyasaṃkalpa iti śruti samīraṇāt .

One whose sandha or resolve always becomes true is Satyasandhaḥ.

:: छान्दोग्योपनिषत् आष्टमः प्रपाठकः प्रथम खण्डः ::
स ब्रूया न्नास्य जरयैत ज्जीर्यति न वधे नाऽस्य हन्यत एत त्सत्यं ब्रह्म पुर मस्मिन् कामा स्समाहिता एष आत्माऽपहतपाप्मा विजरो विमृत्युर्विशोको विजिघत्सोऽपिपास स्सत्यकाम स्सत्यसङ्कल्पो यथा ह्येवेह प्रजा अन्वाविशंति यथानुशासनं यं यमन्त मभि कामा भवन्तियं जनपदं यं क्षेत्रभागं तं तमे वोपजीवंति ॥ ५ ॥

:: Chāndogyopaniṣat āṣṭamaḥ prapāṭhakaḥ prathama khaṇḍaḥ ::
Sa brūyā nnāsya jarayaita jjīryati na vadhe nā’sya hanyata eta tsatyaṃ brahma pura masmin kāmā ssamāhitā eṣa ātmā’pahatapāpmā vijaro vimr̥tyurviśoko vijighatso’pipāsa ssatyakāma ssatyasaṅkalpo yathā hyeveha prajā anvāviśaṃti yathānuśāsanaṃ yaṃ yamanta mabhi kāmā bhavantiyaṃ janapadaṃ yaṃ kṣetrabhāgaṃ taṃ tame vopajīvaṃti. 5.

With the old age of the body, That (i.e. Brahman, described as the akasa in the heart) does not age; with the death of the body, That does not die. That Brahman and not the body is the real city of Brahman. In It all desires are contained. It is the Self−free from sin, free from old age, free from death, free from grief free from hunger, free from thirst; Its desires come true, Its thoughts come true. Just as, here on earth, people follow as they are commanded by a leader and depend upon whatever objects they desire, be it a country or a piece of land so also those who are ignorant of the Self depend upon other objects and experience the result of their good and evil deeds.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasandho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

27 మార్చి, 2014

509. జయః, जयः, Jayaḥ

ఓం జయాయ నమః | ॐ जयाय नमः | OM Jayāya namaḥ


విష్ణుస్సమస్తభూతాని జయతీత్యుచ్యతే జయః సమస్త భూతములనూ జయించువాడుగనుక విష్ణువునకు జయః అను నామము.



विष्णुस्समस्तभूतानि जयतीत्युच्यते जयः / Viṣṇussamastabhūtāni jayatītyucyate jayaḥ Lord Viṣṇu is victorious upon all beings and hence He is Jayaḥ.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

26 మార్చి, 2014

508. వినయః, विनयः, Vinayaḥ

ఓం వినయాయ నమః | ॐ विनयाय नमः | OM Vinayāya namaḥ


దుష్టానాం వినయం దండం కుర్వన్ వినయ ఉచ్యతే దుష్టులకు సంబంధించు విషయమున, వినయమును అనగా లొంగుటకు అనుకూలించు దండనమును అనుగ్రహించునుగనుక ఆ విష్ణుదేవునకు వినయః అను నామము.



दुष्टानां विनयं दंडं कुर्वन् विनय उच्यते / Duṣṭānāṃ vinayaṃ daṃḍaṃ kurvan vinaya ucyate Since Lord Viṣṇu imposes appropriate punishment upon the evil-doers to instill humility, He is Vinayaḥ.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

25 మార్చి, 2014

507. పురుసత్తమః, पुरुसत्तमः, Purusattamaḥ

ఓం పురుసత్తమాయ నమః | ॐ पुरुसत्तमाय नमः | OM Purusattamāya namaḥ


యో విశ్వరూపీ స పురురుత్కృష్టత్వాచ్చ సత్తమః ।
పురుశ్చాసౌ సత్తమశ్చ పురుసత్తమ ఉచ్యతే ॥

పురు అనగా అనేకము అని అర్థము. అన్నియు తానేయగు విశ్వరూపుడు కావున పరమాత్ముని పురు అనదగును. సజ్జనులలోనెల్ల ఉత్కృష్టుడు కావున సత్తముడు. పురుసత్తమః అనగా ఈతడు విశ్వరూపుడూ, చాలా గొప్ప సజ్జనుడూ అని చెప్పదగును.



यो विश्वरूपी स पुरुरुत्कृष्टत्वाच्च सत्तमः ।
पुरुश्चासौ सत्तमश्च पुरुसत्तम उच्यते ॥

Yo viśvarūpī sa pururutkr̥ṣṭatvācca sattamaḥ,
Puruścāsau sattamaśca purusattama ucyate.

As His is universal cosmic dimension and form, He is Puru - excellent and good. Since He is the superlatively good amongst the venerable, He is Sattamaḥ. Thus Purusattamaḥ means the One who is the best amongst the respectable and with cosmic dimensions.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

24 మార్చి, 2014

506. పురుజిత్‌, पुरुजित्‌, Purujit

ఓం పురుజితే నమః | ॐ पुरुजिते नमः | OM Purujite namaḥ


పురుజిత్‌, पुरुजित्‌, Purujit

పురూన్ బహూన్ జయతీతి పురుజిత్ ప్రోచ్యతే బుధైః అనేకులనైన, ఎంతమందినైన జయించువాడు. మహాశక్తి సంపన్నుడుగనుక పురుజిత్‍.

:: శ్రీమద్రామాయణే అరణ్యకాండే ఏకత్రింశస్సర్గః ::
న హి రామో దశగ్రీవ! శక్యో జేతుం త్వయా యుధి ।
రక్షసాం వాపి లోకేన స్వర్గః పాపజనైరివ ॥ 27 ॥

ఓ దశగ్రీవా! యుద్ధమునందు శ్రీరాముని జయించుట నీకు అసాధ్యము. పాపాత్ములు స్వర్గమును చేరలేనట్లు రాక్షసవీరులెవ్వరును అతనిని జయింపజాలరు.



पुरून् बहून् जयतीति पुरुजित् प्रोच्यते बुधैः / Purūn bahūn jayatīti purujit procyate budhaiḥ Puru means bahu or many. Jit means conqueror. Hence Purujit means the powerful one who can conquer upon many.

:: श्रीमद्रामायणे अरण्यकांडे एकत्रिंशस्सर्गः ::
न हि रामो दशग्रीव! शक्यो जेतुं त्वया युधि ।
रक्षसां वापि लोकेन स्वर्गः पापजनैरिव ॥ २७ ॥

Śrīmad Rāmāyaṇa - Book 3, Chapter 31
Na hi rāmo daśagrīva! śakyo jetuṃ tvayā yudhi,
Rakṣasāṃ vāpi lokena svargaḥ pāpajanairiva. 27.

Oh, Dashagriiva, it is impossible to conquer that Rama in war for your, either singly or along with the hosts of the demon-supporters of yours, as one heaven cannot be won by many sinners.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

23 మార్చి, 2014

505. సోమః, सोमः, Somaḥ

ఓం సోమాయ నమః | ॐ सोमाय नमः | OM Somāya namaḥ


ఓషధీః పోషయన్ సోమ ఉమయా వా యుతః శివః సోముని రూపమున నుండి ఓషధులను పోషించుచుండు పరమాత్ముడు సోమః అని ఇచట చెప్పబడినాడు. లేదా ఉమతో కూడియుండు శివుడునూ విష్ణుని విభూతియే.

285. శశబిందుః, शशबिन्दुः, Śaśabinduḥ



ओषधीः पोषयन् सोम उमया वा युतः शिवः / Oṣadhīḥ poṣayan soma Umayā vā yutaḥ Śivaḥ He nourishes the plants in the form of the moon and hence Somaḥ. Or Śiva in association with His consort Uma is also a form of Viṣṇu.

285. శశబిందుః, शशबिन्दुः, Śaśabinduḥ

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

22 మార్చి, 2014

504. అమృతపః, अमृतपः, Amr̥tapaḥ

ఓం అమృతపాయ నమః | ॐ अमृतपाय नमः | OM Amr̥tapāya namaḥ


అమృతపః, अमृतपः, Amr̥tapaḥ

అసురైర్హ్రియమాణ మమృతం సంరక్షదేవతాః ।
పాయయిత్వా స్వయమపి యోఽపిబత్పరమేశ్వరః ।
సచామృతప ఇత్యుక్తః వేదార్థజ్ఞానిభిర్బుధైః ॥

స్వాత్మానందము అను అమృత రసమును త్రావువాడుగా పరమాత్ముడు 'అమృతపః' అనబడును. లేదా క్షీరసాగరమథనమున జనించి అసురులచే అపహరింపబడుచుండిన అమృతమును రక్షించి దానిని దేవతలచే త్రావించి తానునూ త్రావినందున అమృతపః.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
క.   ఒక్క బొట్టుఁ జిక్క కుండఁగ, సకల సుధారసము నమర సంఘంబులకుం
      బ్రకటించి పోసి హరి దన, సుకరాకృతిఁ దాల్చె నసుర శూరులు బెడగన్ (324)
మ. అమరుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థాభిమానణ్బులన్
      సములై లబ్దవికల్పులైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర
      య్యమరారుల్ బహుదుఃఖముల్ గనిరి తా మత్యంత దోర్గర్వులై;
      కమలాక్షున్ శరణంబు వేఁడని జనుల్ గల్యాణ సంయుక్తులే? (325)

విష్ణువు ఒక్క చుక్క కూడా మిగలకుండా అమృతమంతా అమరసమూహానికే బాహాటంగా పోసినాడు. మోహినీ రూపాన్ని వదలి తన నిజ స్వరూపాన్ని ధరించినాడు. ఇదంతా చూసి రాక్షస వీరులు దుఃఖపడినారు.

దేవతలూ సరిసమానమైన రాక్షసులూ పూనికా, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ కలిగినవారే. కానీ వారికి రెండు విధములైన ఫలితములు ప్రాప్తించినాయి. దేవతలు శుభాలను పొందినారు. విష్ణువును శరణు వేడని వారు శుభాలను పొందగలరా?



असुरैर्ह्रियमाण ममृतं संरक्षदेवताः ।
पाययित्वा स्वयमपि योऽपिबत्परमेश्वरः ।
सचामृतप इत्युक्तः वेदार्थज्ञानिभिर्बुधैः ॥

Asurairhriyamāṇa mamr̥taṃ saṃrakṣadevatāḥ,
Pāyayitvā svayamapi yo’pibatparameśvaraḥ,
Sacāmr̥tapa ityuktaḥ vedārthajñānibhirbudhaiḥ.

One who drinks the Amr̥ta (nectar) of immortal Bliss which is of One's own self. Or One who recovered the Amr̥ta from the wicked and made the Devas, including Himself, partake of it.

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे नवमोऽध्यायः ॥
एवं सुरासुरगणाः समदेशकाल
    हेत्वर्थकर्ममतयोऽपि फले विकल्पाः ।
तत्रामृतं सुरगणाः फलमञ्जसापुर्‌
    यत्पादपङ्कजरजः श्रयणान्न दैत्याः ॥२८ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 9
Evaṃ surāsuragaṇāḥ samadeśakāla
Hetvarthakarmamatayo’pi phale vikalpāḥ,
Tatrāmr̥taṃ suragaṇāḥ phalamañjasāpurˈ
Yatpādapaṅkajarajaḥ śrayaṇānna daityāḥ.28.

The place, the time, the cause, the purpose, the activity and the ambition were all the same for both the gods and the demons, but the gods achieved one result and the demons another. Because the gods are always under the shelter of the dust of the Lord's lotus feet, they could very easily drink the nectar and get its result. The demons, however, not having sought shelter at the lotus feet of the Lord, were unable to achieve the result they desired.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

21 మార్చి, 2014

503. సోమపః, सोमपः, Somapaḥ

ఓం సోమపాయ నమః | ॐ सोमपाय नमः | OM Somapāya namaḥ


దర్శయన్ ధర్మమర్యాదాం యజమానో జనార్దనః ।
యష్టవ్య దేవతా రూపీవాఽపి సోమప ఉచ్యతే ॥

శ్రీ విష్ణువు సర్వ యజ్ఞములందును యజించబడదగిన దేవతారూపముననుండుచు సోమ రసమును పానము చేయుచుండును. లేదా ధర్మ మర్యాదను చూపుటకై యజ్ఞమును ఆచరించుచు యజమాన రూపమునైన శ్రీవిష్ణువే సోమపానము చేయుచున్నాడు. కావున అతడు సోమమును త్రావును - కనుక 'సోమపః' అనదగును.



दर्शयन् धर्ममर्यादां यजमानो जनार्दनः ।
यष्टव्य देवता रूपीवाऽपि सोमप उच्यते ॥

Darśayan dharmamaryādāṃ yajamāno janārdanaḥ,
Yaṣṭavya devatā rūpīvā’pi somapa ucyate.

One who drinks the Soma rasa in all Yajñas in the form of presiding deity. Or One who takes the Soma as the yajamāna or the master of sacrifice for the sake of Dharma.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

20 మార్చి, 2014

502. భూరిదక్షిణః, भूरिदक्षिणः, Bhūridakṣiṇaḥ

ఓం భూరిదక్షిణాయ నమః | ॐ भूरिदक्षिणाय नमः | OM Bhūridakṣiṇāya namaḥ


యజతో ధర్మమర్యాదాదర్శనాయాఽపి భూరయః ।
బహ్వ్యోఽస్య దక్షిణా యజ్ఞ ఇతీశో భూరిదక్షిణః ॥

ధర్మ మర్యాదను లోకమునకు చూపుటకై యజ్ఞమును ఆచరించు యజమానిగా ఉన్న ఈ భగవానునకు ఆ యజ్ఞమున తాను ఇచ్చు భూరిదక్షిణలు కలవు. అట్టి యజ్ఞమును ఆచరించుచుండు యజమానుడూ విష్ణుపరమాత్ముని విభూతియే!

అనగా - యజ్ఞమును చేయించిన ఋత్విజులకు యజమాని సమర్పించుకొను భూరిదక్షిణలూ విష్ణువే. కావున ఆ విష్ణుదేవుడు భూరిదక్షిణః.



यजतो धर्ममर्यादादर्शनायाऽपि भूरयः ।
बह्व्योऽस्य दक्षिणा यज्ञ इतीशो भूरिदक्षिणः ॥

Yajato dharmamaryādādarśanāyā’pi bhūrayaḥ,
Bahvyo’sya dakṣiṇā yajña itīśo bhūridakṣiṇaḥ.

Bhūri means abundant. Yajña dakṣiṇa is the compensation offered by the yajamāni or the person who performs sacrifices to the officiating priests of the sacrifice.

Abundant  yajña dakṣiṇa obtain in Him who performs sacrifices to show to the world the proprieties of yajñas.

In other words, the remuneration or honorarium for services rendered by the officiating priests is also Lord Viṣṇu.

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

19 మార్చి, 2014

501. కపీంద్రః, कपींद्रः, Kapīndraḥ

ఓం కపీన్ద్రాయ నమః | ॐ कपीन्द्राय नमः | OM Kapīndrāya namaḥ


కపీంద్రః, कपींद्रः, Kapīndraḥ

కపిర్వరాహ ఇంద్రశ్చ వారాహం వపురాస్థితః ।
కపీనాం వానరాణాం సుకపింద్రో రాఘవోఽపి వా ॥

ఈతడు కపియును ఇంద్రుడును. కపి అనగా వరాహము. వరాహ రూపము ధరించిన భగవానుడు 'కపీంద్రుడు' అనబడును. లేదా వానరులకు ఇంద్రుడు అనగా శ్రీరాముడు అనికూడా చెప్పదగును.



कपिर्वराह इंद्रश्च वाराहं वपुरास्थितः ।
कपीनां वानराणां सुकपिंद्रो राघवोऽपि वा ॥

Kapirvarāha iṃdraśca vārāhaṃ vapurāsthitaḥ,
Kapīnāṃ vānarāṇāṃ sukapiṃdro rāghavo’pi vā.

Kapi means varāha or wild boar. Indra means superior. Kapīndraḥ is the great varāha; an incarnation of Lord Viṣṇu. Or Kapi can also mean a primate.  Kapīndra, hence, can be interpreted as lord of the monkeys or Lord Śrī Rāma.

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

18 మార్చి, 2014

500. భోక్తా, भोक्ता, Bhoktā

ఓం భోక్త్రే నమః | ॐ भोक्त्रे नमः | OM Bhoktre namaḥ


పరమానంద సందోహ సంభోగాత్పరమేశ్వరః ।
జగతాం పాలకత్వాద్వా భోక్తేతి ప్రోచ్యతే బుధైః ॥

జీవ రూపమున తాను ఉండి పరమానంద సందోహమును అనగా పరమానంద రాశిని లెస్సగా అనుభవించునుగావున 'భోక్తా' అని శ్రీ విష్ణునకు వ్యవహారము. లేదా ప్రాణులను పాలించి రక్షించుచుండునుగనుక భోక్తా.

:: శ్రీమద్భగవద్గీత - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ॥ 23 ॥

పురుషుడు అనగా ఆత్మ ఈ శరీరమందున్నప్పటికినీ, శరీరముకంటే వేఱైనవాడూ, సాక్షీభూతుడూ, అనుమతించువాడూ, భరించువాడూ, అనుభవించువాడూ, పరమేశ్వరుడూ, పరమాత్మయూ అని చెప్పబడుచున్నాడు.

143. భోక్తా, भोक्ता, Bhoktā



परमानन्द सन्दोह संभोगात्परमेश्वरः ।
जगतां पालकत्वाद्वा भोक्तेति प्रोच्यते बुधैः ॥

Paramānanda sandoha saṃbhogātparameśvaraḥ ,
Jagatāṃ pālakatvādvā bhokteti procyate budhaiḥ .

He enjoys association with infinite supreme bliss. Or also because He protects, He is known by the divine name of 'Bhoktā'.

:: श्रीमद्भगवद्गीत - क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः ॥ २३ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 13
Upadraṣṭānumantā ca bhartā bhoktā maheśvaraḥ,
Paramātmeti cāpyukto dehe’smin puruṣaḥ paraḥ. 23.

He who is the Witness, the Permitter, the Sustainer, the Experiencer, the great Lord and who is also spoken of as the transcendental Self is the supreme Person in this body.

143. భోక్తా, भोक्ता, Bhoktā

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

17 మార్చి, 2014

499. శరీరభూతభ్రుత్‌, शरीरभूतभ्रुत्‌, Śarīrabhūtabhrut

ఓం శరీరభూభృతే నమః | ॐ शरीरभूभृते नमः | OM Śarīrabhūbhr̥te namaḥ


శరీరారంభభూతానాం భరణాత్ ప్రాణరూపధృత్ ।
శరీరభూతభృదితి శ్రీవిష్ణుః ప్రోచ్యతే బుధైః ॥

శరీరములను నిర్మించు భూతములు శరీర భూతములు (పంచ భూతములు). ప్రాణతత్త్వరూపమున అట్టి శరీరభూతములను సడలిపోకుండా, పడిపోకుండా, చెదిరి పోకుండా భరిస్తూ నిలిపియుంచునుగనుక శ్రీ మహావిష్ణుదేవునకు శరీరభూతభృత్ అని వ్యవహారము.



शरीरारंभभूतानां भरणात् प्राणरूपधृत् ।
शरीरभूतभृदिति श्रीविष्णुः प्रोच्यते बुधैः ॥

Śarīrāraṃbhabhūtānāṃ bharaṇāt prāṇarūpadhr̥t,
Śarīrabhūtabhr̥diti śrīviṣṇuḥ procyate budhaiḥ.

The elements that are involved in makeup of the bodies Śarīrabhūta or elements of the body. In the form of prāṇa or life force, Lord Śrī Mahā Viṣṇu keeps the elements bonded, sustained and supported and hence He is called 'Śarīrabhūtabhrut'.

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

16 మార్చి, 2014

498. పురాతనః, पुरातनः, Purātanaḥ

ఓం పురాతనాయ నమః | ॐ पुरातनाय नमः | OM Purātanāya namaḥ


కాలేనాప్యపరిచ్ఛిన్నః పురాఽపి భవతీతి సః ।
విష్ణుః పురాతనః ఇతి ప్రోచ్యతే విదుషాం వరైః ॥

కాలముచే పరిమితి నిర్ణయింపబడనివాడు కావున పూర్వమునందు ఉన్నవాడు, వర్తమానమున ఉన్నవాడు, భవిష్యత్తునందు ఉండెడివాడు - గావున పురాతనః అని శ్రీ విష్ణుని నామ విశేషము.



कालेनाप्यपरिच्छिन्नः पुराऽपि भवतीति सः ।
विष्णुः पुरातनः इति प्रोच्यते विदुषां वरैः ॥

Kālenāpyaparicchinnaḥ purā’pi bhavatīti saḥ,
Viṣṇuḥ purātanaḥ iti procyate viduṣāṃ varaiḥ.

As He is not confined by time limits; having existed, is existing and will always exist - He is called Purātanaḥ.

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

15 మార్చి, 2014

497. జ్ఞానగమ్యః, ज्ञानगम्यः, Jñānagamyaḥ

ఓం జ్ఞానగమ్యాయ నమః | ॐ ज्ञानगम्याय नमः | OM Jñānagamyāya namaḥ


న కర్మణావా న జ్ఞానకర్మభ్యాం వాఽథగమ్యతే ।
వాసుదేవో మహావిష్ణుః కింతు జ్ఞానేన గమ్యతే ।
ఇత్యుచ్యతే జ్ఞానగమ్య ఇతి వేదాంతిభిర్భుధైః ॥

కర్మలచేగానీ, ఉపాసనా కర్మద్వయముచేగానీ ఎరుగబడక కేవల జ్ఞానముచేతనే వాసుదేవుడైన ఆ మహావిష్ణువు పొందబడుతాడు గనుక ఆయనను జ్ఞానగమ్యః అని కీర్తింతురు.



न कर्मणावा न ज्ञानकर्मभ्यां वाऽथगम्यते ।
वासुदेवो महाविष्णुः किंतु ज्ञानेन गम्यते ।
इत्युच्यते ज्ञानगम्य इति वेदांतिभिर्भुधैः ॥ 

Na karmaṇāvā na jñānakarmabhyāṃ vā’thagamyate,
Vāsudevo mahāviṣṇuḥ kiṃtu jñānena gamyate,
Ityucyate jñānagamya iti vedāṃtibhirbhudhaiḥ.

Lord Mahā Viṣṇu is attained not by karma i.e., action, not by upāsanā i.e., worship and karma, but only by jñāna (knowledge) and hence He is known as Jñānagamyaḥ.

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

14 మార్చి, 2014

496. గోప్తా, गोप्ता, Goptā

ఓం గోప్త్రే నమః | ॐ गोप्त्रे नमः | OM Goptre namaḥ


జగతో రక్షకో విష్ణుస్సర్వభూతాని పాలయన్ ।
గోప్తేతి కథ్యతే విశ్వసృష్టిస్థితివినాశకృత్ ॥

జగద్రక్షకుడైన విష్ణువు సర్వభూతములనూ పాలించుచుండును గనుక గోప్తా అని పిలువబడును. విశ్వమును సృజించుట త్రికృత్యములలో మొదటిది; సంహారము చివరిది. రెంటి నడుమ సాగెడి కృత్యము జగముల పాలకత్వము.



जगतो रक्षको विष्णुस्सर्वभूतानि पालयन् ।
गोप्तेति कथ्यते विश्वसृष्टिस्थितिविनाशकृत् ॥

Jagato rakṣako viṣṇussarvabhūtāni pālayan,
Gopteti kathyate viśvasr̥ṣṭisthitivināśakr̥t.

As the protector of worlds, Lord Viṣṇu sustains and protects all the beings. Sustenance is one of the three phases viz creation, sustenance and annihilation.

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

13 మార్చి, 2014

495. గోపతిః, गोपतिः, Gopatiḥ

ఓం గోపతయే నమః | ॐ गोपतये नमः | OM Gopataye namaḥ


గోపతిః, गोपतिः, Gopatiḥ

గోపవేషధరో విష్ణుర్గోపతిః పాలనాద్గవామ్ ।
అథవా గౌర్మహీ తస్యాః పతిత్వాద్వా తథోచ్యతే ॥

గోపవేషధరుడైన విష్ణువు గోవుల రక్షకుడిగా గోపతిః అని ఎరుగబడును. లేదా 'గౌః' అనగా భూమి. ఆమెకు పతి అనియూ చెప్పదగును. 'గో' శబ్దమునకు ఇంద్రియము అని కూడా అర్థముగలదు. ఈ కోణములో ఇంద్రియముల రక్షకుడు అనగా ముఖ్య ప్రాణతత్త్వముగా కూడా విష్ణువును గోపతిః నామము ద్వారా కీర్తించవచ్చును.



गोपवेषधरो विष्णुर्गोपतिः पालनाद्गवाम् ।
अथवा गौर्मही तस्याः पतित्वाद्वा तथोच्यते ॥

Gopaveṣadharo viṣṇurgopatiḥ pālanādgavām,
Athavā gaurmahī tasyāḥ patitvādvā tathocyate.


Donning the garb of a cowherd, He protects the cows and hence is called Gopatiḥ. 'Gau' can mean earth and hence Gopatiḥ may also be taken as the lord of earth. 'Go' can also be interpreted as sensory organ and Lord Viṣṇu as the protector of sensory organs or as the prime life force is Gopatiḥ.

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

12 మార్చి, 2014

494. ఉత్తరః, उत्तरः, Uttaraḥ

ఓం ఉత్తరాయ నమః | ॐ उत्तराय नमः | OM Uttarāya namaḥ


ఉత్తరతి వాసుదేవో జన్మసంసారబంధనాత్ ।
ఇతి సర్వోత్కృష్ట ఇతి వా విశ్వస్మాదితి శ్రుతేః ।
విష్ణురుత్తర ఇత్యుక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

జన్మ సంసార బంధనమునుండి దాటియుండువాడు. ఉత్ + తర అను విభాగముచే గొప్పవారందరికంటే గొప్పవాడు అని కూడా చెప్పవచ్చును. ఉత్ అను నిపాతమునకు గొప్పవాడు అని అర్థము. దీనికి ప్రమాణముగా విశ్వస్మాదింద్ర ఉత్తరః అను ఋగ్వేదవచనమును (10.86.1) గ్రహించవచ్చును. ఇందీ - దీప్తా అను ధాతువునుండి నిష్పన్నమగు ఇంద్రశబ్దమునకు స్వయం ప్రకాశమానమగునది అని అర్థము.



उत्तरति वासुदेवो जन्मसंसारबंधनात् ।
इति सर्वोत्कृष्ट इति वा विश्वस्मादिति श्रुतेः ।
विष्णुरुत्तर इत्युक्तो विद्वद्भिर्वेदपारगैः ॥ 

Uttarati vāsudevo janmasaṃsārabaṃdhanāt,
Iti sarvotkr̥ṣṭa iti vā viśvasmāditi śruteḥ,
Viṣṇuruttara ityukto vidvadbhirvedapāragaiḥ.

He is beyond the bonds of birth and saṃsāra or the worldly existence and hence He is considered Uttaraḥ. The conjoining of ut + tara can also imply superior amongst the greatest vide the Śruti विश्वस्मादिंद्र उत्तरः / Viśvasmādindra uttaraḥ R̥igveda (10.86.1). He is superior to the whole universe. Indī - dīpta means an effulgent divinity or Brahman.

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr̥d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

11 మార్చి, 2014

493. దేవభృద్గురుః, देवभृद्गुरुः, Devabhr̥dguruḥ

ఓం దేవభృద్‍గురవే నమః | ॐ देवभृद्‍गुरवे नमः | OM Devabhr̥dˈgurave namaḥ


దేవభృద్గురుః, देवभृद्गुरुः, Devabhr̥dguruḥ

దేవాన్బిభర్తీతి దేవభృచ్ఛక్రస్తస్య శాసితా 
దేవానాం భరణాత్సర్వ విద్యానాం శరణాదుత ।
దేవభృద్గురురిత్యుక్తో విష్ణుర్దేవేశ్వరః ॥

దేవతలందరినీ భరించునుగావున ఇంద్రుని 'దేవభృత్‍' అని సంభోదిస్తారు. గురుః అనగా పూజ్యుడగు పెద్ద వ్యక్తి. ఇంద్రునికూడా శాశించువాడుగావున శ్రీ విష్ణు దేవుడు 'దేవభృద్గురుః'.

లేదా దేవతలనందరినీ తానే పోషించును అను అర్థమున విష్ణువు తానే 'దేవభృత్‍'. ఆ విష్ణువు తానే సర్వవిద్యలనూ ప్రవచనముచేయునుకావున గురుః. ఈతడు దేవతలను భరించు, పోషించు వాడునూ, సర్వవిద్యలనూ ప్రవచించువాడునూ కావున 'దేవభృద్గురుః'.



देवान्बिभर्तीति देवभृच्छक्रस्तस्य शासिता ।
देवानां भरणात्सर्व विद्यानां शरणादुत ।
देवभृद्गुरुरित्युक्तो विष्णुर्देवेश्वरः ॥

Dēvānbibhartīti dēvabhr̥cchakrastasya śāsitā,
Dēvānāṃ bharaṇātsarva vidyānāṃ śaraṇāduta,
Dēvabhr̥dgururityuktō viṣṇurdēvēśvaraḥ.

Indra is called dēvabhr̥t since he governs all the devas. Lord Viṣṇu governs even such Indra playing the role of a superior elderly person and hence He is Devabhr̥dguruḥ.

Or Lord Viṣṇu himself governs all the devas and hence He himself is dēvabhr̥t. As He promulgates all the knowledge, He is guruḥ. So, being the governor of all devas imparting knowledge of all vidyas, Lord Viṣṇuis called Devabhr̥dguruḥ.

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥

10 మార్చి, 2014

492. దేవేశః, देवेशः, Deveśaḥ

ఓం దేవేశాయ నమః | ॐ देवेशाय नमः | OM Deveśāya namaḥ


దేవేశః, देवेशः, Deveśaḥ

ప్రాధాన్యేన హి దేవానామీశోదేవేశో ఉచ్యతే ఎల్ల ప్రాణులకు తాను ఈశుడు అయి ఉండిననూ ప్రధానముగా దేవతలకు ఈశుడుగనుక 'దేవేశః' అనబడును.

:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే ।
అనన్త దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ॥ 37 ॥

మహాత్మా! అనంతరూపా! దేవదేవా! జగదాశ్రయా! సత్‍, అసత్తులకు అనగా స్థూలసూక్ష్మజగత్తుల రెంటికినీ పరమైనట్టి అక్షర అనగా నాశరహితమైన పరబ్రహ్మ స్వరూపుడవు నీవే అయి ఉన్నావు. బ్రహ్మదేవునికికూడా ఆదికారణరూపుడవు కనుకనే సర్వోత్కృష్టుడవగు నీకు ఏల నమస్కరింపకుందురు? అనగా వారి నమస్కారములకు నీవే తగుదువు అని భావము.



प्राधान्येन हि देवानामीशोदेवेशो उच्यते / Prādhānyēna hi dēvānāmīśōdēvēśō ucyatē Though He is the Lord of all beings, especially since He is Lord of the devas, He is called Deveśaḥ.

:: श्रीमद्भगवद्गीत - विश्वरूपसंदर्शन योगमु ::
कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् ॥ ३७ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 11
Kasmācca tē na namēranmahātman garīyasē brahmaṇō’pyādikartrē,
Ananta dēvēśa jagannivāsa tvamakṣaraṃ sadasattatparaṃ yat. 37.

And why not should they bow down to You, O exalted One, who is greater than all and who is the first Creator even of Brahmā! O infinite One, supreme God, Abode of the Universe, You are the Immutable, being and non-being and that who is Transcendental.

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥

9 మార్చి, 2014

491. మహాదేవః, महादेवः, Mahādevaḥ

ఓం మహాదేవాయ నమః | ॐ महादेवाय नमः | OM Mahādevāya namaḥ


మహాదేవః, महादेवः, Mahādevaḥ

యన్మహత్యాత్మజ్ఞానయోగైశ్వర్యే యో మహీయతే ।
సర్వన్భావాన్పరిత్యజ్య స మహాదేవ ఉచ్యతే ॥

సంభవములగు సర్వభావములను వదలి మిగుల గొప్పదియగు ఆత్మజ్ఞానయోగమునకు ఈశ్వరుడుగానుండుట అను స్థితియందు పూజింపబడుచుండునుగావున 'మహాన్‍' అనబడును. మహాన్ అగు దేవుడు కావున శ్రీ మహా విష్ణువు 'మహాదేవః' అనబడుచున్నాడు.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
సీ. భూతాత్మా! భూతేశ! భూతభావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!
యీ లోకములకెల్ల నీశ్వరుండవు నీవు; బంధమోక్షములకుఁ బ్రభుఁడ నీవ;
యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ గోరి భజింతురు కుశలమతులు;
సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మవిష్ణు శివాఖ్య బరఁగు దీవు;
ఆ. పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త, మంబు నీవ; శక్తి మయుఁడ వీవ
శబ్ద యోని వీవ; జగదంతరాత్మవు నీవ, ప్రాణ మరయ నిఖిలమునకు. (222)

నీవు పంచభూతాలకూ ఆత్మయైనవాడవు. భూతనాథుడవు. జీవులకు కారణరూపమైన దేవుడవు. దేవదేవా! మహాదేవా! దేవవంద్యా! అన్ని లోకాలనూ పాలించేవాడవు నీవు. లోకములోని బంధ మోక్షాలకు ప్రభుడవు నీవు. దుఃఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు. బుద్ధిమంతులు ప్రీతితో నిన్ను పూజిస్తారు. సమస్తమైన సృష్టికీ స్థితికీ లయానికీ కర్తవు నీవు. బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేరులతో ప్రకాశిమ్చే వాడవు నీవే. భావింపరాని పరమాత్మవు నీవు. ప్రకృతి పురుష సవరూప్డవు నీవే. శక్తియుతుడవు నీవే. శబ్దానికి జన్మస్థానం నీవే. లోకానికి అంతరాత్మవు నీవే. సమస్తానికీ ప్రాణం నీవే.



यन्महत्यात्मज्ञानयोगैश्वर्ये यो महीयते ।
सर्वन्भावान्परित्यज्य स महादेव उच्यते ॥

Yanmahatyātmajñānayogaiśvarye yo mahīyate,
Sarvanbhāvānparityajya sa mahādeva ucyate.

Abandoning all possible concepts, He glories in the great wealth of ātmajñāna or self-realization, yoga and aiśvarya. Therefore, Lord Mahā Viṣṇu is called Mahādevaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे द्विषष्टितमोऽद्यायः ::
नमस्ये त्वां महादेव लोकानां गुरुमीश्वरम् ।
पुंसामपूर्णकामानां कामपूरामराङ्घ्रिपम् ॥ ७ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 62
Namasye tvāṃ mahādeva lokānāṃ gurumīśvaram,
Puṃsāmapūrṇakāmānāṃ kāmapūrāmarāṅghripam. 7.

O Lord Mahādeva, I bow down to you, the spiritual master and controller of the worlds. You are like the heavenly tree that fulfills the desires of those whose desires are unfulfilled.

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥

8 మార్చి, 2014

490. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

ఓం ఆదిదేవాయ నమః | ॐ आदिदेवाय नमः | OM Ādidevāya namaḥ


ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

ఆదీయంతే సర్వభూతాన్యనేనేత్యాదిరచ్యుతః ।
దేవశ్చాసావితి విష్ణురాదిదేవ ఇతీర్యతే ॥

ప్రళయాది సమయములయందు సర్వభూతములనూ తనలోనికి గ్రహించుతాడుగనుక అచ్యుతుడు 'ఆదిః' అనబడును. ఈ విష్ణుడు అట్లు ఆదియగు అనగా సర్వభూతములను తనలోనికి గ్రహించువాడగు దేవుడుగనుక ఆదిదేవః.

:: పోతన భాగవతము ద్వాదశ స్కంధము ::
సీ. సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయార సోద్భాసితుఁ ద్రిదశాభి వందితపాదాబ్జు వనధీశయను
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని వేదాంతవేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని సంఖచక్రగదాశిశార్ఙ్గధరుని
తే. శోభనాకారుఁ బీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయపుణ్యదేహుఁ దలఁతు నుతియింతు దేవకీతనయునెపుడు. (50)

గుణములకన్నింటికీ అతీతమైనవాడునూ, సర్వమూ తెలిసినవాడునూ, అన్నింటికీ ఈశ్వరుడైనవాడునూ, సర్వలోకాలకూ ఆధారమైనవాడునూ, ఆదిదేవుడునూ, గొప్పదైన కరుణారసంచేత ప్రకాశించేవాడునూ, దేవతల వందనాలను అందుకునే పాదాబ్జాలు కలవాడునూ, సముద్రంలో శయనించేవాడునూ, ఆశ్రయించిన వారి పాలిటికి కల్పవృక్షంవంటివాడునూ, ఆదీ-అంతమూ అనేవి లేనివాడునూ, వేదాంతంచేత తెలియదగినవాడునూ, విశ్వమంతా నిండిఉన్నవాడునూ, వక్షస్థలం మీద కౌస్తుభమూ శ్రీవత్సమూ కలవాడునూ, శంఖమూ, చక్రమూ, గదా, ఖడ్గమూ, శార్ఙ్గం అనే ధనుస్సు ధరించి ఉండేవాడునూ, మంగళకరమైన రూపం కలవాడునూ, పీతాంబరము ధరించి మనోహరంగా కనిపించేవాడునూ, రత్నాలచేత ప్రకాశించే కిరీటంతో వెలుగులు నింపేవాడునూ, పద్మపత్రాలవంటి నేత్రాలు కలవాడునూ, గొప్పదైన పుణ్యవంతమైన శరీరం కలవాడునూ అయిన దేవకీనందనుని స్మరించి యెల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను.

334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ



आदीयंते सर्वभूतान्यनेनेत्यादिरच्युतः ।
देवश्चासाविति विष्णुरादिदेव इतीर्यते ॥ 

Ādīyante sarvabhūtānyanenetyādiracyutaḥ,
Devaścāsāviti viṣṇurādideva itīryate.

During the times of dissolution, all the beings are drawn into Lord Acyuta; hence He is 'Ādiḥ'. As Lord Viṣṇu is the Deva who draws all beings to Himself, He is called Ādidevaḥ.

::श्रीमद्भागवते एकादशस्कन्धे चतुर्थोऽध्यायह् ::
भूतैर्यदा पङ्चभिरात्मसृष्टैः पुरं विराजं विरचय्य तस्मिन् ।
स्वांशेन विष्टः पुरुशाभिधानम् अवाप नारायण आदिदेवः ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 4
Bhūtairyadā paṅcabhirātmasr̥ṣṭaiḥ puraṃ virājaṃ viracayya tasmin,
Svāṃśena viṣṭaḥ puruśābhidhānam avāpa nārāyaṇa ādidevaḥ.

When the primeval Lord Nārāyaṇa created His universal body out of the five elements produced from Himself and then entered within that universal body by His own plenary portion, He thus became known as the Puruṣa.

334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥

7 మార్చి, 2014

489. భూతమహేశ్వరః, भूतमहेश्वरः, Bhūtamaheśvaraḥ

ఓం భూతమహేశ్వరాయ నమః | ॐ भूतमहेश्वराय नमः | OM Bhūtamaheśvarāya namaḥ


భూతానామ్మహానీశ్వర ఇతి భూతమహేశ్వరః సకలభూతములకును గొప్ప ఈశ్వరుడు. లేదా భూతేన సత్యేన స ఏవ మహాన్ పరమః ఈశ్వరః సత్యముగా ఆతడే గొప్ప ఈశ్వరుడూ, ప్రభువు.



भूतानाम्महानीश्वर इति भूतमहेश्वरः / Bhūtānāmmahānīśvara iti bhūtamaheśvaraḥ The great Lord of all beings. Or भूतेन सत्येन स एव महान् परमः ईश्वरः / Bhūtena satyena sa eva mahān paramaḥ īśvaraḥ He is Lord of all beings; and this is the supreme truth.

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥

6 మార్చి, 2014

488. సింహః, सिंहः, Siṃhaḥ

ఓం సింహాయ నమః | ॐ सिंहाय नमः | OM Siṃhāya namaḥ


సింహః, सिंहः, Siṃhaḥ

విష్ణుర్విక్రమశాలిత్వాత్సింహవత్సింహ ఇత్యుత ।
సత్యభామా భామేతివన్నృసింహస్సింహ ఉచ్యతే ॥

విక్రమశాలికావున సింహమువంటివాడు. లేదా 'నృసింహః' లోని 'నృ' పదమును తీసివేయగా మిగిలిన 'సింహః' శబ్దముగా దీనిని గ్రహించవలయును. 'సత్యభామా' పదమునుండి 'సత్య'ను వదిలి - సత్యభామను 'భామ' అని చెప్పునట్లే, 'నృ'ను తొలగించి సింహః అని చెప్పునట్లు భావించుటవల్ల 'సింహః' అనగా 'నృసింహః' అని గ్రహించవలెను.



विष्णुर्विक्रमशालित्वात्सिंहवत्सिंह इत्युत ।
सत्यभामा भामेतिवन्नृसिंहस्सिंह उच्यते ॥

Viṣṇurvikramaśālitvātsiṃhavatsiṃha ityuta,
Satyabhāmā bhāmetivannr̥siṃhassiṃha ucyate.

Being valorous, He is like a Siṃha or Lion.

Or by omission of the prefix Nr̥ like Satyabhāmā being called bhāmā, He who is Nr̥siṃha is called Siṃha.

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥

5 మార్చి, 2014

487. సత్త్వస్థః, सत्त्वस्थः, Sattvasthaḥ

ఓం సత్త్వస్థాయ నమః | ॐ सत्त्वस्थाय नमः | OM Sattvasthāya namaḥ


ప్రకాశకం సత్త్వగుణం ప్రాధాన్యేనాధితిష్ఠతి ।
తిష్ఠతి దేహిష్వితి వా సత్త్వస్థ ఇతి కీర్త్యతే ॥

ప్రకాశవంతమైన శక్తి కల సత్త్వము అను గుణమును ప్రధానముగా ఆశ్రయించియుండువాడు. సత్త్వగుణప్రధానుడు. లేదా సర్వ ప్రాణులయందు అంతర్యామిగానుండువాడు.



प्रकाशकं सत्त्वगुणं प्राधान्येनाधितिष्ठति ।
तिष्ठति देहिष्विति वा सत्त्वस्थ इति कीर्त्यते ॥

Prakāśakaṃ sattvaguṇaṃ prādhānyenādhitiṣṭhati,
Tiṣṭhati dehiṣviti vā sattvastha iti kīrtyate.

He eminently abides in the effulgence of the sattvaguṇa. Or since abides in all the beings, He is Sattvasthaḥ.

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥

4 మార్చి, 2014

486. గభస్తినేమిః, गभस्तिनेमिः, Gabhastinemiḥ

ఓం గభస్తినేమయే నమః | ॐ गभस्तिनेमये नमः | OM Gabhastinemaye namaḥ


గభస్తిచక్రస్య మధ్యే స్థితస్సూర్యాత్మనా హరిః ।
గభస్తినేమిరిత్యుక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

గభస్తులు అనగా కిరణములు. గభస్తి చక్రమునకు నేమివంటివాడుగనుక ఆ హరి గభస్తినేమి అని పిలువబడుతాడు. నేమి అనగా చక్రమధ్యమందలి దారుమయమగు చక్రావయవము లేదా ఇరుసు. కిరణములతో ఏర్పడిన చక్రమునకు నడుమ నేమివలె సూర్యరూపమున ఉన్నవాడు. సూర్యుడూ విష్ణుని విభూతియే కదా!



गभस्तिचक्रस्य मध्ये स्थितस्सूर्यात्मना हरिः ।
गभस्तिनेमिरित्युक्तो विद्वद्भिर्वेदपारगैः ॥

Gabhasticakrasya madhye sthitassūryātmanā hariḥ,
Gabhastinemirityukto vidvadbhirvedapāragaiḥ.

Gabhasti means brilliance. Nemi means axle of a wheel. Gabhastinemi means the axle of the wheel of rays or the One with brilliant circumference. Sun is the comparable axle around which or from which brilliant rays emanate from. Even the sun is eminence of Lord Viṣṇu!

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥

3 మార్చి, 2014

485. కృతలక్షణః, कृतलक्षणः, Kr̥talakṣaṇaḥ

ఓం కృతలక్షణాయ నమః | ॐ कृतलक्षणाय नमः | OM Kr̥talakṣaṇāya namaḥ


నిత్యనిష్పన్న చైతన్యరూపత్వాచ్ఛాస్త్రనామ వా ।
కృతం లక్షణమేతేనేత్యచ్యుతః కృతలక్షణః ॥

జన్మరహితముగా సిద్ధించిన శాశ్వతమైన చైతన్యము తన రూపముగా కలవాడూ కావున అతనిని గుర్తించడానికి ఉపయోగపడు లక్షణములు ఏవీ లేవు. ఐననూ అతని విషయములో ఉపాసనకై ఆయా లక్షణములు ఆపాదించబడతాయి. కానీ అవి అన్నీ కల్పితములే కావున ఆ విష్ణువు కృతలక్షణుడు. కల్పితములైన లక్షణములు ఎవనికికలవో అట్టివాడు కృతలక్షణః.

వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్ ।
ఇతి కృష్ణ ద్వైపాయనమునిరత్రైవ వక్ష్యతి ॥

లేదా శ్రీ విష్ణు సహస్రనామమునందు గల వచనము ప్రకారము వేదములు, శాస్త్రములు, విజ్ఞానము మొదలగు లక్షణములు లేదా వాఙ్మయమంతా జనార్దనునినుండే జనించినది అని చెప్పవచ్చును.

సజాతీయ విజాతీయ వ్యవచ్ఛేదకలక్షణమ్ ।
అనేన సర్వభావానాం కృతమిత్యథవోరసి ॥


అన్ని పదార్థములను వానితో సజాతీయములగు పదార్థములతో వాని విజాతీయములగు పదార్థములనుండి వేరు పరచు లక్షణములు ఎవనిచే సృష్టియందే ఏర్పరచబడినవో అట్టివాడు.

శ్రీవత్సలక్షణం కృతమిత్యతో వా కృతలక్షణః ఎవనిచే తన వక్షమునందు శ్రీవత్సమను లక్షణము చేసికొనబడినదో అట్టివాడు.



नित्यनिष्पन्न चैतन्यरूपत्वाच्छास्त्रनाम वा ।
कृतं लक्षणमेतेनेत्यच्युतः कृतलक्षणः ॥

Nityaniṣpanna caitanyarūpatvācchāstranāma vā,
Kr̥taṃ lakṣaṇametenetyacyutaḥ kr̥talakṣaṇaḥ.

He is of nature that is eternal plenal consciousness or caitanya. Thus, there are no characteristics attributable to Him. For the sake of easing meditation upon Him and worshiping, characteristics are attributed. However, none of these confining attributes are essentially true. Since He is with characteristics that are not true, He is called Kr̥talakṣaṇaḥ or the One with fictitious characteristics.

वेदाश्शास्त्राणि विज्ञानमेतत् सर्वं जनार्दनात् ।
इति कृष्ण द्वैपायनमुनिरत्रैव वक्ष्यति ॥

Vedāśśāstrāṇi vijñānametat sarvaṃ janārdanāt,
Iti kr̥ṣṇa dvaipāyanamuniratraiva vakṣyati.

By Him have been created the lakṣaṇas or literature viz., the vedas, śāśtras, vijñāna or knowledge etc. Hence Lord Janārdana having created these lakṣaṇas, is called Kr̥talakṣaṇaḥ.

सजातीय विजातीय व्यवच्छेदकलक्षणम् ।
अनेन सर्वभावानां कृतमित्यथवोरसि ॥

Sajātīya vijātīya vyavacchedakalakṣaṇam,
Anena sarvabhāvānāṃ kr̥tamityathavorasi.

Or since the Lord has made the lakṣaṇas or indications necessary for the internal and external distinctions of the like kind and of different kinds of all beings, He is Kr̥talakṣaṇaḥ.

श्रीवत्सलक्षणं कृतमित्यतो वा कृतलक्षणः / Śrīvatsalakṣaṇaṃ kr̥tamityato vā kr̥talakṣaṇaḥ He bears on His chest the Śrīvatsa mark which constitutes His distinctive feature and indicating mark and hence He is Kr̥talakṣaṇaḥ.

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।
अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakr̥d dharmī sadasatkṣaramakṣaram,
Avijñātā sahasrāṃśurvidhātā kr̥talakṣaṇaḥ ॥ 51 ॥

2 మార్చి, 2014

484. విధాతా, विधाता, Vidhātā

ఓం విధాత్రే నమః | ॐ विधात्रे नमः | OM Vidhātre namaḥ


మహావిష్ణుర్విశేషేణ శేషదిగ్గజభూధరాన్ ।
భూతధాతౄన్దధాతీతి విధాతేత్యుచ్యతే బుధైః ॥


సర్వభూతములను ధరించు శేషునీ, అష్టదిగ్గజములను, సప్తకుల పర్వతములను కూడా తాను విశేషముగా ధరించువాడుగనుక ఆ మహావిష్ణునకు విధాతా అను నామముగలదు.

44. విధాతా, विधाता, Vidhātā



महाविष्णुर्विशेषेण शेषदिग्गजभूधरान् ।
भूतधातॄन्दधातीति विधातेत्युच्यते बुधैः ॥

Mahāviṣṇurviśeṣeṇa śeṣadiggajabhūdharān,
Bhūtadhātṝndadhātīti vidhātetyucyate budhaiḥ.

Since Lord Mahā Viṣṇu is the unique support of all agencies like Ādiśeṣa, the diggajas i.e., the eight elephants in the cardinal directions, the mountains that support all other things, He is called Vidhātā.

44. విధాతా, विधाता, Vidhātā

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।
अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakr̥d dharmī sadasatkṣaramakṣaram,
Avijñātā sahasrāṃśurvidhātā kr̥talakṣaṇaḥ ॥ 51 ॥

1 మార్చి, 2014

483. సహస్రాంశుః, सहस्रांशुः, Sahasrāṃśuḥ

ఓం సహస్రాంశవే నమః | ॐ सहस्रांशवे नमः | OM Sahasrāṃśave namaḥ


సహస్రాంశుః, सहस्रांशुः, Sahasrāṃśuḥ

త ఆదిత్యాదిగతా అప్యంశవోస్య హరే రితి వేలకొలదిగా కిరణములు కలవాడు కావున సూర్యునకు సహస్రాంశుః అని వ్యవహారము. ఆదిత్యునియందు ఉండు కిరణములు ఈ పరమాత్మునివే కావున ముఖ్యుడగు సహస్రాంశుడు విష్ణువే!

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥ 12 ॥

సూర్యునియందు ఏ తేజస్సు, ప్రకాశము, చైతన్యము ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, అదియంతయు నాదిగా నెరుంగుము.



Ta ādityādigatā apyaṃśavosya hare riti / त आदित्यादिगता अप्यंशवोस्य हरे रिति The rays of the sun and other luminaries are truly His. So, He is the chief Sahasrāṃśuḥ.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योगमु ::
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Yadādityagataṃ tejo jagadbhāsayate’khilam,
Yaccandramasi yaccāgnau tattejo viddhi māmakam. 12.

That light in the sun which illumines the whole world, that which is in the moon and the which is in fire - know that light to be Mine.

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।
अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakr̥d dharmī sadasatkṣaramakṣaram,
Avijñātā sahasrāṃśurvidhātā kr̥talakṣaṇaḥ ॥ 51 ॥