30 సెప్టెం, 2014

696. వసుః, वसुः, Vasuḥ

ఓం వసవే నమః | ॐ वसवे नमः | OM Vasave namaḥ


వసన్తి తత్ర భూతాని త్వేషయం వసతీత్యపి ।
వసురిత్యుచ్యతే విష్ణుర్వైదికైర్విబుధోత్తమైః ॥

అతనియందు సకల భూతములును వసించును. ఈతడు సకల భూతములయందు వసించును.



वसन्ति तत्र भूतानि त्वेषयं वसतीत्यपि ।
वसुरित्युच्यते विष्णुर्वैदिकैर्विबुधोत्तमैः ॥

Vasanti tatra bhūtāni tveṣayaṃ vasatītyapi,
Vasurityucyate viṣṇurvaidikairvibudhottamaiḥ.

All beings reside in Him and He resides in all the beings and hence He is Vasuḥ.

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

29 సెప్టెం, 2014

695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ


వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

వసుదేవస్య తనయో వాసుదేవ ఇతీర్యతే వసుదేవుని పురుష సంతానము అనగా తనయుడు కనుక వాసుదేవః.

:: పోతన భాగవతము - దశమ స్కంధము ::
మఱియుం గృష్ణు నుద్దేశించి తొల్లి యీ శిశువు ధవళారుణ పీతవర్ణుండై యిప్పుడు నల్లనైన కతంబునఁ గృష్ణుం డయ్యె, వసుదేవునకు నొక్కెడ జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యె, నీ పాపనికి గుణరూపకర్మంబు అనేకంబులు గలుగుటంజేసి నామంబు లనేకంబులు గలవు. ఈ శాబకుని వలన మీరు దుఃఖంబులఁ దరియింతు, రీ యర్భకునిచేత దుర్జనశిక్షణంబును సజ్జనరక్షణంబును నగు, నీ కుమారుండు నారాయణ సమానుండని చెప్పి తన గృహమ్మున క మ్మునీశ్వరుండు సనియె. నందుండును బరమానందంబున నుండె నంత. (288)

తరువాత గర్గ మహర్షి యశోదా కుమారుని ఉద్దేశించి ఇల అన్నాడు - "ఈ శిశువు పూర్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లనైనాడు కనుక 'కృష్ణు'డని పిలవండి. ఇతడు వసుదేవునకు జన్మించినవాడుగనుక 'వాసుదేవుడు' అని పేరుగూడ చెల్లుతుంది. ఈ బిడ్డడికి గుణములు, రూపములు, కర్మములు ఎన్నో ఉండడంవల్ల ఇంకా ఎన్నో పేర్లు వహిస్తాడు. ఈ బాలునివలన మీరు అన్ని దుఃఖములను అతిక్రమించుతారు. వీని చేత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణా జరుగుతాయి. నాయనా! నీ కుమారుడు నారాయణునితో సమానుడు సుమా! అని చెప్పి గర్గ మహాముని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మహానుభావుడైన ఋషీంద్రుడు తన కుమారుని గురించి మంచిమాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు.

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ



वसुदेवस्य तनयो वासुदेव इतीर्यते / Vasudevasya tanayo vāsudeva itīryate Since He is Vasudeva's son, He is called Vāsudevaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे अष्टमोऽध्यायः ::
प्रागयं वसुदेवस्य क्वचिज्जातस्त्वात्मजः ।
वासुदेव इति श्रीमानभिज्ञाः सम्प्रचक्षते ॥ १४ ॥


Śrīmad Bhāgavata -  Canto 10, Chapter 8
Prāgayaṃ vasudevasya kvacijjātastvātmajaḥ,
Vāsudeva iti śrīmānabhijñāḥ saṃpracakṣate.
14.

Garga Muni indirectly disclosed, “This child was originally born as the son of Vasudeva, although He is acting as your child. Generally He is your child, but sometimes He is the son of Vasudeva.”

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

28 సెప్టెం, 2014

694. వసుప్రదః, वसुप्रदः, Vasupradaḥ

ఓం వసుప్రదాయ నమః | ॐ वसुप्रदाय नमः | OM Vasupradāya namaḥ


వసు ప్రకృష్టం మోక్షాఖ్యం భక్తేభ్యః ప్రదదాతి యః ।
పురుషార్థం ఫలం విష్ణుః స ద్వితీయో వసుప్రదః ॥
విజ్ఞానమానన్దం బ్రహ్మరాతిర్దాతుః పరాయణమ్ ।
తిష్ఠమానస్య తద్విద ఇత్యుపనిషదుక్తితః ॥
సురారీణాం వా వసూని ప్రకర్షేణ హి ఖణ్డయన్ ।
విష్ణుర్వసుప్రద ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

ఈ రెండవ వసుప్రదః అను నామమునకు అర్థముగా 'వసువు' అను పదమునకు మోక్షము అను అర్థమును చూపి - మోక్షమనే ఫలమును మిక్కిలిగా ఇచ్చువాడు అని అర్థము చెప్పవచ్చును. బృహదారణ్యకోపనిషత్ (5.9.28) లోని 'బ్రహ్మము విజ్ఞాన రూపమును, ఆనంద స్వరూపముగా ఎరుంగవలయును. అది దక్షిణాదాత యగుచు యజ్ఞమాచరించు యజమానునకును, బ్రహ్మతత్త్వమునందే నిలిచియుండు బ్రహ్మతత్త్వవేత్తకును పరగమ్యము' అను శ్రుతి ఇచట ప్రమాణము.

లేదా దేవ శత్రువుల ధనములను మిక్కిలిగా ఖండిచును కనుక వసుప్రదః అని కూడా చెప్పవచ్చును.

693. వసుప్రదః, वसुप्रदः, Vasupradaḥ



वसु प्रकृष्टं मोक्षाख्यं भक्तेभ्यः प्रददाति यः ।
पुरुषार्थं फलं विष्णुः स द्वितीयो वसुप्रदः ॥
विज्ञानमानन्दं ब्रह्मरातिर्दातुः परायणम् ।
तिष्ठमानस्य तद्विद इत्युपनिषदुक्तितः ॥
सुरारीणां वा वसूनि प्रकर्षेण हि खण्डयन् ।
विष्णुर्वसुप्रद इति प्रोच्यते विबुधोत्तमैः ॥

Vasu prakr̥ṣṭaṃ mokṣākhyaṃ bhaktebhyaḥ pradadāti yaḥ,
Puruṣārthaṃ phalaṃ viṣṇuḥ sa dvitīyo vasupradaḥ.
Vijñānamānandaṃ brahmarātirdātuḥ parāyaṇam,
Tiṣṭhamānasya tadvida ityupaniṣaduktitaḥ.
Surārīṇāṃ vā vasūni prakarṣeṇa hi khaṇḍayan,
Viṣṇurvasuprada iti procyate vibudhottamaiḥ.

Vasu means the fruit of Mókṣa or salvation. Since He gives it to His devotees, He is called Vasupradaḥ vide the śruti Br̥hadāraṇyakopaniṣat (5.9.28) 'Brahman is wisdom and bliss. He is the highest wealth of one who seeks Him.'

Or He deprives the asuras absolutely of their wealth and hence is Vasupradaḥ.

693. వసుప్రదః, वसुप्रदः, Vasupradaḥ

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

27 సెప్టెం, 2014

693. వసుప్రదః, वसुप्रदः, Vasupradaḥ

ఓం వసుప్రదాయ నమః | ॐ वसुप्रदाय नमः | OM Vasupradāya namaḥ


వసుం ధనం ప్రకర్షేణ దదాతీతి వసుప్రదః ।
సాక్షాద్ ధనాధ్యక్ష ఏష తత్ప్రసాదాత్ తథేతరః ॥
ధనాధ్యక్ష ఇతి వసుప్రద ఇత్యుచ్యతే హరిః ॥

వసువు అనగా ధనమును మిక్కిలిగా ఇచ్చువాడు గనుక వసుప్రదః. కుబేరుడు ఆ పరమాత్ముని అనుగ్రహమున ధనాధ్యక్షుడు అనిపించుకొనువాడయ్యెను. పరమాత్ముడు సాక్షాత్తుగా ధనాధ్యక్షుడు.



वसुं धनं प्रकर्षेण ददातीति वसुप्रदः ।
साक्षाद् धनाध्यक्ष एष तत्प्रसादात् तथेतरः ॥
धनाध्यक्ष इति वसुप्रद इत्युच्यते हरिः ॥

Vasuṃ dhanaṃ prakarṣeṇa dadātīti vasupradaḥ,
Sākṣād dhanādhyakṣa eṣa tatprasādāt tathetaraḥ.
Dhanādhyakṣa iti vasuprada ityucyate hariḥ.

Vasu is dhanam or wealth. Since He bestows it abundantly, He is called Vasupradaḥ. He is the lord of wealth in His own right. The other (Kubera) is lord of wealth only by His grace.

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

26 సెప్టెం, 2014

692. వసురేతాః, वसुरेताः, Vasuretāḥ

ఓం వసురేతసే నమః | ॐ वसुरेतसे नमः | OM Vasuretase namaḥ


సువర్ణం వసు రేతోఽస్యేత్యచ్యుతః పరమేశ్వరః ।
వసురేతా ఇతి ప్రోక్తో వేద విద్యా విశారదైః ॥

వసువు అనగా సువర్ణము. సువర్ణము రేతస్సుగా (వీర్యము లేదా సృష్టిబీజము) గలవాడు వసురేతా.

దేవః పూర్వ మపః సృష్ట్వా తాసు వీర్య మవాసృజత్ ।
త దణ్డ మభవద్ధైమం బ్రహ్మణః కారణం పరమ్ ॥

భగవానుడు మొదట జలములను సృజించి వానియందు వీర్యమును వ్యాప్తమొనర్చెను. అది చతుర్ముఖ బ్రహ్మ ఉత్పత్తినందుటకు హేతువును, ఉత్కృష్టమును అగు హిరణ్మయమగు అండముగానయ్యెను.



सुवर्णं वसु रेतोऽस्येत्यच्युतः परमेश्वरः ।
वसुरेता इति प्रोक्तो वेद विद्या विशारदैः ॥

Suvarṇaṃ vasu reto’syetyacyutaḥ parameśvaraḥ,
Vasuretā iti prokto veda vidyā viśāradaiḥ.

The One whose retas or vital substance is gold is Vasuretāḥ.

देवः पूर्व मपः सृष्ट्वा तासु वीर्य मवासृजत् ।
त दण्ड मभवद्धैमं ब्रह्मणः कारणं परम् ॥

Devaḥ pūrva mapaḥ sr̥ṣṭvā tāsu vīrya mavāsr̥jat,
Ta daṇḍa mabhavaddhaimaṃ brahmaṇaḥ kāraṇaṃ param.

The Lord first created the waters and then deposited vital essence in them. That became the golden egg and was the supreme source of Brahma.

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

25 సెప్టెం, 2014

691. తీర్థకరః, तीर्थकरः, Tīrthakaraḥ

ఓం తీర్థకరాయ నమః | ॐ तीर्थकराय नमः | OM Tīrthakarāya namaḥ


తీర్థకరః, तीर्थकरः, Tīrthakaraḥ

చతుర్దశానాం విద్యానాం బాహ్యానాం చ శ్రుతేరపి ।
సమయానాం చ ప్రణేతా ప్రవక్తా చేతి కేశవః ॥
తీర్థకరః ఇతి బుధైః ప్రోచ్యతే తత్త్వవేదిభిః ।
స హయగ్రీవరూపేణ హత్వా తౌ మధ్కైటభౌ ॥
సర్గస్యాఽదౌ విరిఞ్చాయ శ్రుతీస్సర్వాస్తథేతరాః ।
విద్యా ఉప్దదిశన్ వేదబాహ్యాశ్చ సురవైరిణామ్ ।
వఞ్చనా యోపదిదేశేత్యాహుః పౌరాణికాబుధాః ॥

తీర్థములు అనగా విద్యలు. తీర్థములను అనగా విద్యలను సృష్టించువాడు, బోధించువాడు తీర్థకరః అని చెప్పబడును. నాలుగు వేదములు, ఆరు వేదాంగములు, మీమాంశ, న్యాయ శాస్త్రము, పురాణములు, ధర్మ శాస్త్రము అను పదునాలుగు వైదిక విద్యలను, వేదబాహ్య అనగా వైదికేతర విద్యలను రచించి, వానిని ప్రవచించినవాడు.

శ్రీహరి హయగ్రీవ రూపమున మధు కైటభులను సంహరించి, బ్రహ్మకు సృష్ట్యాది యందు సర్వ వేదములను, ఇతరములగు వైదిక విద్యలను ఉపదేశించుచునే, సురవైరులను వంచించుటకై వేదబాహ్య విద్యలను ఉపదేశించెను అని పురాణజ్ఞులు చెప్పుచుందురు.



चतुर्दशानां विद्यानां बाह्यानां च श्रुतेरपि ।
समयानां च प्रणेता प्रवक्ता चेति केशवः ॥
तीर्थकरः इति बुधैः प्रोच्यते तत्त्ववेदिभिः ।
स हयग्रीवरूपेण हत्वा तौ मध्कैटभौ ॥
सर्गस्याऽदौ विरिञ्चाय श्रुतीस्सर्वास्तथेतराः ।
विद्या उप्ददिशन् वेदबाह्याश्च सुरवैरिणाम् ।
वञ्चना योपदिदेशेत्याहुः पौराणिकाबुधाः ॥

Caturdaśānāṃ vidyānāṃ bāhyānāṃ ca śruterapi,
Samayānāṃ ca praṇetā pravaktā ceti keśavaḥ.
Tīrthakaraḥ iti budhaiḥ procyate tattvavedibhiḥ,
Sa hayagrīvarūpeṇa hatvā tau madhkaiṭabhau.
Sargasyā’dau viriñcāya śrutīssarvāstathetarāḥ,
Vidyā updadiśan vedabāhyāśca suravairiṇām,
Vañcanā yopadideśetyāhuḥ paurāṇikābudhāḥ.

He is the author and also the preceptor of the fourteen vidyās and the auxiliary lores. The fourteen vidyās are - four vedās, the six vedāṅgas, mīmāṃśa, nyāya śāstra, purāṇas and dharma śāstra. So He is Tīrthakaraḥ - a sacred preceptor. Those who expound the purāṇas say that taking the form of Hayagrīva- after killing the demons Madhu and Kaitabha at the beginning of creation, He taught Brahma the Vedas and other vidyās. He also taught the asurās, the non-vedic sciences for deceiving them.

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

24 సెప్టెం, 2014

690. మనోజవః, मनोजवः, Manojavaḥ

ఓం మనోజవాయ నమః | ॐ मनोजवाय नमः | OM Manojavāya namaḥ


యన్మనసో జవో వేగ ఇవ వేగోఽస్య చక్రిణః ।
సర్వగతస్యేతి మనోజవ ఇత్యుచ్యతే హరిః ॥

సర్వగతుడు కావున విష్ణువు మనోవేగ సమాన వేగముగలవాడు. ఇందుచేత ఆ చక్రికి మనోజవః అను నామము కలదు.



यन्मनसो जवो वेग इव वेगोऽस्य चक्रिणः ।
सर्वगतस्येति मनोजव इत्युच्यते हरिः ॥

Yanmanaso javo vega iva vego’sya cakriṇaḥ,
Sarvagatasyeti manojava ityucyate hariḥ.

Since is all pervading, He is as swift as as the mind is and hence He is called Manojavaḥ.

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

23 సెప్టెం, 2014

689. అనామయః, अनामयः, Anāmayaḥ

ఓం అనామయాయ నమః | ॐ अनामयाय नमः | OM Anāmayāya namaḥ


కర్మజైర్వ్యాధిభిర్ బాహ్యైరాన్తర్నైవపీడ్యతే ।
ఇతి విద్వద్భిరీశానః సోనామయ ఇతీర్యతే ॥

ఏ వ్యాధులును లేనివాడు అనామయుడు. కోరికల వలన కలుగు ఆంతరములు కాని, బాహ్యములు కాని అగు ఏ వ్యాధుల చేతను పీడింపబడనివాడు కాదు కనుక శ్రీ విష్ణు దేవుడు అనామయః.



कर्मजैर्व्याधिभिर् बाह्यैरान्तर्नैवपीड्यते ।
इति विद्वद्भिरीशानः सोनामय इतीर्यते ॥ 

Karmajairvyādhibhir bāhyairāntarnaivapīḍyate,
Iti vidvadbhirīśānaḥ sonāmaya itīryate.

Āmaya means disease of the body or mind. Anāmaya means the One without any disease. Since Lord Viṣṇu is with no affliction of mind caused by desires or that of body, He is called Anāmayaḥ

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

22 సెప్టెం, 2014

688. పుణ్యకీర్తిః, पुण्यकीर्तिः, Puṇyakīrtiḥ

ఓం పుణ్యకీర్తయే నమః | ॐ पुण्यकीर्तये नमः | OM Puṇyakīrtaye namaḥ


కర్మజైర్వ్యాధిభిర్‍బాహ్యైరాన్తరైర్నైవపీడ్యతే ।
ఇతి విద్వద్భిరీశానః సోఽనామయ ఇతీర్యతే ॥

ఈతని కీర్తిని, యశమును, మహిమను కీర్తించుట వలన జీవులకు పుణ్యము సంప్రాప్తించును. ఈతనిది పుణ్యకరమగు కీర్తి కనుక ఆ విష్ణుదేవుడు పుణ్యకీర్తి అనబడును.



कर्मजैर्व्याधिभिर्‍बाह्यैरान्तरैर्नैवपीड्यते ।
इति विद्वद्भिरीशानः सोऽनामय इतीर्यते ॥

Karmajairvyādhibhirˈbāhyairāntarairnaivapīḍyate,
Iti vidvadbhirīśānaḥ so’nāmaya itīryate.

Of holy fame for praising of fame brings auspiciousness to the men who sing it. Since His' is holy fame, He is called Puṇyakīrtiḥ.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

21 సెప్టెం, 2014

687. పుణ్యః, पुण्यः, Puṇyaḥ

ఓం పుణ్యాయ నమః | ॐ पुण्याय नमः | OM Puṇyāya namaḥ


పుణ్యః, पुण्यः, Puṇyaḥ

స్మృతి మాత్రేణ సర్వేషాం కల్మషాణి మహాన్యపి ।
మహావిష్ణుః క్షపయతీత్యచ్యుతః పుణ్య ఉచ్యతే ॥

స్మరణ మాత్రముననే స్మరించిన వారి కల్మషములను నశింపజేసి వారిని పవిత్రులనుగా చేయువాడుగనుక ఆ మహా విష్ణువునకు పుణ్యః అను నామము కలదు.

:: పోతన భాగవతము ప్రథమ స్కంధము ::
...పుణ్యశ్రవణకీర్తనుండైన కృష్ణుండు దన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబు లాచరించు; నశుభంబులు పరిహరించు; నశుభంబులు నష్టంబు లయిన, భాగవతశాస్త్రసేవావిశేషంబున నిశ్చల భక్తి యుదయించు... ( 58)

పుణ్య శ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగములలో నివసించి వారికి సర్వశుభములూ సమకూర్చి అశుభములను పోకార్చుతాడు. అశుభ పరిహారము వలన భాగవత సేవ లభిస్తుంది. భాగవత సేవ వలన అచంచల భక్తి ప్రాప్తిస్తుంది.



स्मृति मात्रेण सर्वेषां कल्मषाणि महान्यपि ।
महाविष्णुः क्षपयतीत्यच्युतः पुण्य उच्यते ॥

Smr̥ti mātreṇa sarveṣāṃ kalmaṣāṇi mahānyapi,
Mahāviṣṇuḥ kṣapayatītyacyutaḥ puṇya ucyate.

Merely a thought of Him cleanses the impurities and sanctifies those who dwell upon Him and hence He is called Puṇyaḥ.

:: श्रीमद्भागवते प्रथम स्कन्धे द्वितीयोऽध्यायः ::
सृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवनकिर्तनः ।
हृद्यन्तः स्थो ह्यभद्रणि विधुनोति सुहृत्सताम् ॥ 17 ॥

Śrīmad Bhāgavata - Canto 1, Chapter 2
Sr̥ṇvatāṃ svakathāḥ kr̥ṣṇaḥ puṇyaśravanakirtanaḥ,
Hr̥dyantaḥ stho hyabhadraṇi vidhunoti suhr̥tsatām. 17.

The Paramatma in everyone's heart and the benefactor of the truthful devotee, cleanses desire for material enjoyment from the heart of the devotee who has developed the urge to hear His messages, which are in themselves virtuous when properly heard and chanted.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

20 సెప్టెం, 2014

686. పూరయితా, पूरयिता, Pūrayitā

ఓం పూరయిత్రే నమః | ॐ पूरयित्रे नमः | OM Pūrayitre namaḥ


న కేవలం పూర్ణ ఏవ సర్వేషామపి సమ్పదా ।
పూరయితాఽపి స హరిః పరమాత్మా జనార్దనః ॥

తాను కామిత ఫల పూర్ణుడగుట మాత్రమే కాదు; వారిని సంపదలతో పూరించువాడుగనుక ఆ పరమాత్మ అయిన జనార్దనుడు పూరయితా అని చెప్పబడుతాడు.



न केवलं पूर्ण एव सर्वेषामपि सम्पदा ।
पूरयिताऽपि स हरिः परमात्मा जनार्दनः ॥

Na kevalaṃ pūrṇa eva sarveṣāmapi sampadā,
Pūrayitā’pi sa hariḥ paramātmā janārdanaḥ.

He not merely Pūrṇah but also He fills all with riches. Hence for this reason, Lord Janārdana is called Pūrayitā.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

19 సెప్టెం, 2014

685. పూర్ణః, पूर्णः, Pūrṇaḥ

ఓం పూర్ణాయ నమః | ॐ पूर्णाय नमः | OM Pūrṇāya namaḥ


సకలాభిశ్శక్తిభిశ్చ కామైశ్చ సకలైరపి ।
సమ్పూర్ణ ఇతి విష్ణుస్స పూర్ణ ఇత్యభిధీయతే ॥

కామిత ఫలములన్నియు తీరినవాడు. తాను పొందవలసిన కామిత ఫలములు ఏమియు లేనివాడు. సకల కామములతోను, కళలతోను పూర్ణుడు కావున పూర్ణః.



सकलाभिश्शक्तिभिश्च कामैश्च सकलैरपि ।
सम्पूर्ण इति विष्णुस्स पूर्ण इत्यभिधीयते ॥

Sakalābhiśśaktibhiśca kāmaiśca sakalairapi,
Sampūrṇa iti viṣṇussa pūrṇa ityabhidhīyate.

The One whose all desires are fulfilled. Has no desires left to be fulfilled. Since He is fully possessed of all objects of desire and also all the powers, He is called Pūrṇaḥ.

:: श्रीमद्भागवते पञ्चमस्कन्धे एकोनविंशोऽध्यायः ::
यैः श्रद्धया बर्हिषि भागशो हविर्निरुप्तमिष्टं विधिमन्त्रवस्तुतः ।
एकः पृथङ्नामभिराहुतो मुदा गृह्णाति पूर्णः स्वयमाशिषां प्रभुः ॥ 26 ॥

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 19
Yaiḥ śraddhayā barhiṣi bhāgaśo havirniruptamiṣṭaṃ vidhimantravastutaḥ,
Ekaḥ pr̥thaṅnāmabhirāhuto mudā gr̥hṇāti pūrṇaḥ svayamāśiṣāṃ prabhuḥ. 26.

There are many worshipers of the different gods, the various deities appointed by the Lord, such as Indra, Candra and Sūrya - all of whom are worshiped differently. The worshipers offer these gods their oblations, considering the gods part and parcel of the whole, the Supreme Lord. Therefore the Supreme Lord accepts these offerings and gradually raises the worshipers to the real standard of devotional service by fulfilling their desires and aspirations. Because the Lord is complete, He offers the worshipers the benedictions they desire even if they worship only part of His transcendental body.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

18 సెప్టెం, 2014

684. రణప్రియః, रणप्रियः, Raṇapriyaḥ

ఓం రణప్రియాయ నమః | ॐ रणप्रियाय नमः | OM Raṇapriyāya namaḥ


రణప్రియః, रणप्रियः, Raṇapriyaḥ

ప్రియో రణో యస్య యతో ధత్తే పఞ్చమహాయుధమ్ ।
సతతం లోకరక్షార్థమతో వాఽయం రణప్రియః ॥

లోక రక్షార్థమై సతతము శంఖ, చక్ర, గదా, ధనుస్సు, కడ్గములను మహా ఆయుధములను ధరించుచుండువాడు. కావున ఆతడు రణ ప్రియుడు. ఎవనికి రణము ప్రియమో అట్టివాడు రణప్రియః.



प्रियो रणो यस्य यतो धत्ते पञ्चमहायुधम् ।
सततं लोकरक्षार्थमतो वाऽयं रणप्रियः ॥

Priyo raṇo yasya yato dhatte pañcamahāyudham,
Satataṃ lokarakṣārthamato vā’yaṃ raṇapriyaḥ.

He always carries the five great warfare paraphernalia viz., the conch shell, discus, mace, bow and sword; ever ready to engage in war to protect the worlds.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

17 సెప్టెం, 2014

683. స్తోతా, स्तोता, Stotā

ఓం స్తోత్రే నమః | ॐ स्तोत्रे नमः | OM Stotre namaḥ


స్తోతేత్యపి స ఏవోక్తః కేశవో బుధసత్తమైః స్తుతి చేయువాడును కేశవుడే గనుక స్తోతా అను నామము.

స్తుతించబడువాడు, స్తుతి చేత ప్రసన్నుడగువాడు, స్తోత్ర స్వరూపుడు, స్తుతిచేయుట అను క్రియయు, స్తుతి చేయువాడు సర్వమూ విష్ణు దేవుడే.



स्तोतेत्यपि स एवोक्तः केशवो बुधसत्तमैः / Stotetyapi sa evoktaḥ keśavo budhasattamaiḥ He who praises is Lord Keśava Himself.

He is the only One who is to be praised; He gets pleased by the encomium; He is the praise Himself; He is the act of praising and also the one who praises. Every aspect of worship is Lord Viṣṇu Himself.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

16 సెప్టెం, 2014

682. స్తుతిః, स्तुतिः, Stutiḥ

ఓం స్తుతయే నమః | ॐ स्तुतये नमः | OM Stutaye namaḥ


దేవతా విష్ణునామ్నీ సాస్తుతిశ్చస్తవనక్రియా స్తుతి చేయుట అను క్రియయు విష్ణుదేవుడే!



देवता विष्णुनाम्नी सास्तुतिश्चस्तवनक्रिया / Devatā viṣṇunāmnī sāstutiścastavanakriyā Encomium in the praise of Lord is also a form of Lord Viṣṇu.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

15 సెప్టెం, 2014

681. స్తోత్రమ్, स्तोत्रम्, Stotram

ఓం స్తోత్రాయ నమః | ॐ स्तोत्राय नमः | OM Stotrāya namaḥ


తత్ స్తోత్రం స్తూయతే యేన గుణ సఙ్కీర్తనాత్మకమ్ ।
తత్ స్తోత్రం హరిరేవేతి బ్రహ్మస్తోత్ర మితీర్యతే ॥

ఏ వాఙ్మయముచే భగవానుడు స్తుతించబడునో అట్టి భగవద్గుణ సంకీర్తనాత్మకమగు స్తోత్రము కూడ హరియే.

:: శ్రీమద్భాగవతే తృతీయ స్కన్ధే నవమోఽధ్యాయః ::
యచ్చకర్థాఙ్గ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాఙ్కితమ్ ।
యద్వా తపసి తే నిష్ఠా స ఏశ మదనుగ్రహః ॥

నా గుణగణాలను నుతించుచు నీవు చేసిన స్తోత్రము, తపము, నాయందలి నీకు గల అచంచలమైన విశ్వాసములు అన్నియు నా అపార కరుణా ప్రభావములేయని నెరుంగుము.



तत् स्तोत्रं स्तूयते येन गुण सङ्कीर्तनात्मकम् ।
तत् स्तोत्रं हरिरेवेति ब्रह्मस्तोत्र मितीर्यते ॥

Tat stotraṃ stūyate yena guṇa saṅkīrtanātmakam,
Tat stotraṃ harireveti brahmastotra mitīryate.

That by which He is praised. Praise is uttering His divine qualities. That is Hari Himself.

:: श्रीमद्भागवते तृतीय स्कन्धे नवमोऽध्यायः ::
यच्चकर्थाङ्ग मत्स्तोत्रं मत्कथाभ्युदयाङ्कितम् ।
यद्वा तपसि ते निष्ठा स एश मदनुग्रहः ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 9
Yaccakarthāṅga matstotraṃ matkathābhyudayāṅkitam,
Yadvā tapasi te niṣṭhā sa eśa madanugrahaḥ.

The prayers that you have chanted praising the glories of My transcendental activities, the penances you have undertaken to understand Me, and your firm faith in Me - all these are to be considered My causeless mercy.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

14 సెప్టెం, 2014

680. స్తవప్రియః, स्तवप्रियः, Stavapriyaḥ

ఓం స్తవప్రియాయ నమః | ॐ स्तवप्रियाय नमः | OM Stavapriyāya namaḥ


స్తవ్యఏవ యతో విష్ణురత ఏవ స్తవప్రియః స్తవ్యః అను నామమునందు వివరించినట్టి హేతువుచేతనే స్తవములయందు ప్రీతి కలవాడును, తన స్తవము చేసిన వారిని అనుగ్రహించువాడునుగనుక విష్ణువు స్తవప్రియః.



स्तव्यएव यतो विष्णुरत एव स्तवप्रियः / Stavyaeva yato viṣṇurata eva stavapriyaḥ As explained in the previous divine name Stavyaḥ, He delights in the Stavas or eulogies and being pleased by such, His devotees get bestowed by His grace and hence He is Stavapriyaḥ.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

13 సెప్టెం, 2014

679. స్తవ్యః, स्तव्यः, Stavyaḥ

ఓం స్తవ్యాయ నమః | ॐ स्तव्याय नमः | OM Stavyāya namaḥ


కేశవః స్తూయతే సర్వైర్నస్తోతా కస్యవాఽపి సః ।
ఇతి స్తవ్య ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥

కేశవుడు ఎల్లరిచే స్తుతించబడునుగానీ తాను ఎవ్వరిని స్తుతించువాడు కాదు కనుక వేదవిద్యా విశారదులు ఈతనిని స్తవ్యః అని కీర్తింతురు.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
సీ. వరుస విగ్రహ పారవశ్యంబునను జేసి రఘురామ కృష్ణ వరాహ నార
సింహాది మూర్తు లంచితలీల ధరియించి దుష్టనిగ్రహమును శిష్టపాల
నమును గావించుచు నయమున సద్దర్మ నిరత చిత్తులకు వర్ణింపఁ దగిన
చతురాత్మతత్త్వ విజ్ఞాన ప్రదుండవై వర్తింతు వనఘ! భవన్మహత్త్వ
తే. మజున కయినను వాక్రువ్వ నలది గాదు, నిగమ జాతంబు లయిన వర్ణింపలేవ
యెఱిఁగి సంస్తుతి సేయ నే నెంత దాన?, వినుత గుణశీల మాటలు వేయు నేల? (1033)

పరమాత్మ స్వరూపుడవైన నీవు అవతారముల మీద ముచ్చటపడి రఘురామచంద్రుడిగా, శ్రీ కృష్ణ ప్రభువుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారములు ధరియించి దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మమునందు ప్రవృత్తమైన చిత్తము గల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించుటకొరకై వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు. అనంత కల్యాణ గుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వమును అభివర్ణించడము చతుర్ముఖునకు, చతుర్వేదులకు కూడ సాధ్యము కాదు; ఇకె నేనెంత? వెయ్యి మాటలు ఏల? నిన్ను తెలుసుకొని సన్నుతించడము నాకు శక్యము కాని పని. 



केशवः स्तूयते सर्वैर्नस्तोता कस्यवाऽपि सः ।
इति स्तव्य इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥

Keśavaḥ stūyate sarvairnastotā kasyavā’pi saḥ,
Iti stavya iti prokto vedavidyāviśāradaiḥ.

He is praised by all; but no one is praised by Him.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

12 సెప్టెం, 2014

678. మహాహవిః, महाहविः, Mahāhaviḥ

ఓం మహాహవిషే నమః | ॐ महाहविषे नमः | OM Mahāhaviṣe namaḥ


మహచ్చ తద్ధవిశ్చేతి బ్రహ్మాత్మన్యఖిలం జగత్ ।
తదాత్మతయా హూయత ఇతి విష్ణుర్మహాహవిః ॥

మహత్ అనగా పరమాత్ముని ఉద్దేశించి వేల్చబడునదియగునట్టి పవిత్ర హవిస్సు; అది కూడ విష్ణుని విభూతియే. జగత్తు సైతము వాస్తవమున తదాత్మకము, బ్రహ్మరూపము కావున అది బ్రహ్మతత్త్వమేయగు ప్రత్యగాత్మ తత్త్వమున వేల్చబడును. కావున అట్టి మహా పరిమాణముగల హవిస్సు మహా హవిస్సే కదా! బహువ్రీహి సమాసముగానైతె గొప్పదియగు జగద్రూప హవిస్సు ఎవని విషయమున ఎవనియందు వేల్చబడునో ఆతండు మహాహవిః.



महच्च तद्धविश्चेति ब्रह्मात्मन्यखिलं जगत् ।
तदात्मतया हूयत इति विष्णुर्महाहविः ॥

Mahacca taddhaviśceti brahmātmanyakhilaṃ jagat,
Tadātmatayā hūyata iti viṣṇurmahāhaviḥ.

Mahat meaning the sacred oblation that is offered as an oblation to the great Lord. Such an oblation is also a form of Lord Viṣṇu Himself. Since the entire world is itself a manifestation of the Supreme Soul, during annihilation phase, such an oblation of great value and magnitude gets offered onto that very all devouring Supreme Entity. Hence the world itself is the great oblation offered to the Lord.

In another form of interpretation, He in whose regard great oblations are offered - is Mahāhaviḥ.

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,
Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

11 సెప్టెం, 2014

677. మహాయజ్ఞః, महायज्ञः, Mahāyajñaḥ

ఓం మహాయజ్ఞాయ నమః | ॐ महायज्ञाय नमः | OM Mahāyajñāya namaḥ


మహాయజ్ఞో మహాంశ్చాసౌ యజ్ఞశ్చేత్యుచ్యతే హరిః ।
యజ్ఞానాం జపయజ్ఞోస్మిత్యుక్తేర్గీతాసు శౌరిణా ॥

ఈతడే యాజ్ఞములలోకెల్ల గొప్పదియగు యజ్ఞము. లేదా బహువ్రీహి సమాసముగనైతె గొప్పదియగు యజ్ఞము ఎవని విషయమున ఆచరించబడుచున్నదో అట్టివాడు మహాయజ్ఞః.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ ।
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ॥ 25 ॥

నేను మహర్షులలో భృగుమహర్షిని, వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థిర పదార్థములలో హిమాలయ పర్వతమును అయియున్నాను.



महायज्ञो महांश्चासौ यज्ञश्चेत्युच्यते हरिः ।
यज्ञानां जपयज्ञोस्मित्युक्तेर्गीतासु शौरिणा ॥

Mahāyajño mahāṃścāsau yajñaścetyucyate hariḥ,
Yajñānāṃ japayajñosmityuktergītāsu śauriṇā.

He is the greatest of the Yajñas. Or the divine name can also be interpreted as the One in whose honor greatest of Yajñas is performed.

:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥ 25 ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Maharṣīṇāṃ bhr̥gurahaṃ girāmasmyekamakṣaram,
Yajñānāṃ japayajño’smi sthāvarāṇāṃ himālayaḥ. 25.

Among the great sages I am Bhr̥gu; of words I am the single syllable (ॐ / Oṃ). Among rituals I am the ritual of Japa; of the immovables, the Himālaya.

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,
Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

10 సెప్టెం, 2014

676. మహాయజ్వా, महायज्वा, Mahāyajvā

ఓం మహాయజ్వనే నమః | ॐ महायज्वने नमः | OM Mahāyajvane namaḥ


మహంశ్చాసౌ హరిర్యజ్వా యజ్ఞాన్ నిర్వర్తయన్ ప్రభుః ।
లోకస్య సఙ్గ్రహార్థం స మహాయజ్వేతి కీర్త్యతే ॥

ఈతడు గొప్ప యజ్వ అనగా యజ్ఞ నిర్వర్తకుడు లేదా యజమానుడు కావున మహాయజ్వా.

లోకమందలి జనము ఒకానొక ఉత్తమవ్యక్తి ఆచరించు ఆచరణమునందలి ఉచితత్వమును గ్రహించి అట్లే తామును ఆచరీంచదగిన దానినిగా ఆ ఆచరణమును స్వీకరించుటను 'లోక సంగ్రహము' అందురు. లోక సంగ్రహార్థము యజ్ఞములను నిర్వర్తించుచుండు శ్రీ రామ, కృష్ణ అవతార రూపుడగు విష్ణువు మహాయజ్వా.

బహువ్రీహి సమాస రూపముగ చూచిన - ఎవనిని ఉద్దేశించి యజ్ఞములను ఆచరించు గొప్ప యజమానులుగలరో అట్టివాడు మహాయజ్వా అని కూడా చెప్పదగును.



महंश्चासौ हरिर्यज्वा यज्ञान् निर्वर्तयन् प्रभुः ।
लोकस्य सङ्ग्रहार्थं स महायज्वेति कीर्त्यते ॥

Mahaṃścāsau hariryajvā yajñān nirvartayan prabhuḥ,
Lokasya saṅgrahārthaṃ sa mahāyajveti kīrtyate.

Since He is a great yajvā i.e., the One who performs sacrifices in accordance to vedic rules, Lord Viṣṇu is called Mahāyajvā.

When a great person performs a good deed, the world follows in his foot steps and this is called loka saṅgraha. To achieve loka saṅgraha i.e., to set a righteous path for the world to follow, Lord Viṣṇu in His incarnations like Śrī Rāma and Kr̥ṣṇa performed great Yajñas setting an example and hence He is Mahāyajvā.

The name Mahāyajvā can also be interpreted as the One in whose honor great yajamānas perform vedic sacrifices.

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,
Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

9 సెప్టెం, 2014

675. మహాక్రతుః, महाक्रतुः, Mahākratuḥ

ఓం మహాక్రత్వే నమః | ॐ महाक्रत्वे नमः | OM Mahākratve namaḥ


మహాంశ్చాసౌ క్రతుశ్చేతి మహాక్రతురితీర్యతే ।
యథాఽశ్వమేధః క్రతురాద్దితి వైవస్వతోక్తితః ॥
స్తుతిః సాపి స ఏవేతి కృతాభగవతో హరేః ॥

మను స్మృతియందు పేర్కొనబడిన 'యథాశ్వమేధః క్రతురాట్‍' (11.2.60) - 'అశ్వమేధము ఎట్లు క్రతురాజమో' ప్రమాణమును బట్టి అశ్వమేధము క్రతువులలోకెల్ల ఉత్తమమైనది.

ఆ అశ్వమేధము అతడే లేదా అతని విభూతియేగనుక విష్ణువు మహాక్రతుః. అశ్వమేధ యజ్ఞమును, అశ్వమేధరూపునిగా విష్ణుని ఈ నామముచేత స్తుతించుటయు జరుగుచున్నది.

బహువ్రీహి సమాసముగ చూచినచో 'గొప్పదియగు అశ్వమేధ నామక యజ్ఞము ఎవనిదియో' అనగా 'ఎవని విషయమున జరుపబడుచుండునో' అను అర్థము వచ్చును.



महांश्चासौ क्रतुश्चेति महाक्रतुरितीर्यते ।
यथाऽश्वमेधः क्रतुराद्दिति वैवस्वतोक्तितः ॥
स्तुतिः सापि स एवेति कृताभगवतो हरेः ॥

Mahāṃścāsau kratuśceti mahākraturitīryate,
Yathā’śvamedhaḥ kraturādditi vaivasvatoktitaḥ.
Stutiḥ sāpi sa eveti kr̥tābhagavato hareḥ.

Based on the reference from Manu smr̥ti 'यथाश्वमेधः क्रतुराट्‍' / 'Yathāśvamedhaḥ kraturāṭˈ (11.2.60) - 'As like the Aśvamedha sacrifice which is greatest of all', the Aśvamedha is considered to be the greatest of kratus or sacrifices.

Since Aśvamedha yajña is He Himself or can be considered to be one of His opulences, Lord Hari is Mahākratuḥ.

In another possible interpretation, Mahākratuḥ can also mean 'He in whose honor the Aśvamedha yajña is performed.'

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,
Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

8 సెప్టెం, 2014

674. మహోరగః, महोरगः, Mahoragaḥ

ఓం మహోరగాయ నమః | ॐ महोरगाय नमः | OM Mahoragāya namaḥ


మహాంశ్చాసావురగశ్చ విష్ణురుక్తో మహోరగః ।
సర్పాణామస్మి వాసుకిరితి గీతా సమీరణాత్ ॥

ఈతడు గొప్పదియగు ఉరగము అనగా సర్పము గనుక మహోరగః. వాసుకి అను సర్పముగూడ ఆ విష్ణుదేవుని విభూతియే.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28 ॥

నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడియావులలో కామధేనువును, ధర్మబద్ధమైన ప్రజోత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను, సర్పములలో వాసుకియు అయియున్నాను.



महांश्चासावुरगश्च विष्णुरुक्तो महोरगः ।
सर्पाणामस्मि वासुकिरिति गीता समीरणात् ॥

Mahāṃścāsāvuragaśca viṣṇurukto mahoragaḥ,
Sarpāṇāmasmi vāsukiriti gītā samīraṇāt.

Since He is the great Uraga i.e., serpent, Lord Viṣṇu is known is Mahoragaḥ. The great serpent Vāsuki, that adorns the neck of Lord Śiva, is verily His effulgence only.

:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 12
Āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmadhuk,
Prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ. 28.

Among weapons I am the thunderbolt; among cows I am Kāmadhenu. I am Kandarpa - the progenitor and among serpents I am Vāsuki.

महाक्रमो महाकर्मा महातेजा महोरगः
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,
Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

7 సెప్టెం, 2014

673. మహాతేజః, महातेजः, Mahātejaḥ

ఓం మహాతేజసే నమః | ॐ महातेजसे नमः | OM Mahātejase namaḥ


తేజస్వినో యస్యయేన తేజసా భాస్కరాదయః ।
తత్తేజో మహదస్యేతి మహాతేజాస్సకేశవః ॥
సయేన సూర్య తేజసేద్ధ ఇతి శ్రుతేః ।
యదాదిత్యగతం తేజో జ్గద్భాసయతేఽఖిలమ్ ॥
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం ।
ఇతి గీతాసు హరిణా స్వయమేవ సమీరణాత్ ॥
క్రౌర్య శౌర్యాదిభిర్ధర్మైః మహద్భిస్సమలఙ్కృతః ।
ఇతి వాఽయం మహాతేజా ఇతి సఙ్కీర్త్యతే హరిః ॥

ఎవనికి సంబంధించిన తేజస్సు చేత సూర్యుడు మొదలగువారు తేజోవంతులు అగుచున్నారో ఆతండు మహాతేజః. లేదా క్రౌర్య, శౌర్యాది ధర్మరూపమగు మహాతేజము ఎవనికి గలదో అట్టివాడు; ఈ ధర్మములచే సమలంకరింపబడినవాడు మహాతేజః.

'యేన సూర్య స్తపతి తేజసేద్ధః' (తైత్తిరీయ బ్రాహ్మణము 3.12.9.7) - 'ఏ తేజముచే ప్రకాశించజేయబడిన వాడగుచు సూర్యుడును తపించుచున్నాడో' అను శ్రుతి వచనము దీనిని సమర్థించుచున్నది.

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥ 12 ॥

సూర్యునియందు ఏ తేజస్సు ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో - అది అంతయు నాదిగా నెరుంగుము.

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే శతతమః సర్గః ::
అథ మన్త్రాన్ అభిజపన్ రౌద్రమస్త్రమ్ ఉదీరయన్ ।
శరాన్ భూయః సమాదాయ రామః క్రోధసమన్వితః ।
ముమోచ చ మహాతేజాః చాప మాయమ్య వీర్యవాన్ ॥ 36 ॥

మహాతేజస్వియు, గొప్ప పరాక్రమశాలియు ఐన శ్రీరాముడూ మిక్కిలి క్రుద్ధుడై, మంత్రములను జపించి, రౌద్రాస్త్రమును తదితర శస్త్రములను రావణునిపై ప్రయోగించెను.



तेजस्विनो यस्ययेन तेजसा भास्करादयः ।
तत्तेजो महदस्येति महातेजास्सकेशवः ॥
सयेन सूर्य तेजसेद्ध इति श्रुतेः ।
यदादित्यगतं तेजो ज्गद्भासयतेऽखिलम् ॥
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धिमामकं ।
इति गीतासु हरिणा स्वयमेव समीरणात् ॥
क्रौर्य शौर्यादिभिर्धर्मैः महद्भिस्समलङ्कृतः ।
इति वाऽयं महातेजा इति सङ्कीर्त्यते हरिः ॥

Tejasvino yasyayena tejasā bhāskarādayaḥ,
Tattejo mahadasyeti mahātejāssakeśavaḥ.
Sayena sūrya tejaseddha iti śruteḥ,
Yadādityagataṃ tejo jgadbhāsayate’khilam.
Yaccandramasi yaccāgnau tattejo viddhimāmakaṃ,
Iti gītāsu hariṇā svayameva samīraṇāt.
Kraurya śauryādibhirdharmaiḥ mahadbhissamalaṅkr̥taḥ,
Iti vā’yaṃ mahātejā iti saṅkīrtyate hariḥ.

He by whose brilliance the sun etc., are brilliant, that great brilliance is His. Or since He is endowed with the great qualities of fierceness and valor, He is Mahātejaḥ.

'येन सूर्य स्तपति तेजसेद्धः' (तैत्तिरीय ब्राह्मण ३.१२.९.७) / 'Yena sūrya stapati tejaseddhaḥ' (Taittirīya brāhmaṇa 3.12.9.7) - 'Illumined by which brilliance the sun shines'.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥

Śrīmad Bhagavad Gīta -Chapter 15
Yadādityagataṃ tejo jagadbhāsayate’khilam,
Yaccandramasi yaccāgnau tattejo viddhi māmakam. 12.

That light in the sun which illumines the whole world, that which is in the moon and that which is in fire - know that light to be mine.

:: श्रीमद्रामायणे युद्धकाण्डे शततमः सर्गः ::
अथ मन्त्रान् अभिजपन् रौद्रमस्त्रम् उदीरयन् ।
शरान् भूयः समादाय रामः क्रोधसमन्वितः ।
मुमोच च महातेजाः चाप मायम्य वीर्यवान् ॥ ३६ ॥

Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 100
Atha mantrān abhijapan raudramastram udīrayan,
Śarān bhūyaḥ samādāya rāmaḥ krodhasamanvitaḥ,
Mumoca ca mahātejāḥ cāpa māyamya vīryavān. 36.

Thereupon, seizing hold of more arrows, reciting sacred incantations and making use of the missile presided over by Rudra and stretching his bow, the valiant Rama of great splendor was filled with anger and released those arrows.

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,
Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

6 సెప్టెం, 2014

672. మహాకర్మా, महाकर्मा, Mahākarmā

ఓం మహాకర్మణే నమః | ॐ महाकर्मणे नमः | OM Mahākarmaṇe namaḥ


మహత్ప్రపఞ్చ సృష్ట్యాది కర్మాస్యేతి జనార్దనః ।
మహాకర్మేత్యుచ్యతే స విష్ణుర్విబుధసత్తమైః ॥

ఈతడు నిర్వర్తించు జగత్ ఉత్పత్తి, స్థితి, లయ రూపమగు కర్మము చాలా గొప్పదీ - అన్యులకు శక్యము కానిదిగనుక మహాకర్మా.



महत्प्रपञ्च सृष्ट्यादि कर्मास्येति जनार्दनः ।
महाकर्मेत्युच्यते स विष्णुर्विबुधसत्तमैः ॥

Mahatprapañca sr̥ṣṭyādi karmāsyeti janārdanaḥ,
Mahākarmetyucyate sa viṣṇurvibudhasattamaiḥ.

Great are His actions of creation, sustenance and annihilation of the creation that cannot be accomplished by any other and hence He is Mahākarmā.

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,
Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

5 సెప్టెం, 2014

671. మహాక్రమః, महाक्रमः, Mahākramaḥ

ఓం మహాక్రమాయ నమః | ॐ महाक्रमाय नमः | OM Mahākramāya namaḥ


మహాక్రమః, महाक्रमः, Mahākramaḥ

మహాన్తః పాదవిక్షేపాః క్రమా అస్యేతి కేశవః ।
మహాక్రమ ఇతిప్రోక్తః శన్నో విష్ణురురుక్రమః ।
ఇతి శుక్లయజుర్వేద శ్రవణాద్ విష్ణువాచకః ॥

లోకత్రయమును వ్యాపించు చాల పెద్దవైన పాద విన్యాసములు ఎవనివో ఆతండు మహాక్రమః. 'శం నో విష్ణురురుక్రమః' - పెద్ద పాదన్యాసములుగల విష్ణువు మాకు శుభమును కలిగించుగాక అను శుక్ల యజుర్వేద వచనము ఇట ప్రమాణము.



महान्तः पादविक्षेपाः क्रमा अस्येति केशवः ।
महाक्रम इतिप्रोक्तः शन्नो विष्णुरुरुक्रमः ।
इति शुक्लयजुर्वेद श्रवणाद् विष्णुवाचकः ॥

Mahāntaḥ pādavikṣepāḥ kramā asyeti keśavaḥ,
Mahākrama itiproktaḥ śanno viṣṇururukramaḥ,
Iti śuklayajurveda śravaṇād viṣṇuvācakaḥ.

The One with great strides that cover all the three worlds is Mahākramaḥ. The Śukla Yajurveda chant 'शं नो विष्णुरुरुक्रमः' / 'Śaṃ no viṣṇururukramaḥ' means 'may the Viṣṇu of great strides give us welfare' can be a reference here.

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।
महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,
Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥

4 సెప్టెం, 2014

670. బ్రాహ్మణప్రియః, ब्राह्मणप्रियः, Brāhmaṇapriyaḥ

ఓం బ్రాహ్మణప్రియాయ నమః | ॐ ब्राह्मणप्रियाय नमः | OM Brāhmaṇapriyāya namaḥ


బ్రాహ్మణానాం ప్రియో విష్ణుర్బ్రాహ్మణా అస్య వా ప్రియాః ।
బ్రాహ్మణప్రియ ఇత్యుక్తో విష్ణుర్విబుధసత్తమైః ॥

తత్పురుష సమాసముగా చూచినట్లయితే బ్రాహ్మణులకు ఇష్టుడు అని అర్థము. బహువ్రీహి సమాసముగా చూచినట్లయిన ఎవనికి బ్రాహ్మణులు ప్రీతి పాత్రులో అట్టివాడు బ్రాహ్మణప్రియః.

దీకిని ఉపబలముగా భగవద్వచనము - ఘ్నన్తం శపన్తం పురుషం వదన్తం । యో బ్రాహ్మణం న ప్రణమేద్ యథాఽర్హం । స పాపకృద్ బ్రహ్మదావాగ్నిదగ్ధో । వధ్యశ్చ దణ్డశ్చ న చాఽస్మదీయః ॥ 'తనను చంపుచున్నవానిని, తిట్టుచున్నవానిని, తన విషయమున కఠిన వచనములు పలుకుచున్న వానిని ఐనను, బ్రాహ్మణుని ఆతని ఇతరములగు యోగ్యతల ననుసరించి తగిన విధమున నమస్కరించకుండునో అట్టి పాపకారి మనుజుడు బ్రహ్మ దావాగ్నిచే దహించబడువాడును, వధ్యుడును, దండ్యుడును అగును. అంతియకాదు - వాడు నావాడు కాడు' అని యున్నది.

మహాభారతమునందలి భీష్మవచనమున పరమాత్మునకు బ్రాహ్మణులయందుగల ప్రీతి నిరూపించడినది.

:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః ::
యం దేవం దేవకీ దేవీ వసుదేవాదజీజనత్ ।
భౌమస్య బ్రహ్మణో గుప్త్యై దీప్తమగ్నిమివారణిః ॥ 29 ॥


అరణి ప్రజ్వలించు అగ్నిని ప్రకటించినట్లు - భూలోకవర్తియగు బ్రాహ్మణ జాతిని, వేదములను మరియు యజ్ఞములను రక్షించుటకై దేవకీ దేవి వసుదేవుని వలన అట్టి దేవుని కనెను.



ब्राह्मणानां प्रियो विष्णुर्ब्राह्मणा अस्य वा प्रियाः ।
ब्राह्मणप्रिय इत्युक्तो विष्णुर्विबुधसत्तमैः ॥

Brāhmaṇānāṃ priyo viṣṇurbrāhmaṇā asya vā priyāḥ,
Brāhmaṇapriya ityukto viṣṇurvibudhasattamaiḥ.

Brāhmaṇapriyaḥ can be interpreted as 'the One who is dear to Brāhmaṇas' or 'the One to whom Brāhmaṇas are dear.'

The Lord said: घ्नन्तं शपन्तं पुरुषं वदन्तं । यो ब्राह्मणं न प्रणमेद् यथाऽर्हं । स पापकृद् ब्रह्मदावाग्निदग्धो । वध्यश्च दण्डश्च न चाऽस्मदीयः ॥ / Ghnantaṃ śapantaṃ puruṣaṃ vadantaṃ, Yo brāhmaṇaṃ na praṇamed yathā’rhaṃ, Sa pāpakr̥d brahmadāvāgnidagdho, Vadhyaśca daṇḍaśca na cā’smadīyaḥ. - One who does not duly respect a Brāhmaṇa as is proper, who kills, curses or speaks harshly to him, is a sinner burnt up by the forest fire of Brahma and must be put to death or otherwise punished; he doe not belong to Me.

:: श्रीमहाभारते शान्तिपर्वणि सप्तचत्वारिंशोऽध्यायः ::
यं देवं देवकी देवी वसुदेवादजीजनत् ।
भौमस्य ब्रह्मणो गुप्त्यै दीप्तमग्निमिवारणिः ॥ २९ ॥

Śrī Mahābhārata - Book 12, Chapter 47
Yaṃ devaṃ devakī devī vasudevādajījanat,
Bhaumasya brahmaṇo guptyai dīptamagnimivāraṇiḥ. 29.

That God whom the holy Devaki begot of Vasudeva like the radiant fire from araṇi wood for the protection of Brāhmaṇas, Vedas and yajñas on earth.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

3 సెప్టెం, 2014

669. బ్రాహ్మజ్ఞః, ब्राह्मज्ञः, Brāhmajñaḥ

ఓం బ్రహ్మజ్ఞాయ నమః | ॐ ब्रह्मज्ञाय नमः | OM Brahmajñāya namaḥ


వేదానయం స్వాత్మ భూతాన్ విష్ణుర్జానాతి యత్తతః ।
బ్రహ్మజ్ఞః ఇతి విద్వద్భిః ప్రోచ్యతే పరమేశ్వరః ॥

తన స్వరూపమేయగు వేదములను సమగ్రముగా ఎరిగియుండువాడు విష్ణుదేవుడు. వేద ప్రతిపాద్య తత్త్వమునే స్వస్వరూపముగా ఎరిగినవాడుగనుక ఆ పరమేశ్వరుడు బ్రహ్మజ్ఞః అని చెప్పబడును.



वेदानयं स्वात्म भूतान् विष्णुर्जानाति यत्ततः ।
ब्रह्मज्ञः इति विद्वद्भिः प्रोच्यते परमेश्वरः ॥

Vedānayaṃ svātma bhūtān viṣṇurjānāti yattataḥ,
Brahmajñaḥ iti vidvadbhiḥ procyate parameśvaraḥ.

Since Lord Viṣṇu knows the meaning of Vedas comprehensively and since the true essence of the Vedas is He Himself, the Lord is known as Brāhmajñaḥ.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

2 సెప్టెం, 2014

668. బ్రహ్మీ, ब्रह्मी, Brahmī

ఓం బ్రహ్మిణే నమః | ॐ ब्रह्मिणे नमः | OM Brahmiṇe namaḥ


అత్రైవ తచ్ఛేషభూతా వర్తన్తే బ్రహ్మ సంజ్ఞితాః ।
ఇతి త్రివిక్రమో బ్రహ్మీత్యుచ్యతే విదుషాం వరైః ॥

బ్రహ్మము తనయందుగలవాడు బ్రహ్మీ. బ్రహ్మ అను సంజ్ఞతో వ్యవహరించబడు తపము మొదలగునవి నాలుగును పరమాత్మునకు అంగ భూతములు అగుచు త్రివిక్రముడగు విష్ణునియందే యున్నవి గనుక బ్రహ్మీ.

:: పోతన భాగవతము షష్ఠమ స్కంధము ::
సీ. పూని నా రూపంబు భూతజాలంబులు, భూతభావనుఁడ నేఁ బొందువడఁగ
బ్రహ్మంబు మఱియు శబ్దబ్రహ్మమును శాశ్వతంబైన తనువులు దగిలె నాకు
నఖిలలోకములందు ననుగతంబై యుందు, లోకంబు నా యందు జోకఁజెందు,
నుభయంబు నాయందు నభిగతంబై యుండు, నభిలీన మగుదు న య్యుభయమందు!
తే. వెలయ నిద్రించువాఁడాత్మ విశ్వమెల్లఁ, జూచి మేల్కాంచి తా నొక్క చోటివానిఁ
గా వివేకించు మాడ్కి నీ జీవితేశ, మాయ దిగనాడి పరమధర్మంబుఁ దెలియు. (479)

ఈ జగత్తులోని సమస్తజీవులూ నా స్వరూపాలే. నేను భూత భావనుడను. ఈ సృష్టిలోని సమస్త రూపములను నిర్దేశించెడివాడను నేనే! బ్రహ్మమూ, శబ్దబ్రహ్మమూ - రెండూ శాశ్వతమైన నా దేహములు. ఆత్మస్వరూపుడనైన నేను అఖిల లోకములయందు నిండి ఉన్నాను. ఈ సమస్త జగత్తులు నాలో ఇమిడి ఉన్నాయి. ఈ రెండు స్థితులూ నాకు అనుకూలముగా నడుస్తూ ఉంటాయి. నేను ఈ రెంటిలోను అంతర్లీనముగా ఉంటాను. నిదురించెడివాడు స్వప్నావస్థలో సమస్త విశ్వమును సందర్శించి మేల్కాంచిన అనంతరము తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. అదే విధముగా జీవులు ఈ విశాల సృష్టియందు విహరించి ఏదో ఒకనాడు భగవంతుని మాయనుండి విడివడినవారై పరమార్థమును తెలుసుకుంటారు.



अत्रैव तच्छेषभूता वर्तन्ते ब्रह्म संज्ञिताः ।
इति त्रिविक्रमो ब्रह्मीत्युच्यते विदुषां वरैः ॥

Atraiva taccheṣabhūtā vartante brahma saṃjñitāḥ,
Iti trivikramo brahmītyucyate viduṣāṃ varaiḥ.

Austerity, the Vedas, sages and wisdom which are indicated by the word Brahma, are parts of Him and hence He is Brahmī.

:: श्रीमद्भागवते षष्ठस्कन्धे षोडशोऽध्यायः ::
अहं वै सर्वभूतानि भूतात्मा भूतभावनः ।
शब्दब्रह्म परं ब्रह्म ममोभे शाश्वती तनू ॥ ५१ ॥

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 16
Ahaṃ vai sarvabhūtāni bhūtātmā bhūtabhāvanaḥ,
Śabdabrahma paraṃ brahma mamobhe śāśvatī tanū. 51.

All living entities, moving and non-moving, are My expansions and are separate from Me. I am the Supersoul of all living beings, who exist because I manifest them. I am the form of the transcendental vibrations like oḿkāra and I am the Supreme Absolute Truth. These two forms of Mine - namely, the transcendental sound and the eternally blissful spiritual form of the Deity, are My eternal forms; they are not material.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

1 సెప్టెం, 2014

667. బ్రాహ్మణః, ब्राह्मणः, Brāhmaṇaḥ

ఓం బ్రాహ్మణాయ నమః | ॐ ब्राह्मणाय नमः | OM Brāhmaṇāya namaḥ


లోకానాం హి సమస్తానాం శ్రీవిష్ణుర్బ్రాహ్మణాత్మనా ।
కుర్వన్ ప్రవచనం వేదస్యాయం బ్రాహ్మణ ఉచ్యతే ॥

బ్రాహ్మణ రూపమున సమస్త లోములకును, సమస్త జనులకును వేద ప్రవచనము చేయుచు, వేదార్థమును తెలియజేయుచు ఉండువాడు కావున బ్రాహ్మణః అనబడుచున్నాడు.



लोकानां हि समस्तानां श्रीविष्णुर्ब्राह्मणात्मना ।
कुर्वन् प्रवचनं वेदस्यायं ब्राह्मण उच्यते ॥

Lokānāṃ hi samastānāṃ śrīviṣṇurbrāhmaṇātmanā,
Kurvan pravacanaṃ vedasyāyaṃ brāhmaṇa ucyate.

In the form of the Brāhmaṇas, He expounds the Vedas to the whole world. So He is Brāhmaṇaḥ.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥