31 మార్చి, 2015

878. సురుచిః, सुरुचिः, Suruciḥ

ఓం సురుచయే నమః | ॐ सुरुचये नमः | OM Surucaye namaḥ


శోభనా వా రుచిర్దీపైరుచ్ఛావాఽస్య ప్రభోర్హరేః ।
ఇత్యయం సురుచిరితి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

ఈతనికి శోభనము, చూడముచ్చట్టయగు, లోకహితకరమగు ప్రకాశము కలదు. లేదా ఈతనికి శోభనమగు కోరిక అనగా సంకల్పము కలదు అని కూడా చెప్పవచ్చును.



शोभना वा रुचिर्दीपैरुच्छावाऽस्य प्रभोर्हरेः ।
इत्ययं सुरुचिरिति प्रोच्यते विबुधोत्तमैः ॥

Śobhanā vā rucirdīpairucchāvā’sya prabhorhareḥ,
Ityayaṃ suruciriti procyate vibudhottamaiḥ.

He who is with splendorous effulgence or saṅkalpa i.e, wish or good tastes.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

30 మార్చి, 2015

877. జ్యోతిః, ज्योतिः, Jyotiḥ

ఓం జ్యోతిషే నమః | ॐ ज्योतिषे नमः | OM Jyotiṣe namaḥ


స్వత ఏవ ద్యోతత ఇత్యుచ్యతో జ్యోతిరుచ్యతే ।
నారాయణపరోజ్యోతిరాత్మేతి శ్రుతివాక్యతః ॥

స్వయముగానే ఎవరి ప్రకాశపు సహాయమును లేకయే ప్రకాశించుచుండును. ఈ విషయమున 'నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః' (నారా 13.1) - 'ఉత్కృష్టుడు అగు నారాయణుడే స్వయం ప్రకాశజ్యోతియు సర్వమునకు ఆత్మయు' అను శ్రుతి వచనము ప్రమాణము.



स्वत एव द्योतत इत्युच्यतो ज्योतिरुच्यते ।
नारायणपरोज्योतिरात्मेति श्रुतिवाक्यतः ॥

Svata eva dyotata ityucyato jyotirucyate,
Nārāyaṇaparojyotirātmeti śrutivākyataḥ.

Without dependence on any other source, He shines by Himself so Jyotiḥ vide the mantra 'Nārāyaṇa paro jyotirātmā nārāyaṇaḥ paraḥ' (Nārā 13.1) - 'Nārāyaṇa is supremely self luminous and the supreme soul of everything'.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

29 మార్చి, 2015

876. విహాయసగతిః, विहायसगतिः, Vihāyasagatiḥ

ఓం విహాయసగతయే నమః | ॐ विहायसगतये नमः | OM Vihāyasagataye namaḥ


విహాయసం గతిర్యస్య విష్ణోః పదముతాంశుమాన్ ।
విహాయస గతిరితి ప్రోచ్యతే విష్ణురేవ సః ॥

విహాయసము అనగా హృదయపుండరీకమునందలి సూక్ష్మాకాశము. ఈతడు అట్టి విహాయసము ఆశ్రయస్తానముగానున్నవాడు. త్రివిక్రమావతారమున తన పాదమునకు ఆకాశము ఆశ్రయముగానయ్యెను కావున ఆకాశము ఆశ్రయముగా కలది విష్ణుని పాదమును కావచ్చును. ఆకాశమును ఆశ్రయించి సంచరించుచుండు ఆదిత్యుడనియు ఈ నామమునకు అర్థము చెప్పవచ్చును. 'విహాయసము' అనగా ఆకాశమని అర్థము కావున దానిని ఆశ్రయముగా చేసికొనియుండువానిని ఈ నామము తెలుపును.



विहायसं गतिर्यस्य विष्णोः पदमुतांशुमान् ।
विहायस गतिरिति प्रोच्यते विष्णुरेव सः ॥

Vihāyasaṃ gatiryasya viṣṇoḥ padamutāṃśumān,
Vihāyasa gatiriti procyate viṣṇureva saḥ.

Vihāyasa means ākāśa i.e., space within the heart. He dwells in such space. Or during the Vāmana incarnation, His feet encompassed the skies; so the One who dwells in the sky. Or in the form of sun, He moves through the sky. Since Vihāyasa means the sky or space, the One who had it as abode is Vihāyasagatiḥ.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

28 మార్చి, 2015

875. ప్రీతివర్ధనః, प्रीतिवर्धनः, Prītivardhanaḥ

ఓం ప్రీతివర్ధనాయ నమః | ॐ प्रीतिवर्धनाय नमः | OM Prītivardhanāya namaḥ


తేషాం ప్రీతం వర్ధయతీత్యేవ స ప్రీతివర్ధనః తనను భజించువారికి ప్రియమును ఆచరించును, వారికి ప్రీతిని, ఆనందమును వర్ధిల్లజేయును కనుక ప్రీతివర్ధనః.



तेषां प्रीतं वर्धयतीत्येव स प्रीतिवर्धनः / Teṣāṃ prītaṃ vardhayatītyeva sa prītivardhanaḥ He increases the endearment of those who worship Him by praise etc., or His endearment to them and hence Prītivardhanaḥ.

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

27 మార్చి, 2015

874. ప్రియకృత్, प्रियकृत्, Priyakr̥t

ఓం ప్రియకృతే నమః | ॐ प्रियकृते नमः | OM Priyakr̥te namaḥ


నకేవలం సుప్రియార్హ ఏవ కిన్తు జనార్దనః ।
ప్రియం కరోతి భజతాం విష్ణుః ప్రియకృదిత్యపి ॥

కేవలము ప్రియార్హుడు మాత్రమే కాదు, ఈ చెప్పిన స్తుతి మొదలగు వానిచే తన్ను భుజించినవారికి ప్రియమును ఆచరించును కనుక ప్రియకృత్‍.



नकेवलं सुप्रियार्ह एव किन्तु जनार्दनः ।
प्रियं करोति भजतां विष्णुः प्रियकृदित्यपि ॥

Nakevalaṃ supriyārha eva kintu janārdanaḥ,
Priyaṃ karoti bhajatāṃ viṣṇuḥ priyakr̥dityapi.

Not merely deserves to be loved but He also fulfills the desires of those who worship Him by praise etc., and hence He is Priyakr̥t.

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

26 మార్చి, 2015

873. అర్హః, अर्हः, Arhaḥ

ఓం అర్హాయ నమః | ॐ अर्हाय नमः | OM Arhāya namaḥ


స్వాగతాసనశంసార్ఘ్యపాద్యస్తుత్యాదిసాధనైః ।
పూజ్యైశ్చ పూజనీయ ఇత్యర్హ ఇత్యుచ్యతే బుధైః ॥

పూజనమును పొందుటకు అర్హుడు. ఆవాహనము, ఆసనము, ప్రశంస, అర్ఘ్యము, పాద్యము, స్తుతి, సమస్కారము మొదలగు పూజాసాధనములచే పూజ చేయదగినవాడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
వ. పూజించునప్పు డం దగ్రపూజార్హు లెవ్వ రని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతుర వచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకుల సంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి 'యీ మహాత్ముని సంతుష్టుం జేసిన భువనంబులన్నియుం బరితుష్టిం బొందు' నని జెప్పి ధర్మజుం జూచి ఇట్లనియె. (777)

ఉ. కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్ జగ

జ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్‍

వేళలు విప్రులున్ జననవృద్ధిలయంబుల హేతుభూతముల్‍

లీలలఁ దానయై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్‍. (778)

చ. ఇతఁడే యితండు గన్ను లొకయించుక మెడ్చిన నీ చరాచర

స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్‍

వితతములై జనించుఁ బ్రబవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ

క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్‍? (779)

ఉ. ఈ పురుషోత్తమున్ జగదధీశు ననంతుని సర్వశక్తుఁ జి

ద్రూపకు నగ్రపుజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‍

వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్‍

శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్‍? (780)

ఈ విధంగా పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హుడెవడనే ప్రశ్న పుట్టింది. సభలో ఉన్నవారు తమకు తోచిన విధంగా తలకొకరీతిగా చెప్పారు. వారి మాటలను వారించి బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన కృష్ణుడిని చూపించి 'ఈ మహాత్ముడిని సంతుష్టుడిని చేసిన సమస్త లోకాలు సంతోషిస్తాయి' అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు.

కాలమూ, దేశమూ, యజ్ఞమూ, కర్మమూ, కర్తా, భోక్తా, ప్రపంచమూ, దైవమూ, గురువూ, మంత్రమూ, అగ్నీ, హవ్యద్రవ్యాలూ, సృష్టి-స్థితి-లయలు సమస్తమూ తానేయై ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ కృష్ణ పరమాత్ముడొక్కడే.

పరమేశ్వరుడైన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొన్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ జన్మిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు కారకుడైన ఈ పుణ్యపురుషుడు యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు విష్ణుస్వరూపుడు. సర్వ సమర్థుడు. అగ్రపూజకు అర్హుడు ఇతడు గాకపోతే మరెవ్వరు?

ఓ రాజా! పురుషోత్తముడూ, లోకాధిపతీ, అనంతుడూ, సమస్త శక్తులు కలవాడూ, చిద్రూపుడూ, అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింపజేసినట్లయిన సమస్త లోకాలూ సంతృప్తినొందుతాయి.



स्वागतासनशंसार्घ्यपाद्यस्तुत्यादिसाधनैः ।
पूज्यैश्च पूजनीय इत्यर्ह इत्युच्यते बुधैः ॥

Svāgatāsanaśaṃsārghyapādyastutyādisādhanaiḥ,
Pūjyaiśca pūjanīya ityarha ityucyate budhaiḥ.

One who deserves to be worshipped by words of welcome, offer of a seat, water to wash the hands and feet, praise, prostration and other instruments of worship.

:: श्रीमद्भागवते दशमस्कन्धे चतुःसप्ततितमोऽध्यायः ::
सदस्याग्र्यार्हणार्हं वै विमृशन्तः सभासदः ।
नाध्यगच्छन्ननैकान्त्यात्सहदेवस्तदाब्रवीत् ॥ १८ ॥
अर्हति ह्यच्युतः श्रैष्ठ्यं भगवान्सात्वतां पतिः ।
एश वै देवताः सर्वा देशकालधनादयः ॥ १९ ॥
यदात्मकमिदं विश्वं क्रतवश्च यदात्मकाः ।
अग्निराहुतयो मन्त्रा साङ्ख्यं योगश्च यत्परः ॥ २० ॥
एक एवाद्वितीयोऽसावैतदात्म्यमिदं जगत् ।
आत्मनात्माश्रयः सभ्याः सृजत्यवति हन्त्यजः ॥ २१ ॥
विविधानीह कर्माणि जनयन्यदवेक्शया ।
ईहते यदयं सर्वः श्रेयो धर्मादिलक्शणम् ॥ २२ ॥
तस्मात्कृष्णाय महते दीयतां परमार्हणम् ।
एवं चेत्सर्वभूतानाम् आत्मनश्चार्हणं भवेत् ॥ २३ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 74
Sadasyāgryārhaṇārhaṃ vai vimr̥śantaḥ sabhāsadaḥ,
Nādhyagacchannanaikāntyātsahadevastadābravīt. 18.
Arhati hyacyutaḥ śraiṣṭhyaṃ bhagavānsātvatāṃ patiḥ,
Eśa vai devatāḥ sarvā deśakāladhanādayaḥ. 19.
Yadātmakamidaṃ viśvaṃ kratavaśca yadātmakāḥ,
Agnirāhutayo mantrā sāṃkhyaṃ yogaśca yatparaḥ. 20.
Eka evādvitīyo’sāvaitadātmyamidaṃ jagat,
Ātmanātmāśrayaḥ sabhyāḥ sr̥jatyavati hantyajaḥ. 21.
Vividhānīha karmāṇi janayanyadavekśayā,
Īhate yadayaṃ sarvaḥ śreyo dharmādilakśaṇam. 22.
Tasmātkr̥ṣṇāya mahate dīyatāṃ paramārhaṇam,
Evaṃ cetsarvabhūtānām ātmanaścārhaṇaṃ bhavet. 23.

The members of the assembly then pondered over who among them should be worshiped first, but since there were many personalities qualified for this honor, they were unable to decide. Finally Sahadeva spoke up. He said "Certainly it is Acyuta, the Supreme God and chief of the Yādavas, who deserves the highest position. In truth, He Himself comprises all the gods worshiped in sacrifice, along with such aspects of the worship as the sacred place, the time and the paraphernalia. This entire universe is founded upon Him, as are the great sacrificial performances, with their sacred fires, oblations and mantras. Sāńkhya and yoga both aim toward Him, the One without a second. O assembly members, that unborn Lord, relying solely on Himself, creates, maintains and destroys this cosmos by His personal energies, and thus the existence of this universe depends on Him alone. He creates the many activities of this world, and thus by His grace the whole world endeavors for the ideals of religiosity, economic development, sense gratification and liberation. Therefore we should give the highest honor to Kṛṣṇa, the Supreme Lord. If we do so, we will be honoring all living beings and also our own selves."

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

25 మార్చి, 2015

872. ప్రియార్హః, प्रियार्हः, Priyārhaḥ

ఓం ప్రియార్హాయ నమః | ॐ प्रियार्हाय नमः | OM Priyārhāya namaḥ


ప్రియాణీష్టాన్యర్హతీతి ప్రియార్హ ఇతి కథ్యతే ప్రాణులకు ప్రియములు, ప్రీతికరములు, ప్రీతిపాత్రములు అగు వానిని వారి నుండి పొందుటకు అర్హుడు. ప్రాణులు తమకు ఇష్టములగు వానిని పరమాత్మునకు అర్పణము చేయవలయును.

:: శ్రీవామన మహాపురాణే పఞ్చదశోఽధ్యాయః ::
యద్యదిష్టతమం కిఞ్చిద్యచ్చాస్య దయితం గృహే ।
తత్త ద్గుణవతే దేయం తదేవాక్షయ మిచ్ఛాతా ॥ 51 ॥

పుణ్యము కోరు దాత అగువానికి లోకమున ఏది యేది మిక్కిలి ఇష్టమగునదియు, తన గృహమున తనకు మిగుల ప్రీతిపాత్రమగునదియు కలదో అది యెల్ల - అది అదిగానే తనకు అటు మీదట అక్షయముగా లభించవలయునని కోరికతో - దానమునందుకొనదగు గుణములు కలవానికి ఈయవలెను.



प्रियाणीष्टान्यर्हतीति प्रियार्ह इति कथ्यते / Priyāṇīṣṭānyarhatīti priyārha iti kathyate He deserves whatever is priya, īṣṭa or dear. One should submit whatever is dear to himself as an oblation to the Lord.

:: श्रीवामन महापुराणे पञ्चदशोऽध्यायः ::
यद्यदिष्टतमं किञ्चिद्यच्चास्य दयितं गृहे ।
तत्त द्गुणवते देयं तदेवाक्षय मिच्छाता ॥ ५१ ॥

Śrī Vāmana Mahā Purāṇa Chapter 15
Yadyadiṣṭatamaṃ kiñcidyaccāsya dayitaṃ gr̥he,
Tatta dguṇavate deyaṃ tadevākṣaya micchātā. 51.

Whatever is superlatively dear in the world, the most beloved at home - that must be given as is to the worthy by one who desires the Imperishable.

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

24 మార్చి, 2015

871. అభిప్రాయః, अभिप्रायः, Abhiprāyaḥ

ఓం అభిప్రాయాయ నమః | ॐ अभिप्रायाय नमः | OM Abhiprāyāya namaḥ


పురుషార్థకాంక్షాభిరభిప్రీయతే ప్రైతి వా జగత్ ।
ప్రలయేఽస్మిన్నాభిముఖ్యేనేత్యభిప్రాయ ఉచ్యతే ॥

పురుషార్థములను కోరువారిచేత అభిలషించబడువాడు. లేదా ప్రళయకాలమున ప్రపంచము ఈతనియందు ఎంతయు ఆభిముఖ్యము కలిగి ఈతనియందు మిక్కిలిగా చేరును కనుక అభిప్రాయః.



पुरुषार्थकांक्षाभिरभिप्रीयते प्रैति वा जगत् ।
प्रलयेऽस्मिन्नाभिमुख्येनेत्यभिप्राय उच्यते ॥

Puruṣārthakāṃkṣābhirabhiprīyate praiti vā jagat,
Pralaye’sminnābhimukhyenetyabhiprāya ucyate.

Sought by those who are desirous of puruṣārthas. Or during pralaya or dissolution, the world tends into Him and hence He is Abhiprāyaḥ.

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

23 మార్చి, 2015

870. సత్యధర్మపరాయణః, सत्यधर्मपरायणः, Satyadharmaparāyaṇaḥ

ఓం సత్యధర్మపరాయణాయ నమః | ॐ सत्यधर्मपरायणाय नमः | OM Satyadharmaparāyaṇāya namaḥ


యథాభూతార్థకథనే సత్యే ధర్మే పరాయణః ।
యథాభూతార్థకథనే సత్యే చ నియతో హరిః ।
చోదలక్షణే ధర్మే సత్యధర్మపరాయణః ॥

ఎవనికి సత్యము ధర్మము ఉత్తమమగు ఆశ్రయమో అట్టివాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పుట అను సత్యమునందును, చోదనారూపమగు అనగా ఒక కర్మ ఏట్లు చేయవలెనో అట్లే చేసెడి విధముగా వైదికధర్మమునందును నియతముగా నిలిచియుండువాడు.

:: శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ద్వితీయస్సర్గః ::
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః ।
సాక్షాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ ॥ 29 ॥

ఈ లోకమున రామునివంటి సత్పురుషుడు మఱియొకడు లేడు. అతడు శత్రువులనుగూడ మన్నించువాడు, సత్యధర్మైకనిరతుడు. ధర్మమును, దాని ఫలమైన సంపదను - ఈ రెంటిని ఒక్క త్రాటిపైన నడిపెడివాడతడూ.



यथाभूतार्थकथने सत्ये धर्मे परायणः ।
यथाभूतार्थकथने सत्ये च नियतो हरिः ।
चोदलक्षणे धर्मे सत्यधर्मपरायणः ॥

Yathābhūtārthakathane satye dharme parāyaṇaḥ,
Yathābhūtārthakathane satye ca niyato hariḥ,
Codalakṣaṇe dharme satyadharmaparāyaṇaḥ.

He is constant to truth which is expressing a thing as it is and Dharma based on commands. So He is Satyadharmaparāyaṇaḥ.

:: श्रीमद्रामायणे अयोध्याकाण्डे द्वितीयस्सर्गः ::
रामः सत्पुरुषो लोके सत्यधर्मपरायणः ।
साक्षाद्रामाद्विनिर्वृत्तो धर्मश्चापि श्रिया सह ॥ २९ ॥

Śrīmad Rāmāyaṇa - Book II, Chapter II
Rāmaḥ satpuruṣo loke satyadharmaparāyaṇaḥ,
Sākṣādrāmādvinirvr̥tto dharmaścāpi śriyā saha. 29.

Rāma is the world renowned gentleman. He is keenly interested in truth and righteousness. Only Rāma can make both righteousness and wealth combine without separation.

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

22 మార్చి, 2015

869. సత్యః, सत्यः, Satyaḥ

ఓం సత్యాయ నమః | ॐ सत्याय नमः | OM Satyāya namaḥ


సాధుత్వాత్ సత్సు సత్యోఽయమచ్యుతః ప్రోచ్యతే బుధైః సత్పురుషుల విషయమున అనుకూలముగా వర్తించువాడు కనుక సత్యః.

106. సత్యః, सत्यः, Satyaḥ
212. సత్యః, सत्यः, Satyaḥ



साधुत्वात् सत्सु सत्योऽयमच्युतः प्रोच्यते बुधैः / Sādhutvāt satsu satyo’yamacyutaḥ procyate budhaiḥ As He is good to people of righteous behavior, He is called Satyaḥ.

106. సత్యః, सत्यः, Satyaḥ
212. సత్యః, सत्यः, Satyaḥ

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān Sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

21 మార్చి, 2015

868. సాత్త్వికః, सात्त्विकः, Sāttvikaḥ

ఓం సాత్త్వికాయ నమః | ॐ सात्त्विकाय नमः | OM Sāttvikāya namaḥ


ప్రాధాన్యేన గుణేసత్త్వేస్థిత ఇత్యేవ సాత్త్వికః ప్రధానరూపమున సత్త్వగుణమునందు నిలిచియుండువాడు కనుక సాత్త్వికః.



प्राधान्येन गुणेसत्त्वेस्थित इत्येव सात्त्विकः / Prādhānyena guṇesattvesthita ityeva sāttvikaḥ Since is established predominantly in the sattva guṇa, He is called Sātvikaḥ.

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

20 మార్చి, 2015

867. సత్త్వవాన్, सत्त्ववान्, Sattvavān

ఓం సత్త్వవతే నమః | ॐ सत्त्ववते नमः | OM Sattvavate namaḥ


శౌర్య ప్రభృతికం సత్త్వమస్యాస్తీతి స సత్త్వవాన్ శౌర్య వీర్యాది రూపమగు సత్త్వము అనగా సత్తువ ఇతనికి అమితముగా కలదు కనుక సత్త్వవాన్‍.



शौर्य प्रभृतिकं सत्त्वमस्यास्तीति स सत्त्ववान् / Śaurya prabhr̥tikaṃ sattvamasyāstīti sa sattvavān He has sattva - composed of strength and valor in abundance and hence He is Sattvavān.

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr̥tprītivardhanaḥ ॥ 93 ॥

19 మార్చి, 2015

866. (అ)యమః, (अ)यमः, (A)yamaḥ

ఓం (అ)యమాయ నమః | ॐ (अ)यमाय नमः | OM (A)Yamāya namaḥ


నవిద్యతే యమో మృత్యురస్యేత్యయమ ఉచ్యతే ।
యోగాఙ్గౌ యమనియమౌ తదన్యత్వాదుతాచ్యుతః ॥
ప్రోచ్యతే విబుధశ్రేష్ఠైః స ఏవ నియమో యమః ॥

అయమః: ఈతనికి యముని బాధ అనగా మృత్యువు లేదు.

యమః: యమము, నియమము అనునవి యోగాంగములు. వానిచే గమ్యుడు అనగా అవి సాధనములుగా చేరదగినవాడు కావున యమః, నియమః అనునవి పరమాత్ముని చెప్పుపదములేయగును.



नविद्यते यमो मृत्युरस्येत्ययम उच्यते ।
योगाङ्गौ यमनियमौ तदन्यत्वादुताच्युतः ॥
प्रोच्यते विबुधश्रेष्ठैः स एव नियमो यमः ॥

Navidyate yamo mr̥tyurasyetyayama ucyate,
Yogāṅgau yamaniyamau tadanyatvādutācyutaḥ.
Procyate vibudhaśreṣṭhaiḥ sa eva niyamo yamaḥ.

There is no Yama, mr̥tyu or death for Him hence Ayamaḥ. Or yama being limb of yoga and hence possessed by Him, He himself is Yamaḥ.

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ताऽनियमोऽयमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తాఽనియమోఽయమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā'niyamo'yamaḥ ॥ 92 ॥

18 మార్చి, 2015

865. (అ)నియమః, (अ)नियमः, (A)Niyamaḥ

ఓం (అ)నియమాయ నమః | ॐ (अ)नियमाय नमः | OM (A)Niyamāya namaḥ


నియమో నియతిస్తస్య న విద్యత ఇతి ప్రభుః ।
ప్రోచ్యతేఽనియమ ఇతి తన్నియన్తోరభావతః ॥


అనియమః: ఇతరులు తన విషయమున చేయు ఏ నియమము ఈతనికి లేదు. ఏలయన ఎల్లవారిని నియమించువానికి నియంత ఎవ్వరునుండరు కదా!

నియమః: యోగాంగములలో ఒకటైన నియమము ఈతనికి స్వాధీనముగనుండును కనుక నియమః.



नियमो नियतिस्तस्य न विद्यत इति प्रभुः ।
प्रोच्यतेऽनियम इति तन्नियन्तोरभावतः ॥


Niyamo niyatistasya na vidyata iti prabhuḥ,
Procyate’niyama iti tanniyantorabhāvataḥ.

Aniyamaḥ: Since He is not bound by by any code; for to Him who is the ordainer of all, there is no other ordainer and hence He is Aniyamaḥ.

Niyamaḥ: Niyama being limb of yoga and hence possessed by Him, He himself is Niyamaḥ.

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ताऽनियमोऽयमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తాఽనియమోఽయమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā'niyamo'yamaḥ ॥ 92 ॥

17 మార్చి, 2015

864. నియన్తా, नियन्ता, Niyantā

ఓం నియన్త్రే నమః | ॐ नियन्त्रे नमः | OM Niyantre namaḥ


వ్యవస్థాపయతి స్వేషు కృత్యేషు కేశవః ।
యో దేవస్స నియన్తేతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

ఎల్ల ప్రాణులను తమ తమ కృత్యములయందు తగిన విధమున నిలుపు కేశవుడు నియంతా.



व्यवस्थापयति स्वेषु कृत्येषु केशवः ।
यो देवस्स नियन्तेति प्रोच्यते विबुधोत्तमैः ॥

Vyavasthāpayati sveṣu kr̥tyeṣu keśavaḥ,
Yo devassa niyanteti procyate vibudhottamaiḥ.

Since Lord Keśava ordains and establishes all creatures in their respective functions, He is called Niyantā.

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥

16 మార్చి, 2015

863. సర్వసహః, सर्वसहः, Sarvasahaḥ

ఓం సర్వసహాయ నమః | ॐ सर्वसहाय नमः | OM Sarvasahāya namaḥ


సర్వకర్మసు సమర్థ స్సహమానో రిపూన్ హరిః ।
యో దేవస్సర్వసహ ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥

సహః అనగా సమర్థుడు. సర్వకర్మములయందును సమర్థుడు. ఎల్ల శత్రువులను ఓర్చగలవాడు.



सर्वकर्मसु समर्थ स्सहमानो रिपून् हरिः ।
यो देवस्सर्वसह इत्युच्यते विबुधोत्तमैः ॥

Sarvakarmasu samartha ssahamāno ripūn hariḥ,
Yo devassarvasaha ityucyate vibudhottamaiḥ.

Since Lord Hari is skillful in all actions and withstands all enemies, He is called Sarvasahaḥ.

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥

15 మార్చి, 2015

862. అపరాజితః, अपराजितः, Aparājitaḥ

ఓం అపరాజితాయ నమః | ॐ अपराजिताय नमः | OM Aparājitāya namaḥ


శత్రుభిర్ న పరాజిత ఇత్యపరాజితో హరిః న + పరాజితః శత్రువులచే పరాజితుడు కాని హరి అపరాజితుడు.

716. అపరాజితః, अपराजितः, Aparājitaḥ



शत्रुभिर् न पराजित इत्यपराजितो हरिः / Śatrubhir na parājita ityaparājito hariḥ na + parājitaḥ Since Lord Hari is unconquered by enemies, He is known as Aparājitaḥ.

716. అపరాజితః, अपराजितः, Aparājitaḥ

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥

14 మార్చి, 2015

861. దమః, दमः, Damaḥ

ఓం దమాయ నమః | ॐ दमाय नमः | OM Damāya namaḥ


దమోదమ్యేషు దణ్డేన కార్యం యత్ ఫలమస్తితత్ ।
స ఏవేతి దమ ఇతి ప్రోచ్యతే విబుధైర్హరిః ॥

దమ్యుల అనగా అదుపులోనుంచబడదగినవారి విషయమున ఆచరించబడు దమనక్రియకు ఫలమగు 'దండము'నకు 'దమము' అని వ్యవహారము. అట్టి దమము కూడ పరమాత్ముడే.



दमोदम्येषु दण्डेन कार्यं यत् फलमस्तितत् ।
स एवेति दम इति प्रोच्यते विबुधैर्हरिः ॥

Damodamyeṣu daṇḍena kāryaṃ yat phalamastitat,
Sa eveti dama iti procyate vibudhairhariḥ.

Of those who deserve to be punished, punishment is the fruit. That too is the Lord; so Damaḥ.

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥

13 మార్చి, 2015

860. దమయితా, दमयिता, Damayitā

ఓం దమిత్రే నమః | ॐ दमित्रे नमः | OM Damitre namaḥ


వైవస్వతనరేన్ద్రాదిరూపేణ భగవాన్ హరిః ।
ప్రజా దమయతీతి స దమయితేతి కథ్యతే ॥

భగవంతుడైన శ్రీ హరియే వైవస్వతయమునిగను, భూపాలురగు నరేంద్రులును మొదలగువారి రూపములలో దుష్టులను దమనము చేసి అదుపులోనుంచువాడు కనుక దమయితా.



वैवस्वतनरेन्द्रादिरूपेण भगवान् हरिः ।
प्रजा दमयतीति स दमयितेति कथ्यते ॥

Vaivasvatanarendrādirūpeṇa bhagavān hariḥ,
Prajā damayatīti sa damayiteti kathyate.

In the forms of Vaivasvata Yama i.e., God of death, kings ruling the lands and other such - Lord Hari punishes evildoers keeping a check on lawlessness and hence He is Damayitā.

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥

12 మార్చి, 2015

859. దణ్డః, दण्डः, Daṇḍaḥ

ఓం దణ్డాయ నమః | ॐ दण्डाय नमः | OM Daṇḍāya namaḥ


దమయతాం దమనాద్యస్సదణ్డ ఇతి కథ్యతే ।
దణ్డో దమయతామస్మీత్యచ్యుతే నైవ కీర్తనాత్ ॥

ఇతర ప్రాణులను దమనము అనగా అణచువారిలోనుండు 'దండము' పరమాత్ముని విభూతియే.

:: శ్రీమద్భగవద్గీత విభూతి యోగము ::
దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ ।
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ॥ 38 ॥

నేను దండించువారియొక్క దండనమును, జయింపనిచ్ఛగలవారియొక్క జయోపాయమగు నీతియు అయియున్నాను. మఱియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనైయున్నాను.



दमयतां दमनाद्यस्सदण्ड इति कथ्यते ।
दण्डो दमयतामस्मीत्यच्युते नैव कीर्तनात् ॥

Damayatāṃ damanādyassadaṇḍa iti kathyate,
Daṇḍo damayatāmasmītyacyute naiva kīrtanāt.

He is the Daṇḍa or the ability to punish of those who punish; hence Daṇḍaḥ.

:: श्रीमद्भगवद्गीत विभूति योग ::
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥ ३८ ॥

Śrīmad Bhagavad Gīta Chapter 10
Daṇḍo damayatāmasmi nītirasmi jigīṣatām,
Maunaṃ caivāsmi guhyānāṃ jñānaṃ jñānavatāmaham. 38.

I am the punishment of those who suppress lawlessness; I am the righteous policy of those who desire to conquer. And of things secret, I am verily silence; I am knowledge of the men of knowledge.

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥

11 మార్చి, 2015

858. ధనుర్వేదః, धनुर्वेदः, Dhanurvedaḥ

ఓం ధనుర్వేదాయ నమః | ॐ धनुर्वेदाय नमः | OM Dhanurvedāya namaḥ


ధనుర్వేదం స వేత్తీతి ధనుర్వేద ఇతీర్యతే (ధనుర్ధరుడైన ఆ శ్రీరాముడే) ధనుర్వేదమును ఎరిగినవాడు కూడ.

:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::
యజుర్వేదవినీతశ్చ వేదవిద్భిస్సుపూజితః ।
ధనుర్వేదే చ వేదేషు వేదాఙ్గేషు చ నిష్ఠితః ॥ 14 ॥

(శ్రీరాముడు) యజుర్వేదమునందు పారంగతుడు, ధనుర్వేదమునందును, ఋక్సామాథర్వవేదములయందును, శిక్షాది వేదాంగములయందును నిష్ణాతుడు, వేదపండితులచే పూజింపబడుచుండువాడు.



धनुर्वेदं स वेत्तीति धनुर्वेद इतीर्यते / Dhanurvedaṃ sa vettīti dhanurveda itīryate (Śrī Rāma who is Dhanurdharaḥ) Also knows the science of archery and hence is Dhanurvedaḥ.

:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ::
यजुर्वेदविनीतश्च वेदविद्भिस्सुपूजितः ।
धनुर्वेदे च वेदेषु वेदाङ्गेषु च निष्ठितः ॥ १४ ॥

Śrīmad Rāmāyaṇa - Book 5, Chapter 35
Yajurvedavinītaśca vedavidbhissupūjitaḥ,
Dhanurvede ca vedeṣu vedāṅgeṣu ca niṣṭhitaḥ. 14.

(Śrī Rāma) He got trained in Yajurveda, the sacrificial Veda. He is highly honored by those well-versed in Vedas. He is skilled in Dhanurveda, the science of archery, other Vedas and the six limbs of Vedangas.

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥

10 మార్చి, 2015

857. ధనుర్ధరః, धनुर्धरः, Dhanurdharaḥ

ఓం ధనుర్ధరాయ నమః | ॐ धनुर्धराय नमः | OM Dhanurdharāya namaḥ


శ్రీమాన్ రామో మహద్ధనుర్ధారయామాన యః ప్రభుః ।
స రామరూపో భగవాన్ ధనుర్ధర ఇతీర్యతే ॥

మహానుభావుడగు శ్రీరామునిగా మహా ధనువును ధరించెను కనుక ధనుర్ధరః.

:: శ్రీమద్రామాయణే బాలకాణ్డే సప్తషష్టితమస్సర్గః ::
ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా ।
యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణేఽపి వా ॥ 14 ॥
బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషిత ॥ 15 ॥
లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః ।
పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునన్దనః ।
ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయమాస తద్ధనుః ॥ 16 ॥

"ఓ బ్రహ్మర్షీ! ఇప్పుడే ఈ మహాధనుస్సును చేతితో తాకి చూచెదను. దానిని పైకెత్తి, అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనెదను." అందులకు విశ్వామిత్రుడును, జనకుడును 'సరే' అని పలికిరి.

అంతట ఆ రఘునందనుడు వేలకొలది సదస్యులు చూచుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి, ధనుస్సు మధ్యభాగమును అవలీలగా పట్టుకొనెను. ధనుర్విద్యా కుశలుడును, మహాశక్తిమంతుడును అయిన రాముని కరస్పర్శ మాత్రముననే ఆ ధనుస్సు వంగెను. (అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటినారిని సంధించి, దానిని ఆకర్ణాంతము లాగెను. వెంటనె ఆ విల్లు పెళ్ళున విఱిగెను. ఆ ధనుర్భంగధ్వని పిడుగుపాటువలె భయంకరముగానుండెను.)



श्रीमान् रामो महद्धनुर्धारयामान यः प्रभुः ।
स रामरूपो भगवान् धनुर्धर इतीर्यते ॥

Śrīmān rāmo mahaddhanurdhārayāmāna yaḥ prabhuḥ,
Sa rāmarūpo bhagavān dhanurdhara itīryate.

As Śrīmān Rāma, wielded the great bow and hence He is called Dhanurdharaḥ.

:: श्रीमद्रामायणे बालकाण्डे सप्तषष्टितमस्सर्गः ::
इदं धनुर्वरं ब्रह्मन् संस्पृशामीह पाणिना ।
यत्नवांश्च भविष्यामि तोलने पूरणेऽपि वा ॥ १४ ॥
बाढमित्येव तं राजा मुनिश्च समभाषित ॥ १५ ॥
लीलया स धनुर्मध्ये जग्राह वचनान्मुनेः ।
पश्यतां नृसहस्राणां बहूनां रघुनन्दनः ।
आरोपयित्वा धर्मात्मा पूरयमास तद्धनुः ॥ १६ ॥

Śrīmad Rāmāyaṇa - Book 1, Chapter 67
Idaṃ dhanurvaraṃ brahman saṃspr̥śāmīha pāṇinā,
Yatnavāṃśca bhaviṣyāmi tolane pūraṇe’pi vā. 14.
Bāḍamityeva taṃ rājā muniśca samabhāṣita. 15.
Līlayā sa dhanurmadhye jagrāha vacanānmuneḥ,
Paśyatāṃ nr̥sahasrāṇāṃ bahūnāṃ raghunandanaḥ,
Āropayitvā dharmātmā pūrayamāsa taddhanuḥ. 16.

"Now I wish to get the feel of this supreme bow, oh, Brahman, and I shall try to brandish it, or even try to take aim with it" said Rāma. "All Right!" said the saint and king to Rāma in chorus, and Rāma upon the word of the sage grasping it at the middle hand grip playfully grabbed the bow.

While many thousands of men are witnessing that right-minded Rama the legatee of Raghu stringed the bow effortlessly. (Further, that dextrous one stringed that bow with bowstring and started to stretch it up to his ear to examine its tautness, but that glorious one who is foremost among men, Rāma, broke that bow medially. Then there bechanced an explosive explosion when the bow is broken, like the explosiveness of down plunging thunder, and the earth is tremulously tremulous, as it happens when a mountain is exploding.)

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥

9 మార్చి, 2015

856. వాయువాహనః, वायुवाहनः, Vāyuvāhanaḥ

ఓం వాయువాహనాయ నమః | ॐ वायुवाहनाय नमः | OM Vāyuvāhanāya namaḥ


వాయుర్వహతి యద్భీత్యా ప్రాణిష్యితి జనార్దనః ।
స వాయు వాహన ఇతి ప్రోచ్యతే విదుషాం వరైః ॥

ఎవని భయమువలన వాయువు సకల భూతములను కొనిపోవుచుండునో అట్టివాడు.

:: తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి (బ్రహ్మానందవల్లి) ద్వితీయాధ్యాయః - అష్టమోఽనువాకః ::
భీషాఽస్మాద్వాతః పవతే । భీషోదేతి సూర్యః । భీషాఽస్మాదగ్నిశ్చేన్ద్రశ్చ । మృత్యుర్ధావతి పఞ్చమ ఇతి । ... (1)

వాయువు పరబ్రహ్మము భయము చేత వీచుచున్నది. సూర్యుడు సైతమూ పరబ్రహ్మము భయము వలన ఉదయించుచున్నాడు. పరబ్రహ్మము వలన భయముచేత అగ్నియు, ఇంద్రుడు, అయిదవవాడగు యముడును ప్రవర్తించుచున్నారు.



वायुर्वहति यद्भीत्या प्राणिष्यिति जनार्दनः ।
स वायु वाहन इति प्रोच्यते विदुषां वरैः ॥

Vāyurvahati yadbhītyā prāṇiṣyiti janārdanaḥ,
Sa vāyu vāhana iti procyate viduṣāṃ varaiḥ.

He by fear of whom the wind carries beings is Vāyuvāhanaḥ.

:: तैत्तिरीयोपनिषत् - आनंदवल्लि (ब्रह्मानंदवल्लि) द्वितीयाध्यायः - अष्टमोऽनुवाकः ::
भीषाऽस्माद्वातः पवते । भीषोदेति सूर्यः । भीषाऽस्मादग्निश्चेन्द्रश्च । मृत्युर्धावति पञ्चम इति । ... (१)

Taittirīya Upaniṣad - Ānandavalli (Brahmānandavalli) Section II - Chapter VIII
Bhīṣā’smādvātaḥ pavate , bhīṣodeti sūryaḥ , bhīṣā’smādagniścendraśca , mr̥tyurdhāvati pañcama iti , ... (1)

From Its (parabrahma) fear, the wind blows; from fear rises the sun, from the fear of It again Indra, Fire and the fifth i.e., death, proceed (to their respective duties).

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

8 మార్చి, 2015

855. సుపర్ణః, सुपर्णः, Suparṇaḥ

ఓం సుపర్ణాయ నమః | ॐ सुपर्णाय नमः | OM Suparṇāya namaḥ


యస్య చ్ఛన్దాంసి పర్ణాని సంసారతరురూపిణః ।
శోభనాని స సుపర్ణ ఇతి విద్యర్భిరీర్యతే ॥

సంసార వృక్ష రూపుడగు ఈతనియందు ఛందస్సులు అనగా వేదములు శోభన, సుందర పర్ణములు అనగా ఆకులుగానుండును కనుక సుపర్ణః.

:: శ్రీమద్భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగము ::
ఊర్ధ్వమూలమధశ్శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥ 1 ॥

దేనికి వేదములు ఆకులుగనున్నవో, అట్టి సంసారమను అశ్వత్థవృక్షమును పైన వేళ్ళు కలదిగను, క్రింది కొమ్మలు గలదిగను, జ్ఞానప్రాప్తి పర్యంతము నాశములేనిదిగను పెద్దలు చెప్పుదురు. దాని నెవడు తెలిసికొనుచున్నాడో, అతడు వేదార్థము నెఱింగినవాడగుచున్నాడు.

192. సుపర్ణః, सुपर्णः, Suparṇaḥ



यस्य च्छन्दांसि पर्णानि संसारतरुरूपिणः ।
शोभनानि स सुपर्ण इति विद्यर्भिरीर्यते ॥

Yasya cchandāṃsi parṇāni saṃsāratarurūpiṇaḥ,
Śobhanāni sa suparṇa iti vidyarbhirīryate.

Of Him who is in the form of the tree of saṃsāra i.e., the world - of which the Vedas are the beautiful leaves.

:: श्रीमद्भगवद्गीत पुरुषोत्तमप्राप्ति योग ::
ऊर्ध्वमूलमधश्शाख मश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥ १ ॥

Śrīmad Bhagavad Gīta Chapter 15
Ūrdhvamūlamadhaśśākha maśvatthaṃ prāhuravyayam,
Chandāṃsi yasya parṇāni yastaṃ veda sa vedavit. 1.

They say that the Fig Tree, which has its roots upwards and the branches downward, and of which the Vedas are the leaves, is imperishable. He who realizes it is a knower of the Vedas.

192. సుపర్ణః, सुपर्णः, Suparṇaḥ

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

7 మార్చి, 2015

854. క్షామః, क्षामः, Kṣāmaḥ

ఓం క్షామాయ నమః | ॐ क्षामाय नमः | OM Kṣāmāya namaḥ


క్షామాః క్షీణాః ప్రజాః సర్వాః కరోతీతి జనార్దనః ।
క్షామ ఇత్యుచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥
తత్కరోతి తదాచష్టే ఇతిణిచి పచాద్యచి ।
కృతే క్షామ ఇతి శబ్దః సమ్పన్న ఇతి కథ్యతే ॥

క్షీణించి కృశించి యున్నవారు క్షామాః అనగా క్షాములు అనబడెదరు. ప్రళయకాలమున సర్వప్రజలను క్షాములనుగా చేయును అనగా నశింపజేయును.

'క్షామాః కరోతి' అనగా క్షాములనుగా చేయును అను అర్థములో 'క్షామ' శబ్దము నుండి 'తత్కరోతి తదాచష్టే' అను చురాదిగణసూత్రముచే 'ణిచ్‍' ప్రత్యయమును పచాది ధాతువులపై వచ్చు 'అచ్‍' ప్రత్యయమును రాగా 'క్షామః' అను రూపము సిద్ధించును.



क्षामाः क्षीणाः प्रजाः सर्वाः करोतीति जनार्दनः ।
क्षाम इत्युच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥
तत्करोति तदाचष्टे इतिणिचि पचाद्यचि ।
कृते क्षाम इति शब्दः सम्पन्न इति कथ्यते ॥

Kṣāmāḥ kṣīṇāḥ prajāḥ sarvāḥ karotīti janārdanaḥ,
Kṣāma ityucyate sadbhirvedavidyāviśāradaiḥ.
Tatkaroti tadācaṣṭe itiṇici pacādyaci,
Kr̥te kṣāma iti śabdaḥ sampanna iti kathyate.

Those who are emaciated and deteriorating are Kṣāmaḥ. During the times of dissolution, Lord Viṣṇu obliterates everything causing dissolution and hence He is Kṣāmaḥ.

In the construct 'Kṣāmāḥ karoti,' meaning 'causes decay,' when the word Kṣāma is subjected to linguistic rule of 'Tatkaroti tadācaṣṭe' with a suffix of 'Ṇic' and grammatical precept of affixing 'Ac', 'Kṣāmaḥ' gets deduced. This is how the name gets implied as the one who causes instead of the one being defined.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

6 మార్చి, 2015

853. శ్రమణః, श्रमणः, Śramaṇaḥ

ఓం శ్రమణాయ నమః | ॐ श्रमणाय नमः | OM Śramaṇāya namaḥ


సర్వాన్ సన్తాపయతీతి శ్రమణః ప్రోచ్యతే హరిః అవివేకులగువారి నందరను సంతాపింప జేయును కనుక హరి శ్రమణః.



सर्वान् सन्तापयतीति श्रमणः प्रोच्यते हरिः / Sarvān santāpayatīti śramaṇaḥ procyate hariḥ Since Lord Hari causes grief to the blockhead people, He is called Śramaṇaḥ.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

5 మార్చి, 2015

852. ఆశ్రమః, आश्रमः, Āśramaḥ

ఓం ఆశ్రమాయ నమః | ॐ आश्रमाय नमः | OM Āśramāya namaḥ


ఆశ్రమ ఇవ సర్వేషాం విశ్రామస్థానమేవ యః ।
సంసారారణ్యే భ్రమతాం స ఆశ్రమ ఇతీర్యతే ॥


సంసారారణ్యమున దారి తప్పి ఇటునటు భ్రమించువారికి అందరకును ఆశ్రమమువలె విశ్రాంతి స్థానముగానుండువాడు కనుక ఆశ్రమః.



आश्रम इव सर्वेषां विश्रामस्थानमेव यः ।
संसारारण्ये भ्रमतां स आश्रम इतीर्यते ॥ 


Āśrama iva sarveṣāṃ viśrāmasthānameva yaḥ,
Saṃsārāraṇye bhramatāṃ sa āśrama itīryate.


As He is the resting place like a hermitage of those who wander in the forest of samsāra, He is called Āśramaḥ.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

4 మార్చి, 2015

851. సర్వకామదః, सर्वकामदः, Sarvakāmadaḥ

ఓం సర్వకామదాయ నమః | ॐ सर्वकामदाय नमः | OM Sarvakāmadāya namaḥ


సర్వాన్ కామాన్ దదాతీతి సర్వకామద ఉచ్యతే ।
ఫలమత ఉపపత్తేరితి వ్యాసేన సూత్రణాత్ ॥

సర్వ ఫలములను అనుగ్రహించువాడు. ఈ విషయమున బ్రహ్మ సూత్రమునందలి తృతీయ సాధనాధ్యాయమున వ్యాస వచనము 'ఫలమత ఉపపత్తేః' (3.2.38) - 'కర్మ ఫలము ఈ పరమాత్ముని నుండియే లభించుచున్నది ఏలయన యుక్తులను బట్టి ఈ విషయమే సిద్ధించుచున్నది' నిశ్చయించదగియున్నది.

:: శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మధర్మపర్వణి సప్తషష్టితమోఽధ్యాయః ::
ఏష ధర్మశ్చ ధర్మజ్ఞో వరదః సర్వకామదః ।
ఏష కర్తా చ కార్యం చ పూర్వదేవః స్వయమ్ప్రభుః ॥ 8 ॥

ఈతడు ధర్మజ్ఞుడును, వరదాతయును, అన్ని కోరికలను తీర్చెడి వరదుడును, ధర్మస్వరూపుడును. ఈయనే కర్తయును, కార్యమును, ఆదిదేవుడును మరియు తానై సర్వసమర్థుడును అయియున్నాడు.



सर्वान् कामान् ददातीति सर्वकामद उच्यते ।
फलमत उपपत्तेरिति व्यासेन सूत्रणात् ॥

Sarvān kāmān dadātīti sarvakāmada ucyate,
Phalamata upapatteriti vyāsena sūtraṇāt.

He who ever fulfills all desires. As Vyāsa said in the third chapter of Brahma Sūtras focusing upon sādhana or practice 'फलमत उपपत्तेः / Phalamata upapatteḥ' (3.2.38) - From Him the fruits (of actions) arises; for that stands to reasoning.' So, Sarvakāmadaḥ.

:: श्रीमहाभारते भीष्मपर्वणि भीष्मधर्मपर्वणि सप्तषष्टितमोऽध्यायः ::
एष धर्मश्च धर्मज्ञो वरदः सर्वकामदः ।
एष कर्ता च कार्यं च पूर्वदेवः स्वयम्प्रभुः ॥ ८ ॥

Śrī Mahābhārata - Book 6, Chapter 68
Eṣa dharmaśca dharmajño varadaḥ sarvakāmadaḥ,
Eṣa kartā ca kāryaṃ ca pūrvadevaḥ svayamprabhuḥ. 8.

He is Righteousness and of righteous soul. He is the giver of boons and the giver of all (our) wishes. He is the Actor and Action, and He is himself the Divine Master.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

3 మార్చి, 2015

850. యోగీశః, योगीशः, Yogīśaḥ

ఓం యోగీశాయ నమః | ॐ योगीशाय नमः | OM Yogīśāya namaḥ


యోగినో యోగాన్తరాయ్యైర్హన్యన్తేఽన్యే సహస్రశః ।
స్వస్వరూపాత్ ప్రమాద్యన్తి సోఽయం తు న తథా హరిః ॥
తేషామీశోఽధిపో విష్ణుర్యోగీశ ఇతి కథ్యతే ॥

యోగులకు ఈశుడు. యోగులలో శ్రేష్ఠుడు. ఇతర యోగులు యోగ విఘ్నములచే దెబ్బతినుచుందురు. స్వరూపాఽనుభవము నుండి ఏమరపాటు చెందుచుందురు. పరమాత్మ అట్టి తత్త్వమునుండి ఏమరిక లేనివాడు కావున సర్వయోగిశ్రేష్ఠుడైన యోగీశుడు.



योगिनो योगान्तराय्यैर्हन्यन्तेऽन्ये सहस्रशः ।
स्वस्वरूपात् प्रमाद्यन्ति सोऽयं तु न तथा हरिः ॥
तेषामीशोऽधिपो विष्णुर्योगीश इति कथ्यते ॥

Yogino yogāntarāyyairhanyante’nye sahasraśaḥ,
Svasvarūpāt pramādyanti so’yaṃ tu na tathā hariḥ.
Teṣāmīśo’dhipo viṣṇuryogīśa iti kathyate.

Other yogis are obstructed by impediments. They fall away from their status. As He is devoid of such condition, He is the Lord of the yogis and hence Yogīśaḥ.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

2 మార్చి, 2015

849. యోగీ, योगी, Yogī

ఓం యోగినే నమః | ॐ योगिने नमः | OM Yogine namaḥ


యోగో జ్ఞానం తేన గమ్యో హరిర్యోగీతి కథ్యతే ।
సమాధిర్హి స యో యోగః స హి స్వాత్మని సర్వదా ॥
సమాధత్తే స్వమాత్మానం తేన యోగీతి చోచ్యతే ॥

యుజ - సమాధౌ అను అవధాన వాచక ధాతువునుండి నిష్పన్నమగు యోగ శబ్దమునకు 'జ్ఞానము' అని శబ్దావయవముల అర్థమునుండి ఏర్పడు అర్థము. యోగము, జ్ఞానము సాధకుని ఈతనికడకు చేర్చునదిగా కలదు కావున పరమాత్మ 'యోగీ' అనబడును. యోగము అనగా సమాధి చిత్తమును తత్త్వముపై నిలుపుట అని అర్థము. ఏలయన ఆ సమాధియే సాధకుని తన ఆత్మ తత్త్వమును స్వాత్మ తత్త్వమునందు లెస్సగా ఏకీభావమున నిలుపును. అట్టి సమాధి స్థితి అనగా యోగము పరమాత్ముని రూపమే కావున భగవంతుని యునక్తి లేదా ఆత్మ తత్త్వమున నిలుపును అను అర్థమున 'యోగీ' అనదగును.



योगो ज्ञानं तेन गम्यो हरिर्योगीति कथ्यते ।
समाधिर्हि स यो योगः स हि स्वात्मनि सर्वदा ॥
समाधत्ते स्वमात्मानं तेन योगीति चोच्यते ॥

Yogo jñānaṃ tena gamyo hariryogīti kathyate,
Samādhirhi sa yo yogaḥ sa hi svātmani sarvadā.
Samādhatte svamātmānaṃ tena yogīti cocyate.

Yoga stands for jñānam or blissful state of knowledge. As He is attained by it alone, He is Yogī. Or Yoga is samādhi or state of singularity. As He establishes His Ātman in His Ātman, He is Yogī.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

1 మార్చి, 2015

848. కథితః, कथितः, Kathitaḥ

ఓం కథితాయ నమః | ॐ कथिताय नमः | OM Kathitāya namaḥ


సర్వైర్వేదైః కథిత ఇత్యుచ్యతః కథితః స్మృతః ।
వేదైశ్చ సర్వై రహమేవేత్యతః కథితః శ్రుతః ॥
సోఽధ్వనః రమాప్నోతీత్యత్రోక్తం కిం తదధ్వనః ।
విష్ణోర్వ్యాపనశీలస్య సత్తత్త్వం పరమం పదం ॥
ఇత్యాకాంక్షాం పురస్కృత్య పరత్వం ప్రతిపాద్యతే ।
ఇన్ద్రియేభ్యః పరా హ్యర్థా ఇత్యారభ్య పరాగతిః ॥
ఇత్యన్తేన యః కథితః స ఏవ కథిత స్మృతః ॥

చెప్పబడినవాడు. ప్రతిపాదించబడినవాడు. తెలియజేయబడినవాడు. వేదములు మొదలగు వానిచేత ఈ విష్ణు పరమాత్ముడే 'పరుడు' అనగా సర్వోత్కృష్టుడు అని చెప్పబడినాడు. సర్వ వేదములచేతను ఒకే మాటగా చెప్పబడినవాడు - అని యైనను చెప్పవచ్చును.

'సర్వే వేదా య త్పద మామనంతి' (కఠోపనిషత్ 1.2.15) - 'సర్వ వేదములును ఏ తెలియబడదగిన పరబ్రహ్మ తత్త్వమును ప్రతిపాదించుచున్నవో'

'వేదైశ్చ సర్వై రహమేవ వేద్యః' (శ్రీమద్భగవద్గీత 15.15) - 'సర్వ వేదముల చేతను తెలియబడదగినవాడను నేనే'

'వేదే రామాయణే పుణ్య భారతే భరతర్షభ । అదౌ మధ్యే తథా చాన్తే విష్ణుః సర్వత్ర గీయతే ॥' (హరివంశము 323.93) - 'హే భరత వంశ శ్రేష్ఠా! పుణ్యకరములగు వేద రామాయణ, మహాభారతములయందు వాని ఆది మధ్యాంతములందంతటను విష్ణువు కీర్తించబడుచున్నాడు' ఈ మొదలగు శ్రుతి, స్మృత్యాది వచనముల ప్రామాణ్యముచే ఈ అర్థము నిశ్చితమగుచున్నది.

సర్వత్ర సర్వకాలములయందును సర్వముగా వ్యాపించియుండువాడగు వ్యాపనశీలుడు అగు 'విష్ణుని' మార్గమునకు సంబంధించి, ఆ మార్గమున పయనించి చేరదగిన కట్టకడపటి గమ్యస్థానముగా తెలియదగు పరమతత్త్వము తాత్త్విక లక్షణములతో కూడిన పరమ పదము ఏది? అను ప్రశ్నము కలుగగా, ఆ విష్ణు పరమాత్ముడు ఇంద్రియాదులగు సర్వతత్త్వములకంటెను పరుడుగా శ్రుత్యాదులచే ప్రతిపాదించబడుచున్నాడు. ఆ విషయమున 'ఇన్ద్రియేభ్యః పరా హర్థాః' అనునది మొదలుగా 'పురుషాన్న పరం కిన్చిత్ సా కాష్ఠా సా పరా గతిః' (కఠోపనిషత్ 1.3.10-11) చే చెప్పబడిన పరమ పురుషుడే ఇచ్చట 'కథితః' అను నామముచే చెప్పబడియున్నారు అని సమాధానము.

:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయము 3వ వల్లి ::
విజ్ఞాన సారథి ర్యస్తు మనః ప్రగ్రహవా న్నరః ।
సోఽధన్వః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్ ॥ 9 ॥
ఇన్ద్రియేభ్యః పరాహ్యార్థాః అర్ధేభ్యశ్చ పరం మనః ।
మనసస్తు పరా బుద్ధి ర్బు ద్ధేరాత్మా మహాన్ పరః ॥ 10 ॥
మహతః పరమవ్యక్త మవ్యక్తా త్పురుషః పరః ।
పురషాన్న పరఙ్కీమ్చిత్సా కాష్ఠా సా పరాగతిః ॥ 11 ॥

ఎవనికి విజ్ఞానమను సారథియు, స్వాధీనములోనున్న మనస్సు అను కళ్ళెమును ఉండునో, అట్టివాడు జీవితమార్గముయొక్క గమ్యమును సర్వవ్యాపక బ్రహ్మపదమైన విష్ణు పదమును చేరుచున్నాడు.

ఇంద్రియములను స్థూలములనుగా గ్రహించుచున్నది. ఈ ఇంద్రియములకు కారణభూతములగు శబ్దాది విషయములు, ఇంద్రియముల కంటె సూక్ష్మములు అగుచున్నవి. ఆ శబ్దాది విషయముల కంటె ప్రత్యగాత్మ భూతమగు మనస్సు మహత్తైనది. మనస్సు కంటె బుద్ధి గొప్పది. బుద్ధి కంటె మహతత్త్వము పరమైనదిగానున్నది.

మహతత్త్వముకంటె పరమైనది అవ్యక్తము. అవ్యక్తము కంటె పరమైనవాడు ప్రత్యగాత్మ పురుషుడు. ఆ పురుషునికన్న శ్రేష్ఠమైనది మరియొకటి లేదు. అదియే పరమ గమ్యము. అవ్యక్త, అవ్యాకృత, ఆకాశాది నామవాచ్యము



सर्वैर्वेदैः कथित इत्युच्यतः कथितः स्मृतः ।
वेदैश्च सर्वै रहमेवेत्यतः कथितः श्रुतः ॥
सोऽध्वनः रमाप्नोतीत्यत्रोक्तं किं तदध्वनः ।
विष्णोर्व्यापनशीलस्य सत्तत्त्वं परमं पदं ॥
इत्याकांक्षां पुरस्कृत्य परत्वं प्रतिपाद्यते ।
इन्द्रियेभ्यः परा ह्यर्था इत्यारभ्य परागतिः ॥
इत्यन्तेन यः कथितः स एव कथित स्मृतः ॥

Sarvairvedaiḥ kathita ityucyataḥ kathitaḥ smr̥taḥ,
Vedaiśca sarvai rahamevetyataḥ kathitaḥ śrutaḥ.
So’dhvanaḥ ramāpnotītyatroktaṃ kiṃ tadadhvanaḥ,
Viṣṇorvyāpanaśīlasya sattattvaṃ paramaṃ padaṃ.
Ityākāṃkṣāṃ puraskr̥tya paratvaṃ pratipādyate,
Indriyebhyaḥ parā hyarthā ityārabhya parāgatiḥ.
Ityantena yaḥ kathitaḥ sa eva kathita smr̥taḥ.

By the Vedas, He alone is declared Supreme.

He is celebrated by all the Vedas vide the śruti 'सर्वे वेदा य त्पद मामनन्ति / Sarve vedā ya tpada māmananti' (Kaṭhopaniṣat 1.2.15) - 'He who is celebrated by all the Vedas.'

'वेदैश्च सर्वै रहमेव वेद्यः / Vedaiśca sarvai rahameva vedyaḥ' (Śrīmad Bhagavad Gīta 15.15) - I alone am to be known by all the Vedas.

'वेदे रामायणे पुण्य भारते भरतर्षभ । अदौ मध्ये तथा चान्ते विष्णुः सर्वत्र गीयते ॥ / Vede rāmāyaṇe puṇya bhārate bharatarṣabha, adau madhye tathā cānte viṣṇuḥ sarvatra gīyate.' (Harivaṃśa 323.93) - In the holy Vedas, the Rāmāyaṇa, Bhārata, at the beginning and at the end Viṣṇu is sung everywhere.

:: कठोपनिषत् प्रथमाध्याय ३व वल्लि ::
विज्ञान सारथि र्यस्तु मनः प्रग्रहवा न्नरः ।
सोऽधन्वः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ॥ ९ ॥
इन्द्रियेभ्यः पराह्यार्थाः अर्धेभ्यश्च परं मनः ।
मनसस्तु परा बुद्धि र्बु द्धेरात्मा महान् परः ॥ १० ॥
महतः परमव्यक्त मव्यक्ता त्पुरुषः परः ।
पुरषान्न परङ्कीम्चित्सा काष्ठा सा परागतिः ॥ ११ ॥

Kaṭhopaniṣat Canto 1, Chapter 3
Vijñāna sārathi ryastu manaḥ pragrahavā nnaraḥ,
So’dhanvaḥ pāramāpnoti tadviṣṇoḥ paramaṃ padam. 9.
Indriyebhyaḥ parāhyārthāḥ ardhebhyaśca paraṃ manaḥ,
Manasastu parā buddhi rbu ddherātmā mahān paraḥ. 10.
Mahataḥ paramavyakta mavyaktā tpuruṣaḥ paraḥ,
Puraṣānna paraṅkīmcitsā kāṣṭhā sā parāgatiḥ. 11.

The man, however, who has as his charioteer a discriminating intellect, and who has under control the reins of the mind, attains the end of the road; and that is the highest place of Viṣṇu.

The sense-objects are higher than the senses and the mind is higher than the sense-objects; but the intellect is higher than the mind and the Great Soul is higher than the intellect.

The Unmanifested is higher than Mahat; the Puruṣa is higher than the Unmanifested. There is nothing higher than the Puruṣa. He is the culmination, He is the highest goal.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥