28 ఫిబ్ర, 2015

847. భారభృత్, भारभृत्, Bhārabhr̥t

ఓం భారభృతే నమః | ॐ भारभृते नमः | OM Bhārabhr̥te namaḥ

భువో భారమనన్తాది రూపేణ బిభ్రదచ్యుతః ।
భారభృదిత్యుచ్యతే స వేదవిద్యావిశారదైః ॥

అనంతుడు మొదలగు రూపములతో భూభారమును మోయును కనుక భారభృత్‍.

भुवो भारमनन्तादि रूपेण बिभ्रदच्युतः ।
भारभृदित्युच्यते स वेदविद्याविशारदैः ॥

Bhuvo bhāramanantādi rūpeṇa bibhradacyutaḥ,
Bhārabhr̥dityucyate sa vedavidyāviśāradaiḥ.

In the form of Ananta, Ādiśeṣa and such, He carries the weight of the earth, hence Bhārabhr̥t.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

27 ఫిబ్ర, 2015

846. వంశవర్ధనః, वंशवर्धनः, Vaṃśavardhanaḥ

ఓం వంశవర్ధనాయ నమః | ॐ वंशवर्धनाय नमः | OM Vaṃśavardhanāya namaḥ

ప్రపఞ్చం వర్ధయన్ వంశం ఛేదయన్ వా జనార్దనః ।
వంశవర్ధన ఇత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥

ప్రపంచరూపమగు వంశమును వృద్ధినందించును, ఛేదించును అనగా లయమందించును.

వృధ్‍ - వృద్ధినందించుట. వర్ధ - ఛేదించుటయు పూరించుటయే అను ధాతువులనుండి 'వర్ధన' నిష్పన్నము.

प्रपञ्चं वर्धयन् वंशं छेदयन् वा जनार्दनः ।
वंशवर्धन इत्युक्तो वेदविद्या विशारदैः ॥

Prapañcaṃ vardhayan vaṃśaṃ chedayan vā janārdanaḥ,
Vaṃśavardhana ityukto vedavidyā viśāradaiḥ.

As expanding or cutting the Universe (Vaṃśaṃ), He is Vaṃśavardhanaḥ.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

26 ఫిబ్ర, 2015

845. ప్రాగ్వంశః, प्राग्वंशः, Prāgvaṃśaḥ

ఓం ప్రాగ్వంశాయ నమః | ॐ प्राग्वंशाय नमः | OM Prāgvaṃśāya namaḥ

అన్యస్య వంశినో వంశాః పాశ్చాత్యా అస్య శార్ఙ్గిణః ।
వంశః ప్రపఞ్చః ప్రాగేవ న పాశ్చాత్య ఇతీశ్వరః ॥
ప్రాగ్వంశ ఇత్యుచ్యతే హి వేదవిద్యావిశారదైః ॥

తమ పేరున వంశము కలవారగు 'వంశుల'కు వంశములు తమ కంటె పాశ్చాత్త్యములు అనగా తమ తరువాత ఏర్పడునవి. కాని ప్రపంచము అనబడు పరమాత్ముని సంతానపు వంశము మాత్రము ముందుగానే, అనాదిగా, అది-ఇది అని నిర్ణయించ శక్యముకాక ఉన్నది. కావున పరమాత్ముడు ప్రాగ్వంశః - ముందునుండియు తన వంశము కలవాడు అని పరమాత్ముడు చెప్పబడును.

अन्यस्य वंशिनो वंशाः पाश्चात्या अस्य शार्ङ्गिणः ।
वंशः प्रपञ्चः प्रागेव न पाश्चात्य इतीश्वरः ॥
प्राग्वंश इत्युच्यते हि वेदविद्याविशारदैः ॥

Anyasya vaṃśino vaṃśāḥ pāścātyā asya śārṅgiṇaḥ,
Vaṃśaḥ prapañcaḥ prāgeva na pāścātya itīśvaraḥ.
Prāgvaṃśa ityucyate hi vedavidyāviśāradaiḥ.

Those by whose name races got into existence, have been there before the race itself. The race comes later. But the race of paramātma, namely the universe has been in existence before all that and not later; hence He is Prāgvaṃśaḥ.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

25 ఫిబ్ర, 2015

844. స్వాస్యః, स्वास्यः, Svāsyaḥ

ఓం స్వాస్యాయ నమః | ॐ स्वास्याय नमः | OM Svāsyāya namaḥ

పద్మోదరతలతామ్రమభిరూపతమం హరేః ।
అస్యాస్యం శోభనమితి స్వాస్య ఇత్యుచ్యతే హరిః ॥
వేదాత్మకో మహాన్ శబ్ద రాశిస్తస్య ముఖాద్బహిః ।
పురుషార్థోపదేశార్థం నిర్గతో వేతి కేశవః ॥
స్వాస్య మిత్యుచ్యతేఽస్యేతి శ్రుతివాక్యాఽనుసారతః ॥

ఈతనిది తామరపూవునడిమి వన్నెవంటి ఎర్ర వన్నె కలదియు, మిగుల సుందరమగు శోభనమైన చక్కటి ముఖము. లేదా సకల పురుషార్థములను జనులకు ఉపదేశించుటకై వేద రూపమగు మహా శబ్దరాశి అతని నోటి నుండి వెలువడెను కావున పరమాత్మ శోభనమగు ముఖము, నోరు కలవాడు. 'అస్య మహతో భూతస్య' (బృహదారణ్యకోపనిషత్ 4.4.10) - 'ఋగ్వేదాదికమగు వాగ్విస్తరమంతయు ఈ మహా భూతపు నిఃశ్వసితమే' ఇత్యాది శ్రుతి ఈ విషయమున ప్రమాణము.

पद्मोदरतलताम्रमभिरूपतमं हरेः ।
अस्यास्यं शोभनमिति स्वास्य इत्युच्यते हरिः ॥
वेदात्मको महान् शब्द राशिस्तस्य मुखाद्बहिः ।
पुरुषार्थोपदेशार्थं निर्गतो वेति केशवः ॥
स्वास्य मित्युच्यतेऽस्येति श्रुतिवाक्याऽनुसारतः ॥

Padmodaratalatāmramabhirūpatamaṃ hareḥ,
Asyāsyaṃ śobhanamiti svāsya ityucyate hariḥ.
Vedātmako mahān śabda rāśistasya mukhādbahiḥ,
Puruṣārthopadeśārthaṃ nirgato veti keśavaḥ.
Svāsya mityucyate’syeti śrutivākyā’nusārataḥ.

His face is beautiful, handsome as the red color inside a lotus flower, so Svāsyaḥ. Or the upadeśa or preaching of the great store of Vedas which can give the puruṣārthas came out from His mouth so Svāsyaḥ vide the śruti 'अस्य महतो भूतस्य / Asya mahato bhūtasya' (बृहदारण्यकोपनिषत् / Br̥hadāraṇyakopaniṣat 2.4.10) - 'From this great Being emanated R̥g Veda, Yajur Veda etc.'

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

24 ఫిబ్ర, 2015

843. స్వధృతః, स्वधृतः, Svadhr̥taḥ

ఓం స్వధృతాయ నమః | ॐ स्वधृताय नमः | OM Svadhr̥tāya namaḥ

యద్యేవమయం భగవాన్ పరమాత్మాసనాతనః ।
కేన ధార్యత ఇత్యాశఙ్క్యాహ ద్వైపాయనో మునిః ॥
స్వేనైవాత్మనా ధార్యత ఇతి స్వధృత ఉచ్యతే ।
కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్నీతి వేదతః ॥

తానెవ్వరిచేతను ధరించబడనివాడైనట్లయిన మరి పరమాత్ముడెవ్వరి చేత ధరించబడును? - అని ఆశంక చేసికొని అందులకు సమాధానముగా 'స్వధృతః' అను నామమును చెప్పుచున్నారు. 'స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి; స్వే మహిమ్ని' (ఛాందోగ్యోపనిషత్ 7.24.1) 'హే భగవన్! ఆ పరమాత్ముడు దేనియందు నిలుపబడియున్నాడు అని నారదుడు అడిగిన ప్రశ్నకు తన మహిమయందే నిలుపబడియున్నాడు అని సనత్కుమారులు చెప్పిరి' అను శ్రుతి వచనము ఇట ప్రమాణము.

यद्येवमयं भगवान् परमात्मासनातनः ।
केन धार्यत इत्याशङ्क्याह द्वैपायनो मुनिः ॥
स्वेनैवात्मना धार्यत इति स्वधृत उच्यते ।
कस्मिन् प्रतिष्ठित इति स्वे महिम्नीति वेदतः ॥

Yadyevamayaṃ bhagavān paramātmāsanātanaḥ,
Kena dhāryata ityāśaṅkyāha dvaipāyano muniḥ.
Svenaivātmanā dhāryata iti svadhr̥ta ucyate,
Kasmin pratiṣṭhita iti sve mahimnīti vedataḥ.

By way of removing the doubt as to by whom then He is supported - it is said: He is supported by His own glory so Svadhr̥taḥ. 'स भगवः कस्मिन् प्रतिष्ठित इति; स्वे महिम्नि / Sa bhagavaḥ kasmin pratiṣṭhita iti; sve mahimni' (छान्दोग्योपनिषत्  / Chāndogyopaniṣat 7.24.1) - In response to the inquiry of Nārada as to where does the Lord abide, Sanatkumāras replied "In His own eminence."'

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

23 ఫిబ్ర, 2015

842. అధృతః, अधृतः, Adhr̥taḥ

ఓం అధృతాయ నమః | ॐ अधृताय नमः | OM Adhr̥tāya namaḥ

పృథ్వాదీనాం ధరాణామపి యో ధారకో హరిః ।
న కేనచిద్ధ్రియత ఇత్యధృతః ప్రోచ్యతే హి సః ॥

ధరించబడువాడు కాడు. ఇతరములను ధరించు పృథివి మొదలగువానిని గూడ ధరించువాడగుటచేతను తానెవ్వరిచేతను ధరించబడడు కావునను 'అధృతః' అనబడును.

पृथ्वादीनां धराणामपि यो धारको हरिः ।
न केनचिद्ध्रियत इत्यधृतः प्रोच्यते हि सः ॥

Pr̥thvādīnāṃ dharāṇāmapi yo dhārako hariḥ,
Na kenaciddhriyata ityadhr̥taḥ procyate hi saḥ.

Being the supporter of all supports like the earth, He is not supported by anything else; hence Adhr̥taḥ.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

22 ఫిబ్ర, 2015

841. మహాన్, महान्, Mahān

ఓం మహతే నమః | ॐ महते नमः | OM Mahate namaḥ

నిరతిశయసూక్ష్మత్వాచ్ఛబ్దాదిగుణహైన్యతః ।
నిత్యశుద్ధసర్వగతత్వాదినా ప్రతిబన్ధకమ్ ॥
ధర్మజాతం తర్కతోఽపి యతో వక్తుం న శక్యతే ।
అతఏవ మహానిత్యోఽచ్యుతస్సఙ్కీర్త్యతే బుధైః ॥
అనఙ్గోఽశబ్దోఽశరీరోఽస్పర్శశ్చేతి మహాన్ శుచిః ।
ఇత్యాపస్తమ్బమునినా భగవత్తత్త్వబోధనాత్ ॥

వృద్ధినందునది. దేనియందును ఇముడనంతగా పెద్దదైనది. శబ్దస్పర్శరూపరసగంధములు అను గుణములు ఏవియు లేనివాడును, నిరతిశయముగ అనగా అంతకంటె చిన్నది లేదు అనదగినంతగా సూక్ష్ముడును, నిత్యశుద్ధుడును, సర్వగతుడును అగుటచే శ్రుతి ప్రమాణము చెప్పలేము సరిగదా యుక్తిచేగూడ చెప్పశక్యము కాదు కావున పరమాత్ముడు 'మహాన్‍' అని చెప్పదగియున్నాడు. ఆపస్తంబ ముని భగవద్ తత్త్వమును (1.22.7) 'ఆత్మ, అవయవములు కాని, శబ్దగుణము కాని, శరీరము కాని లేని వాడును స్పర్శరహితుడును అయియున్నాడు కావుననే మహాన్ శుచిః అని చెప్పదగియున్నాడు' అని బోధించారు.

निरतिशयसूक्ष्मत्वाच्छब्दादिगुणहैन्यतः ।
नित्यशुद्धसर्वगतत्वादिना प्रतिबन्धकम् ॥
धर्मजातं तर्कतोऽपि यतो वक्तुं न शक्यते ।
अतएव महानित्योऽच्युतस्सङ्कीर्त्यते बुधैः ॥
अनङ्गोऽशब्दोऽशरीरोऽस्पर्शश्चेति महान् शुचिः ।
इत्यापस्तम्बमुनिना भगवत्तत्त्वबोधनात् ॥

Niratiśayasūkṣmatvācchabdādiguṇahainyataḥ,
Nityaśuddhasarvagatatvādinā pratibandhakam.
Dharmajātaṃ tarkato’pi yato vaktuṃ na śakyate,
Ataeva mahānityo’cyutassaṅkīrtyate budhaiḥ.
Anaṅgo’śabdo’śarīro’sparśaśceti mahān śuciḥ,
Ityāpastambamuninā bhagavattattvabodhanāt.

It is impossible to speak of Him as possessing any quality even for the sake of argument as He is devoid of the qualities of sound etc., as He is extremely subtle, as He is ever pure and omnipresent etc. Therefore only He is Mahān. Āpastaṃba muni thus says in Dharma Sūtra (1.22.7) 'Partless, bodiless, devoid of touch and mahān and pure.'

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान्
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

21 ఫిబ్ర, 2015

840. నిర్గుణః, निर्गुणः, Nirguṇaḥ

ఓం నిర్గుణాయ నమః | ॐ निर्गुणाय नमः | OM Nirguṇāya namaḥ

స వస్తుతో గుణాభావాత్ నిర్గుణః ప్రోచ్యతే హరిః ।
కేవలో నిర్గుణశ్చేతి శ్రుతివాక్యానుసారతః ॥

వస్తు స్థితిలో మాత్రము తనకు ఏ గుణములును లేవు కావున ఆత్మ 'నిర్గుణః' అనబడును.

:: శ్వేతాశ్వరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::
ఏకో దేవ స్సర్వభూతేషు గూఢ స్సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా ।
కర్మాధ్యక్ష స్సర్వభూతాధివాస స్సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ ॥ 11 ॥

అద్వితీయుడును, ప్రకాశస్వరూపుడునునగు ఆ పరమేశ్వరుడే సకల జీవులయందు అంతరాత్మగా ఉన్నాడు. ఈతడే ఆయా జీవుడు చేయు వివిధ కర్మలకు అధిష్ఠాత. ఈతడే సర్వభూతాధివాసుడును, సర్వసాక్షియును, చైతన్య రూపుడును, నిరుపాధికుడును, నిర్గుణుడును అగుచున్నాడు.

स वस्तुतो गुणाभावात् निर्गुणः प्रोच्यते हरिः ।
केवलो निर्गुणश्चेति श्रुतिवाक्यानुसारतः ॥

Sa vastuto guṇābhāvāt nirguṇaḥ procyate hariḥ,
Kevalo nirguṇaśceti śrutivākyānusārataḥ.

He is without qualities and hence Nirguṇaḥ.

:: श्वेताश्वरोपनिषत् षष्ठोऽध्यायः ::
एको देव स्सर्वभूतेषु गूढ स्सर्वव्यापी सर्वभूतान्तरात्मा ।
कर्माध्यक्ष स्सर्वभूताधिवास स्साक्षी चेता केवलो निर्गुणश्च ॥ ११ ॥

Śvetāśvara Upaniṣat Chapter 6

Eko deva ssarvabhūteṣu gūḍa ssarvavyāpī sarvabhūtāntarātmā,
Karmādhyakṣa ssarvabhūtādhivāsa ssākṣī cetā kevalo nirguṇaśca. 11.

The non-dual and resplendent Lord is hidden in all beings. All-pervading, the inmost Self of all creatures, the impeller to actions, abiding in all things, He is the Witness, the Animator and the Absolute, free from guṇas or qualities.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

20 ఫిబ్ర, 2015

839. గుణభృత్, गुणभृत्, Guṇabhr̥t

ఓం గుణభృతే నమః | ॐ गुणभृते नमः | OM Guṇabhr̥te namaḥ

సత్వరజస్తమసాం యస్యాధిష్ఠాతృత్వమిష్యతే ।
సృష్టి స్థితి లయకర్మా గుణభృద్ధరిరుచ్యతే ॥

సృష్టి స్థితి లయ దశలయందు మాయోపాధి వశమున సత్త్వరజస్తమోగుణములకు అధిష్ఠాతగా అనగా ఆశ్రయముగానుండుటచే 'గుణాన్ భిభర్తి' అనగా 'గుణములను భరించును' అను వ్యుత్పత్తిచే పరమాత్మ 'గుణభృత్‍' అనబడును.

सत्वरजस्तमसां यस्याधिष्ठातृत्वमिष्यते ।
सृष्टि स्थिति लयकर्मा गुणभृद्धरिरुच्यते ॥ 

Satvarajastamasāṃ yasyādhiṣṭhātr̥tvamiṣyate,
Sr̥ṣṭi sthiti layakarmā guṇabhr̥ddharirucyate.

Presiding over śruṣṭi, sthiti and laya i.e., creation, preservation and dissolution by the virtue of of the guṇas or qualities sattva, rajas and tamas, the Lord is Guṇabhr̥t - the bearer of guṇas.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

19 ఫిబ్ర, 2015

838. స్థూలః, स्थूलः, Sthūlaḥ

ఓం స్థూలాయ నమః | ॐ स्थूलाय नमः | OM Sthūlāya namaḥ

సర్వాత్మత్వాద్ విష్ణురేవ స్థూల ఇత్యుపచర్యతే మునుపటి నామమునందు ప్రస్తావించబడిన శ్రుతిచే స్థూలత్వాది ద్రవ్య ధర్మములు ఏవియు ఆత్మకు లేకయున్నను, ఆతడు ప్రపంచరూపమున సర్వాత్ముడు లేదా సర్వ దృశ్యమును తానేయగువాడు కావున ఔపచారికముగా అనగా ఆరోపిత రూపము తెలుపునదిగా 'స్థూలః' అనబడుచున్నాడు.

सर्वात्मत्वाद् विष्णुरेव स्थूल इत्युपचर्यते / Sarvātmatvād viṣṇureva sthūla ityupacaryate As according to the mentions from śruti quoted in previous names, though ātma does not have any attributes of gross world, being omnipresent - figuratively He is considered stout; He being everything and hence Sthūlaḥ.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

18 ఫిబ్ర, 2015

837. కృశః, कृशः, Kr̥śaḥ

ఓం కృశాయ నమః | ॐ कृशाय नमः | OM Kr̥śāya namaḥ

ద్రవ్యత్వప్రతిషేధాదస్థూలమిత్యాదినా కృశః 'అస్తూలమ్‍' (బృహదారణ్యకోపనిషత్ 3.8.8) - 'లావగునదియు కాదు' ఈ మొదలగు శ్రుతి వచనము పరమాత్మ తత్త్వమునకు ద్రవ్యములకుండు ధర్మములు ఏవియు లేవనుచు పరమాత్ముని విషయమున ద్రవ్యత్వమును నిషేధించుచున్నది కావున కృశః.

కృశత్వము అనగా శ్రుతి చెప్పిన అస్థూలత్వము మొదలగు విధములనున్న పరమాత్మ ద్రవ్యలక్షణములు ఏవియు లేనివాడు అని చెప్పబడుచున్నాడు.

द्रव्यत्वप्रतिषेधादस्थूलमित्यादिना कृशः / Dravyatvapratiṣedhādasthūlamityādinā kr̥śaḥ  As per 'अस्तूलम्‌' / 'Astūlamˈ mentioned in śruti like Br̥hadāraṇyakopaniṣat (3.8.8) which means 'not gross', His being material is denied and hence He is Kr̥śaḥ.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

17 ఫిబ్ర, 2015

836. బృహత్, बृहत्, Br̥hat

ఓం బృహతే నమః | ॐ बृहते नमः | OM Br̥hate namaḥ

బృహత్వాత్ బృంహణత్వాచ్చ బహ్మైవ బృహదుచ్యతే ।
మహతో మహీయానితిశ్రుతివాక్యానుసారతః ॥

'బృంహతి', 'బృంహయతి' అను వ్యుత్పత్తులచే ఆత్మ తత్త్వము ప్రపంచరూపమున వృద్ధినందును, ప్రాణులను వృద్ధినందించును కావున బ్రహ్మము బృహత్ అనబడును.

:: కఠోపనిషత్ (ప్రథమాధ్యాయము) 2వ వల్లి ::
అణోరణీయాన్మహతో మహీయానాత్మాఽస్య జన్తోర్నిహతో గుహాయామ్ ।
తమక్రతుః పశ్యతి వీతశోకో ధాతుప్రసాదాన్మహిమానమాత్మనః ॥ 20 ॥ (49)

ఆత్మతత్త్వము అణువుకంటె అణువుగను, మహత్తుకంటె మహత్తుగను ప్రతి జీవి యొక్క హృదయకుహరమునందు నివసించుచున్నది. మనోబుద్ధీంద్రియముల కరుణచే ఎవడు సంకల్ప వికల్పములనుండి విముక్తుడగుచున్నాడో, అట్టివాడు ఆత్మ యొక్క మహామహిమను గుర్తించి సర్వశోకములనుండి రక్షింపబడుచున్నాడు.

बृहत्वात् बृंहणत्वाच्च बह्मैव बृहदुच्यते ।
महतो महीयानितिश्रुतिवाक्यानुसारतः ॥

Br̥hatvāt br̥ṃhaṇatvācca bahmaiva br̥haducyate,
Mahato mahīyānitiśrutivākyānusārataḥ.

From the roots 'Br̥ṃhati' and 'Br̥ṃhayati', it is understood that consciousness grows in the form of world and also causes growth in beings and hence being big and growing to infinitude - Brahman is Br̥hat.

:: कठोपनिषत् (प्रथमाध्यायमु) वल्लि २ ::
अणोरणीयान्महतो महीयानात्माऽस्य जन्तोर्निहतो गुहायाम् ।
तमक्रतुः पश्यति वीतशोको धातुप्रसादान्महिमानमात्मनः ॥ २० ॥ (४९)

Kaṭhopaniṣat Part I, Canto II
Aṇoraṇīyānmahato mahīyānātmā’sya jantornihato guhāyām,
Tamakratuḥ paśyati vītaśoko dhātuprasādānmahimānamātmanaḥ. 20. (49)

The Self that is subtler than the subtle and greater than the great, is lodged in the heart of every creature. A desire less man sees that glory of the Self through serenity of the organs, and thereby he becomes free from sorrow.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

16 ఫిబ్ర, 2015

835. అణుః, अणुः, Aṇuḥ

ఓం అణవే నమః | ॐ अणवे नमः | OM Aṇave namaḥ

సాక్ష్మ్యాతిశయశాలిత్వాదణురిత్యుచ్యతే హరిః ।
ఏషోఽణురాత్మా చేతసా వేదితవ్య ఇతి శ్రుతేః ॥

అధిక సూక్ష్మత్వమునందిన రూపము కలవాడు కనుక అణుః.

:: ముణ్డకోపనిషత్ తృతీయ ముణ్డకే ప్రథమ ఖణ్డః ::
ఏషోఽణురాత్మా చేతసా వేదితవ్యోయస్మిన్ ప్రాణః పఞ్చధా సంవివేశ ।
ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా ॥ 9 ॥

ప్రాణము, ఏ దేహమునందు ఐదు ప్రాణములుగా ప్రవేశించెనో, ఆ శరీరమునందలి హృదయమునందు అతి సూక్ష్మమైన ఈ ఆత్మ చిత్తముచేత తెలిసికొనదగినది. పరిశుద్ధమైన చిత్తమునందు, ఈ ఆత్మ ప్రకటమగును. జీవులయొక్క చిత్తమంతయు, ప్రాణేంద్రియాదులతో ఈ ఆత్మ వ్యాపకముగానున్నది.

साक्ष्म्यातिशयशालित्वादणुरित्युच्यते हरिः ।
एषोऽणुरात्मा चेतसा वेदितव्य इति श्रुतेः ॥

Sākṣmyātiśayaśālitvādaṇurityucyate hariḥ,
Eṣo’ṇurātmā cetasā veditavya iti śruteḥ.

As He is extremely subtle, He is called Aṇuḥ.

:: मुण्डकोपनिषत् तृतीय मुण्डके प्रथम खण्डः ::
एषोऽणुरात्मा चेतसा वेदितव्योयस्मिन् प्राणः पञ्चधा संविवेश ।
प्राणैश्चित्तं सर्वमोतं प्रजानां यस्मिन् विशुद्धे विभवत्येष आत्मा ॥ ९ ॥

Muṇḍakopaniṣat Muṇḍaka 3, Chapter 1
Eṣo’ṇurātmā cetasā veditavyoyasmin prāṇaḥ pañcadhā saṃviveśa,
Prāṇaiścittaṃ sarvamotaṃ prajānāṃ yasmin viśuddhe vibhavatyeṣa ātmā. 9.

Within (the heart in) the body, where the vital force has entered in five forms, is the subtle Self to be realized through that intelligence by which is pervaded the entire mind as well as the motor and sensory organs of all creatures. And It is to be known in the mind, which having become purified, this Self reveals Itself distinctly.

अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr̥hatkr̥śaḥ sthūlo guṇabhr̥nnirguṇo mahān,
Adhr̥taḥ svadhr̥tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

15 ఫిబ్ర, 2015

834. భయనాశనః, भयनाशनः, Bhayanāśanaḥ

ఓం భయనాశనాయ నమః | ॐ भयनाशनाय नमः | OM Bhayanāśanāya namaḥ

వర్ణాశ్రమాచారవతాం భయం నాశయతీతి సః ।
భయనాశన ఇత్యుక్తో విష్ణుర్విద్వద్భిరుత్తమైః ॥

వర్ణములకును, ఆశ్రమములకును విహితములగు ధర్మములను అనుష్ఠించువారల భయమును నశింపజేయును.

:: విష్ణు పురాణే తృతీయాంశే అష్ఠమోఽధ్యాయః ::
వర్ణాశ్రమాచారవతా పురుషేణ పరః పుమాన్ ।
విష్ణు రారాధ్యతే; పన్థా నాఽన్య స్తత్తోషకారకః ॥ 2 ॥

వర్ణాశ్రమాచారములను సరిగా అనుష్ఠించు జీవునిచేత పరమపురుషుడగు విష్ణుడు మెప్పించబడుచున్నాడు. ఆయా వర్ణములకును, ఆశ్రమములకును విహితములగు ధర్మము ఆచరించుటయే భగవత్ప్రీతికరమార్గము. ఆతనికి సంతుష్టి కలిగించు మార్గము మరియొకటి లేదు.

वर्णाश्रमाचारवतां भयं नाशयतीति सः ।
भयनाशन इत्युक्तो विष्णुर्विद्वद्भिरुत्तमैः ॥

Varṇāśramācāravatāṃ bhayaṃ nāśayatīti saḥ,
Bhayanāśana ityukto viṣṇurvidvadbhiruttamaiḥ.

He destroys the fear of those who are steadfast in the duties of their varṇa and āśrama vide the words of Parāśara.

:: विष्णु पुराणे तृतीयांशे अष्ठमोऽध्यायः ::
वर्णाश्रमाचारवता पुरुषेण परः पुमान् ।
विष्णु राराध्यते; पन्था नाऽन्य स्तत्तोषकारकः ॥ २ ॥

Viṣṇu Purāṇa - Part 3, Chapter 8
Varṇāśramācāravatā puruṣeṇa paraḥ pumān,
Viṣṇu rārādhyate; paṃthā nā’nya stattoṣakārakaḥ. 2.

The path of supreme Puruṣa is worshipped by those who practice varṇa and āśrama. There is no other way to please Him.

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

14 ఫిబ్ర, 2015

833. భయకృత్, भयकृत्, Bhayakr̥t

ఓం భయకృతే నమః | ॐ भयकृते नमः | OM Bhayakr̥te namaḥ

భయం కరోతి భగవాన్ సర్వాసన్మార్గవర్తినామ్ ।
భయఙ్కృతన్తి భక్తానాం కృణోతీత్యథవా హరిః ॥
భయకృత్ ప్రోచ్యతే సద్భి ర్వేదవిద్యావిశారదైః ॥

సన్మార్గమున నడువనివారికిని, అసన్మార్గమున నడుచువారికిని భయమును కలిగించును. సన్మార్గవర్తులగు తన భక్తుల భయమును నరకును.

भयं करोति भगवान् सर्वासन्मार्गवर्तिनाम् ।
भयङ्कृतन्ति भक्तानां कृणोतीत्यथवा हरिः ॥
भयकृत् प्रोच्यते सद्भि र्वेदविद्याविशारदैः ॥

Bhayaṃ karoti bhagavān sarvāsanmārgavartinām,
Bhayaṅkr̥tanti bhaktānāṃ kr̥ṇotītyathavā hariḥ.
Bhayakr̥t procyate sadbhi rvedavidyāviśāradaiḥ. 

He causes fear to those who do not pursue the path of righteousness or pursue the path of unrighteousness. Or since He removes the fear of devotees, He is called Bhayakr̥t.

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

13 ఫిబ్ర, 2015

832. అచిన్త్యః, अचिन्त्यः, Acintyaḥ

ఓం అచిన్త్యాయ నమః | ॐ अचिन्त्याय नमः | OM Acintyāya namaḥ

సాక్షిత్వేన ప్రమాత్రాదేః ప్రమాణాగోచరత్వతః ।
అయమీదృశ ఇత్యేవం శక్యశ్చిన్తయితుం న హి ॥
విశ్వవిలక్షణత్వేనాచిన్త్య ఇత్యుచ్యతే హరిః ॥

చింతించుటకు అనగా ప్రమాణములచే లెస్సగా ఎరుగుటకు అతీతుడు. పరమాత్మ 'ప్రమాత, ప్రమాణము, ప్రమేయము' అను త్రిపుటికిని సాక్షి భూతుడు. సర్వ ప్రమాణములకును అగోచరుడు కావున అచింత్యః అనబడును. లేదా పరమాత్ముడు సమస్త ప్రపంచమునందలి ఏ వస్తువు కంటెను విలక్షణుడు. ఆయా వస్తువుల లక్షణముకంటె సర్వథా భిన్నమగు లక్షణము కలవాడు కావున ఈతడు ఇట్టివాడు అని ఎవరి చేతను చింతించబడుటకే సాధ్యుడు కాడు.

साक्षित्वेन प्रमात्रादेः प्रमाणागोचरत्वतः ।
अयमीदृश इत्येवं शक्यश्चिन्तयितुं न हि ॥
विश्वविलक्षणत्वेनाचिन्त्य इत्युच्यते हरिः ॥

Sākṣitvena pramātrādeḥ pramāṇāgocaratvataḥ,
Ayamīdr̥śa ityevaṃ śakyaścintayituṃ na hi.
Viśvavilakṣaṇatvenācintya ityucyate hariḥ.

Being the witness of the knower etc., He cannot be thought of by any canon of knowledge. Or being different from anything in the universe, He cannot be thought of in any form as 'He is like this'; so Acintyaḥ.

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

12 ఫిబ్ర, 2015

831. అనఘః, अनघः, Anaghaḥ

ఓం అనఘాయ నమః | ॐ अनघाय नमः | OM Anaghāya namaḥ

దుఃఖం పాపం చాఘమస్య నాస్తీత్యనఘ ఉచ్యతే అఘము అనగా పాపము, దుఃఖము ఈతనికి లేదు కనుక అనఘః.

146. అనఘః, अनघः, Anaghaḥ

दुःखं पापं चाघमस्य नास्तीत्यनघ उच्यते / Duḥkhaṃ pāpaṃ cāghamasya nāstītyanagha ucyate Agham is sorrow or sin. Being without it, He is called Anaghaḥ.

146. అనఘః, अनघः, Anaghaḥ

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

11 ఫిబ్ర, 2015

830. అమూర్తిః, अमूर्तिः, Amūrtiḥ

ఓం అమూర్తయే నమః | ॐ अमूर्तये नमः | OM Amūrtaye namaḥ

తాభ్యోఽభి తప్తాభ్యో మూర్తిరజాయత ఇతి శ్రుతేః ।
మూర్తిర్ధారణసామర్థ్యం తచ్చరాచర లక్షణమ్ ॥
ఘనరూపమేవ మూర్తిః తద్ధీనోఽమూర్తి రుచ్యతే ।
మూర్ఛితామ్గావయవావాదేహ సంస్థాన లక్షణా ॥
మూర్తిస్తయాఽథ రహిత ఇత్యమూర్తిరితీర్యతే ॥

మూర్తి అనగా పట్టుకొనుటకు అనుకూలించు యోగ్యతకలదియు చరమో అచరమో అగు రూపము కలదియునగు ఘన రూపము. లేదా దేహ సంస్థాన రూపమున దేహపు అమరికగా నున్నదియు రూపముగా ఏర్పడి శరీరావయవములు కలదియునగు అమరికను మూర్తి అందురు. అట్టి మూర్తి ఈతనికి లేదు.

ताभ्योऽभि तप्ताभ्यो मूर्तिरजायत इति श्रुतेः ।
मूर्तिर्धारणसामर्थ्यं तच्चराचर लक्षणम् ॥
घनरूपमेव मूर्तिः तद्धीनोऽमूर्ति रुच्यते ।
मूर्छिताम्गावयवावादेह संस्थान लक्षणा ॥
मूर्तिस्तयाऽथ रहित इत्यमूर्तिरितीर्यते ॥

Tābhyo’bhi taptābhyo mūrtirajāyata iti śruteḥ,
Mūrtirdhāraṇasāmarthyaṃ taccarācara lakṣaṇam.
Ghanarūpameva mūrtiḥ taddhīno’mūrti rucyate,
Mūrchitāmgāvayavāvādeha saṃsthāna lakṣaṇā.
Mūrtistayā’tha rahita ityamūrtiritīryate.

Mūrti or figure is what is weighty and which can support, of the nature of the moveable and immovable. He who is devoid of it is Amūrtiḥ. Or Mūrti means what is compacted of the body and limbs capable of perception and feelings. As He is without these, He is Amūrtiḥ.

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

10 ఫిబ్ర, 2015

829. సప్తవాహనః, सप्तवाहनः, Saptavāhanaḥ

ఓం సప్తవాహనాయ నమః | ॐ सप्तवाहनाय नमः | OM Saptavāhanāya namaḥ

సప్తైవ వాహనాన్యస్య సవిష్ణుస్సప్తవాహనః ।
వాసప్తనామాశ్వ ఏకో హరేర్వాహనమిత్యుత ॥
ఏకాశ్వో వహతి సప్తనామేతి శ్రుతి వాక్యతః ॥

సూర్య రూపుడగు ఈ పరమాత్మునకు ఏడు అశ్వములు వాహనములుగానున్నవి. లేదా ఏడు నామములు కల ఒకే అశ్వము ఈతని వాహనము. 'ఏకో అశ్వో వహతి సప్తనామా' (తైత్తిరీయ ఆరణ్యకము 3.11) - 'సప్తనామములు కల ఒకే అశ్వము ఈతని రథమును మోయుచు కొనిపోవుచున్నది' అను శ్రుతి వచనము ఇందు ప్రమాణము.

सप्तैव वाहनान्यस्य सविष्णुस्सप्तवाहनः ।
वासप्तनामाश्व एको हरेर्वाहनमित्युत ॥
एकाश्वो वहति सप्तनामेति श्रुति वाक्यतः ॥

Saptaiva vāhanānyasya saviṣṇussaptavāhanaḥ,
Vāsaptanāmāśva eko harervāhanamityuta.
Ekāśvo vahati saptanāmeti śruti vākyataḥ.

In the form of Sun, which is an effulgence of paramātma, He has seven horses as His vehicle. Or one horse with seven names is carrying Him vide the śruti 'एको अश्वो वहति सप्तनामा' / 'Eko aśvo vahati saptanāmā' (Taittirīya āraṇyaka 3.11).

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

9 ఫిబ్ర, 2015

828. సప్తైధాః, सप्तैधाः, Saptaidhāḥ

ఓం సప్తైధసే నమః | ॐ सप्तैधसे नमः | OM Saptaidhase namaḥ

సప్తైధాంసి మహావిష్ణుఓర్దీప్తయోఽస్యేతి కేశవః ।
సప్తైధా ఇతి విద్యద్భిరుచ్యతే బ్రహ్మనిష్ఠితైః ।
సప్త తే అగ్నే సమిధః సప్తజిహ్వా ఇతి శుతేః ॥

ఈతనికి ఏడు ఏధస్సులు అనగా ప్రకాశములు కలవు కనుక సప్తైధాః. అగ్నిరూపుడగు పరమాత్ముడు అట్టివాడు. 'సప్త తే అగ్నే । సమిధః సప్త జిహ్వాః' (తైత్తిరీయ సంహిత 1.5.2) - 'అగ్నీ! నీకు ఏడు ప్రకాశములును, ఏడు జిహ్వలును కలవు' అను శ్రుతి మంత్రము ఇందు ప్రమాణము.

सप्तैधांसि महाविष्णुओर्दीप्तयोऽस्येति केशवः ।
सप्तैधा इति विद्यद्भिरुच्यते ब्रह्मनिष्ठितैः ।
सप्त ते अग्ने समिधः सप्तजिह्वा इति शुतेः ॥

Saptaidhāṃsi mahāviṣṇuordīptayo’syeti keśavaḥ,
Saptaidhā iti vidyadbhirucyate brahmaniṣṭhitaiḥ,
Sapta te agne samidhaḥ saptajihvā iti śuteḥ.

He has seven flames and hence He is called Saptaidhāḥ vide Taittirīya Saṃhita (1.5.2) 'सप्त ते अग्ने । समिधः सप्त जिह्वाः' / 'Sapta te agne, samidhaḥ sapta jihvāḥ' - 'O Agni! thou hast seven flames, seven tongues.'

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

8 ఫిబ్ర, 2015

827. సప్తజిహ్వః, सप्तजिह्वः, Saptajihvaḥ

ఓం సప్తజిహ్వాయ నమః | ॐ सप्तजिह्वाय नमः | OM Saptajihvāya namaḥ

కాలీ కరాలీ చ మనోజవా చ సులోహితాయా చ సుధూమ్రవర్ణా ।
స్ఫలిఙ్గినీ విశ్వరుచీ చ దేవీ లేలాయమానా ఇతి సప్తజిహ్వః ॥
ఇతి శ్రుతే స్సప్త్జిహ్వా హ్యగ్ని రూపస్య చక్రిణః ।
యస్య సన్తి స గోవిన్దః సప్తజిహ్వ ఇతీర్యతే ॥

అగ్ని రూపుడగు ఈ పరమాత్మకు ఏడు జిహ్వలు అనగా నాలుకలు కలవు.

:: ముణ్డకోపనిషత్ ప్రథమ ముణ్డకే ద్వితీయ ఖణ్డః ::
కాలీ కరాలీ చ మనోజవా చ
    సులోహితా యా చ సుధూమ్రవర్ణా ।
స్ఫులిఙ్గినీ విశ్వరుచీ చ దేవీ
    లేలాయమానా ఇతి సప్తజిహ్వాః ॥ 4 ॥

ధగధగలాడుచు వెలుగుచుండు అగ్నిజ్వాలలు - కాలీ, కరాలీ, మనోజవా, సులోహితా, సుధూమ్రవర్ణా, స్ఫులింగినీ, విశ్వరుచీ అనునవి ఏడు జిహ్వలు.

काली कराली च मनोजवा च सुलोहिताया च सुधूम्रवर्णा ।
स्फलिङ्गिनी विश्वरुची च देवी लेलायमाना इति सप्तजिह्वः ॥
इति श्रुते स्सप्त्जिह्वा ह्यग्नि रूपस्य चक्रिणः ।
यस्य सन्ति स गोविन्दः सप्तजिह्व इतीर्यते ॥

Kālī karālī ca manojavā ca sulohitāyā ca sudhūmravarṇā,
Sphaliṅginī viśvarucī ca devī lelāyamānā iti saptajihvaḥ.
Iti śrute ssaptjihvā hyagni rūpasya cakriṇaḥ,
Yasya santi sa govindaḥ saptajihva itīryate.

(As fire is also His effulgence) He is with seven tongues.

:: मुण्डकोपनिषत् प्रथम मुण्डके द्वितीय खण्डः ::
काली कराली च मनोजवा च
     सुलोहिता या च सुधूम्रवर्णा ।
स्फुलिङ्गिनी विश्वरुची च देवी
     लेलायमाना इति सप्तजिह्वाः ॥ ४ ॥

Muṇḍakopaniṣat - Muṇḍaka 1, Chapter 2
Kālī karālī ca manojavā ca
    Sulohitā yā ca sudhūmravarṇā,
Sphuliṅginī viśvarucī ca devī
    Lelāyamānā iti saptajihvāḥ. 4.

Kālī, Karālī, Manojavā and Sulohitā and that which is Sudhūmravarṇa, as also Sphuliṅginī, and the shining Viśvarucī - these are the even flaming tongues.

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

7 ఫిబ్ర, 2015

826. సహస్రార్చిః, सहस्रार्चिः, Sahasrārciḥ

ఓం సహస్రార్చిషే నమః | ॐ सहस्रार्चिषे नमः | OM Sahasrārciṣe namaḥ

అనన్తాని సహస్రాణి యస్యార్చింషి గదాభృతః ।
స సహస్రార్చిరిత్యుక్తః విద్యద్భిర్విష్ణురుత్తమైః ॥

వేలకొలది అనగా అనంతములగు జ్వాలలు ఎవ్వనివియో...

:: శ్రీమద్భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ::
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా ।
యది భాస్సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః ॥ 12 ॥

ఆకశమునందు వేలకొలది సూర్యులయొక్క కాంతి ఒక్కసారి బయలుదేరినచో ఎంత కాంతియుండునో అది ఆ మహాత్మునియొక్క కాంతికి బోలియున్నది.

अनन्तानि सहस्राणि यस्यार्चिंषि गदाभृतः ।
स सहस्रार्चिरित्युक्तः विद्यद्भिर्विष्णुरुत्तमैः ॥

Anantāni sahasrāṇi yasyārciṃṣi gadābhr̥taḥ,
Sa sahasrārcirityuktaḥ vidyadbhirviṣṇuruttamaiḥ.

He who has thousands i.e., endless rays is Sahasrārciḥ.

:: श्रीमद्भगवद्गीत विश्वरूप सन्दर्शन योगमु ::
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भास्सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥ १२ ॥

Śrīmad Bhagavad Gīta Chapter 11
Divi sūryasahasrasya bhavedyugapadutthitā,
Yadi bhāssadr̥śī sā syādbhāsastasya mahātmanaḥ. 12.

Should the effulgence of a thousand suns blaze forth simultaneously in the sky, that might be similar to the radiance of that exalted one.

सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥

సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥

Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr̥dbhayanāśanaḥ ॥ 89 ॥

6 ఫిబ్ర, 2015

825. చాణూరాన్ధ్రనిషూదనః, चाणूरान्ध्रनिषूदनः, Cāṇūrāndhraniṣūdanaḥ

ఓం చాణూరాన్ధ్రనిషూదనాయ నమః | ॐ चाणूरान्ध्रनिषूदनाय नमः | OM Cāṇūrāndhraniṣūdanāya namaḥ

చాణూర నామాన మన్ధ్రం యోనిషూదితవాన్ హరిః ।
ససద్భిరుచ్యతే ఇతి చాణూరాన్ధ్ర నిషూదనః ॥

చాణూరుడు అను నామము కల అంధ్ర జాతీయుని చంపినందున హరి చాణూరాన్ధ్రనిషూదనః.

:: పోతన భాగవతము దశమ స్కంధ పూర్వ భాగము ::
క. హరికిని లోఁబడి బెగడక, హరియురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్‍

హరి కుసుమమాలికాహత, కరిభంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై. (1360)
క. శౌరి నెఱిఁజొచ్చి కరములు, క్రూరగతిన్ బట్టి త్రిప్పి కుంభిని వైచెన్‍

శూరుం గలహ గభీరున, వీరుం జాణూరు ఘోరు వితతాకారున్‍. (1361)
క. శోణితము నోర నొకఁగ, జాణూరుం డట్లు కృష్ణసంభ్రామణ సం

క్షీణుండై క్షోణిం బడి, ప్రాణంబులు విడిచెఁ గంసుప్రాణము గలఁగన్‍. (1362)

విరోధి అయిన చాణూరుడు కృష్ణునకు లోబడినప్పటికిని, భయపడక మహాభయంకరమైన పిడికిలితో వెన్నుని రొమ్మును పొడిచినాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగు చందముగా ఆ పోటును లెక్క చేయక శ్రీహరి యుద్ధమందు విజృంభించి పరాక్రమము చూపినాడు. పరాక్రమవంతుడును, యుద్ధమందు గంభీరుడును, భీతిగొలిపెడి వాడును, దొడ్డదేహము కలవాడును, వీరుడునుయగు చాణూరుడిని కృష్ణుడు చొచ్చుకొనిపోయి కర్కశముగా వాని చేతులు పట్టుకొని గిరగిర త్రిప్పి నేలపై కొట్టినాడు. ఆ విధముగా అచ్యుతునిచేత గిర గిర త్రిప్పబడిన చాణూరుడు మిక్కిలిగ నలిగినవాడై నోటినుంచి నెత్తురు కారగా పుడమిమీదబడి ప్రాణములు విడిచినాడు. అతని ప్రాణములు వీడినవెంటనె కంసుని ప్రాణము కలబారినది. 

चाणूर नामान मन्ध्रं योनिषूदितवान् हरिः ।
ससद्भिरुच्यते इति चाणूरान्ध्र निषूदनः ॥

Cāṇūra nāmāna mandhraṃ yoniṣūditavān hariḥ,
Sasadbhirucyate iti cāṇūrāndhra niṣūdanaḥ.

Since He is the killer of the wrestler from andhra deśa of the name Cāṇūra, He is called Cāṇūrāndhraniṣūdanaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे चतुश्चत्वारिंशोऽध्यायः ::
नचलत्तत्प्रहारेण मालाहत इव द्विपः ।
बाह्वोर्निगृह्य चाणूरं बहुशो भ्रामयन्हरिः ॥ २२ ॥
भूपृष्ठे पोथयामास तरसा क्षीण जीवितम् ।
विस्रस्ताकल्पकेशस्रगिन्द्रध्वज इवापतत् ॥ २३ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 44
Nacalattatprahāreṇa mālāhata iva dvipaḥ,
Bāhvornigr̥hya cāṇūraṃ bahuśo bhrāmayanhariḥ. 22.
Bhūpr̥ṣṭhe pothayāmāsa tarasā kṣīṇa jīvitam,
Visrastākalpakeśasragindradhvaja ivāpatat. 23.

No more shaken by the demon's mighty blows than an elephant struck with a flower garland, Lord Kr̥ṣṇa grabbed Cāṇūra by his arms, swung him around several times and hurled him onto the ground with great force. His clothes, hair and garland scattering, the wrestler fell down dead, like a huge festival column collapsing.

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaścāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

5 ఫిబ్ర, 2015

824. అశ్వత్థః, अश्वत्थः, Aśvatthaḥ

2ఓం అశ్వత్థాయ నమః | ॐ अश्वत्थाय नमः | OM Aśvatthāya namaḥ

అశ్వత్థః శ్వోఽపిన స్థాతేత్యచ్యుతః ప్రోచ్యతే బుధైః ।
సకారస్యతకారః పృషోదరాదితయేష్యతే ॥
ఊర్ధ్వమూలోవాక్శాఖ ఏషోశ్వత్థ స్సనాతనః ।
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థః ప్రాహుర్వ్యయం ॥
ఇతి శ్రుతిస్మృతి బలాదశ్వత్థైతికథ్యతే ॥

ప్రపంచము ఇచ్చట 'అశ్వత్థ' వృక్షముగా చెప్పబడినది. శ్వస్థః అనగా రేపటివరకు నిలిచియుండునది. అశ్వస్థః అనగా రేపటికి నిలిచియుండునది కానిది. అనగా నిన్న, నేడు, రేపు అను కాల పరిమితులకు అతీతముగా నిలిచియుండునది అశ్వత్థః. వృషోదరాది గణమునందలి శబ్దమగుట చేత 'అశ్వస్థః' - 'అశ్వత్థః' అగును. 'ఊర్ధ్వమూలోఽవాక్శాఖ ఏషోఽశ్వత్థః సనాతనః' (కఠోపనిషత్ 2.3.1) - 'సంసార రూపమగు ఈ అశ్వత్థవృక్షము పై వైపునకు మూలమును, క్రింది వైపునకు కొమ్మలును కలదియు అనాది సిద్ధమును' అను శ్రుతియు, 'ఊర్ధ్వమూల మావాక్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయమ్‍' (శ్రీమదభగవద్గీత 15.1) - 'పై వైపునకు మొదలును, క్రింది వైపునకు శాఖలును కల అవినాశియగు అశ్వత్థ వృక్షమునుగా ఈ సంసారమును తత్త్వవేత్తలు చెప్పుచున్నారు' అను స్మృతియు ఇచ్చట ప్రమాణములు.

अश्वत्थः श्वोऽपिन स्थातेत्यच्युतः प्रोच्यते बुधैः ।
सकारस्यतकारः पृषोदरादितयेष्यते ॥
ऊर्ध्वमूलोवाक्शाख एषोश्वत्थ स्सनातनः ।
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थः प्राहुर्व्ययं ॥
इति श्रुतिस्मृति बलादश्वत्थैतिकथ्यते ॥

Aśvatthaḥ śvo’pina sthātetyacyutaḥ procyate budhaiḥ,
Sakārasyatakāraḥ pr̥ṣodarāditayeṣyate.
Ūrdhvamūlovākśākha eṣośvattha ssanātanaḥ,
Ūrdhvamūlamadhaḥśākhamaśvatthaḥ prāhurvyayaṃ.
Iti śrutismr̥ti balādaśvatthaitikathyate.

What stands tomorrow is Śvasthaḥ. What is not Śvasthaḥ i.e., that of which it cannot be said as 'staying tomorrow' is Aśvasthaḥ. That is, that whose existence is not determined by time as today, tomorrow being ever present without demarcation of time is aśvasthaḥ. By special rule, aśvasthaḥ becomes aśvatthaḥ vide śruti 'ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः' / 'Ūrdhvamūlo’vākśākha eṣo’śvatthaḥ sanātanaḥ' (कठोपनिषत् २.३.१ / Kaṭhopaniṣat 2.3.1) - 'the eternal tree with roots above and branches below' and the smr̥ti 'ऊर्ध्वमूल मावाक्शाख मश्वत्थं प्राहु रव्ययम्' / 'Ūrdhvamūla māvākśākha maśvatthaṃ prāhu ravyayamˈ (श्रीमदभगवद्गीत १५.१ / Śrīmadabhagavadgīta 15.1) - 'the philosophers speak of a deathless tree with roots above and branches below.'

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

4 ఫిబ్ర, 2015

823. ఉదుమ్బరః, उदुम्बरः, Udumbaraḥ

ఓం ఉదుమ్బరాయ నమః | ॐ उदुम्बराय नमः | OM Udumbarāya namaḥ

అమ్బరాదుద్గతో విష్ణురుదుమ్బర ఇతీర్యతే ।
అత్ర పృషోదరాదిత్వాదుకారాదేశ ఇష్యతే ॥
యద్వోదుమ్బరమన్నాద్యమ్ తేన విశ్వం తదాత్మనా ।
పోషయన్నుదుమ్బర ఇత్యుచ్యుతః కీర్త్యతే బుధైః ॥

ఉద్ + అంబర = ఉద్ + ఉంబర = ఉదుంబర. ఇచ్చట 'అంబర' లోని 'అ' స్థానమున 'ఉ' వచ్చుట ఈ 'ఉదుంబర' శబ్దము వృషోదరాదిగణమునందలిదగుటచేతనే.

పరమాత్ముడు తాను జగత్కారణుడు కావున పంచ భూతములలోనే మొదటిదగు ఆకాశముకంటె పై స్థితి పొందియున్నాడు కావున ఉదుంబరః.

లేదా అన్నము మొదలగు దానిని 'ఉదుంబరమ్‍' అందురు. అట్టి ఉదుంబర రూపమున తానుండి - విశ్వమును పోషించుచుండును. 'ఊర్గ్వా అన్నాద్య ముదుంబరమ్‍' - 'ఉదుంబరం అని వ్యవహరింపబడు అన్నాదికము బలకరము' అను శ్రుతి ఇందు ప్రమాణము.

अम्बरादुद्गतो विष्णुरुदुम्बर इतीर्यते ।
अत्र पृषोदरादित्वादुकारादेश इष्यते ॥
यद्वोदुम्बरमन्नाद्यम् तेन विश्वं तदात्मना ।
पोषयन्नुदुम्बर इत्युच्युतः कीर्त्यते बुधैः ॥

Ambarādudgato viṣṇurudumbara itīryate,
Atra pr̥ṣodarāditvādukārādeśa iṣyate.
Yadvodumbaramannādyam tena viśvaṃ tadātmanā,
Poṣayannudumbara ityucyutaḥ kīrtyate budhaiḥ.

By a special rule 'a' becomes 'u' leading to Ud + ambara = Ud + umbara = Udumbara. Ambara is sky.

Since He is the creator of the universe that is made up of five elements, first of which is ether or sky, He is beyond the same i.e., ambara; hence He is Udumbaraḥ.

Or Udumbara means food etc. As He nourishes the universe with it, He is Udumbaraḥ. 'ऊर्ग्वा अन्नाद्य मुदुम्बरम्' / 'Ūrgvā annādya mudumbaram' - 'Udumbara means food etc.' from śruti is reference.

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

3 ఫిబ్ర, 2015

822. న్యగ్రోధః, न्यग्रोधः, Nyagrodhaḥ

ఓం న్యగ్రోధాయ నమః | ॐ न्यग्रोधाय नमः | OM Nyagrodhāya namaḥ

యోన్య గర్వాగూర్థ్వ రోహ సర్వేషాం వర్తతే హరిః ।
న్యక్కృత్య సర్వభూతాని నిజమాయాం వృణోతి యః ।
నిరుణద్ధీతి వా విష్ణుః స న్యగ్రోధ ఇతీర్యతే ॥

న్యగ్రోధము అనగా మర్రిచెట్టు. తాను పైన ఉండి సర్వ భూతములను క్రిందుపరచి విష్ణువు తన మాయను వారిపై కప్పుచున్నందున న్యగ్రోధః అని చెప్పబడుచున్నారు. తన మాయతో గప్పి, పాపుల ఉత్తమగతి నిరోధించువాడు.

योन्य गर्वागूर्थ्व रोह सर्वेषां वर्तते हरिः ।
न्यक्कृत्य सर्वभूतानि निजमायां वृणोति यः ।
निरुणद्धीति वा विष्णुः स न्यग्रोध इतीर्यते ॥

Yonya garvāgūrthva roha sarveṣāṃ vartate hariḥ,
Nyakkr̥tya sarvabhūtāni nijamāyāṃ vr̥ṇoti yaḥ,
Niruṇaddhīti vā viṣṇuḥ sa nyagrodha itīryate.

Nyagrodha is banyan tree. That which remains above all and grows downwards. He is standing above all beings who are below. Since He conceals His māya or controls them by it, He is Nyagrodhaḥ.

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

2 ఫిబ్ర, 2015

821. శత్రుతాపనః, शत्रुतापनः, Śatrutāpanaḥ

ఓం శత్రుతాపనాయ నమః | ॐ शत्रुतापनाय नमः | OM Śatrutāpanāya namaḥ

తాపనః సురశత్రూణాం శత్రుతాపన ఉచ్యతే దేవతల శత్రువులను తపింపజేయును కనుక శత్రుతాపనః.

तापनः सुरशत्रूणां शत्रुतापन उच्यते / Tāpanaḥ suraśatrūṇāṃ śatrutāpana ucyate Since He is the source of affliction to enemies of devas, He is called Śatrutāpanaḥ.

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

1 ఫిబ్ర, 2015

820. శత్రుజిత్, शत्रुजित्, Śatrujit

ఓం శత్రుజితే నమః | ॐ शत्रुजिते नमः | OM Śatrujite namaḥ

సురశత్రవ ఏవాస్య శత్రవస్తాన్ జయత్యజః ।
ఇతి శత్రుజిదిత్యేవం కీర్త్యతే విబుధోత్తమైః ॥

విష్ణునకు స్వతః ఎవరును శత్రువులు కాకపోయినప్పటికీ, సురల శత్రువులే ఈతనికి శత్రువులు. అట్టి శత్రువులను జయించువాడు.

सुरशत्रव एवास्य शत्रवस्तान् जयत्यजः ।
इति शत्रुजिदित्येवं कीर्त्यते विबुधोत्तमैः ॥

Suraśatrava evāsya śatravastān jayatyajaḥ,
Iti śatrujidityevaṃ kīrtyate vibudhottamaiḥ.

Though Lord Viṣṇu has no enemies, the foes of the devas alone are His enemies. He vanquishes them so Śatrujit.