30 ఏప్రి, 2014

543. గభీరః, गभीरः, Gabhīraḥ

ఓం గభీరాయ నమః | ॐ गभीराय नमः | OM Gabhīrāya namaḥ


గభీరః, गभीरः, Gabhīraḥ

జ్ఞానైశ్వర్యాదిభిర్విష్ణోర్గమ్భీరత్వాత్ గభీరతః జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగు ఉత్తమ లక్షణములచే గంభీరుడు.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
చ. చతురత నట్టి యీశ్వరుఁడు సజ్జనలోక నిరస్త సర్వ కా
     మిత విమలాంతరంగమున మిశ్రిత భావనఁ జేసి సన్నిధా
     పితుఁ డగుచున్ దయాకర గభీర గుణంబులఁ జాల నొప్పి యా
     శ్రిత జన పారతంత్ర్యమును జేకొని పాయక యుండు నిచ్చలున్‍. (960)

భగవంతుడు ఆశ్రితజన వత్సలుడు. కాబట్టి పరిశుద్ధమైన సజ్జనుల మనస్సులో చేరి విడవకుండా నిత్యమూ అక్కడే ఉంటాడు.



ज्ञानैश्वर्यादिभिर्विष्णोर्गम्भीरत्वात् गभीरतः / Jñānaiśvaryādibhirviṣṇorgambhīratvāt gabhīrataḥ The unfathomable or Supreme in wisdom, wealth, strength, valor etc., and hence He is Gabhīraḥ.

:: श्रीमद्भागवते एकादशस्कन्धे षष्ठोऽद्यायः ::
अस्यासि हेतुरुदयस्थितिसंयमानाम्
     आव्यक्तजीवमहतामपि कालमाहुः ।
सोऽयं त्रिणाभिरखिलापचये प्रवृत्तः
     कालो गभीररय उत्तमपूरुषस्त्वम् ॥ १५ ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 6
Asyāsi heturudayasthitisaṃyamānām
     Āvyaktajīvamahatāmapi kālamāhuḥ,

So’yaṃ triṇābhirakhilāpacaye pravr̥ttaḥ
     Kālo gabhīraraya uttamapūruṣastvam. 15.

You are the cause of the creation, maintenance and destruction of this universe. As time, You regulate the subtle and manifest states of material nature and control every living being. As the threefold wheel of time You diminish all things by Your imperceptible actions, and thus You are the Supreme Lord.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

29 ఏప్రి, 2014

542. గుహ్యః, गुह्यः, Guhyaḥ

ఓం గుహ్యాయ నమః | ॐ गुह्याय नमः | OM Guhyāya namaḥ


గుహ్యః, गुह्यः, Guhyaḥ

రహస్యోపనిషద్వేద్యో గుహాయాం పరమేశ్వరః ।
హృదయాకాశే నిహిత ఇతి వా గుహ్య ఉచ్యతే ॥

రహస్యమైన ఉపనిషద్ వచనములచే తెలియబడువాడు పరమేశ్వరుడు. లేదా హృదయాకాశము అనగా హృదయము అనబడే గుహయందు ఉండెడివాడు గనుక ఆ దేవ దేవుడు గుహ్యుడు.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. కలలోన జీవుండు కౌతూహలంబునఁ బెక్కు దేహంబులఁ బేరు వడసి
యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెరుఁగుకరణి
నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ డఖిలజీవుల హృదయముల నుండి
బుద్ధి వృత్తుల నెల్ల బొద్ధయై వీక్షించు బద్ధుండు గాఁడు ప్రాభవము వలన
తే. సత్యుఁ డానందబాహుళ విజ్ఞానమూర్తి, యతని సేవింప నగుఁగాక, యన్యసేవఁ
గలుగనేరవు కైవల్య గౌరవములు, పాయ దెన్నఁడు సంసారబంధ మధిప! (18)

జీవుడు కలలో ఉబలాటంతో పలు శరీరాలు దాలుస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గ్రహిస్తాడు. ఆ తరువాత తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే అంతటికీ అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారాలన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యరూపుడు. ఆనందంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. ఈ సంసార బంధము వదలదు.



रहस्योपनिषद्वेद्यो गुहायां परमेश्वरः ।
हृदयाकाशे निहित इति वा गुह्य उच्यते ॥

Rahasyopaniṣadvedyo guhāyāṃ parameśvaraḥ,
Hr̥dayākāśe nihita iti vā guhya ucyate.

One who is to be known by the Guhya or the esoteric knowledge conveyed by the Upanishads. Or since He dwells in the guha i.e., cave of the heart, He is Guhyaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे षोडशोऽध्यायः ::
त्वत्तः सनातनो धर्मो रक्ष्यते तनुभिस्तव ।
धर्मस्य परमो गुह्यो निर्विकारो भवान्मतः ॥ १८ ॥ 


Śrīmad Bhāgavata - Canto 3, Chapter 16
Tvattaḥ sanātano dharmo rakṣyate tanubhistava,
Dharmasya paramo guhyo nirvikāro bhavānmataḥ. 18.

You are the source of the eternal occupation of all living entities, and by Your multiple manifestations, You have always protected religion. You are the supreme objective of religious principles, and in our opinion You are inexhaustible and unchangeable eternally.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

28 ఏప్రి, 2014

541. కనకాఙ్గదీ, कनकाङ्गदी, Kanakāṅgadī

ఓం కనకాఙ్గదినే నమః | ॐ कनकाङ्गदिने नमः | OM Kanakāṅgadine namaḥ


కనకాఙ్గదీ, कनकाङ्गदी, Kanakāṅgadī

కనకమయాన్యఙ్గదాన్యస్యేతి కనకాఙ్గదీ బంగారముతో చేయబడిన భుజాభరణములు ఈతనికి కలవు.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ. కుండల మణి దీప్తి గండస్థలంబులఁ బూర్ణేందురాగంబుఁ బొందుబరుప
దివ్యకిరీట ప్రదీప్తు లంబర రమా సతికిఁ గౌస్తుభవస్త్రంబు గాఁగ
వక్షస్థలంబుపై వనమాల మాలికల్ శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొఱయ
నీలాద్రి బెనఁగొని నిలిచిన విద్యుల్లతలభాతిఁ గనకాంగదములు మెఱయ
ఆ. నఖిలలోక మోహనాకార యుక్తుఁడై, నారదాది మునులు చేరి పొగడఁ
గదిసి మునులు పొగడ గంధర్వ కిన్నర, సిద్ధ గానరవము సెవుల నలర. (219)

ఆయన కర్ణకుండలాల కాంతులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబాలలాగా తళతళలాడుతున్నాయి. తలమీద ధరించిన కిరీటం తన దివ్య దీప్తులతో గగనలక్ష్మికి కుంకుమరంగు చీరను అలంకరిస్తున్నది. ఆయన వక్షస్థలం మీద విరాజిల్లే వనమాలిక శోభలు శ్రీవత్సంతోనూ కౌస్తుభంతోనూ పోటీపడుతున్నాయి. బాహువులకు చుట్టుకొని ఉన్న భుజకీర్తులు నీలగిరికి చుట్టుకొన్న మెరుపు తీగలవలె మెరుస్తున్నాయి. ఆ స్వామి సౌందర్యం సమస్తలోకాలనూ మోహంలో ముంచి తేలుస్తున్నది. నారదాది మహర్షులు చుట్టూ చేరి సేవిస్తున్నారు. దేవతా బృందాలు కైవారాలు సలుపుతున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులూ వీనులవిందుగా గానం చేస్తున్నారు.



कनकमयान्यङ्गदान्यस्येति कनकाङ्गदी / Kanakamayānyaṅgadānyasyeti kanakāṅgadī  One who has armlets made of gold.

:: श्रीमद्भागवते षष्ठस्कन्धे चतुर्थोऽध्यायः ::
महाकिरीटकटकः स्फुरन्मकरकुण्डलः ।
काञ्चङ्गुलीयवलय नूपुराङ्गदभूषितः ॥ ३७ ॥

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 4
Mahākirīṭakaṭakaḥ sphuranmakarakuṇḍalaḥ,
Kāñcaṅgulīyavalaya nūpurāṅgadabhūṣitaḥ. 37.

The Lord on His head had a gorgeous round helmet, and His ears were decorated with earrings resembling sharks. All these ornaments were uncommonly beautiful. The Lord wore a golden belt on His waist, bracelets on His arms, rings on His fingers, and ankle bells on His feet.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

27 ఏప్రి, 2014

540. సుషేణః, सुषेणः, Suṣeṇaḥ

ఓం సుషేణాయ నమః | ॐ सुषेणाय नमः | OM Suṣeṇāya namaḥ


సుషేణః, सुषेणः, Suṣeṇaḥ

శ్రీవిష్ణోశ్శోభనా సేనా విద్యతే హి గణాత్మికా ।
యస్ససోఽయం సుషేణ ఇత్యుచ్యతే విదుషాం వరైః ॥

పార్షద గణ రూపమగు అనగా 'సు' లేదా శోభనమైన సేన గలవాడు అను విగ్రహమున సుషేణ శబ్దము విష్ణువును బోధించును.

:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
వ. మఱియు ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండును సునంద నందకుముదాది సేవితుండును బ్రకృతిపురుష మహదహంకారంబులను చతుశ్శక్తులును గర్మేంద్రియ జ్ఞానేంద్రియమనో మహాభూతంబులను షోడశ శక్తులును బంచతన్మాత్రంబులునుం బరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభా విక సమస్తైశ్వర్యాతిశయుండునునై స్వస్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానందకందళిత హృదయారవిందుడును, రోమాంచకంచుకిత శరీరుండును, ఆనందబాష్పధారాసిక్త కపోలుండును నగుచు. (238)

అమూల్యమైన మణిమయ సింహాసనంలో కూర్చున్నవాడూ; సునందుడు, నందుడు, కుముదుడు మొదలైన పార్షదుల సేవలు గైకొనుచున్నవాడూ; ప్రకృతి, పురుషుడు, మహతత్త్వము, అహంకారము అనే నాలుగు శక్తులూ; వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనే పంచ కర్మేంద్రియాలూ; శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనే పంచ జ్ఞానేంద్రియాలూ; మనస్సూ; పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము అనే పంచభూతాలూ - ఈ పదునారు శక్తులూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రలూ తనచుట్టూ చేరి కొలుస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతితో భాసించేవాడూ; ఇతరులకు లభ్యం కానివీ, తనకు మాత్రమే స్వభావసిద్ధమైనవీ అయిన సకలైశ్వర్యాలతో ప్రకాశించేవాడూ; నిజస్వరూపంలోనే వినోదించేవాడూ, అంతటికీ అదినాథుడు, పరమపురుషుడు, పరమశ్రేష్ఠుడు, పద్మాక్షుడూ అయిన నారాయణుడిని బ్రహ్మ దేవుడు చూసినాడు. ఆయన హృదయపద్మము అమితానందముతో వికసించినది. ఆయన శరీరం గగుర్పాటు చెందినది. ఆయన చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో ఆర్ద్రములైనాయి.



श्रीविष्णोश्शोभना सेना विद्यते हि गणात्मिका ।
यस्ससोऽयं सुषेण इत्युच्यते विदुषां वरैः ॥

Śrīviṣṇośśobhanā senā vidyate hi gaṇātmikā,
Yassaso’yaṃ suṣeṇa ityucyate viduṣāṃ varaiḥ.

He who possesses the auspicious groups of senas or armies of the form of gaṇas. So Lord Viṣṇu is Suṣeṇaḥ.

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे नवमोऽध्यायः ::
ददर्श तत्राखिलसात्वतां पतिं श्रियः पतिं यज्ञपतिं जगत्पतिम् ।
सुनन्दनन्दप्रबलार्हणादिभिः स्वपार्षदाग्रैः परिसेवितं विभुम् ॥ १४ ॥

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 9
Dadarśa tatrākhilasātvatāṃ patiṃ śriyaḥ patiṃ yajñapatiṃ jagatpatim,
Sunandanandaprabalārhaṇādibhiḥ svapārṣadāgraiḥ parisēvitaṃ vibhum. 14.

Lord Brahmā saw Him in the Vaikuṇṭha, who is the Lord of the entire devotee community, the Lord of the goddess of fortune, the Lord of all sacrifices, and the Lord of the universe, and who is served by the foremost servitors like Nanda, Sunanda, Prabala and Arhaṇa, His immediate associates.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

26 ఏప్రి, 2014

539. గోవిన్దః, गोविन्दः, Govindaḥ

ఓం గోవిన్దాయ నమః | ॐ गोविन्दाय नमः | OM Govindāya namaḥ


గోవిర్భాణీభిరబ్జాక్షో విన్దతే వేత్తి కేశవః ।
వేదాన్తవాకైరపి వేత్యసౌ గోవిన్ద ఉచ్యతే ॥
గోభిరేవ యతో వేద్యః గోవిన్దస్సముదాహృతః ।
ఇతి శ్రీ విష్ణుతిలకే కర్మవ్యుత్పత్తిరాదృతా ॥

ఈతనిని ముముక్షువులు గోవుల అనగా వాక్కులచే పొందుదురు. వేదవచనములచే తెలిసికొందురు. స్తుతులచే అతని అనుగ్రహమును పొంది ఈతని స్థానమును పొందెదరు. లేదా ఈతనిని ముముక్షువు వేదవాక్కుల చేతనే తెలిసికొనుచున్నాడు.

శ్రీ విష్ణుతిలకమునందు 'ఈతడు గోవులచే అనగా వాక్కులచే వేద్యుడు అనగా తెలియబడువాడుగావున గోవిందుడుగా చెప్పబడును' అని ఉన్నది.

:: హరివంశే భవిష్యపర్వణి కైలాసయాత్రాయాం శివకృతవిష్ణుస్తుతౌ అష్టాశీతితమోఽధ్యాయః ::
గౌ రేషా తు యతో వాణీ తాం చ విందయతే భవాన్ ।
గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్ ॥ 50 ॥

ఈ వాణికి (వక్కునకు) గౌః అని వ్యవహారము. నీవు ప్రాణులచే వాక్కును పొందింతువు (ప్రాణులకు వానికి వానికి తగిన వాక్కును అందజేయువాడవు నీవే). అందువలన దేవా నీవు మునులచేత గోవిందః అని చెప్పబడుచున్నావు.

187. గోవిందః, गोविन्दः, Govindaḥ



गोविर्भाणीभिरब्जाक्षो विन्दते वेत्ति केशवः ।
वेदान्तवाकैरपि वेत्यसौ गोविन्द उच्यते ॥
गोभिरेव यतो वेद्यः गोविन्दस्समुदाहृतः ।
इति श्री विष्णुतिलके कर्मव्युत्पत्तिरादृता ॥ 

Govirbhāṇībhirabjākṣo vindate vetti keśavaḥ,
Vedāntavākairapi vetyasau govinda ucyate.
Gobhireva yato vedyaḥ govindassamudāhr̥taḥ,
Iti śrī viṣṇutilake karmavyutpattirādr̥tā.

The Lord is attained by go which stands for vāṇi or speech.

Or The jīva who is non-different from Brahman knows the Truth that is Brahman by the texts of vedānta vide the Viṣṇutilaka 'Gobhireva yato vedyaḥ govindassamudāhr̥taḥ,' - 'as You are known by the go, vedāntic texts alone, You are said to be Govinda.'

:: श्रीमद्भागवते प्रथम स्कन्धे अष्टमोऽध्यायः ::
कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च ।
नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः ॥ २१ ॥
नमः पङ्कनाभाय नमः पङ्कजमालिने ।
नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये ॥ २२ ॥ 

Śrīmad Bhāgavata - Canto 1, Chapter 8
Kr̥ṣṇāya vāsudevāya devakīnandanāya ca,
Nandagopakumārāya govindāya namo namaḥ. 21.
Namaḥ paṅkanābhāya namaḥ paṅkajamāline,
Namaḥ paṅkajanetrāya namaste paṅkajāṅghraye. 22.

My respectful obeisances unto the Lord, who has become the son of Vasudeva, the pleasure of Devakī, the boy of Nanda and the other cowherd men of Vṛndāvana, and the enlivener of the cows and the senses. My respectful obeisances are unto You, O Lord, whose abdomen is marked with a depression like a lotus flower, who are always decorated with garlands of lotus flowers, whose glance is as cool as the lotus and whose feet are engraved with lotuses.

:: हरिवंशे भविष्यपर्वणि कैलासयात्रायां शिवकृतविष्णुस्तुतौ अष्टाशीतितमोऽध्यायः ::
गौरेषा तु यतो वाणी तां च वेद यतो भवान् ।
गोविन्दस्तु ततो देव मुनिभिः कथ्यते भवान् ॥ ५० ॥

Harivaṃśa - Book3, Chapter 88
Gaureṣā tu yato vāṇī tāṃ ca veda yato bhavān,
Govindastu tato deva munibhiḥ kathyate bhavān. 50.

Speech is called 'go'. You confer it. So the holy men proclaim you as Govinda.

187. గోవిందః, गोविन्दः, Govindaḥ

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

25 ఏప్రి, 2014

538. మహావరాహః, महावराहः, Mahāvarāhaḥ

ఓం మహావరాహాయ నమః | ॐ महावराहाय नमः | OM Mahāvarāhāya namaḥ


మహావరాహః, महावराहः, Mahāvarāhaḥ

మహాంశ్చాసౌ వరాహశ్చ మహావరాహ ఉచ్యతే ఈతడు గొప్ప వరాహముగా రూపము ధరించినవాడు.

:: పోతన భాగవతము పంచమ స్కంధము ::
క. ఉత్తర కురుభూములఁ దను, హత్తుకొని వరాహదేవుఁ డధిపతియైనన్‍
    సత్తుగ భూసతి యతనిం, జిత్తములో నిలిపి పూజ సేయుచు నుండున్‍. (49)
క. ఆ వర్షమందులను బ్రజ, లా విపులవరాహమూర్తి ననవరతంబున్‍
    సేవించి కొలిచి సంస్తుతిఁ, గావించుచుఁ గాంతు రంతఁ గైవల్యంబున్‍. (50)

ఉత్తర కురువర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి వరాహదేవుడయిన శ్రీహరిని మనసులో నిలుపుకొని పూజలు చేస్తుంటుంది. ఆ ఉత్తర కురువర్షంలోని ప్రజలు వరాహమూర్తిని అనుదినమూ (ఈ క్రింది ఉపనిషద్ మంత్రముతో) సేవిస్తూ, సంభావిస్తూ, సంస్తుతులు గావిస్తూ మోక్షపదాన్ని చేరుకొంటారు.

:: శ్రీమద్భాగవతే పఞ్చమ స్కన్ధే అష్టాదశోఽధ్యాయః ::
ఓం నమో భగవతే మన్త్రతత్త్వలిఙ్గాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే ॥ 35 ॥



महांश्चासौ वराहश्च महावराह उच्यते / Mahāṃścāsau varāhaśca mahāvarāha ucyate He appeared in the form of a great Varāha or wild boar and hence He is called Mahāvarāhaḥ.

:: श्रीमद्भागवते पञ्चम स्कन्धे अष्टादशोऽध्यायः :: 
ॐ नमो भगवते मन्त्रतत्त्वलिङ्गाय यज्ञक्रतवे महाध्वरावयवाय महापुरुषाय नमः कर्मशुक्लाय त्रियुगाय नमस्ते ॥ ३५ ॥ 

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 18
Oṃ namo bhagavate mantratattvaliṅgāya yajñakratave mahādhvarāvayavāya mahāpuruṣāya namaḥ karmaśuklāya triyugāya namaste. 35.

(Upaniṣadic mantra of the Supreme Lord in Varāha rūpa)
O Lord, we offer our respectful obeisances unto You as the gigantic person. Simply by chanting mantras, we shall be able to understand You fully. You are yajña, and You are the kratu. Therefore all the ritualistic ceremonies of sacrifice are part of Your transcendental body, and You are the only enjoyer of all sacrifices. Your form is composed of transcendental goodness. You are known as tri-yuga because in Kali-yuga You appeared as a concealed incarnation and because You always fully possess the three pairs of opulences.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

24 ఏప్రి, 2014

537. కృతాన్తకృత్, कृतान्तकृत्, Kr̥tāntakr̥t

ఓం కృతాన్తకృతే నమః | ॐ कृतान्तकृते नमः | OM Kr̥tāntakr̥te namaḥ


కృతాన్తకృత్, कृतान्तकृत्, Kr̥tāntakr̥t

కృతస్యాన్తం కరోతీతి కృతాన్తం కృతన్తీతివా ।
కృతాన్తకృతిది ప్రోక్తో విద్వద్భిః పరమేశ్వరః ॥

తనచే నిర్మించబడిన జగత్తునకు ప్రళయకాలమున అంతము కలిగించువాడు. లేదా అంతము అనగా మృత్యువును మోక్షదాతగా రూపుమాపు పరమేశ్వరుడు కృతాన్తకృత్.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
ఉ. విశ్వభవస్థితి ప్రళయవేళలయందు వికారసత్త్వమున్‍
     విశ్వము నీవ యీ నిఖిలవిశ్వము లోలి సృజింతు విందిరా
     ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
     శాశ్వతలీల లిట్టి వని సన్నుతి సేయఁగ మాకు శక్యమే? (436)

ఓ లక్ష్మీవల్లభా! ఈ ప్రపంచం సృష్టించేదీ, రక్షించేదీ, లయం చేసేదీ నీవే! సమస్తమూ నీవై ఈ సమస్త లోకాలనూ మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. ఈశ్వరా! కేశవా! వేదమయా! దివ్యస్వరూపా! దేవ దేవా! అంతులేని నీ వింత లీలలు ఇంతటివి, ఇటువంటివి అని వర్ణించడానికి మాకు చేతనవుతుందా?



कृतस्यान्तं करोतीति कृतान्तं कृतन्तीतिवा ।
कृतान्तकृतिदि प्रोक्तो विद्वद्भिः परमेश्वरः ॥

Kr̥tasyāntaṃ karotīti kr̥tāntaṃ kr̥tantītivā,
Kr̥tāntakr̥tidi prokto vidvadbhiḥ parameśvaraḥ.

During annihilation, He brings the anta or end of everything that is kr̥ta or created by Him. Or He by bestowing liberation, has the ability to release one from the cycle of death and birth.

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
यत्र निर्विष्टमरणं कृतान्तो नाभिमन्यते ।
विश्वं विध्वंसयन्वीर्य शौर्यविस्फूर्जितभ्रुवा ॥ ५६ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Yatra nirviṣṭamaraṇaṃ kr̥tānto nābhimanyate,
Viśvaṃ vidhvaṃsayanvīrya śauryavisphūrjitabhruvā. 56.

Simply by expansion of His eyebrows, invincible time personified can immediately vanquish the entire universe. However, formidable time does not approach the devotee who has taken complete shelter at Your lotus feet.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

23 ఏప్రి, 2014

536. మహాశృఙ్గః, महाशृङ्गः, Mahāśr̥ṅgaḥ

ఓం మహాశృఙ్గాయ నమః | ॐ महाशृङ्गाय नमः | OM Mahāśr̥ṅgāya namaḥ


మహాశృఙ్గః, महाशृङ्गः, Mahāśr̥ṅgaḥ

మత్స్యరూపేణ మహతి శృఙ్గే ప్రలయవారిధౌ
చిక్రీడ నావం బద్ద్వేతి మహాశృఙ్గ ఇతీర్యతే

పెద్దదియగు శృంగము (పెద్ద కొమ్ము) ఇతనికి క్రీడాస్థానముగానుండెను. మత్స్యరూపి యగుచు ప్రళయకాలపు మహా సముద్రమున తన మహా శృంగము నందు నావను కట్టి క్రీడించెను.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
వ. కని, జలచరేంద్రుని కొమ్మున నొక్కపెనుఁ బాఁపత్రాట న న్నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నారాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె. (722)
మ. తమలోఁ బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూలసంసార వి

బ్రములై కొందరు దేలుచుం గలఁగుచున్ బల్వెంటలన్ దైవ యో

గమునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్యసంప్రాప్తులై

ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా! (723)

సత్యవ్రతుడు ఒక పెద్దపామును త్రాడుగా చేసి ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకొన్నాడు. ఋషులతో పాటు అతడు విష్ణువును క్రింది విధంగా పొగడసాగినాడు.

ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానం వల్ల కొందరు సంసారసాగరంలోపడి చిక్కుకొని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోషపడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు.



मत्स्यरूपेण महति शृङ्गे प्रलयवारिधौ ।
चिक्रीड नावं बद्द्वेति महाशृङ्ग इतीर्यते ॥

Matsyarūpeṇa mahati śr̥ṅge pralayavāridhau,
Cikrīḍa nāvaṃ baddveti mahāśr̥ṅga itīryate.

The One sporting a big horn. During His Matsyāvatāra or incarnation as a great fish, He sported in the waters of great deluge binding the boat with only life to His great horn.

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
सोऽनुध्यातस्ततो राज्ञा प्रादुरासीन्महार्णवे ।
एकशृङ्गधरो मत्स्यो हैमो नियुतयोजनः ॥ ४४ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 24
So’nudhyātastato rājñā prādurāsīnmahārṇave,
Ekaśr̥ṅgadharo matsyo haimo niyutayojanaḥ. 44.

Then, while the King (Satyavrata) constantly meditated upon the Supreme Personality of Godhead, a large golden fish appeared in the ocean of inundation. The fish had one horn and was inconceivably long.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృఙ్గః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṅgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

22 ఏప్రి, 2014

535. త్రిదశాధ్యక్షః, त्रिदशाध्यक्षः, Tridaśādhyakṣaḥ

ఓం త్రిదశాధ్యక్షాయ నమః | ॐ त्रिदशाध्यक्षाय नमः | OM Tridaśādhyakṣāya namaḥ


త్రిదశాధ్యక్షః, त्रिदशाध्यक्षः, Tridaśādhyakṣaḥ

గుణావేశేన సఞ్జాతా అవస్థా జాగ్రదాదయః ।
త్రిసో దశాస్తదధ్యక్ష స్త్రిదశాధ్యక్ష ఉచ్యతే ॥

సత్త్వము మొదలగు ఆయాగుణముల ఆవేశముచే కలుగు జాగ్రత్, స్వప్న, సుషుప్తి దశలకు మూడిటికిని అధ్యక్షుడు అనగా వానికి పైన తానుండి వానిని సాక్షాత్తుగా అవి తానై చూచువాడు గనుక ఆ దేవ దేవునికి త్రిదశాధ్యక్షః అను నామముగలదు.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. ...జాగరణస్వప్న సుషుప్తులను వృత్తు లెవ్వనిచేత గంధాశ్రయుండయిన వాయువు నెఱింగెడు భంగి ద్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబు లయిన బుద్ధిబేదంబుల నాత్మ నెరుంగందగు నని చెప్పి. (237)

...జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు! సుమాలకు ఉండే సువాసన వల్ల వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములూ, కర్మజన్యములూ అయిన బుద్ధిబేదాల వల్ల ఆత్మను తెలుసుకోవచ్చును.



गुणावेशेन सञ्जाता अवस्था जाग्रदादयः ।
त्रिसो दशास्तदध्यक्ष स्त्रिदशाध्यक्ष उच्यते ॥

Guṇāveśena sañjātā avasthā jāgradādayaḥ,
Triso daśāstadadhyakṣa stridaśādhyakṣa ucyate.

By the combination with guṇas i.e., Sattva, Rajas and Tamas - arise three states of the mind viz., jāgrat (awake), svapna (dream) and suṣupti (deep sleep). He being unaffected by them, presides upon these states as the witness and hence He is Tridaśādhyakṣaḥ.

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे सप्तमोऽध्यायः ::
बुद्धेर्जागरणं स्वप्नः सुषुप्तिरिति वृत्तयः ।
ता येनैवानुभूयन्ते सोऽध्यक्षः पुरुषः परः ॥ २५ ॥ 

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 7
Buddherjāgaraṇaṃ svapnaḥ suṣuptiriti vr̥ttayaḥ,
Tā yenaivānubhūyante so’dhyakṣaḥ puruṣaḥ paraḥ. 25.

The state of mind or intelligence can be perceived in three states of activity - wakefulness, dreaming and deep sleep. The entity which perceives these three is to be considered the original master, the ruler and the Supreme Lord.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

21 ఏప్రి, 2014

534. త్రిపదః, त्रिपदः, Tripadaḥ

ఓం త్రిపదాయ నమః | ॐ त्रिपदाय नमः | OM Tripadāya namaḥ


త్రిపదః, त्रिपदः, Tripadaḥ

అస్య త్రీణి పదానీతి త్రిపదో విష్ణురుచ్యతే ।
త్రీణి పదా విచక్రమ ఇత్ శ్రుతిసమీరణాత్ ॥

మూడు అడుగులతో త్రిలోకములనూ ఆక్రమీంచినవాడు గనుక, ఆ విష్ణుదేవుని త్రిపదః అని కీర్తింతురు. త్రీణి పదా విచక్రమే (ఋగ్వేదము, తైత్తిరీయ బ్రాహ్మణము 2.4.6) మూడు అడుగులతో పరమాత్మ లోకత్రయమును విక్రమించెనని శ్రుతి చెప్పుచున్నది.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
సీ. దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంతభూమియు నొక్క యడుగయ్యె నాకును; స్వర్లోకమును నొక్క చరణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు; గడమ పాదమునకుఁ గలదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు నిరయంబుఁ బొందుట నిజము గాదె?
తే. కాన దుర్గతికిని గొంతకాల మరుగు, కాక యిచ్చెదవేని వేగంబు నాకు
నిపుడు మూఁడవ పదమున కిమ్ము చూపు, బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె? (641)

ఓ దనుజేంద్రా! మూడడుగుల నేల ఇస్తానంటివి. భూలోకమూ చంద్ర సూర్యులదాకా ఉండే స్థలమూ నాకు ఒక అడుగైనది. స్వర్గలోకం ఒక అడుగైనది. నీ సంపద అంతా ఈ నాడు రెండడుగులైనది. ఇక మూడవ అడుగుకు ఎక్కడుంది చోటు? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజం. అందువల్ల కొంతకాలం నరకానికి వెళ్ళు. అట్లా కాకుండా మూడవ అడుగు ఇవ్వదలచుకొంటే ఆ చోటు నాకు తొందరగా చూపు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనటానికి బ్రహ్మకుకూడా సాధ్యం కాదు కదా!



अस्य त्रीणि पदानीति त्रिपदो विष्णुरुच्यते ।
त्रीणि पदा विचक्रम इत् श्रुतिसमीरणात् ॥

Asya trīṇi padānīti tripado viṣṇurucyate,
Trīṇi padā vicakrama it śrutisamīraṇāt.

He has placed three steps to occupy the three worlds and hence He is Tripadaḥ.

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे सप्तमोऽध्यायः ::
ज्यायान्गुणैरवरजोऽप्यदितेः सुतानां
     लोकान्विचक्रम इमान्यदथाअथाधियज्ञः ।
क्ष्मां वामनेन जगृहे त्रिपदच्छलेन
     याच्ञामृते पथि चरन्प्रभुभिर्न चाल्यः ॥ १७ ॥

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 17
Jyāyānguṇairavarajo’pyaditeḥ sutānāṃ
     Lokānvicakrama imānyadathāathādhiyajñaḥ,
Kṣmāṃ vāmanena jagr̥he tripadacchalena
     Yācñāmr̥te pathi caranprabhubhirna cālyaḥ. 17.

The Lord, although transcendental to all material modes, still surpassed all the qualities of the sons of Aditi, known as the Ādityas. The Lord appeared as the youngest son of Aditi. And because He surpassed all the planets of the universe, He is the Supreme God. On the pretense of asking for a measurement of three footsteps of land, He took away all the lands of Bali Mahārāja. He asked simply because without begging, no authority can take one's rightful possession.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

20 ఏప్రి, 2014

533. మేదినీ పతిః, मेदिनी पतिः, Medinī Patiḥ

ఓం మేదినీపతయే నమః | ॐ मेदिनीपतये नमः | OM Medinīpataye namaḥ


మేదినీ పతిః, मेदिनी पतिः, Medinī Patiḥ

మేదిన్యాస్సపతిర్భూమ్యా మేదినీపతిరుచ్యతే మేదిని అనగా భూమి. మేదినీపతిః అనగా భూమి యొక్క పతి. మధు-కైటభులతో సంహార ఘట్టమునందు, మధు మెద అనగా క్రొవ్వు యొక్క పిండరూపమే ఈ భూమిగనుక మేదినీ అని పేరు.

:: ప్రాతః స్మరణ మన్త్రము ::
సముద్రవసనే దేవిః పర్వతస్థనమణ్డలే ।
విష్ణుపత్నిః నమస్థుభ్యం పాదస్పర్శ క్షమస్వ మే ॥

సముద్రములను వస్త్రముగా ధరించి, పర్వతములను స్థన మండలముగాగలిగిన ఓ విష్ణుపత్నీ నీకు నమస్కారము; నా పాదస్పర్శను క్షమించ ప్రార్థన.



मेदिन्यास्सपतिर्भूम्या मेदिनीपतिरुच्यते / Medinyāssapatirbhūmyā medinīpatirucyate Medinī means earth and Patiḥ is Lord. The Lord of the earth is Medinī Patiḥ. The earth is considered to be the Meda or tallow lump of the asura Madhu who was killed by Lord Viṣṇu and hence she is known as Medinī.

:: प्रातः स्मरण मन्त्र ::
समुद्रवसने देविः पर्वतस्थनमण्डले ।
विष्णुपत्निः नमस्थुभ्यं पादस्पर्श क्षमस्व मे ॥ 

Morning prayer
Samudravasane deviḥ parvatasthanamaṇḍale,
Viṣṇupatniḥ namasthubhyaṃ pādasparśa kṣamasva me.

The devi who has ocean as her garment and the mountain ranges as her bosom, the one who is the consort of Lord Viṣṇu, I bow to you; please forgive us for touching you with our feet.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

19 ఏప్రి, 2014

532. కృతజ్ఞః, कृतज्ञः, Kr̥tajñaḥ

ఓం కృతజ్ఞాయ నమః | ॐ कृतज्ञाय नमः | OM Kr̥tajñāya namaḥ


కార్యం జగత్కృతమితి జ్ఞ ఇత్యాత్మోచ్యతే హరిః ।
కృతస్యజ్ఞ ఇతి పరః కృతజ్ఞ ఇతి కథ్యతే ॥

కృతం అనగా 'చేయబడినది' లేదా 'కార్య' రూపమగు జగత్తు. 'జ్ఞః' అనగా జానాతి లేదా ఎరుగును అనగా 'ఆత్మ'. పరమాత్ముడు జగత్తును తానే, ఆత్మయూ తానేగనుక కృతజ్ఞః.



कार्यं जगत्कृतमिति ज्ञ इत्यात्मोच्यते हरिः ।
कृतस्यज्ञ इति परः कृतज्ञ इति कथ्यते ॥

Kāryaṃ jagatkr̥tamiti jña ityātmocyate hariḥ,
Kr̥tasyajña iti paraḥ kr̥tajña iti kathyate.

Kr̥taṃ is the effect or the world. Jñaḥ is the ātma. He who is both kr̥taṃ and ñaḥ i.e., the world and its knower is Kr̥tajñaḥ.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

18 ఏప్రి, 2014

531. మహర్షిః కపిలాచార్యః, महर्षिः कपिलाचार्यः, Maharṣiḥ Kapilācāryaḥ

ఓం మహర్షయేకపిలాచార్యాయ నమః | ॐ महर्षयेकपिलाचार्याय नमः | OM Maharṣayekapilācāryāya namaḥ


కపిలాచార్యః, कपिलाचार्यः, Kapilācāryaḥ

మహర్షిః కపిలాచార్యః ఇత్యేకం సవిశేషణం ।
మహాంశ్చాసావృషిశ్చేతి మహర్షిః కపలో హరిః ॥
దేవహూత్యాత్మసమ్భూతః కృత్స్నవేదస్య దర్శనాత్ ।
అన్యే తు వేదైకదేశదర్శనాదృషయః స్మృతాః ॥
శుద్దాత్మతత్త్వజ్ఞానస్య సాఙ్ఖ్యస్యాచార్య ఇత్యయమ్ ।
మహర్షిః కపిలాచార్య ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

ఇక్కడ 'మహర్షిః' విశేషణముగా 'కపిలాచార్యః' విశేష్యముగా సవిసేషణమగు ఒకే నామముగా ఈ రెండు పదములును గ్రహించబడును. ఇతరులు వేదపు అల్పాంశమును దర్శించినవారు అగుటచే ఋషులు అనబడుదురు. వేద మంత్ర ద్రష్టకు 'ఋషి' అని వ్యవహారము. కపిలుడు సమగ్ర వేదమునే దర్శించెను. కావున మహాన్ అగు ఋషి లేదా మహర్షి అగును. దేవహూతీ కర్దమ ప్రజాపతులకు విష్ణుదేవుడే పుత్రుడుగా జన్మించెను. ఈతడు 'కపిలః' అను నామము కలవాడును, శుద్ధ తత్త్వ విజ్ఞానమగు సాంఖ్య దర్శనమునకు ఆచార్యుడును కావున 'కపిలాచార్యః' అనబడును.

:: శ్రీమద్భగవద్గీత విభూతి యోగము ::
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః ।
గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ॥ 26 ॥

నేను చెట్లన్నిటియందును రావిచెట్టును. దేవర్షులలో నారదుడను. గంధర్వులలో చిత్రరథుడను. సిద్ధులలో కపిలమునీంద్రుడను నేనే అయియున్నాను.

:: శ్వేతాశ్వతరోపనిషత్ - పఞ్చమోఽధ్యాయః ::
ఓం ద్వే అక్షరే బ్రహ్మపరే త్వనన్తే విద్యాఽవిద్యే నిహితే యత్ర గూఢే । 
క్షరం త్వవిద్యా హ్యమృతం తువ్ దియా । 
విద్యాఽవిద్యే ఈశతే యస్తుసోఽన్యః ॥ 1 ॥
యోఽయోనిం యోని మదితిష్ఠ త్యేకో విశ్వాని రూపాణి యోనిశ్చ సర్వాః ।
ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రేజ్ఞానైర్భి జాయమానం చ పశ్యేత్ ॥ 2 ॥

విద్య, అవిద్య అనునవీరెండునూ నాశరహితములు, అపరిచ్ఛిన్నములు. పరబ్రహ్మమునందు నిగూఢముగా ఉంచబడినవి. అవిద్య నశించునది, విద్య అమృతము. ఎవడు విద్యా అవిద్యలను నియమించుచున్నాడో, అతడు వాటికంటె అన్యముగానున్నవాడు. పృథివ్యాది సకల యోనులను, సకల రూపములను అయా ఉత్పత్తి స్థానములను ఎవడు అధిష్ఠించియున్నాడో, సర్వజ్ఞుడును కపిలవర్ణముగలవాడునూనగు హిరణ్యగర్భుని ఆదిలో ఎవడు సృజించెనో, సృష్టిసమయములో ఎవడు ధర్మజ్ఞాన వైరాగ్య భాగ్యములను భరించియున్నాడో, అతడే పరమాత్మ.



महर्षिः कपिलाचार्यः इत्येकं सविशेषणं ।
महांश्चासावृषिश्चेति महर्षिः कपिलो हरिः ॥
देवहूत्यात्मसम्भूतः कृत्स्नवेदस्य दर्शनात् ।
अन्ये तु वेदैकदेशदर्शनादृषयः स्मृताः ॥
शुद्दात्मतत्त्वज्ञानस्य साङ्ख्यस्याचार्य इत्ययम् ।
महर्षिः कपिलाचार्य इति सङ्कीर्त्यते बुधैः ॥ 

Maharṣiḥ kapilācāryaḥ ityekaṃ saviśeṣaṇaṃ,
Mahāṃścāsāvr̥ṣiśceti maharṣiḥ kapilo hariḥ.
Devahūtyātmasaṃbhūtaḥ kr̥tsnavedasya darśanāt,
Anye tu vedaikadeśadarśanādr̥ṣayaḥ smr̥tāḥ.
Śuddātmatattvajñānasya sāṃkhyasyācārya ityayam,
Maharṣiḥ kapilācārya iti saṃkīrtyate budhaiḥ.

This is one Name with an adjective; mahān r̥ṣiḥ is Mahar̥ṣiḥ i.e., He is great as he saw with intuitive vision the entire body of Vedas. Others are only ordinary r̥ṣis as they saw only a part of the knowledge of Sāṅkhya which is also Truth.

:: श्रीमद्भगवद्गीत विभूति योग ::
अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥ २६ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Aśvatthaḥ sarvavr̥kṣāṇāṃ devarṣīṇāṃ ca nāradaḥ,
Gandharvāṇāṃ citrarathaḥ siddhānāṃ kapilo muniḥ. 26.

Among all trees, I am the Aśvattha i.e., fig tree and Nārada among the divine sages. Among the Gandharvas I am Citraratha and among the perfected ones, the sage Kapila.

:: श्वेताश्वतरोपनिषत् - पञ्चमोऽध्यायः ::
ॐ द्वे अक्षरे ब्रह्मपरे त्वनन्ते विद्याऽविद्ये निहिते यत्र गूढे । 
क्षरं त्वविद्या ह्यमृतं तुव् दिया । 
विद्याऽविद्ये ईशते यस्तुसोऽन्यः ॥ १ ॥
योऽयोनिं योनि मदितिष्ठ त्येको विश्वानि रूपाणि योनिश्च सर्वाः ।
ऋषिं प्रसूतं कपिलं यस्तमग्रेज्ञानैर्भि जायमानं च पश्येत् ॥ २ ॥

Śvetāśvatara Upaniṣat - Chapter 5
Oṃ dve akṣare brahmapare tvanante vidyā’vidye nihite yatra gūḍe, 
Kṣaraṃ tvavidyā hyamr̥taṃ tuv diyā,
Vidyā’vidye īśate yastuso’nyaḥ.
1.
Yo’yoniṃ yoni maditiṣṭha tyeko viśvāni rūpāṇi yoniśca sarvāḥ,
R̥ṣiṃ prasūtaṃ kapilaṃ yastamagrejñānairbhi jāyamānaṃ ca paśyet. 2.

In the Immutable, infinite Supreme Brahman remain hidden the two: knowledge and ignorance. Ignorance leads to worldliness and knowledge, to Immortality. Brahman, who controls both knowledge and ignorance, is different from both.

He, the non-dual Brahman, who rules over every position; who controls all forms and all sources; who, in the beginning, filled with knowledge the omniscient Hiranyagarbha, His own creation, whom He beheld when He (Hiranyagarbha) was produced - He is other than both knowledge and ignorance.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

17 ఏప్రి, 2014

530. త్రివిక్రమః, त्रिविक्रमः, Trivikramaḥ

ఓం త్రివిక్రమాయ నమః | ॐ त्रिविक्रमाय नमः | OM Trivikramāya namaḥ


త్రివిక్రమః, त्रिविक्रमः, Trivikramaḥ

విక్రమాస్తిషు లోకేషు త్రయః క్రాన్తాశ్చ యస్య సః ।
త్రివిక్రమః ఇతి ప్రోక్తో విష్ణుర్విద్వద్భిరుత్తమైః ॥

మూడు లోకములయందునూ విన్యాసము చేయబడిన మూడు పాదన్యాసములు ఎవనికి కలవో అట్టివాడు - వామనావతారము. 'త్రీణి పదా విచక్రమే' మూడు అడుగులతో విక్రమించెను అని శ్రుతి వచించుచున్నది.

:: హరివంశే భవిష్యపర్వణి కైలాసయాత్రాయాం శివకృతవిష్ణుస్తుతౌ అష్టాశీతితమోఽధ్యాయః ::
త్రిరిత్యేవ త్రయో లోకాః కీర్తితా మునిసత్తమైః । 
క్రమతే తాంస్త్రిధా సర్వాం స్త్రివిక్రమ ఇతి శ్రుతః ॥ 51 ॥

'త్రి' అనగా మూడు లోకములు అని మునిశ్రేష్ఠులచే కీర్తించబడుచున్నది. వానినన్నిటిని మూడు విధములుగా విశేషముగా క్రమించుచున్నాడు అనగా వానియందు అడుగులు వేయుచున్నాడు కావున త్రివిక్రమః అని శాస్త్ర పురాణాదులయందు హరి వినబడుచున్నాడు.



विक्रमास्तिषु लोकेषु त्रयः क्रान्ताश्च यस्य सः ।
त्रिविक्रमः इति प्रोक्तो विष्णुर्विद्वद्भिरुत्तमैः ॥

Vikramāstiṣu lokeṣu trayaḥ krāntāśca yasya saḥ,
Trivikramaḥ iti prokto viṣṇurvidvadbhiruttamaiḥ.

He whose three steps encompassed the three worlds, vide the śruti 'Trīṇi padā vicakrame' meaning 'He measured by three steps.'

:: हरिवंशे भविष्यपर्वणि कैलासयात्रायां शिवकृतविष्णुस्तुतौ अष्टाशीतितमोऽध्यायः ::
त्रिरित्येव त्रयो लोकाः कीर्तिता मुनिसत्तमैः । 
क्रमते तांस्त्रिधा सर्वां स्त्रिविक्रम इति श्रुतः ॥ ५१ ॥

Harivaṃśa - Section 3, Chapter 88
Trirityeva trayo lokāḥ kīrtitā munisattamaiḥ, 
Kramate tāṃstridhā sarvāṃ strivikrama iti śrutaḥ. 51.

By the soud 'tri', the great munis or ascetics mean the three worlds. Lord Janārdana strode three steps. Therefore He is said to be Trivikrama.'

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

16 ఏప్రి, 2014

529. సత్యధర్మాః, सत्यधर्माः, Satyadharmāḥ

ఓం సత్యధర్మణే నమః | ॐ सत्यधर्मणे नमः | OM Satyadharmaṇe namaḥ


సత్యధర్మాః, सत्यधर्माः, Satyadharmāḥ

సత్యధర్మా హరేరస్య జ్ఞానాదయ ఉదాహృతాః |
సవిష్ణుస్సత్యధర్మేతి కథ్యతే విధుషాం వరైః ||

ఈతనికి జ్ఞానము మొదలగు సత్యములగు ధర్మములు కలవు.

:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::
సత్యధర్మపరశ్శ్రీమాన్ సఙ్గ్రహానుగ్రహే రతః ।
దేశకాలవిభాగజ్ఞః సర్వలోక ప్రియంవదః ॥ 21 ॥

శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు, సత్యభాషణమునందును, ధర్మాచరణమునందును నిరతుడు, ధర్మమార్గమున ధనమునార్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు, అందరితోడను ప్రియముగా మాట్లాడెడివాడు.



सत्यधर्मा हरेरस्य ज्ञानादय उदाहृताः ।
सविष्णुस्सत्यधर्मेति कथ्यते विधुषां वरैः ॥

Satyadharmā harerasya jñānādaya udāhr̥tāḥ,
Saviṣṇussatyadharmeti kathyate vidhuṣāṃ varaiḥ.

One whose dharmas or attributes like jñāna etc are true.

:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ::
सत्यधर्मपरश्श्रीमान् सङ्ग्रहानुग्रहे रतः ।
देशकालविभागज्ञः सर्वलोक प्रियंवदः ॥ २१ ॥

Śrīmad Rāmāyaṇa - Book 5, Chapter 35
Satyadharmaparaśśrīmān saṅgrahānugrahe rataḥ,
Deśakālavibhāgajñaḥ sarvaloka priyaṃvadaḥ. 21.

Rama is engrossed in truth and righteousness. He is a prosperous man. He is interested in reception and facilitation. He knows how to apportion place and time. He speaks affectionately with all.

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

15 ఏప్రి, 2014

528. నన్దః, नन्दः, Nandaḥ (అనన్దః, अनन्दः, Anandaḥ)

ఓం నన్దాయ నమః | ॐ नन्दाय नमः | OM Nandāya namaḥ


నన్దః, नन्दः, Nandaḥ (అనన్దః, अनन्दः, Anandaḥ)

మహావిష్ణుస్ససమృద్ధః సర్వాభిరుపపత్తిభిః ।
నన్ద ఇత్యుచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥
నన్దస్సుఖం వైషయికం నాస్త్యనన్ద ఇతీర్యతే ।
యో వై భూమా తత్సుఖమిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥

'నన్దః' - అన్ని విధములగు సిద్ధులచే నిండియుండును. ఇచట 'నందనః' మరియూ 'అనందః' అను విభాగమునైన చేయవచ్చును. అపుడు, 'అనన్దః' అను నామమునకు - ఎవనికి శబ్దాది విషయములననుభవించుటచే కలుగు ఆనందము ఉండదో అట్టివాడు అను అర్థము చెప్పవచ్చును.

:: ఛాన్దోగ్యోపనిషత్ - సప్తమః ప్రపాఠకః, త్రయోవింశః ఖణ్డః ::
యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖ మస్తి భూమైవ సుఖం ।
భూమాత్వేన విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి ॥ 1 ॥

భూమా (అనగా గొప్పది, బ్రహ్మము, ఆత్మ) అనునదియే సుఖము. అల్పమైనదానియందు సుఖము ఉండదు. కావున భూమయే సుఖము. ఆ గొప్పదియగు ఆత్మనే తెలిసికొనవలయును... (పరమ మహత్పరిణమముతో నిండియుండు పరమాత్ముడు తానే సుఖస్వరూపుడు కావున ఆతనికి ఇతరములనుండి సుఖమును పొందవలసిన పనియే లేదు).



महाविष्णुस्ससमृद्धः सर्वाभिरुपपत्तिभिः ।
नन्द इत्युच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥
नन्दस्सुखं वैषयिकं नास्त्यनन्द इतीर्यते ।
यो वै भूमा तत्सुखमित्यादिश्रुतिसमीरणात् ॥

Mahāviṣṇussasamr̥ddhaḥ sarvābhirupapattibhiḥ,
Nanda ityucyate sadbhirvedavidyāviśāradaiḥ.
Nandassukhaṃ vaiṣayikaṃ nāstyananda itīryate,
Yo vai bhūmā tatsukhamityādiśrutisamīraṇāt.

Nandaḥ - Rich with all things to be attained. Or Anandaḥ - He who does not need to seek sensory and such pleasures from anything.

:: छान्दोग्योपनिषत् - सप्तमः प्रपाठकः, त्रयोविंशः खण्डः ::
योवै भूमा तत्सुखं नाल्पे सुख मस्ति भूमैव सुखं ।
भूमात्वेन विजिज्ञासितव्य इति भूमानं भगवो विजिज्ञास इति ॥ १ ॥

Chāndogyopaniṣat - Chapter 7, Section 23
Yovai bhūmā tatsukhaṃ nālpe sukha masti bhūmaiva sukhaṃ,
Bhūmātvena vijijñāsitavya iti bhūmānaṃ bhagavo vijijñāsa iti. 1.

The infinite is bliss. There is no bliss in anything finite. One must desire to understand that which is infinite... (Since He himself is bliss, there is nothing else from which He can seek pleasure).

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

14 ఏప్రి, 2014

527. నన్దనః, नन्दनः, Nandanaḥ

ఓం నన్దనాయ నమః | ॐ नन्दनाय नमः | OM Nandanāya namaḥ


నన్దనః, नन्दनः, Nandanaḥ

నన్దయతీతి నన్దన ఇత్యుక్తో విభుదైర్హరిః ఆనందమును కలుగజేయువాడు నందనః.

ముకున్ద మాలా స్తోత్రం (2)
జయతు జయతు దేవో దేవకీనన్దనోఽయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాఙ్గో
జయతు జయతు పృథ్వీభారనాశో ముకున్దః


దేవకీదేవి నందనుడికి (ఆనందమును కలుగజేయువాడు లేదా పుత్రుడికి) జయమగుగాక
వృష్ణివంశ ప్రదీపుడైన కృష్ణునికి జయమగుగాక
మేఘశ్యామలవర్ణముతో కోమలమైన అంగములుగలవాడికి జయమగుగాక
భూభారాన్ని నశింపజేసే ముకుందునికి జయమగుగాక



नन्दयतीति नन्दन इत्युक्तो विभुदैर्हरिः / Nandayatīti nandana ityukto vibhudairhariḥ He pleases or causes delight and hence He is Nandanaḥ.

मुकुन्द माला स्तोत्र (२)
जयतु जयतु देवो देवकीनन्दनोऽयं
जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः
जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो
जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः


Mukunda mālā stotra (2)
Jayatu jayatu devo devakīnandano’yaṃ
Jayatu jayatu kr̥ṣṇo vr̥ṣṇivaṃśapradīpaḥ
Jayatu jayatu meghaśyāmalaḥ komalāṅgo
Jayatu jayatu pr̥thvībhāranāśo mukundaḥ


All glories to Him who is the son of Devakī devī! All glories to Lord Śrī Kṛṣṇa, the brilliant scion of the Vṛṣṇi dynasty! All glories to Him who is with tender limbs of dark color of a new cloud! All glories to Lord Mukunda, who eradicates the burdens of the earth!

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

13 ఏప్రి, 2014

526. ఆనన్దః, आनन्दः, Ānandaḥ

ఓం ఆనన్దాయ నమః | ॐ आनन्दाय नमः | OM Ānandāya namaḥ


ఆనన్దః, आनन्दः, Ānandaḥ

ఆనన్దోఽస్య స్వరూప మిత్యానన్ద ఇతి కీర్త్యతేః ।
యే తస్యేత్యాది బృహదారణ్యక శ్రుతి వాక్యతః ॥

ఆనందమే తన స్వరూపముగా కలవాడుగనుక ఆనన్దః.

:: బృహదారణ్యకోపనిషత్ - షష్ఠాధ్యాయః, తృతీయం బ్రాహ్మణమ్ ::
సలిల ఏకో ద్రష్టాఽద్వైతో భవ త్యేష బ్రహ్మలోకః స మ్రాడితి హైన మనుశశాన యాజ్ఞవల్క్య ఏషాస్య పరమా గతి రేషాస్యపరమా సమ్పదేషోఽస్య పరమోలోక ఏషోఽస్య పరమ ఆనన్ద ఏతస్యైవా నన్ద స్యాన్యాని భూతాని మాత్రా ముపజీవన్తి (32)

ఆత్మ స్వచ్ఛమైన ఉదకము. ఉదకమునందువలెనే, సుషుప్తియందు రెండవ వస్తువులేనిది. దేహేంద్రియోపాధి భేదములేని ఈ ఆత్మ, ఈ సుషుప్తికాలమునందు స్వకీయమైన ఆత్మ తేజస్సునందున్నది. ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమైన లోకము. ఈ విధముగా యాజ్ఞవల్క్య ఋషి జనకమహారాజునకు బోధించెను. ఈ విజ్ఞానమయాత్మకు ఇది శ్రేష్ఠమైన స్థానము మరియూ శ్రేష్ఠమైన సంపత్తు. ఇదియే శ్రేష్ఠమైన లోకము. ఇదియే శ్రేష్ఠమైన ఆనందము. ఇతర భూతములు ఈ ఆనందము యొక్క అంశమును అనుసరించి జీవించుచున్నవి.



आनन्दोऽस्य स्वरूप मित्यानन्द इति कीर्त्यतेः ।
ये तस्येत्यादि बृहदारण्यक श्रुति वाक्यतः ॥

Ānando’sya svarūpa mityānanda iti kīrtyateḥ,
Ye tasyetyādi br̥hadāraṇyaka śruti vākyataḥ.

His form or nature is Ānanda or bliss and hence He is Ānandaḥ.

:: बृहदारण्यकोपनिषत् - षष्ठाध्यायः, तृतीयं ब्राह्मणम् ::
सलिल एको द्रष्टाऽद्वैतो भव त्येष ब्रह्मलोकः स म्राडिति हैन मनुशशान याज्ञवल्क्य एषास्य परमा गति रेषास्यपरमा सम्पदेषोऽस्य परमोलोक एषोऽस्य परम आनन्द एतस्यैवा नन्द स्यान्यानि भूतानि मात्रा मुपजीवन्ति (३२)

Br̥hadāraṇyaka Upaniṣat - Section 6, Chapter 3
Salila eko draṣṭā’dvaito bhava tyeṣa brahmalokaḥ sa mrāḍiti haina manuśaśāna yājñavalkya eṣāsya paramā gati reṣāsyaparamā sampadeṣo’sya paramoloka eṣo’sya parama ānanda etasyaivā nanda syānyāni bhūtāni mātrā mupajīvanti (32)

It becomes transparent like water, one, the witness and without a second. This is the world or state of Brahman, O Emperor. Thus did Yājñavalkya instructs Janaka: This is its supreme attainment, this is its supreme glory, this is its highest world, this is its supreme bliss. One a particle of this very bliss, other being live.

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

12 ఏప్రి, 2014

525. ప్రమోదనః, प्रमोदनः, Pramodanaḥ

ఓం ప్రమోదాయ నమః | ॐ प्रमोदाय नमः | OM Pramodāya namaḥ


విష్ణుస్స్వాత్మామృతరసాస్వాదాన్నిత్యం ప్రమోదతే ।
ధ్వాయినో ధ్యానమాత్రేణ ప్రమోదయతి వేతి సః ।
ప్రమోదన ఇతిప్రోక్తః స్వానన్దానుభవైర్భుధైః ॥

తన ఆత్మ తత్త్వము అను అమృత రసమును పానము చేయుటచేతనే నిత్యమును ప్రమోదించుచుండునుగనుక ప్రమోదనః. లేదా తనను ధ్యానించువారికి ధ్యానమాత్రము చేతనే ప్రమోదమును కలిగించును గనుక ఆ శ్రీ మహా విష్ణువునకు ప్రమోదనః అని నామము.



विष्णुस्स्वात्मामृतरसास्वादान्नित्यं प्रमोदते ।
ध्वायिनो ध्यानमात्रेण प्रमोदयति वेति सः ।
प्रमोदन इतिप्रोक्तः स्वानन्दानुभवैर्भुधैः ॥

Viṣṇussvātmāmr̥tarasāsvādānnityaṃ pramodate,
Dhvāyino dhyānamātreṇa pramodayati veti saḥ,
Pramodana itiproktaḥ svānandānubhavairbhudhaiḥ.

By drinking the nectar of His own self by contemplation on His own blissful self; or in other words the One who is always joyous as He is absorbed in immortal bliss, He is called Pramodanaḥ.

It can also be interpreted as the One who causes delight to those - merely as a result of their contemplation upon Him is Pramodanaḥ.

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

11 ఏప్రి, 2014

524. జితాఽమిత్రః, जिताऽमित्रः, Jitā’mitraḥ

ఓం జితామిత్రాయ నమః | ॐ जितामित्राय नमः | OM Jitāmitrāya namaḥ


జితా అమిత్రా యేనాం తర్వర్తినో దుఃఖహేతవః ।
రాగద్వేషాదయో బాహ్యాశ్చాపి వా రావణాదయః ।
స శ్రీ విష్ణుర్జితామిత్ర ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

అంతఃకరణవర్తులైన రాగద్వేషాదులును, బాహ్యులగు రావణాది శత్రువులను జయించిన శ్రీ విష్ణుదేవుడు జితాఽమిత్రః అని చెప్పబడును.



जिता अमित्रा येनां तर्वर्तिनो दुःखहेतवः ।
रागद्वेषादयो बाह्याश्चापि वा रावणादयः ।
स श्री विष्णुर्जितामित्र इति सङ्कीर्त्यते बुधैः ॥

Jitā amitrā yenāṃ tarvartino duḥkhahetavaḥ,
Rāgadveṣādayo bāhyāścāpi vā rāvaṇādayaḥ,
Sa śrī viṣṇurjitāmitra iti saṅkīrtyate budhaiḥ.


Since He has conquered the internal enemies of attachment, aversion etc., and also the external enemies like Rāvaṇa, Lord Viṣṇu is called Jitā’mitraḥ.

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

10 ఏప్రి, 2014

523. స్వాఽభావ్యః, स्वाऽभाव्यः, Svā’bhāvyaḥ

ఓం స్వాభావ్యాయ నమః | ॐ स्वाभाव्याय नमः | OM Svābhāvyāya namaḥ


నిత్యనిష్పన్నరూపత్వాత్ స్వాభావ్యో యస్స్వభావతః ।
మహావిష్ణు స్స విద్వద్భిః స్వాభావ్య ఇతి కథ్యతే ॥

జన్మ అన్నదే లేక శాశ్వతముగా సిద్ధించిన స్వయం ప్రకాశ చిద్రూపము కలవాడుగావున తన స్వభావము చేతనే 'అభావ్యుడు' లేదా జనింప జేయబడనివాడుగనుక ఆ శ్రీ మహావిష్ణువు స్వాఽభావ్యః.



नित्यनिष्पन्नरूपत्वात् स्वाभाव्यो यस्स्वभावतः ।
महाविष्णु स्स विद्वद्भिः स्वाभाव्य इति कथ्यते ॥

Nityaniṣpannarūpatvāt svābhāvyo yassvabhāvataḥ,
Mahāviṣṇu ssa vidvadbhiḥ svābhāvya iti kathyate.

As He is eternal and self-existent, He is by nature such that He cannot be born (Svabhāvena abhāvyaḥ).

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

9 ఏప్రి, 2014

522. మహాఽర్హః, महाऽर्हः, Mahā’rhaḥ

ఓం మహార్హాయ నమః | ॐ महार्हाय नमः | OM Mahārhāya namaḥ


మహాఽర్హః, महाऽर्हः, Mahā’rhaḥ

మహః పూజా తదర్హత్వాన్మహార్హ ఇతి కథ్యతే పూజలనందుకొనుటకు అర్హుడుగనుక ఆ పరమేశ్వరుడు మహార్హుడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
వ. పూజించునప్పు డం దగ్రపూజార్హు లెవ్వ రని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతుర వచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకుల సంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి 'యీ మహాత్ముని సంతుష్టుం జేసిన భువనంబులన్నియుం బరితుష్టిం బొందు' నని జెప్పి ధర్మజుం జూచి ఇట్లనియె. (777)
ఉ. కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్ జగ

జ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్‍

వేళలు విప్రులున్ జననవృద్ధిలయంబుల హేతుభూతముల్‍

లీలలఁ దానయై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్‍. (778)
చ. ఇతఁడే యితండు గన్ను లొకయించుక మెడ్చిన నీ చరాచర

స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్‍

వితతములై జనించుఁ బ్రబవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ

క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్‍? (779)
ఉ. ఈ పురుషోత్తమున్ జగదధీశు ననంతుని సర్వశక్తుఁ జి

ద్రూపకు నగ్రపుజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‍

వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్‍

శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్‍? (780)

ఈ విధంగా పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హుడెవడనే ప్రశ్న పుట్టింది. సభలో ఉన్నవారు తమకు తోచిన విధంగా తలకొకరీతిగా చెప్పారు. వారి మాటలను వారించి బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన కృష్ణుడిని చూపించి 'ఈ మహాత్ముడిని సంతుష్టుడిని చేసిన సమస్త లోకాలు సంతోషిస్తాయి' అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు.

కాలమూ, దేశమూ, యజ్ఞమూ, కర్మమూ, కర్తా, భోక్తా, ప్రపంచమూ, దైవమూ, గురువూ, మంత్రమూ, అగ్నీ, హవ్యద్రవ్యాలూ, సృష్టి-స్థితి-లయలు సమస్తమూ తానేయై ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ కృష్ణ పరమాత్ముడొక్కడే.

పరమేశ్వరుడైన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొన్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ జన్మిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు కారకుడైన ఈ పుణ్యపురుషుడు యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు విష్ణుస్వరూపుడు. సర్వ సమర్థుడు. అగ్రపూజకు అర్హుడు ఇతడు గాకపోతే మరెవ్వరు?

ఓ రాజా! పురుషోత్తముడూ, లోకాధిపతీ, అనంతుడూ, సమస్త శక్తులు కలవాడూ, చిద్రూపుడూ, అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింపజేసినట్లయిన సమస్త లోకాలూ సంతృప్తినొందుతాయి.



महः पूजा तदर्हत्वान्महार्ह इति कथ्यते / Mahaḥ pūjā tadarhatvānmahārha iti kathyate One who is fit for worship is Mahā’rhaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे चतुःसप्ततितमोऽध्यायः ::
सदस्याग्र्यार्हणार्हं वै विमृशन्तः सभासदः ।
नाध्यगच्छन्ननैकान्त्यात्सहदेवस्तदाब्रवीत् ॥ १८ ॥
अर्हति ह्यच्युतः श्रैष्ठ्यं भगवान्सात्वतां पतिः ।
एश वै देवताः सर्वा देशकालधनादयः ॥ १९ ॥
यदात्मकमिदं विश्वं क्रतवश्च यदात्मकाः ।
अग्निराहुतयो मन्त्रा साङ्ख्यं योगश्च यत्परः ॥ २० ॥
एक एवाद्वितीयोऽसावैतदात्म्यमिदं जगत् ।
आत्मनात्माश्रयः सभ्याः सृजत्यवति हन्त्यजः ॥ २१ ॥
विविधानीह कर्माणि जनयन्यदवेक्शया ।
ईहते यदयं सर्वः श्रेयो धर्मादिलक्शणम् ॥ २२ ॥
तस्मात्कृष्णाय महते दीयतां परमार्हणम् ।
एवं चेत्सर्वभूतानाम् आत्मनश्चार्हणं भवेत् ॥ २३ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 74
Sadasyāgryārhaṇārhaṃ vai vimr̥śantaḥ sabhāsadaḥ,
Nādhyagacchannanaikāntyātsahadevastadābravīt. 18.
Arhati hyacyutaḥ śraiṣṭhyaṃ bhagavānsātvatāṃ patiḥ,
Eśa vai devatāḥ sarvā deśakāladhanādayaḥ. 19.
Yadātmakamidaṃ viśvaṃ kratavaśca yadātmakāḥ,
Agnirāhutayo mantrā sāṃkhyaṃ yogaśca yatparaḥ. 20.
Eka evādvitīyo’sāvaitadātmyamidaṃ jagat,
Ātmanātmāśrayaḥ sabhyāḥ sr̥jatyavati hantyajaḥ. 21.
Vividhānīha karmāṇi janayanyadavekśayā,
Īhate yadayaṃ sarvaḥ śreyo dharmādilakśaṇam. 22.
Tasmātkr̥ṣṇāya mahate dīyatāṃ paramārhaṇam,
Evaṃ cetsarvabhūtānām ātmanaścārhaṇaṃ bhavet. 23.

The members of the assembly then pondered over who among them should be worshiped first, but since there were many personalities qualified for this honor, they were unable to decide. Finally Sahadeva spoke up. He said "Certainly it is Acyuta, the Supreme God and chief of the Yādavas, who deserves the highest position. In truth, He Himself comprises all the gods worshiped in sacrifice, along with such aspects of the worship as the sacred place, the time and the paraphernalia. This entire universe is founded upon Him, as are the great sacrificial performances, with their sacred fires, oblations and mantras. Sāńkhya and yoga both aim toward Him, the One without a second. O assembly members, that unborn Lord, relying solely on Himself, creates, maintains and destroys this cosmos by His personal energies, and thus the existence of this universe depends on Him alone. He creates the many activities of this world, and thus by His grace the whole world endeavors for the ideals of religiosity, economic development, sense gratification and liberation. Therefore we should give the highest honor to Kṛṣṇa, the Supreme Lord. If we do so, we will be honoring all living beings and also our own selves."

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

8 ఏప్రి, 2014

521. అజః, अजः, Ajaḥ

ఓం అజాయ నమః | ॐ अजाय नमः | OM Ajāya namaḥ


అజః, अजः, Ajaḥ

అజస్సకాయో ధాతా వా య ఆద్విష్ణోరజాయత 'అ' అనగా విష్ణువు. ఆ విష్ణువునుండి జనించినవాడుగనుక కాముడు అజుడు అనబడును. అతడునూ విష్ణుని విభూతియే.

:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 11 ॥

భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! నేను బలవంతులయొక్క ఆశ, అనురాగము లేని బలమును; ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకముకాని కామమునూ అయియున్నాను.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామదుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28 ॥

నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేనువును, ప్రజల ధర్మబద్ధమైన యుత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను, సర్పములలో వాసుకియు అయియున్నాను.

95. అజః, अजः, Ajaḥ
204. అజః, अजः, Ajaḥ



अजस्सकायो धाता वा य आद्विष्णोरजायत / Ajassakāyo dhātā vā ya ādviṣṇorajāyata 'A' means Lord Viṣṇu. So the word Ajaḥ means the one born of Viṣṇu. In this context, Manmatha or Kāmadeva or Kandarpa or Cupid is Ajaḥ.

:: श्रीमद्भगवद्गीत - विज्ञान योगमु ::
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 7
Balaṃ balavatāṃ cāhaṃ kāmarāgavivarjitam,
Dharmāviruddho bhūteṣu kāmo’smi bharatarṣabha. 11.

Of the strong, I am the strength which is devoid of passion and attachment. Among creatures, I am desire which is not contrary to righteousness, O scion of Bharata dynasty.

:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामदुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmaduk,
Prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ. 28 .

Among weapons I am the thunderbolt; among cows I am Kāmadhenu. I am Kandarpa, the progenitor, and among serpents I am Vāsuki.

95. అజః, अजः, Ajaḥ
204. అజః, अजः, Ajaḥ
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।
आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,
Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

7 ఏప్రి, 2014

520. అన్తకః, अन्तकः, Antakaḥ

ఓం అన్తకాయ నమః | ॐ अन्तकाय नमः | OM Antakāya namaḥ


అన్తం కరోతి భూతానా మిత్యన్తకః ఉదీరితః ।
తత్కరోతి తదాచష్ట ఇతిణిచ్ప్రత్యయేకృతే ॥

భూతములకు అంతమును కలిగించునుగనుక, అన్తకః. సాత్వతాం పతిః నామవివరణమునందు తత్కోరితి తదాచష్టే అను పాణిని సూత్రమునుబట్టి, ఈ నామ వివరణయందును అన్త + అక = అన్త్ + అక = అన్తకః అగుచున్నది.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
క. మదిఁ దలపోయఁగ జల బు, ద్బుదములు ధరఁ బుట్టి పొలియు పోలిక గల యీ
    త్రిదశాది దేహములలో, వదలక వర్తించు నాత్మవర్గము నోలిన్‍. (1224)
ఆ. ప్రళయవేళ నీవు భరియింతు వంతకుఁ, గారణంబ వగుటఁ గమలనాభ!
     భక్తపారిజాత! భవ భూరి తిమిర ది, నేశ! దుష్టదైత్యనాశ! కృష్ణ! (1225)

నీళ్ళల్లో బుడగలు పుట్టి నశించిపోయే విధంగా ఆత్మ సమూహం దేవతాదుల దేహాలలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి శరీరాలలో అంతరాత్మవై నీవు వర్తించి ప్రళయ సమయమునందు వాటిని నీలో లీనము చేసుకుంటావు. కృష్ణా! నీవు భక్తుల పాలిటి పారిజాతానివి. భవబంధాలను దూరంచేసేవాడివి. దుష్ట శిక్షకుడవు.



अन्तं करोति भूताना मित्यन्तकः उदीरितः ।
तत्करोति तदाचष्ट इतिणिच्प्रत्ययेकृते ॥

Antaṃ karoti bhūtānā mityantakaḥ udīritaḥ,
Tatkaroti tadācaṣṭa itiṇicpratyayekr̥te.

As He brings about the end of all beings, He is Antakaḥ. The 'tatkaroti tadācaṣṭe' rule of pāṇini, as used in the elucidation of the divine name Sāttvatāṃ patiḥ is also applicable here.

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
प्रमत्तमुच्चैरिति कृत्यचिन्तया प्रवृद्धलोभं विषयेषु लालसम् ।
त्वमप्रमत्तः सहसाभीपद्यसे क्षुल्लेलिहानोऽहिरिवाखुमन्तकः ॥ ६६ ॥

Śrīmad Bhāgavata - Canto 4 Chapter 24
Pramattamuccairiti kr̥tyacintayā pravr̥ddhalobhaṃ viṣayeṣu lālasam,
Tvamapramattaḥ sahasābhīpadyase kṣullelihāno’hirivākhumantakaḥ. 66.

My dear Lord, all living entities within this material world are mad after planning for things, and they are always busy with a desire to do this or that. This is due to uncontrollable greed. The greed for material enjoyment is always existing in the living entity, but Your Lordship is always alert, and in due course of time You strike him, just as a snake seizes a mouse and very easily swallows him.

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

6 ఏప్రి, 2014

519. మహోదధిశయః, महोदधिशयः, Mahodadhiśayaḥ

ఓం మహోదధిశయాయ నమః | ॐ महोदधिशयाय नमः | OM Mahodadhiśayāya namaḥ


మహోదధిశయః, महोदधिशयः, Mahodadhiśayaḥ

సర్వభూతాని సంహృత్య కృత్వా చైకార్ణవం జగత్ ।
తస్మిన్ మహోదధౌ శేతే మహోదధిశయస్తతః ॥

సర్వభూతములను సంహరించి జగత్తును ఏకార్ణవమునుగా చేసి, ఆ మహా సముద్రమును ఆశ్రయించి శయనించువాడు మహోదధిశయః.



सर्वभूतानि संहृत्य कृत्वा चैकार्णवं जगत् ।
तस्मिन् महोदधौ शेते महोदधिशयस्ततः ॥

Sarvabhūtāni saṃhr̥tya kr̥tvā caikārṇavaṃ jagat,
Tasmin mahodadhau śete mahodadhiśayastataḥ.

When having reduced all beings to their primal state and having converted the world to one expanse of water, He reclines in it and hence He is Mahodadhiśayaḥ.

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥