31 జన, 2013

89. ప్రజాభవః, प्रजाभवः, Prajābhavaḥ

ఓం ప్రజాభవాయ నమః | ॐ प्रजाभवाय नमः | OM Prajābhavāya namaḥ


సర్వాః ప్రజా యత్సకాశాదుద్భవంతి ప్రజాభవః సర్వ ప్రజలు (ప్రాణులు) ఈతనినుండి జనింతురు.

:: భగవద్గీత - విభూతి యోగము ::
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః ॥ 8 ॥


'నేను సమస్త జగత్తునకు ఉత్పత్తికారణమైనవాడను. నా వలననే సమస్తము నడుచుచున్నది' అని వివేకవంతులు తెలిసికొని పరిపూర్ణ భక్తిభావముతో గూడినవారై నన్ను భజించుచున్నారు.



Sarvāḥ prajā yatsakāśādudbhavaṃti prajābhavaḥ / सर्वाः प्रजा यत्सकाशादुद्भवंति प्रजाभवः He from whom all beings have originated.

Bhagavad Gītā - Chapter 10
Ahaṃ sarvasya prabhavo mattaḥ sarvaṃ pravartate,
Iti matvā bhajante māṃ budhā bhāvasamanvitāḥ.
(8)

:: भगवद् गीता - विभूति योग ::
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥ ८ ॥


I am the Source of everything; from Me all creation emerges. Realizing thus, the wise ones, filled with fervor, adore Me.

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः
अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ
Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

30 జన, 2013

88. విశ్వరేతాః, विश्वरेताः, Viśvaretāḥ

ఓం విశ్వరేతసే నమః | ॐ विश्वरेतसे नमः | OM Viśvaretase namaḥ


విశ్వస్య కారణత్వేన విశ్వరేతా జనార్ధనః విశ్వమునకు (విశ్వోత్పత్తికి) రేతస్సువంటివాడు. రేతస్సు ప్రాణుల ఉత్పత్తికి హేతువు. పరమాత్ముడు అట్లే విశ్వపు ఉత్పత్తికి కారణము.

:: భగవద్గీత - గుణత్రయ విభాగ యోగము ::
సర్వయోనిషు కౌన్తేయ! మూర్తయస్సమ్భవన్తియాః ।
తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పితా ॥ 4 ॥


అర్జునా! సమస్తజాతులందును ఏ శరీరము లుద్భవించుచున్నవో, వానికి మూలప్రకృతి (మాయ) యే మాతృస్థానము (తల్లి). నేను బీజమునుంచునట్టి తండ్రిని.



Viśvasya kāraṇatvena viśvaretā janārdhanaḥ / विश्वस्य कारणत्वेन विश्वरेता जनार्धनः He is the seed of the Universe. As He is the cause (from retas) of the Universe, He is Viśvaretā.

Bhagavad Gītā - Chapter 14
Sarvayoniṣu kaunteya! mūrtayassambhavantiyāḥ,
Tāsāṃ brahma mahadyoni rahaṃ bījapradaḥ pitā.
(4)

:: श्रीमद्भगवद् गीता - गुणत्रय विभाग योग ::
सर्वयोनिषु कौन्तेय! मूर्तयस्सम्भवन्तियाः ।
तासां ब्रह्म महद्योनि रहं बीजप्रदः पिता ॥ ४ ॥


O Son of Kuntī (Arjunā), of all forms produced from whatsoever wombs - Great Prakr̥ti is the original womb (Mother), I am the seed-imparting Father.

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।
अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।
Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

29 జన, 2013

87. శర్మ, शर्म, Śarma

ఓం శర్మణే నమః | ॐ शर्मणे नमः | OM Śarmaṇe namaḥ


పరమానందరూపత్వాద్ బ్రహ్మ శర్మేతి కథ్యతే పరమాత్ముడు పరమానంద రూపుడుకావున ఆతడే ఈ శబ్దముచే తెలుపబడుచున్నాడు. శర్మ అనగా సుఖము.

:: పోతన భాగవతము - దశమ స్కందము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::
క. ఏ నిన్ను నఖిలదర్శను, జ్ఞానానందస్వరూపు సంతతు నపరా
    దీనుని మాయాదూరుని, సూనునిఁగాఁ గంటి, నిట్టి చోద్యము గలదే?


(అప్పుడే జన్మించిన శ్రీ కృష్ణుని జూచి వసుదేవుడు) స్వామీ! నీవు సమస్త సృష్టినీ నీయందు దర్శింప జేస్తావు. జ్ఞానమూ, ఆనందమూ ఒక్కటై నీ రూపం కట్టుకున్నాయి. నీవు శాశ్వతుడవు. ఎవరి అదుపాజ్ఞలకు నీవు లొంగవలసిన పనిలేదు. మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతుంది. ఇటువంటి నిన్ను నేను కుమారుడుగా కన్నానట! ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా?



Paramānaṃdarūpatvād brahma śarmeti kathyate / परमानंदरूपत्वाद् ब्रह्म शर्मेति कथ्यते As He is of the nature of supreme bliss, He is Śarma.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8
Adyaitaddharinararūpamadbhutaṃ te dr̥ṣtaṃ naḥ śaraṇada sarvalokaśarma,
So’yaṃ te vidhikara īśa vipraśaptastasyedaṃ nidhanamanugrahāya vidmaḥ.
(56)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे आष्टमोऽध्यायः ::
अद्यैतद्धरिनररूपमद्भुतं ते दृष्तं नः शरणद सर्वलोकशर्म
सोऽयं ते विधिकर ईश विप्रशप्तस्तस्येदं निधनमनुग्रहाय विद्मः ॥ ५६ ॥


The associates of Lord Viṣṇu in Vaikuṇṭha offered this prayer: O Lord, our supreme giver of shelter, today we have seen Your wonderful form as Lord Nṛsiḿhadeva, meant for the good fortune of all the world. O Lord, we can understand that Hiraṇyakaśipu was the same Jaya who engaged in Your service but was cursed by brāhmaṇas and who thus received the body of a demon. We understand that his having now been killed is Your special mercy upon him.

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।
अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।
Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

28 జన, 2013

86. శరణం, शरणं, Śaraṇaṃ

ఓం శరణాయ నమః | ॐ शरणाय नमः | OM Śaraṇāya namaḥ


శ్రియతే ఇతి శరణమ్ ఆశ్రయించబడును. ఆర్తుల ఆర్తిని పోగొట్టువాడుగావున భక్తులచే పరమాత్మ ఆశ్రయించబడును.

:: పోతన భాగవతము - రెండవ స్కందము ::
ఉ. సర్వఫల ప్రదాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున
     సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగతుం డగు చక్రపాణి యీ
     సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై
     పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్‍.


ఆ భగవంతుడు అందరికీ అన్ని ఫలాలు ఇచ్చేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులూ గలవాడు. అన్ని లోకాలలోనూ ప్రసిద్ధి పొందినవాడు. అంతటా వ్యాపించినవాడు. సుదర్శనమనే చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవుడు, తక్కిన ఈ సమస్త ప్రాణులూ చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంత కాలంలో గూడా ఆకాశంలాగా తానొక్కడూ చెక్కుచెదరకుండా నిర్వికారుడై నిలిచి ఉంటాడు.



Śriyate iti śaraṇam / श्रियते इति शरणम् One who removes the sorrows of those in distress.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 4
Vicakṣaṇā yaccaraṇopasādanātsaṅgaṃ vyudasyobhayato’ntarātmanaḥ,
Vindanti hi brahmagatiṃ gataklamāstasmai subhadraśravase namo namaḥ.
(16)

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे चतुर्थोऽध्यायः ::
विचक्षणा यच्चरणोपसादनात्सङ्गं व्युदस्योभयतोऽन्तरात्मनः ।
विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमास्तस्मै सुभद्रश्रवसे नमो नमः ॥ १६ ॥


Let me offer my respectful obeisances again and again unto the all-auspicious Lord Śrī Kṛṣṇa. The highly intellectual, simply by surrendering unto His lotus feet, are relieved of all attachments to present and future existences and without difficulty progress toward spiritual existence.

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।
अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।
Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

27 జన, 2013

85. సురేశః, सुरेशः, Sureśaḥ

ఓం సురేశాయ నమః | ॐ सुरेशाय नमः | OM Sureśāya namaḥ



సురాంతి దదతి ఇతి సురాః శోభనమును లేదా శుభములను చేకూర్చువారు సురులు. అట్టి సురులకు ఈశుడు సురేశః. శుభమును ఇచ్చు సకల దేవతలకు ఈతండు ఈశుడు. లేదా శుభములను చేకూర్చువారిలోకెల్ల ఉత్తముడు.




Surāṃti dadati iti surāḥ / सुरांति ददति इति सुराः Those who bestow auspicious and good are Surās (gods). He being the Īśa or Lord of such is Sureśaḥ. He is the Lord of the Surās who dower men with good. It can also mean the greatest of those who bestow good.

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।
अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।
Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

26 జన, 2013

84. ఆత్మవాన్, आत्मवान्, Ātmavān

ఓం ఆత్మవతే నమః | ॐ आत्मवते नमः | OM Ātmavate namaḥ


ఆత్మా అనగా తాను. ఆత్మనః అనగా తనకు సంబంధించిన అని అర్థము. ఆత్మనః అస్య అస్తి స్వప్రతిష్ఠాత్వేన ఇతి ఆత్మవాన్ ఆత్మా 'తాను' లేదా ఆత్మనః 'తన మహిమ' మాత్రమే తన నిలుకడ చోటుగా కలవాడు.

:: ఛాందోగ్యోపనిషత్ - సప్తమః ప్రపాఠకః, చతుర్వింశః ఖండః ::
యత్రనాన్యత్పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యద్విజానాతి స భూమాఽథ య త్రాన్యత్పశ్య త్యస్యత్ శృణో త్యన్యద్విజానాతి తదల్పం యోవై భూమా తదమృత మథ యదల్పం తన్మర్త్యం స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని యది వాన మహిమ్నితి ॥ 1 ॥

[సనత్కుమారుడు చెప్పెను] ఏ ఆత్మయందు, ఆత్మకంటే వేరైనది కనిపించుటలేదో, వినిపించుటలేదో తెలియబడుటలేదో అదియే అనంతమైనది (భూమా). దీనికంటే వేరైనదంతయు అల్పము. అనంతస్వరూపమగు ఆత్మ (బ్రహ్మము) నాశరహితమైనది. అల్పమైనదానికి నాశనము కలదు. [నారదుడు ప్రశ్నించెను] ఓ భగవన్‌! ఆ అనంతమైనది (బ్రహ్మము) దేనియందు ప్రతిష్ఠితమై యున్నది? [సనత్కుమారుడు సమాధానమునిచ్చెను] తన మహిమయందే తాను ప్రతిష్ఠితమై యున్నది. అది నిరాలంబము.

:: పోతన భాగవతము - శ్రీ కృష్ణావతార ఘట్టము ::
క. సర్వము నీలోనిదిగా, సర్వాత్ముఁడ, వాత్మవస్తు సంపన్నుఁడవై
     సర్వమయుఁడ వగు నీకును, సర్వేశ్వర! లేవు లోనుసంధులు వెలియున్‍.


సృష్టి అంతా నీలోనే ఉన్నది గనుక సర్వమునకూ ఆత్మ అయిన వాడవు నీవు. నీ చేత తయారైన వస్తువులలో సర్వమునందు నిండి ఉన్న నీకు లోపల, బయట, మధ్య ఉండే మార్పులు అనేవి లేవు. కనుకనే నీవు సర్వేశ్వరుడవు.



Ātmanaḥ asya asti svapratiṣṭhātvena iti ātmavān / आत्मनः अस्य अस्ति स्वप्रतिष्ठात्वेन इति आत्मवान् As He is established in His own glory, He is Ātmavān i.e., requiring no other support than Himself.

Chāndogyopaniṣat - Part Seven, Chapter 24
Yatranānyatpaśyati nānyat śr̥ṇoti nānyadvijānāti sa bhūmā’tha ya trānyatpaśya tyasyat śr̥ṇo tyanyadvijānāti tadalpaṃ yovai bhūmā tadamr̥ta matha yadalpaṃ tanmartyaṃ sa bhagavaḥ kasmin pratiṣṭhita iti sve mahimni yadi vāna mahimniti. (1)

:: छांदोग्योपनिषत् - सप्तमः प्रपाठकः, चतुर्विंशः खंडः ::
यत्रनान्यत्पश्यति नान्यत् शृणोति नान्यद्विजानाति स भूमाऽथ य त्रान्यत्पश्य त्यस्यत् शृणो त्यन्यद्विजानाति तदल्पं योवै भूमा तदमृत मथ यदल्पं तन्मर्त्यं स भगवः कस्मिन् प्रतिष्ठित इति स्वे महिम्नि यदि वान महिम्निति ॥ १ ॥

[Sanatkumāra said] Where one sees nothing else, hears nothing else, understands nothing else - that is the Infinite. Where one sees something else, hears something else, understands something else - that is the finite. The Infinite is immortal, the finite mortal. [Nārada inquired] Venerable Sir, in what does the Infinite find Its support? [Sanatkumāra responded] In Its own greatness - or not even in greatness.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Evaṃ bhavānbuddhayanumeyalakṣaṇairgrāhyairguṇaiḥ sannapi tadguṇāgrahaḥ,
Anāvr̥tatvādbahirantaraṃ na te sarvasya sarvātmana ātmavastunaḥ.
(17)

:: श्रीमद्भागवते दशमस्कन्धे तृतीयोऽध्यायः ::
एवं भवान्बुद्धयनुमेयलक्षणैर्ग्राह्यैर्गुणैः सन्नपि तद्गुणाग्रहः ।
अनावृतत्वाद्बहिरन्तरं न ते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः ॥ १७ ॥


With our senses we can perceive some things, but not everything. Consequently, He is beyond perception by the senses. Although in touch with the modes of material nature, He is unaffected by them. He is the prime factor in everything, the all-pervading, undivided Supersoul. For Him, therefore, there is no external or internal.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

25 జన, 2013

83. కృతిః, कृतिः, Kr̥tiḥ

ఓం కృతయే నమః | ॐ कृतये नमः | OM Kr̥taye namaḥ


ప్రయత్నమునకు కృతి అని వ్యవహారము లేదా ఏ క్రియనైననూ 'కృతి' అనదగును. పరమాత్ముడు సర్వాత్మకుడును అన్నిటికిని ఆశ్రయమును కావున ఆట్టి కృతి శబ్దముచే పరమాత్ముడే చెప్పబడును.

:: భగవద్గీతా - కర్మ యోగము ::
న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ॥ 5 ॥


(ప్రపంచమున) ఎవడును ఒక్క క్షణకాలమైననూ కర్మచేయక ఉండనేరడు. ప్రకృతివలన బుట్టిన గుణములచే ప్రతివాడును సహజసిద్ధముగ కర్మలను చేయుచునే ఉన్నాడు.



Kr̥ti means effort. Or the act itself. Or being soul of all, He is considered as the basis of every act.

Bhagavad Gītā - Chapter 3
Na hi kaścitkṣaṇamapi jātu tiṣṭhatyakarmakr̥t,
Kāryate hyavaśaḥ karma sarvaḥ prakr̥tijairguṇaiḥ. (5)

:: भगवद्गीता - कर्म योग ::
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥ ५ ॥

No one ever remains even for a moment without doing work. For all are made to work under compulsion by the guṇās born of Nature.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

24 జన, 2013

82. కృతజ్ఞః, कृतज्ञः, Kr̥tajñaḥ

ఓం కృతజ్ఞాయ నమః | ॐ कृतज्ञाय नमः | OM Kr̥tajñāya namaḥ


కృతం (ప్రాణినాం పుణ్యా పుణ్యాత్మకం కర్మ) జానాతి ఆయా ప్రాణుల పుణ్యా పుణ్య కర్ములను ఎరిగియుండును. లేదా తనకు భక్తులచే అర్పణ చేయబడిన దానిని కరుణతో ఎరుగును. ఉపాసకులు తనకు పత్ర పుష్పాదికమును ఈయగా దానిని అనంత కరుణతో ఎరిగి వారికి మోక్షమును ఇచ్చును.

:: పోతన భాగవతము - దశమ స్కందము, కుచేలోపాఖ్యానము ::
వ. అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తిపూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్య సాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుం గాక! యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్పర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారండునునై యఖిలక్రియలయందు ననంతుని యనంతధ్యాన సుధారసంబునం జొక్కుచు విగతబంధనుండై యపవర్గప్రాప్తి నొందె; మఱియును.

భక్తి తత్పరులైన సజ్జనులు సమర్పించిన పదార్థం లేశ మాత్రమే అయినా భగవంతుడు దానిని కోటానుకోట్లుగా భావించి స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తాడనటానికి నా (కుచేలుని) వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని, చినిగిన బట్టల్నీ చూచి శ్రీకృష్ణుడు మనస్సులోనయినా ఏవగించుకోలేదు. నా వద్దనున్న అటుకులను ప్రీతితో ఆరగించి నన్ను ధన్యుణ్ణి చేయడంలో అచ్యుతుని నిర్హేతుక వాత్సల్యం అభివ్యక్తమౌతూ ఉంది. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాలమీద నాకు జన్మజన్మలకూ నిండైన భక్తి నెల్కొని ఉండు గాక! ఈ రీతిగా తలపోసి హరిస్మరణం మరవకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలిసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా రాగద్వేషాది ద్వంద్వాల కతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ భవబంధాలను బాసి ముక్తుడయ్యాడు.



Kr̥taṃ (prāṇināṃ puṇyā puṇyātmakaṃ karma) jānāti / कृतं (प्राणिनां पुण्या पुण्यात्मकं कर्म) जानाति One who knows everything about what has been done (Kr̥ta) by Jīvas. Even to those who make a small offering of leaf, flower etc., He grants Mokṣa (liberation).

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 81
Kiñcitkarotvurvapi yatsvadattaṃ
  Suhr̥tkr̥taṃ phalgvapi bhūrikārī,
Mayopaṇītaṃ pr̥thukaikamuṣṭiṃ
  pratyagrahītprītiyuto mahātmā.
(35)

:: श्रीमद्भागवते महापुराणे दशमस्कन्धे, नामैकाशीतितमोऽध्यायः ::
किञ्चित्करोत्वुर्वपि यत्स्वदत्तं
  सुहृत्कृतं फल्ग्वपि भूरिकारी ।
मयोपणीतं पृथुकैकमुष्टिं
  प्रत्यग्रहीत्प्रीतियुतो महात्मा ॥ ३५ ॥


The Lord considers even His greatest benedictions to be insignificant, while He magnifies even a small service rendered to Him by His devotee. Thus with pleasure the Supreme Soul accepted a single palmful of the flat rice I brought Him.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

23 జన, 2013

81. దురాదర్షః, दुरादर्षः, Durādarṣaḥ

ఓం దురాదర్షాయ నమః | ॐ दुरादर्षाय नमः | OM Durādarṣāya namaḥ


ధర్షణ శబ్దమునకు బెదిరుంచుట, అణచుట, లోంగ దీసికొనుట మొదలగునవి అర్థములు. దైత్యాదిభిః దుఃఖేనాపి ఆ (ఈషదపి) దర్షయితుం న శక్యతే ఇతి దైత్యులు మొదలగువారిచే ఎంత దుఃఖముచే (శ్రమచే) కూడ కొంచెమైనను ధర్షించబడుటకు శక్యుడు కాడు కావున విష్ణువు దురాదర్షః.



Daityādibhiḥ duḥkhenāpi ā (īṣadapi) darṣayituṃ na śakyate iti / दैत्यादिभिः दुःखेनापि आ (ईषदपि) दर्षयितुं न शक्यते इति He who cannot be assailed by asuras (demons) and such.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

22 జన, 2013

80. అనుత్తమః, अनुत्तमः, Anuttamaḥ

ఓం అనుత్తమాయ నమః | ॐ अनुत्तमाय नमः | OM Anuttamāya namaḥ


అవిద్యమానః ఉత్తమః యస్మాత్ సః ఎవని కంటె ఉత్తముడు మరి ఎవడును అవిద్యమానుడో (లేడో) అతడు.

:: భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
పితాఽసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ।
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥ 43 ॥

సాటిలేని ప్రభావముగల ఓ కృష్ణమూర్తి! మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునంతకును తండ్రి అయియున్నారు. మఱియు మీరు పూజ్యులును, సర్వశ్రేష్ఠులగు గురువులును అయి వెలయుచున్నారు. ముల్లోకములందును మీతో సమానమైనవారు లేరు. ఇక మిమ్ములను మించినవారు మఱియొక రెట్లుండగలరు?



Avidyamānaḥ uttamaḥ yasmāt saḥ / अविद्यमानः उत्तमः यस्मात् सः He who has no superior to Him is Anuttama.

Bhagavad Gīta - Chapter 11
Pitā’si lokasya carācarasya tvamasya pūjyaśca gururgarīyān,
Na tvatsamo’styabhyadhikaḥ kuto’nyo lokatraye’pyapratimaprabhāva. (43)

:: भगवद्‍गीता - विश्वरूप संदर्शन योग ::
पिताऽसि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥ ४३ ॥

You are the Father of all beings moving an non-moving; to this (world) You are worthy of worship, the Teacher and greater (than a teacher). There is none equal to you; how at all can there be anyone greater even in all the three worlds, O You of unrivalled power?

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

21 జన, 2013

79. క్రమః, क्रमः, Kramaḥ

ఓం క్రమాయ నమః | ॐ क्रमाय नमः | OM Kramāya namaḥ


క్రామతి నడుచును, దాటును, పరువెత్తును. అనేజ దేకం మనసో జవీయః - 'ఆ ఏకైక తత్త్వము తాను కదలకయే యుండియు మనస్సు కంటెను శీఘ్రగతి కలది' అను శ్రుతిప్రమాణముచే పరమాత్మ తన సర్వప్రవృత్తులయందును ఎల్లరకంటెను శీఘ్రతర గతి కలవాడు. లేదా అట్టి క్రమమునకు (శీఘ్రగతికిని విస్తరణమునకు) హేతుభూతుడు.

క్రాంతే విష్ణుమ్ అను మను స్మృతి (12.121) వచనమున 'గతి విషయమున విష్ణుని భావన చేయవలెను.' విష్ణుని అనుగ్రహమున తమ సంకల్పిత కార్యములు శీఘ్రగతితో ముందునకు సాగుటకు హేతువగునని ఈ మనువచనమునకు భావము.



Krāmati / क्रामति He walks or is the cause of walking (progressing). Or vide Manu Smr̥ti (12.121) Krāṃte Viṣṇumक्रांते विष्णुम् In the matter of walking, Viṣṇu.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

20 జన, 2013

78. విక్రమః, विक्रमः, Vikramaḥ

ఓం విక్రమాయ నమః | ॐ विक्रमाय नमः | OM Vikramāya namaḥ


విక్రామతి - విశేషేణ క్రామతి జగత్ - విశ్వం పరమాత్ముడు ఈ జగత్తును - విశ్వమును - విశేషముగా నాక్రమించుచు దాటుచు దాని ఆవలి అవధులను చేరుచు ఉన్నాడు. లేదా విచక్రమే ఈ విశ్వమును పూర్తిగా ఆక్రమించిన / కొలిచిన వాడు.  లేదా వినా - గరుడేన - పక్షిణా క్రామతి 'వి' తో అనగా గరుడపక్షితో సంచరించువాడు.



Vicakrame / विचक्रमे He measured the entire universe. Or Vinā - Garuḍena - pakṣiṇā krāmati / विना - गरुडेन - पक्षिणा क्रामति as He rides the bird Garuda, otherwise called Vi / वि.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

19 జన, 2013

77. మేధావీ, मेधावी, Medhāvī

ఓం మేధావినే నమః | ॐ मेधाविने नमः | OM Medhāvine namaḥ


మేధా - బహుగ్రంథ ధారణ సామర్థ్యం అస్య అస్తి 'మేధా' అనగా బహుగ్రంథములను తన బుద్ధియందు నిలుపుకొను శక్తి; అది ఈతనికి కలదు.



Medhā - bahugraṃtha dhāraṇa sāmarthyaṃ asya asti / मेधा - बहुग्रंथ धारण सामर्थ्यं अस्य अस्ति He who has Medhā, the capacity to understand many treatises.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

18 జన, 2013

76. ధన్వీ, धन्वी, Dhanvī

ఓం ధన్వినే నమః | ॐ धन्विने नमः | OM Dhanvine namaḥ


ధనుః అస్య అస్తి అత్యంత శక్తివంతమైన ధనుస్సును కలవాడు.

:: భవద్గీత - విభూతి యోగము ::
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥ 31 ॥

నేను పవిత్రమొనర్చువారిలో (లేక వేగవంతులలో) వాయువును, ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను, జలచరాలలో మొసలిని, నదులలో గంగానదిని అయియున్నాను.



Dhanuḥ asya asti / धनुः अस्य अस्ति The one armed with a very powerful Bow.

Bhavad Gīta - Chapter 10
Pavanaḥ pavatāmasmi rāmaḥ śastrabhr̥tāmaham,
Jhaṣāṇāṃ makaraścāsmi srotasāmasmi jāhnavī.
(31)

:: भवद्गीत - विभूति योग ::
पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥ ३१ ॥


Of purifiers I am the wind, of the wielders of weapons I am Rāma, of fishes I am the Crocodile and of flowing rivers I am the Ganges.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

17 జన, 2013

75. విక్రమీ, विक्रमी, Vikramī

ఓం విక్రమిణే నమః | ॐ विक्रमिणे नमः | OM Vikramiṇe namaḥ


విక్రమః (శౌర్యం) అస్య అస్తి (అపరిమితమగు) విక్రమము (శౌర్యము) ఈతనికి కలదు.



Vikramaḥ (śauryaṃ) asya asti / विक्रमः (शौर्यं) अस्य अस्ति Vikrama means prowess. Being associated with it, He is Vikramī.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

16 జన, 2013

74. ఈశ్వరః, ईश्वरः, Īśvaraḥ

ఓం ఈశ్వరాయ నమః | ॐ ईश्वराय नमः | OM Īśvarāya namaḥ


సర్వశక్తిమాన్ సర్వశక్తి (అనంతశక్తి) కలవాడు.

:: శ్వేతాశ్వతరోపనిషత్ - షష్ఠోఽధ్యాయః ::
త మీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం ।
పతిం పతీనాం పరమం పరస్త ద్విదామ దేవం భువనేశ మీడ్యమ్ ॥ 7 ॥ 

ఈశ్వరుని వైవస్వత యమునికంటే గొప్పవానిగను, దేవేంద్రాది దేవతలకంటే శ్రేష్ఠునిగను, ప్రజాపతులందరికంటే శ్రేష్ఠ ప్రజాపతిగను, అక్షర స్వరూపుని కంటే పరునిగను, జ్యోతిస్వరూపునిగను, లోకేశ్వరునిగను, స్తుతింపదగినవానిగను తెలిసికొన్నామని విద్వాంసులు స్వానుభవముతో చెప్పిరి. 



Sarvaśaktimān The Omnipotent. So called as he possesses infinite power.

Śvetāśvataropaniṣat - Chapter 6
Ta mīśvarāṇāṃ paramaṃ maheśvaraṃ taṃ devatānāṃ paramaṃca daivataṃ,
Patiṃ patīnāṃ paramaṃ parasta dvidāma devaṃ bhuvaneśa mīḍyam. (7)

:: श्वेताश्वतरोपनिषत् - षष्ठोऽध्यायः ::
त मीश्वराणां परमं महेश्वरं तं देवतानां परमंच दैवतं ।
पतिं पतीनां परमं परस्त द्विदाम देवं भुवनेश मीड्यम् ॥ ७ ॥ 

He who has contained in Himself the highest divinity, the great Lord, the Supreme Deity of deities, the master of masters, who is higher than the imperishable Prakr̥ti and is the self-luminous; let us know that God as the most adorable Lord of the world.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

15 జన, 2013

73. మధుసూదనః, मधुसूदनः, Madhusūdanaḥ

ఓం మధుసూదనాయ నమః | ॐ मधुसूदनाय नमः | OM Madhusūdanāya namaḥ


మధు (నామాన మసురం) సూదితవాన్ మధునామముగల అసురుని 'సూదనము' (సంహరించుట) చేసెను.

:: మహాభారతము - భీష్మ పర్వము 67.14 ::
కర్ణమిశ్రోద్భవం చాపి మధునామ మహాఽసురం । బ్రహ్మణోఽపచితిం కుర్వన్ జఘాన పురుషోత్తమ తస్య తాత । వధా దేవ దేవదానవమానవాః । మధుసూదన ఇత్యాహు రృషయశ్చ జనార్ధనమ్ ॥ 16 ॥

పురుషోత్తముడు బ్రహ్మను ఆదరించుచు (బ్రహ్మ ప్రార్థనచే) తన కర్ణములనుండి ఉద్భవిల్లిన మధువను మహా సురుని చంపెను. నాయనా! అతనిని వధించుటవలననే దేవదానవ మానవులును ఋషులును ఈ జనార్ధనుని 'మధుసూదన' అందురు.



Madhu (nāmāna masuraṃ) sūditavān / मधु (नामान मसुरं) सूदितवान् The destroyer of the demon Madhu.

Mahābhārata - Bhīṣma parva 67.14 
Karṇamiśrodbhavaṃ cāpi madhunāma mahā’suraṃ, Brahmaṇo’pacitiṃ kurvan jaghāna puruṣottama tasya tāta, Vadhā deva devadānavamānavāḥ, Madhusūdana ityāhu rr̥ṣayaśca janārdhanam. (16)

:: महाभारत - भीष्म पर्व 67.14 ::
कर्णमिश्रोद्भवं चापि मधुनाम महाऽसुरं । ब्रह्मणोऽपचितिं कुर्वन् जघान पुरुषोत्तम तस्य तात । वधा देव देवदानवमानवाः । मधुसूदन इत्याहु रृषयश्च जनार्धनम् ॥ १६ ॥

At the request of Brahmā, Puruṣottama (Lord Viṣṇu) slew the great demon named Madhu who was born out of his ear wax. Thus having slain the demon, Lord Janārdhana was called 'Madhusūdana' by the Gods, asuras, men and the sages.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

14 జన, 2013

72. మాధవః, माधवः, Mādhavaḥ

ఓం మాధవాయ నమః | ॐ माधवाय नमः | OM Mādhavāya namaḥ


మాయాః ధవః (శ్రియః పతిః) మా అనగా శ్రీ లేదా లక్ష్మి. ఆమెకు ధవుడు అనగా పతి. లేదా బృహదారణ్యకోపనిషత్తునందు ప్రతిపాదించబడిన 'మధు' విద్యచే బోధింపబడువాడు కావున 'మాధవః'. మధోః అయమ్ ఇతడు 'మధు' విద్యకు సంబంధించినవాడు అని విగ్రహవాక్యము. మధు విద్యచే బోధింపబడుటయే పరమాత్మునకు ఆ విద్యతో గల సంబంధము. లేదా 'మౌనా ద్ధ్యానాచ్చ యోగాచ్చ విద్ధి భారత మాధవమ్‌.' (మహాభారతము - ఉద్యోగ పర్వము, సనత్ సుజాత పర్వము 4) 'హే భారతా! మౌనము (మననము) వలనను, ధ్యానము వలనను యోగము (తత్త్వానుసంధానము) వలనను మాధవుని ఎరుగుము' అను వ్యాస వచనము ననుసరించి మౌనధ్యాన యోగములచే ఎరగబడువాడు కావున విష్ణుడు 'మాధవః' అనబడును.



Māyāḥ dhavaḥ (Śriyaḥ patiḥ) मायाः धवः (श्रियः पतिः) The dhava or husband of Mā or Śri who is otherwise known as Lakṣmi लक्ष्मि. Or as mentioned in Br̥hadāraṇyakopaniṣat, He is made known by the Madhu vidyā. Or in the Mahā Bhārata (Udyoga parva, Sanat sujāta parva 4) Vyāsa says 'Maunā ddhyānācca yogācca viddhi bhārata mādhavamˈ, 'मौना द्ध्यानाच्च योगाच्च विद्धि भारत! माधवम्‌' O Bhārata! Know Mādhava by mauna (silence / contemplation), dhyāna (meditation) and Yoga (practice). He who is known by these is Mādhava. Mā signifies mauna, dhā signifies dhyāna and vā yoga.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

13 జన, 2013

71. భూగర్భః, भूगर्भः, Bhūgarbhaḥ

ఓం భూగర్భాయ నమః | ॐ भूगर्भाय नमः | OM Bhūgarbhāya namaḥ


భూః గర్భే యస్య సః ఎవని గర్భమునందు భూమి ఉండునో అట్టివాడు.

:: పురుష సూక్తం / శ్వేతాశ్వతరోపనిషత్ - తృతీయోఽధ్యాయః ::
సహస్రశీర్షా పురుష స్సహస్రాక్ష స్సహస్రపాత్ ।
స భూమిం విశ్వతో వృత్వాఽత్యతిష్ఠ ద్దశాంగులమ్ ॥ 1 / 14 ॥

ఆ పరమాత్మ సహస్ర శీర్షములు గలవాడు, పూర్ణ పురుషుడు, సహస్ర నేత్రములు గలవాడు. సహస్ర పాదములు గలవాడు. ఆ పరమాత్మ భూమి తనలో కలిగియున్న విశ్వమంతయు వ్యాపించినవాడై అపారమైన భాగమును అధిష్ఠించి యున్నాడు.



Bhūḥ garbhe yasya saḥ (भूः गर्भे यस्य सः) He in whose womb is the earth.

Puruṣa Sūktaṃ / Śvetāśvataropaniṣat - Chapter 3
Sahasraśīrṣā puruṣa ssahasrākṣa ssahasrapāt,
Sa bhūmiṃ viśvato vr̥tvā’tyatiṣṭha ddaśāṃgulam. (1 / 14)

:: पुरुष सूक्तम् / श्वेताश्वतरोपनिषत् - तृतीयोऽध्यायः ::
सहस्रशीर्षा पुरुष स्सहस्राक्ष स्सहस्रपात् ।
स भूमिं विश्वतो वृत्वाऽत्यतिष्ठ द्दशांगुलम् ॥ १ / १४ ॥

The Puruṣa with a thousand heads, a thousand eyes, a thousand feet, encompasses this universe which has this Earth in it; on all sides and extends beyond it (the Universe) by ten fingers' breadth!

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

12 జన, 2013

70. హిరణ్యగర్భః, हिरण्यगर्भः, Hiraṇyagarbhaḥ

ఓం హిరణ్యగర్భాయ నమః | ॐ हिरण्यगर्भाय नमः | OM Hiraṇyagarbhāya namaḥ


గర్భః అనగా మాత్రుదరవర్తి శిశువు. 'విరించి' అనబడు చతుర్ముఖ బ్రహ్మ మొదట తానుద్భవించుటకు ముందు హిరణ్యమయమగు అండమునందు ఉండెను కావున అతడు 'హిరణ్య గర్భః'. హిరణ్యమయమగు అండమందలి గర్భము. హిరణ్య గర్భః సమవర్తతాఽగ్రే (ఋగ్వేద సంహిత 10.121.1) 'మొదట హిరణ్య గర్భుడే ఉండెను' అను శ్రుతి ఇందులకు ప్రమాణము. హిరణ్య గర్భ తత్త్వమును విష్ణుని విభూతియే.

:: పోతన భాగవతము - పదునొకండవ స్కందము ::
వ. అనుటయు హరి యుద్ధవునకుం జెప్ప; 'నట్లు మత్ప్రేరితంబులైన మహదాది గుణంబులు గూడి యండంబై యుధ్భవించె; నా యండంబువలన నే నుద్భవించితిని; నంత నా నాభివివరంబున బ్రహ్మ యుదయించె; సాగరారణ్య నదీనద సంఘంబులు మొదలుగాఁ గల జగన్నిర్మాణంబు లతని వలనం గల్పించితిని; నంత శతానందులకు శతాబ్దంబులు పరిపూర్ణంబైన ధాత్రి గంధంబునం దడంగు; నాగంధం బుదకంబునం గలయు; నా యుదకంబు రసంబున లీనం బగు; నా రసంబు తేజోరూపంబగు; నా తేజంబు రూపంబున సంక్రమించు; నా రూపంబు వాయువందుం గలయు; వాయువు స్పర్శగుణ సంగ్రాహ్యం బైన స్పర్శగుణం బాకాశంబున లయంబగు; నా యాకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసియింపఁబడిన నింద్రియంబులు మనో వైకారిక గుణంబులం గూడి యీశ్వరునిం బొంది, యీశ్వరరూపంబు దాల్చు;

నేను రజస్సత్త్వ తమోగుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి, జగదుత్పత్తి స్థితిలయ కారణుండనై వర్తిల్లుదుఁ; గావున నీ రహస్యంబు నీకు నుపదేశించితిఁ, బరమ పావనుండవుఁ బరమ భక్తి యుక్తుండవుగ' మ్మని చెప్పె; నంత.

అనగా హరి ఉద్ధవునితో ఇలా అన్నాడు - ఆ విధంగా నా చేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలిసి ఒక అండంగా ఏర్పడ్డాయి. ఆ అండం నుంచి నేను పుట్టాను. అంత నా నాభి రంధ్రంలోనుంచి బ్రహ్మ పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచమంతా అతనిచేత నేనే నిర్మీంపజేశాను. ఆ బ్రహ్మకు నూరేండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది. గంధం నీటిలో కలుస్తుంది. ఆ నీరు రసములో లీన మవుతుంది. ఆ రసం తేజస్సు యొక్క రూపాన్ని ధరిస్తుంది. ఆ తేజస్సు రూపమునందు సంక్రమిస్తుంది. ఆ రూపం వాయువులో కలుస్తుంది. ఆ వాయువు స్పర్శగా మారుతుంది. ఆ స్పర్శ గుణం ఆకాశంలో లయమవుతుంది. ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే గ్రహింప బడుతుంది ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునితో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వరరూపాన్ని ధరిస్తవి.

నేను రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడు గుణాలతో కూడి మూడు మూర్తులు ధరించి సృష్టియొక్క పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికీ కారణుడనై వర్తిస్తాను, ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. పరమపావనుడవైనావు. పరమ భక్తియుక్తుడవు కావలసిందని కృష్ణుడు పలికాడు.



One who is Ātman of even Brahmā the creator who is otherwise known as Hiraṇyagarbhaḥ - the luminous globe that contains the whole universe in the seminal form. Hiraṇya garbhaḥ samavartatā’gre (R̥gveda saṃhita 10.121.1) at first, Hiraṇya garbha alone existed.

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 24
Mayā sañcoditā bhāvāḥ sarve saṃhatyakāriṇaḥ,
Aṇḍamutpādayāmāsurmamāyatanamuttamam. (9)

:: श्रीमद्भागवत - एकादशस्कन्धे, चतुर्विंषोऽध्याय ::
मया सञ्चोदिता भावाः सर्वे संहत्यकारिणः ।
अण्डमुत्पादयामासुर्ममायतनमुत्तमम् ॥ ९ ॥

Impelled by Me, all these elements combined to function in an orderly fashion and together gave birth to the golden universal egg, which is My excellent place of residence.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

11 జన, 2013

69. ప్రజాపతిః, प्रजापतिः, Prajāpatiḥ

ఓం ప్రజాపతయే నమః | ॐ प्रजापतये नमः | OM Prajāpataye namaḥ


(ఈశ్వరత్వేన సర్వాసాం) ప్రజానాం పతిః తానే ఈశ్వరుడు కావున సర్వ ప్రజల (ప్రాణుల) కును పతి (తండ్రియు, రక్షకుడును).

:: నారాయణోపనిషత్ ::
ఓం అథపురుషో హ వై నారాయణోఽకామయత । ప్రజాః సృజేయేతి । నారాయణాత్ ప్రాణో జాయతే । మన స్సర్వేంద్రియాణిచ । ఖం వాయుర్జ్యోతి రాపః పృథివీ విశ్వస్య ధారిణీ । నారాయాణాద్రహ్మా జాయతే । నారాయణాద్రుద్రో జాయతే । నారాయణాదింద్రో జాయతే । నారాయణాత్ప్రజాపతిః ప్రజాయతే । నారాయణాత్ ద్వాదశాదిత్యా రుద్రా వసవ స్సర్వాణి ఛందాంసి । నారాయణదేవ సముత్పద్యంతే । నారాయణాత్ ప్రవర్తంతే । నారాయణే ప్రలీయంతే । ఏతదృగ్వేదశిరోఽధీతే ॥ 1 ॥

ఈ సృష్టి ప్రారంభములో పరమపురుషుడగు నారాయణుడు ప్రాణులను సృజింపదలచెను. అపుడు సమష్టి సూక్ష్మ శరీర రూపియగు హిరణ్యగర్భుడు పుట్టెను. పిదప ఆకాశము, వాయువు, అగ్ని, జలము మరియూ ఈ పృథివీ పుట్టినవి. ఇట్లు నారాయణుని నుండియే బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు, మరియూ ప్రజాపతులుద్భవించిరి. నారాయణుని నుండియే ద్వాదశాదిత్యులును, ఏకాదశరుద్రులును, అష్టవసువులును, సకలవేదములును ఆవిర్భవించినవి. ఇట్లు సకల చరాచరములును నారాయణుని నుండియే ఉత్పన్నములగుచున్నవి. నారాయణుని యందే ఇవి యన్నియు నున్నవి. చివరకు నారాయణునియందే సర్వస్వమును లయమగుచున్నవి. ఈ తత్త్వము ఋగ్వేద శిరస్సులో బోధింపబడినది.



(Īśvaratvena sarvāsāṃ) Prajānāṃ patiḥ (ईश्वरत्वेन सर्वासां) प्रजानां पतिः The Master of all living beings, because He is Īśvara.

Nārāyaṇopaniṣat :: नारायणोपनिषत्
Oṃ athapuruṣo ha vai nārāyaṇo’kāmayata, Prajāḥ sr̥jeyeti, Nārāyaṇāt prāṇo jāyate, Mana ssarveṃdriyāṇica, Khaṃ vāyurjyoti rāpaḥ pr̥thivī viśvasya dhāriṇī, Nārāyāṇādrahmā jāyate, Nārāyaṇādrudro jāyate, Nārāyaṇādiṃdro jāyate, Nārāyaṇātprajāpatiḥ prajāyate, Nārāyaṇāt dvādaśādityā rudrā vasava ssarvāṇi chaṃdāṃsi, Nārāyaṇadeva samutpadyaṃte, Nārāyaṇāt pravartaṃte, Nārāyaṇe pralīyaṃte, Etadr̥gvedaśiro’dhīte. (1)

ॐ अथपुरुषो ह वै नारायणोऽकामयत । प्रजाः सृजेयेति । नारायणात् प्राणो जायते । मन स्सर्वेंद्रियाणिच । खं वायुर्ज्योति रापः पृथिवी विश्वस्य धारिणी । नारायाणाद्रह्मा जायते । नारायणाद्रुद्रो जायते । नारायणादिंद्रो जायते । नारायणात्प्रजापतिः प्रजायते । नारायणात् द्वादशादित्या रुद्रा वसव स्सर्वाणि छंदांसि । नारायणदेव समुत्पद्यंते । नारायणात् प्रवर्तंते । नारायणे प्रलीयंते । एतदृग्वेदशिरोऽधीते ॥ १ ॥

In the beginning the Supreme Person Nārāyaṇā desired to manifest this universe. From Nārāyaṇā  all forms of life forms emanated along with consciousness encapsulated in the Hiraṇyagarbha. The five elements viz., Ether or Space, Air, Fire, Water and the Earth which sustains all forms of life forms came from Him. From Nārāyaṇā, Brahmā the creator is born. From Nārāyaṇā, Rudrā the annihilator is born. From Nārāyaṇā, Indra the king of gods is born and from Nārāyaṇā the patriarchs are also born. From Nārāyaṇā the eight Vasus are born, from Nārāyaṇā the eleven Rudrās are born, from Nārāyaṇā the twelve Ādityas are born. From Him the Vedās emanated. Total universe is born from Him. It stays sustained in Him and during the great dissolution, everything merges back into Him. This is exemplified in the initial parts of R̥gveda.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

10 జన, 2013

68. శ్రేష్ఠః, श्रेष्ठः, Śreṣṭhaḥ

ఓం శ్రేష్ఠాయ నమః | ॐ श्रेष्ठाय नमः | OM Śreṣṭhāya namaḥ


ప్రశస్యతమః మిక్కిలియు ప్రశంసించబడువాడు. సర్వాన్ అతి శేతే ఎల్లవాని(రి) మించును కావున విష్ణువే 'శ్రేష్ఠః'.

:: ఛాందోగ్యోపనిషత్ - పంచమ ప్రపాఠకః, ప్రథమ ఖండః ::
ఓం. యోహవై జ్యేష్ఠంచ శ్రేష్ఠంచ వేద జ్యేష్ఠశ్చ హవై శ్రేష్ఠశ్చ భవతి ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ ॥ 1 ॥

ఎవడు నిశ్చితముగా ముఖ్య ప్రాణ తత్త్వమే అందరిలో, అన్ని కార్య-దృశ్య-తత్త్వములలో జ్యేష్ఠమును, శ్రేష్ఠమును అగునని తెలిసికొనునో, అతడు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడునగు చున్నాడు.



Praśasyatamaḥ (प्रशस्यतमः) One deserving the highest praise. Sarvān ati śete (सर्वान् अति शेते) As He is the highest Being excelling others, He is Śreṣṭhaḥ.

Chāṃdogyopaniṣat 5.1 :: छांदोग्योपनिषत् - पंचम प्रपाठकः, प्रथम खंडः
Oṃ. Yohavai jyeṣṭhaṃca śreṣṭhaṃca veda jyeṣṭhaśca havai śreṣṭhaśca bhavati prāṇo vāva jyeṣṭhaśca śreṣṭhaśca. (1)

ॐ. योहवै ज्येष्ठंच श्रेष्ठंच वेद ज्येष्ठश्च हवै श्रेष्ठश्च भवति प्राणो वाव ज्येष्ठश्च श्रेष्ठश्च ॥ १ ॥

The one who has firmly realized that the element of Mukhya Prāṇa or the Vital Force as being the first cause and thus elder to all, becomes the same.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

9 జన, 2013

67. జ్యేష్ఠః, ज्येष्ठः, Jyeṣṭhaḥ

ఓం జ్యేష్ఠాయ నమః | ॐ ज्येष्ठाय नमः | OM Jyeṣṭhāya namaḥ


వృద్ధతమః ముదుసలి. చాలా వయసుకలవారందరిలో మిక్కిలి వృద్ధుడు. అతిశయేన వృద్ధః మిక్కిలి వృద్ధుడు.

:: బృహదారణ్యకోపనిషత్ - అష్టమాధ్యాయః, ప్రథమం బ్రాహ్మణమ్ ::
ఓం యో హవై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి; ప్రాణో వై జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ; జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి । అపి చ యేషాం ఋభూషతి య ఏవం వేద ॥ 1 ॥

ఎవడు ప్రాణము యొక్క జ్యేష్ఠత్వమును, శ్రేష్ఠత్వమును తెలిసికొనుచున్నాడో, వాడు జ్ఞాతులలో జ్యేష్ఠుడును, శ్రేష్ఠుడును అగుచున్నాడు. ప్రాణమే సమస్త ఇంద్రియములలో జ్యేష్ఠమైనదియును, శ్రేష్ఠమైనదియును అయియున్నది. ఎవడు ఈ ప్రకారము తెలిసికొనుచున్నాడో జ్ఞాతులలో జ్యేష్ఠుడును, శ్రేష్ఠుడును అగుచున్నాడు. మరియును, యెవరు జ్యేష్ఠత్వ శ్రేష్ఠత్వములను తనలోనగుటకు కోరుకొనుచున్నాడో, వాడు జ్యేష్ఠుడును, శ్రేష్ఠుడును అగుచున్నాడు.



Vr̥ddhatamaḥ; Atiśayena vr̥ddhaḥ The oldest; for there is nothing before him.

Br̥hadāraṇyakopaniṣat  - Chapter 8, Section 1
Oṃ yo havai jyeṣṭhaṃ ca śreṣṭhaṃ ca veda jyeṣṭhaśca śreṣṭhaśca svānāṃ bhavati; prāṇo vai jyeṣṭhaśca śreṣṭhaśca; jyeṣṭhaśca śreṣṭhaśca svānāṃ bhavati, Api ca yeṣāṃ r̥bhūṣati ya evaṃ veda. (1)

He who knows that which is the oldest and greatest, becomes the oldest and greatest amongst his relatives. The vital force is indeed the oldest and greatest. He who knows it to be such - becomes the oldest and greatest amongst his relatives as well as amongst those of whom he wants to be such.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

8 జన, 2013

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ

ఓం ప్రాణాయ నమః | ॐ प्राणाय नमः | OM Prāṇāya namaḥ


ప్రాణితి శ్వాసోచ్ఛ్వాసక్రియలు జరుపునది. క్షేత్రజ్ఞుడుగా జీవరూపమునందుండు విష్ణువు. లేదా జీవుల ప్రాణమునకు శక్తినిచ్చు పరమాత్మ. ముఖ్యప్రాణము అని కూడా అర్థము.

:: బృహదారణ్యకోపనిషత్ - చతుర్థాధ్యాయః - చతుర్థం బ్రాహ్మణం ::
ప్రాణస్య ప్రాణముత చక్షుష శ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం । మనసో యే మనోవిదుః । తే నిచిక్యుః బ్రహ్మ పురాణ మగ్ర్యం ॥ 18 ॥

అక్షర రూపమగునది ఏది ప్రాణమునకు ప్రాణమో (ప్రాణ వ్యాపారమునకు ఆధారమో), నేత్రమునకు నేత్రమో, శ్రోత్రమునకు (చెవికి) శ్రోత్రమో, మనస్సునకే మనస్సువంటిదో అద్దానిని తెలిసికొనినవారే పరబ్రహ్మమును నిశ్చయముగా దెలిపికొనువారు.

:: ఛాందోగ్యోపనిషత్ - పంచమః ప్రపాఠకః, ప్రథమ ఖండః ::
నవై వాచో నచక్షూంషి నశ్రోత్రాణి నమనాంసీత్యాచక్షతే ప్రాణా ఇత్యేవాచక్షతే ప్రాణో హ్యే వైతాని సర్వాణి భవతి ॥ 15 ॥

వాగింద్రియము, నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము, మనస్సు - ఇవన్నియు ప్రత్యేకముగా చైతన్యము కలిగి యుండవు. వీటన్నింటిని ప్రాణములని ప్రజలు పిలిచెదరు. ఈ ఇంద్రియములన్నియు ప్రాణమే గానీ, వేరు కాదు.



Prāṇiti Breathes. The name may refer to Kṣetrajña, the Jīva or the Paramātma. It may also mean Mukhyaprāṇa, the life principle.

Br̥hadāraṇyakopaniṣat - Section 4, Brāhmaṇa 4
Prāṇasya prāṇamuta cakṣuṣa ścakṣuruta śrotrasya śrotraṃ, manaso ye manoviduḥ, Te nicikyuḥ brahma purāṇa magryaṃ. (18)

Those who have known the Vital Force of the vital force, the Eye of the eye, the Ear of the ear and the Mind of the mind, have realized the ancient, primodial Brahman.

Chāndogyopaniṣat - 5.1
Navai vāco nacakṣūṃṣi naśrotrāṇi namanāṃsītyācakṣate prāṇā ityevācakṣate prāṇo hye vaitāni sarvāṇi bhavati. (15)

In the body of a living being neither the power to speak, nor the power to see, nor the power to hear, nor the power to think is the prime factor; it is life which is the center of all activities.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

7 జన, 2013

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

ఓం ప్రాణదాయ నమః | ॐ प्राणदाय नमः | OM Prāṇadāya namaḥ


ప్రాణాన్ దదాతి ప్రాణులు చేష్టించుటకు ఆవస్యకమగు పంచ మహా ప్రాణములు అయిన ప్రాణము, అపానము, వ్యానము, ఉదాన సమానములూ, పంచ ఉపప్రాణములు అయిన నాగము, కూర్మము, కృకరము, దేవదత్త ధనంజయములను జీవులకు ఇచ్చు వాడు.

:: తైత్తీరీయోపనిషత్ - ద్వితీయాధ్యాయః, సప్తమోఽనువాకః ::
అసద్వా ఇదమగ్ర ఆసీత్ । తతో వై స దజాయత తదాత్మానగ్‍ం స్వయ మకురుత । తస్మాత్తత్సుకృత ముచ్యత ఇతి । యద్వై తత్సుకృతమ్ । రసో వై సః । రసగ్‍ం హ్యేవాయం లబ్ధ్వాఽఽనందీ భవతి । కే హ్యేవాఽన్యాత్కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ । ఏష హ్యేవానందయాతి ॥ 1 ॥

పూర్వమునందు పరబ్రహ్మ స్వరూపముగా చెప్పబడిన ఈ ప్రపంచము సృష్టికి పూర్వము వ్యాకృతమై నామరూప విశేషములకు విపరీతమగు అవ్యాకృతమైన పరబ్రహ్మముగానే యుండెను. అట్టి అవ్యాకృత పరబ్రహ్మము నుండియే ప్రవివిక్తమగు నామరూప విశేషముగల జగత్తు పుట్టెను. ఏ కారణమువలన ఆ పరబ్రహ్మము ఈ ప్రకారము తన్ను తాను చేసికొనెనో ఆ కారణమునుండియే బ్రహ్మము స్వకర్తృకమైనదని చెప్పబడుచున్నది. ఇట్లు స్వకర్తృకమైన ఆ పరబ్రహ్మము, తృప్తి హేతువగు ఆనందకరమైన రసస్వరూపముగానున్నది. ఇట్టి రసస్వరూపమును జీవి పొంది సుఖవంతుడగుచున్నాడు. ఈ సుఖస్వరూపమైన పరమాత్మ హృదయాకాశమునందు లేని యెడల ఎవడు ప్రాణాపానాది వ్యాపారము చేయును? ఈ పరమాత్మయే లోకమును సుఖపెట్టుచున్నాడు.



Prāṇān dadāti One who bestows or activates the five main vital energies of Prāṇa, Apāna, Vyāna, Udāna and Samāna as also the other (sub vital) energies of Nāga, Kūrma, Kr̥kara, Devadatta and Dhananjaya.

Taittīrīyopaniṣat - Chapter 2, Anuvāka 7
Asadvā idamagra āsīt, Tato vai sa dajāyata tadātmānagˈṃ svaya makuruta, Tasmāttatsukr̥ta mucyata iti, Yadvai tatsukr̥tam, Raso vai saḥ, Rasagˈṃ hyevāyaṃ labdhvā’’naṃdī bhavati, Ke hyevā’nyātkaḥ prāṇyāt yadeṣa ākāśa ānaṃdo na syāt, Eṣa hyevānaṃdayāti. (1)

In the beginning was verily this non-existent. From that (Parabrahma) was generated the existent. That made Itself by Itself. Therefore It is called Self-made. That one who is self-made is verily the joy. Having attained this joy, (man) becomes blessed. Who would have lived and breathed, had not this sky of bliss existed? This verily It is that bestows bliss.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

6 జన, 2013

64. ఈశానః, ईशानः, Īśānaḥ

ఓం ఈశానాయ నమః | ॐ ईशानाय नमः | OM Īśānāya namaḥ


ఈష్టే - సర్వభూతాని - స్వస్వవ్యాపారేషు నియమయతి - ప్రవర్తయతి సర్వ భూతములను తమ తమ వ్యాపరములయందు నియమించును లేదా ప్రవర్తిల్లజేయును.

:: శ్వేతాశ్వతరోపనిషత్ - తృతీయోఽఅధ్యాయః ::
సర్వేంద్రియగుణాభాసగ్‍ం సర్వేంద్రియ వివర్జితమ్ ।
సర్వస్య ప్రభుమ్ ఈశానం సర్వస్య శరణం సుహృత్ ॥ 17 ॥

బ్రహ్మతత్త్వమును సర్వేంద్రియ గుణములను భాసింపజేయునదిగన, సర్వేంద్రియములు లేనిదానిగను, సమస్తమునకు ప్రభునిగను, ఈశానునిగను, సకలమునకు నమ్మదగినదీ, శరణుజొచ్చదగినదిగనూ తెలిసికొనవలెను.



Īṣṭe - sarvabhūtāni - svasvavyāpāreṣu niyamayati He who controls and regulates everything. Or by the reason of His controlling all things, He is called Īśānaḥ. 'Īś' implies 'to control'.

Śvetāśvataropaniṣat - Chapter 3
Sarveṃdriyaguṇābhāsagˈṃ sarveṃdriya vivarjitam,
Sarvasya prabhum īśānaṃ sarvasya śaraṇaṃ suhr̥t. (17)

He is shining through the functions of all the senses, yet without the senses, Lord of everything, the controller and is the most reliable refuge for all.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

5 జన, 2013

63. మఙ్గళం పరమ్, मङ्गलं परम्, Maṅgaḷaṃ param

ఓం మఙ్గళాయ పరస్మై నమః | ॐ मङ्गलाय परस्मै नमः | OM Maṅgalāya parasmai namaḥ


ఇది రెండు పదాల నామము. మంగళం - విశేషము. పరం విశేష్యము. శుభకరమును, శుభస్వరూపమును, సర్వభూతములకంటే ఉత్కృష్టమును అగు బ్రహ్మ తత్త్వము.

:: విష్ణు పురాణము ::
అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం ।
స్మృతిమాత్రేణ య త్పుంసాం బ్రహ్మ తన్మంగలం విదుః ॥


ఏ బ్రహ్మము తన స్మరణమాత్రముచేతనే జీవుల అశుభములను తొలగించునో శుభనైరంతర్యమును (ఎడతెగని శుభములను) వర్ధిల్లజేయునో అటువంటి బ్రహ్మ తత్త్వమును 'మంగలం' అని తత్త్వవేత్తలు తలచుచున్నారు.



Maṅgaḷaṃ and param make one word as adjective and noun. Supremely auspicious. He is Maṅgaḷaṃ due to His auspicious form and param of all beings the highest, Brahma.

Viṣṇu purāṇa
Aśubhāni nirācaṣṭe tanoti śubha saṃtatiṃ,
Smr̥timātreṇa ya tpuṃsāṃ brahma tanmaṃgalaṃ viduḥ.


Brahman is known as Maṅgaḷaṃ, the beneficent, which wards off evils and dowers with series of good by being merely remembered.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

4 జన, 2013

62. పవిత్రం, पवित्रं, Pavitraṃ

ఓం పవిత్రాయ నమః | ॐ पवित्राय नमः | OM Pavitrāya namaḥ


యేన పునాతి తత్ పవిత్రమ్ దేనిచే దేనినైను శుద్ధమునుగా చేయుదురో అట్టి తృణవిశేషము కానీ, మంత్రము కానీ, ఋషి కాని 'పవిత్రమ్‌' అనబడును.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
పితాఽహమస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామయజురేవ చ ॥ 17 ॥

ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, తాతను మఱియు తెలిసికొనదగిన వస్తువును, పవిత్రతను చేకూర్చేవాడినీ, ఓంకారమును, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములును అయియున్నాను.



Yena punāti tat pavitram That by which one is purified. It can be an object/being or a Mantrā or R̥ṣi.

Bhagavad Gīta - Chapter 9
Pitā’hamasya jagato mātā dhātā pitāmahaḥ,
Vedyaṃ pavitra moṃkāra r̥ksāmayajureva ca. (17)

Of this world, I am the father, mother, ordainer and the grand father; I am the knowable, the sanctifier, the syllable OM as also R̥k, Sāma and Yajus.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्दाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః स्त्रिककुब्धाम పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

3 జన, 2013

61. త్రికకుబ్ధామ, त्रिककुब्धाम, Trikakubdhāma

ఓం త్రికకుబ్ధామ్నే నమః | ॐ त्रिककुब्धाम्ने नमः | OM Trikakubdhāmne namaḥ


(ఊర్ధ్వాధోమధ్యభేదేన) తిసృణాం కకుభాం (అపి) ధామ ఊర్ధ్వదిక్, అధోదిక్, మధ్యదిక్ అనుభేదముతో (నుండు) మూడు దిక్కులకును ఆశ్రయస్థానము అగువాడు.

:: పోతన భాగవతము - షష్టమ స్కందము ::
త్రిభువనాత్మ భవన! త్రివిక్రమ! త్రిణయన! త్రిలోక మనోహరానుభావ! భవదీయ వైభవ విభూతి భేదంబు లైన దనుజాదులకు ననుపక్రమ సమయం బెఱింగి, నిజమాయాబలంబున సుర నగ మృగ జలచరాది రూపంబులు ధరియించి, తదీయావతారంబుల ననురూపంబైన విధంబున శిక్షింతువు.

నీవు ముల్లోకాలలో నిండి ఉన్నావు. ముల్లోకాలనూ ఆక్రమించిన త్రివిక్రముడవు. ముల్లోకాలనూ దర్శించే త్రినేత్రుడవు. ముల్లోకాల ఆత్మలను ఆకర్షించే మహామహిమాన్వితుడవు. నీ విభూతి భేదాలైన దానవులు మొదలైన వారికి అంత్యకాలం ఆసన్నం అయిందని తెలుసుకొని నీ మాయా ప్రభావంవల్ల వామనాది దేవతా రూపాలనూ, రామకృష్ణాది మానవ రూపాలనూ, వరాహాది మృగరూపాలనూ, మత్స్యకూర్మాది జలచర రూపాలనూ ధరించి తగిన విధంగా శిక్షిస్తుంటావు.



(Ūrdhvādhomadhyabhedena) Tisr̥ṇāṃ kakubhāṃ (api) dhāma His abode is above, below and the middle regions.

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 9
Tri-bhuvanātma-bhavana trivikrama tri-nayana tri-loka-manoharānubhāva tavaiva vibhūtayo ditijadanujādayaścāpi teṣām upakrama samayo'yam iti svātma māyayā sura nara mṛga miśrita jalacarākṛtibhir yathāparādhaṃ daṇḍaṃ daṇḍadhara dadhartha evam enam api bhagavañjahi tvāṣṭram uta yadi manyase. (40)

You are the Supersoul of the three worlds whose power and opulence is distributed throughout the three worlds; O maintainer and seer of the three worlds who is perceived as the most beautiful within the three worlds. Everything and everyone, including human beings and even the Daitya demons and the Dānavas are but an expansion of Your energy. O supremely powerful one, You have always appeared in Your forms as the various incarnations to punish the demons as soon as they become very powerful. You appear as Lord Vāmanadeva, Lord Rāma and Lord Kṛṣṇa. You appear sometimes as an animal like Lord Boar, sometimes a mixed incarnation like Lord Nṛsiḿhadeva and Lord Hayagrīva, and sometimes an aquatic like Lord Fish and Lord Tortoise. Assuming such various forms, You have always punished the demons and Dānavas. We therefore pray that Your Lordship appear today as another incarnation, if You so desire, to kill the great demon Vṛtrāsura.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

2 జన, 2013

60. ప్రభూతః, प्रभूतः, Prabhūtaḥ

ఓం ప్రభూతాయ నమః | ॐ प्रभूताय नमः | OM Prabhūtāya namaḥ


జ్ఞానైశ్వర్యాది గుణైః సంపన్నః జ్ఞానము, ఈశ్వరత్వము మొదలగు గుణములతో నిండినవాడు.

ప్రభవతి కార్యం సంపాదయితుమితి ప్రభూతం కార్యమును జేయ సమర్ధమైనది.



Jñānaiśvaryādi guṇaiḥ saṃpannaḥ Abundantly endowed with the qualities of wisdom, eminence etc..

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

1 జన, 2013

59. ప్రతర్దనః, प्रतर्दनः, Pratardanaḥ

ఓం ప్రతర్దనాయ నమః | ॐ प्रतर्दनाय नमः | OM Pratardanāya namaḥ


(ప్రలయే భూతాని) ప్రతర్దయతి (హినస్తి) ప్రలయ సమయమునందు ప్రాణులను హింసించును.



(Pralaye bhūtāni) Pratardayati (hinasti) Destroyer of all at the time of cosmic dissolution.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥