31 మే, 2014

574. త్రిసామా, त्रिसामा, Trisāmā

ఓం త్రిసామ్నే నమః | ॐ त्रिसाम्ने नमः | OM Trisāmne namaḥ


దేవవ్రత సమాఖ్యాతైస్సామభిస్సామగైస్త్రిభిః ।
స్తుతోయతస్త్రిసామేతి విష్ణుస్సమభిధీయతే ॥

దేవ వ్రతములు అను సంజ్ఞగల మూడు సామముల ద్వారా సామగుల అనగా సామవేదీయుల చేత స్తుతించబడువాడుగావున ఆ విష్ణు దేవుడు త్రిసామా.



देवव्रत समाख्यातैस्सामभिस्सामगैस्त्रिभिः ।
स्तुतोयतस्त्रिसामेति विष्णुस्समभिधीयते ॥

Devavrata samākhyātaissāmabhissāmagaistribhiḥ,
Stutoyatastrisāmeti viṣṇussamabhidhīyate.

The singers of Sāma praised Him by the three Sāmas named Devavrata; hence Lord Viṣṇu is known by the divine name 'Trisāmā'.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

30 మే, 2014

573. వాచస్పతిరయోనిజః, वाचस्पतिरयोनिजः, Vācaspatirayonijaḥ

ఓం వాచస్పతయే అయోనిజాయ నమః | ॐ वाचस्पतये अयोनिजाय नमः | OM Vācaspataye ayonijāya namaḥ


విద్యాయా ఈశ్వరో వాచస్పతిర్యోనౌ న జాయతే ।
అమాతృగర్భోఽజో విష్ణుర్వాచస్పతిరయోనిజః ॥
ఇతి సహవిశేషణం నామ విష్ణోర్మహాత్మనః ॥

వాక్కునకు అనగా విద్యకు పతి లేదా ప్రభువు లేదా రక్షకుడు - వాచస్పతి. యోని ద్వారమున జనియించనివాడు అనగా తల్లి యందుండి పుట్టనివాడు అయోనిజుడు. ఆ పరమాత్మునియందు ఈ రెండు లక్షణములూ కలవు కనుక వాచస్పతిరయోనిజః. ఆ విష్ణు పరమాత్మునికి విశేషణముతో కూడిన ఒకే నామము ఇది.



विद्याया ईश्वरो वाचस्पतिर्योनौ न जायते ।
अमातृगर्भोऽजो विष्णुर्वाचस्पतिरयोनिजः ॥
इति सहविशेषणं नाम विष्णोर्महात्मनः ॥

Vidyāyā īśvaro vācaspatiryonau na jāyate,
Amātr̥garbho’jo viṣṇurvācaspatirayonijaḥ.
Iti sahaviśeṣaṇaṃ nāma viṣṇormahātmanaḥ.

Vāk means eloquence or vidya i.e. knowledge; the One who is the Lord of such knowledge is Vācaspati. He who is self manifest not needing to take birth journeying through the womb of a woman is Ayonijaḥ. Since He has both the qualities, Vācaspatirayonijaḥ is one name but to be treated as with an adjective.

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

29 మే, 2014

572. సర్వదృగ్వ్యాసః, सर्वदृग्व्यासः, Sarvadr̥gvyāsaḥ

ఓం సర్వదృగ్వ్యాసాయ నమః | ॐ सर्वदृग्व्यासाय नमः | OM Sarvadr̥gvyāsāya namaḥ


సర్వదృగ్వ్యాసః, सर्वदृग्व्यासः, Sarvadr̥gvyāsaḥ

విస్తారకృత్ సర్వదృశాం సర్వదృగ్వ్యాస ఉచ్యతే ।
సర్వాఽస్య సాచ దృక్చేతి విష్ణుస్సర్వదృగుచ్యతే ॥
సర్వాకారజ్ఞానరూపః దృక్ త్వాత్ సర్వస్య సర్వదృక్ ।
ఋగ్వేదాదివిభాగేన వ్యస్తో వేదశ్చతుర్విధః ॥
ఆద్య ఏకవింశతిధా సామవేదస్సహస్రధా ।
యజుర్వేద ఏకోత్తరశతధా శ్రూయతే కృతః ॥
అథర్వవేదో నవధా శాఖాభేదేన వై కృతః ।
అన్యాని చ పురాణాని వ్యస్తానేమవనేనహి ॥

దృక్ అనగా చూడబడి, ఎరుగబడెడి జ్ఞానము. వ్యాపింపజేయువాడు వ్యాసః. సర్వ విధములగు జ్ఞానమును విస్తారము చేయువాడు లేదా విస్తరింపజేయువాడు సర్వదృగ్వ్యాసః.

సాధన భూతమగు దేని సాయముచే ఏ వస్తువు కానీ విషయము కానీ చూడ, తెలియ బడునో అది దృక్ అనగా దృష్టి. సర్వదృక్ అనగా సర్వరూపములును గల జ్ఞానము. ప్రతియొకనికి సంబంధించిన దృష్టి అనదగినది వేదమే! అట్టి సర్వదృక్ అగు వేదమును విభజించినవాడు సర్వదృగ్వ్యాసః.

ఋగ్వేదాది విభాగముతో వేదము నాలుగుగా విభాగించబడినది. అందును మొదటి ఋగ్వేదము ఇరువదియొక విధములుగా చేయబడినది. రెండవది అయిన యజుర్వేదము నూటయొక విధములుగా చేయబడినది. సామవేదము వేయి విధములుగా, అథర్వ వేదము తొమ్మిది విధములుగా విభాగింపబడినవి. ఇట్లు వేదములు అన్నియు శాఖా భేదముచే విభజించబడినవి. ఈ విధముగానే ఇతరములగు పురాణములును ఈతనిచే విభజించబడినవి.



विस्तारकृत् सर्वदृशां सर्वदृग्व्यास उच्यते ।
सर्वाऽस्य साच दृक्चेति विष्णुस्सर्वदृगुच्यते ॥
सर्वाकारज्ञानरूपः दृक् त्वात् सर्वस्य सर्वदृक् ।
ऋग्वेदादिविभागेन व्यस्तो वेदश्चतुर्विधः ॥
आद्य एकविंशतिधा सामवेदस्सहस्रधा ।
यजुर्वेद एकोत्तरशतधा श्रूयते कृतः ॥
अथर्ववेदो नवधा शाखाभेदेन वै कृतः ।
अन्यानि च पुराणानि व्यस्तानेमवनेनहि ॥

Vistārakr̥t sarvadr̥śāṃ sarvadr̥gvyāsa ucyate,
Sarvā’sya sāca dr̥kceti viṣṇussarvadr̥gucyate.
Sarvākārajñānarūpaḥ dr̥k tvāt sarvasya sarvadr̥k,
R̥gvedādivibhāgena vyasto vedaścaturvidhaḥ.
Ādya ekaviṃśatidhā sāmavedassahasradhā,
Yajurveda ekottaraśatadhā śrūyate kr̥taḥ.
Atharvavedo navadhā śākhābhedena vai kr̥taḥ,
Anyāni ca purāṇāni vyastānemavanenahi.

As Vyāsa He expounded at length - all knowledge and hence Sarvadr̥gvyāsaḥ.

Sarvadr̥k means jñāna or the knowledge that encompasses every aspect. What other jñāna is worth calling Sarvadr̥k but the Veda?

Sarvadr̥k means He sees everything. Vyāsa the classifier. Vedas were classified fourfold in the forms of R̥k and others. The first of them, R̥g Veda was made of twenty one parts. The second Yajur Veda was made of one thousand and one parts. The Sāma Veda was of a thousand parts and the Atharva Veda in nine branches. And also other purāṇas were made by him, vyastāni. So he was called Vyāsa. In that aspect, the Lord too is called Vyāsa i.e., Brahmā.

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

28 మే, 2014

571. దివఃస్పృక్, दिवःस्पृक्, Divaḥspr̥k

ఓం దివస్పృశే నమః | ॐ दिवस्पृशे नमः | OM Divaspr̥śe namaḥ


దివఃస్పృక్, दिवःस्पृक्, Divaḥspr̥k

స విష్ణురేవ భగవాన్ దివస్పృక్ స్పర్శనాద్దివః స్పృశించువాడు 'స్పృక్‍' అనబడును. ద్యులోకమును స్పృశించువాడు దివఃస్పృక్‍. ఆయా జ్యోతిస్సుల రూపమున పరమాత్ముడు ద్యులోకమును చేరి అచట వెలుగుచుండును గదా!

మరియూ త్రివిక్రమ అనగా వామనావతారమున పరమాత్ముడు భూమిని, ఆకాశమును సైతమూ తన పాదాములతో విక్రమించెనుగనుక దివఃస్పృక్‍ అనబడును.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
మ. ఒకపాదంబున భూమిఁ గప్పి దివి వేఱొంటన్ నిరోధించి యొం
      డొకటన్ మీఁది జగంబులెల్లఁ దొడి, యొం డొంటిన్ విలంఘించి, ప
      ట్టక బ్రహ్మాండ కటాహముం బగిలి వేండ్రంబై పరుల్ గానరా
      కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్‍. (625)

విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్నీ, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్నీ, పై లోకాలను కప్పివేసినాడు. క్రమముగా అన్నింటినీ దాటిపోయినాడు. ఆ మహారూపము పట్టకపోవడమువల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగినది. ఆయన తప్ప ఇంక యెవ్వరూ కనిపించకుండా పోయినారు. ఆ విశ్వరూపుడు మాటలకూ, చూపులకూ అందరానివాడై శోభించినాడు.



स विष्णुरेव भगवान् दिवस्पृक् स्पर्शनाद्दिवः / Sa viṣṇureva bhagavān divaspr̥k sparśanāddivaḥ The one who touches is called Spr̥k. In the form of celestial bodies, the Lord is spread all across the heavens and hence He is Divaḥspr̥k.

Moreover, during the Vāmana incarnation, He touched and conquered the heavens in a single foot step. Because of this as well, he is called Divaḥspr̥k.

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे एकविंशोऽध्यायः ::
पदैकेन मयाक्रान्तो भूर्लोकः खं दिशस्तनोः ।
स्वर्लोकस्ते द्वितीयेन पश्यतस्ते स्वमात्मना ॥ ३१ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 21
Padaikēna mayākrāntō bhūrlōkaḥ khaṃ diśastanōḥ,
Svarlōkastē dvitīyēna paśyatastē svamātmanā. 31.

With one step I have occupied Bhūrloka, and with My body I have occupied the entire sky and all directions. And in your presence, with My second step, I have occupied the upper planetary system.

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

27 మే, 2014

570. ద్రవిణప్రదః, द्रविणप्रदः, Draviṇapradaḥ

ఓం ద్రవిణప్రదాయ నమః | ॐ द्रविणप्रदाय नमः | OM Draviṇapradāya namaḥ


ద్రవిణం దదాతి విష్ణుః ప్రకర్షేణ సుమార్గిణే ।
తస్మాద్ ద్రవిణప్రద ఇత్యుచ్యతే విధుషాం వరైః ॥

వాంఛితమగు ద్రవిణమును అనగా ధనమును భక్తులకు మిక్కిలిగా అనుగ్రహించునుగనుక, ఆ విష్ణుదేవుని 'ద్రవిణప్రదః' అని విద్వాంసులు కీర్తించుచుందురు.



द्रविणं ददाति विष्णुः प्रकर्षेण सुमार्गिणे ।
तस्माद् द्रविणप्रद इत्युच्यते विधुषां वरैः ॥

Draviṇaṃ dadāti viṣṇuḥ prakarṣeṇa sumārgiṇe,
Tasmād draviṇaprada ityucyate vidhuṣāṃ varaiḥ.

Since He bestows desired wealth upon His devotees, He is called Draviṇapradaḥ by the learned.

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

26 మే, 2014

569. దారుణః, दारुणः, Dāruṇaḥ

ఓం దారుణాయ నమః | ॐ दारुणाय नमः | OM Dāruṇāya namaḥ


దారుణో దారుణత్వాత్స సన్మార్గస్య విరోధినామ్ సన్మార్గమునకు విరోధుకగువారికి దారుణుడు లేదా భయంకరుడు..



दारुणो दारुणत्वात्स सन्मार्गस्य विरोधिनाम् / Dāruṇo dāruṇatvātsa sanmārgasya virodhinām  As being hard on the enemies of the righteous path.

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

25 మే, 2014

568. ఖణ్డపరశుః, खण्डपरशुः, Khaṇḍaparaśuḥ

ఓం ఖణ్డపరశవే నమః | ॐ खण्डपरशवे नमः | OM Khaṇḍaparaśave namaḥ


ఖణ్డపరశుః, खण्डपरशुः, Khaṇḍaparaśuḥ

శత్రూణాం ఖణ్డనాత్ఖణ్డః జామద్గ్న్యాకృతేర్హరేః ।
విద్యతే పరశురితి స ఖణ్డపరశుర్హరిః ।
అఖణ్డః పరశురితి వాఽఖణ్డపరశుర్హరిః ॥

శత్రువులను ఖండిచునది ఖండః అనబడును. ఖండము అనగా శత్రువులను ఖండిచునదియగు పరశువు లేదా గొడ్డలి - జమదగ్ని కుమారుడగు పరశురామ రూపుడిగా ఈతనికి కలదు. లేదా 'అఖణ్డ పరశుః' అను విభాగము చేయగా అఖండితమగు అనగా ఎవరిచేతనూ ఖండిచబడని పరశువు ఎవనికి కలదో అట్టివాడు ఖణ్డపరశుః.



शत्रूणां खण्डनात्खण्डः जामद्ग्न्याकृतेर्हरेः ।
विद्यते परशुरिति स खण्डपरशुर्हरिः ।
अखण्डः परशुरिति वाऽखण्डपरशुर्हरिः ॥

Śatrūṇāṃ khaṇḍanātkhaṇḍaḥ jāmadgnyākr̥terhareḥ,
Vidyate paraśuriti sa khaṇḍaparaśurhariḥ,
Akhaṇḍaḥ paraśuriti vā’khaṇḍaparaśurhariḥ.

By the reason of punishing the evildoers He is Khaṇḍaḥ. In the form of son of R̥ṣi Jamadagni - Paraśurāma He wielded a Paraśu or Axe and hence His incarnation as Paraśurāma is Khaṇḍaparaśuḥ. Or it may be taken as 'Akhaṇḍa Paraśuḥ' i.e., unbreakable axe and the One who wields such 'Khaṇḍaparaśuḥ'.

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

24 మే, 2014

567. సుధన్వా, सुधन्वा, Sudhanvā

ఓం సుధన్వనే నమః | ॐ सुधन्वने नमः | OM Sudhanvane namaḥ


సుధన్వా, सुधन्वा, Sudhanvā

ఇన్ద్రియాదిమయం శార్ఙ్గం శోభనం ధనురస్య హి ।
ఇతి విష్ణుస్సుధన్వేతి ప్రోచ్యతే విదుషం వరైః ॥

ఇంద్రియములు మొదలగు తత్త్వముల రూపమేయగు శార్ఙ్గము అను ధనువు ఈతనికిగలదు గనుక ఆ విష్ణుదేవుని సుధన్వా అని విద్వాంసులు నుతింతురు.

:: పోతన భాగవతము ద్వాదశ స్కంధము ::
సీ. సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయార సోద్భాసితుఁ ద్రిదశాభి వందితపాదాబ్జు వనధిశయను
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని వేదాంతవేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని శంఖచక్రగదాసిశార్ఙ్గధరుని
తే. శోభనాకారుఁ బీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయపుణ్యదేహుఁ దలఁతు నుతియింతు దేవకీతనయు నెపుడు. (50)

గుణములకన్నింటికిని అతీతమైనవాడును, సర్వమూ తెలిసినవాడునూ, అన్నింటికీ ఈశ్వరుడైనవాడునూ, సర్వ లోకములకును ఆధారమైనవాడునూ, ఆదిదేవుడునూ, గొప్పదైన కరుణారసము చేత ప్రకాశించే వాడునూ, దేవతల వందనములను అందుకొనే పాదాబ్జములుగలవాడునూ, సముద్రములో శయనించేవాడునూ, ఆశ్రయించిన వారి పాలిటి కల్పవృక్షమువంటి వాడునూ, ఆదీ-అంతమూ అనేవి లేనివాడునూ, వేదాంతముచేతను తెలియదగినవాడునూ, విశ్వము అంతయును నిండియున్నవాడునూ, వక్షఃస్థలముపై కౌస్తుభమూ-శ్రీవత్సమూగలవాడునూ, శంఖమూ-చక్రమూ-గదా-శార్ఙ్గము అనే ధనుస్సూ ధరించి ఉండెడివాడునూ, మంగళకరము అయిన రూపముగలవాడునూ, పీతాంబరము ధరించి మనోహరముగా కనిపించెడివాడునూ, రత్నములచేత ప్రకాశించెడి కిరీటముతో వెలుగులు నింపెడివాడునూ, పద్మపత్రములవంటి నేత్రములు కలవాడునూ, గొప్పదైన పుణ్యవంతము అయిన శరీరముగలవాడునూ అయిన దేవకీ నందనుని స్మరించి యెల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను.



इन्द्रियादिमयं शार्ङ्गं शोभनं धनुरस्य हि ।
इति विष्णुस्सुधन्वेति प्रोच्यते विदुषं वरैः ॥

Indriyādimayaṃ śārṅgaṃ śobhanaṃ dhanurasya hi,
Iti viṣṇussudhanveti procyate viduṣaṃ varaiḥ.

Since He sports a beautiful bow by name Śārṅga, which signifies the sense organs, the learned address Him as Sudhanvā.

:: श्रीमद्भागवते द्वादशस्कन्धे एकादशोऽध्यायः ::
ओजह् सहोबलयुतं मुख्यतत्त्वं गदां दधत् ।
अपां तत्त्वं दरवरं तेजस्तत्त्वं सुदर्शनम् ॥ १४ ॥
नभोनिभं नभस्तत्त्वमसिं चर्म तमोमयम् ।
कालरुपं धनुः शार्ङ्गं तथा कर्ममयेषुधिम् ॥ १५ ॥

Śrīmad Bhāgavata - Canto 12, Chapter 11
Ojah sahobalayutaṃ mukhyatattvaṃ gadāṃ dadhat,
Apāṃ tattvaṃ daravaraṃ tejastattvaṃ sudarśanam. 14.
Nabhonibhaṃ nabhastattvamasiṃ carma tamomayam,
Kālarupaṃ dhanuḥ śārṅgaṃ tathā karmamayeṣudhim. 15.

The club the Lord carries is the chief element, prana, incorporating the potencies of sensory, mental and physical strength. His excellent conchshell is the element water, His Sudarśana disc the element fire, and His sword, pure as the sky, the element ether. His shield embodies the mode of ignorance, His bow, named Śārṅga, time, and His arrow-filled quiver the working sensory organs.

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

23 మే, 2014

566. గతిసత్తమః, गतिसत्तमः, Gatisattamaḥ

ఓం గతిసత్తమాయ నమః | ॐ गतिसत्तमाय नमः | OM Gatisattamāya namaḥ


గతిశ్చాసౌ సత్తమశ్చ గతిసత్తమ ఉచ్యతే ।
గత్యా విష్ణుః సత్తమ ఇతీర్యతే గతిసత్తమః ॥

ఈతడే ప్రాణులకు గతీ మరియూ సత్తముడు. ఇట సత్తముడు అనగా ఉత్తములలో ఉత్తమమైనవాడు అయినందున గమ్యము. గతీ మరియూ గమ్యము.



गतिश्चासौ सत्तमश्च गतिसत्तम उच्यते ।
गत्या विष्णुः सत्तम इतीर्यते गतिसत्तमः ॥

Gatiścāsau sattamaśca gatisattama ucyate,
Gatyā viṣṇuḥ sattama itīryate gatisattamaḥ.

He is the Gati and is also Sattama. Gati means refuge and Sattama is the Best and most Superior Existent.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

22 మే, 2014

565. సహిష్ణుః, सहिष्णुः, Sahiṣṇuḥ

ఓం సహిష్ణువే నమః | ॐ सहिष्णुवे नमः | OM Sahiṣṇuve namaḥ


ద్వన్ద్వాని శీతోష్ణాదీని సహతే పరమేశ్వరః ।
ఇతి విష్ణుస్సహిష్ణురిత్యుచ్యతే విదుషాం వరైః ॥

శీతోష్ణాది రూపములగు ద్వంద్వములను అనాయాసముగా సహించువాడుగనుక శ్రీ విష్ణువు సహిష్ణువుగా పిలువబడుతాడు.



द्वन्द्वानि शीतोष्णादीनि सहते परमेश्वरः ।
इति विष्णुस्सहिष्णुरित्युच्यते विदुषां वरैः ॥

Dvandvāni śītoṣṇādīni sahate parameśvaraḥ,
Iti viṣṇussahiṣṇurityucyate viduṣāṃ varaiḥ.

Since effortlessly He bears different dualities like heat and cold etc., Lord Viṣṇu is known as Sahiṣṇuḥ.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

21 మే, 2014

564. జ్యోతిరాదిత్యః, ज्योतिरादित्यः, Jyotirādityaḥ

ఓం జ్యోతిరాదిత్యాయ నమః | ॐ ज्योतिरादित्याय नमः | OM Jyotirādityāya namaḥ


జ్యోతిరాదిత్యః, ज्योतिरादित्यः, Jyotirādityaḥ

ఆదిత్యమణ్డలే జ్యోతిష్యాస్థితః పరమేశ్వరః ।
జ్యోతిరాదిత్య ఇతి స ప్రోచ్యతే విదుషాం వరైః ॥

జ్యోతిస్సునందు సవితృ మండలమునందు అనగా సూర్య మండలమునందు ఉండు ఆదిత్య రూపుడైన శ్రీ విష్ణువు జ్యోతిరాదిత్యుడు.

:: శ్రీమద్భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ॥ 18 ॥

పరబ్రహ్మము ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకుగూడ ప్రకాశము నిచ్చునదియు, తమస్సు అనగా అజ్ఞానము కంటె అతీతమైనదియు, జ్ఞాన స్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు విశేషించియున్నదియునని చెప్పబడుచున్నది.



आदित्यमण्डले ज्योतिष्यास्थितः परमेश्वरः ।
ज्योतिरादित्य इति स प्रोच्यते विदुषां वरैः ॥ 

Ādityamaṇḍale jyotiṣyāsthitaḥ parameśvaraḥ,
Jyotirāditya iti sa procyate viduṣāṃ varaiḥ.

Since Lord Viṣṇu resides as the splendorous effulgence in the orb of the sun, He is called Jyotirādityaḥ.

:: श्रीमद्भगवद्गीत क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥ १८ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 13
Jyotiṣāmapi tajjyotistamasaḥ paramucyate,
Jñānaṃ jñeyaṃ jñānagamyaṃ hr̥di sarvasya viṣṭhitam. 18.

That is the Light even of the lights; It is spoken of as beyond darkness. It is Knowledge, the Knowable and the Known. It exists specially in the hearts of all.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

20 మే, 2014

563. ఆదిత్యః, आदित्यः, Ādityaḥ

ఓం ఆదిత్యాయ నమః | ॐ आदित्याय नमः | OM Ādityāya namaḥ


ఆదిత్యః, आदित्यः, Ādityaḥ

ఆదిత్యాం కశ్యపాదిన్ద్రస్యానుజత్వేన యాచితః ।
దేవైర్వామనరూపేణ జాత ఆదిత్య ఉచ్యతే ॥

అదితికి కశ్యపునివలన ఇంద్రునకు అనుజునిగా జన్మించినవాడు. వామనావతారమును స్వామి ఈ విధముగా స్వీకరించినందున ఆదిత్యః అని పిలువబడుతాడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
వ. అని యిట్లు దేవకీదేవి విన్నవించిన నీశ్వరుండిట్లనియె, అవ్వా! నీవు దొల్లి స్వాయంభువ మన్వంతరంబునఁ బృశ్నియను పరమపతివ్రతవు, వసుదేవుండు సుతపుం డను ప్రజాప్తి, మీరిరువురును సృష్టికాలంబునం, బెంపున నింద్రియమ్బుల జయించి తెంపున వానగాలి యెండ మంచులకు సైరించి యేకలములయి దిని యే కలంకంబును లేక వేండ్రంబుగఁ బండ్రెండువేల దివ్యవర్షంబులు దపంబులు సేసిన నెపంబున మీ రూపంబులు మెరయనొజ నాజపంబులు సేసి, డాసి, పేర్చి, యర్చింప మీకు నాకుం గల రూపుఁ జూపి యేను 'దిరంబులగు వరంబులు వేఁడుం' డనిన మీరు నా మాయం బాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డయడ్డంబున దుర్గమం బగు నపవర్గంబు గోరక నా యీఁడు కొడుకు నడిగిన మెచ్చి యట్ల వరం బిచ్చి మీ కేను 'బృశ్నిగర్భుం'డన నర్భకుండ నయితి, మఱియును (131)
క. అదితుత్యుఁ గస్యపుఁడును నన, విదితుల రగు మీకుఁ గురుచవేషంబున నే నుదయించితి వామనుఁ డనఁ, ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవమునన్‍. (132)
క. ఇప్పుడు మూఁడవబామునఁ, దప్పక మీ కిరువురకును దనయుఁడ నైతిం జెప్పితిఁ బూర్వము మీయం, దెప్పటికిని లేదు జన్మమిటపై నాకున్‍. (133)

ఈ విధముగా విన్నవించిన దేవకీదేవితో ఈశ్వరుడైన మహా విష్ణువు ఇలా అన్నాడు. "అమ్మా! పూర్వము స్వాయంభువ మన్వంతరములో నీవు 'పృశ్ని' అనే మహా పతివ్రతవు. అప్పుడు వసుదేవుడు 'సుతపుడు' అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టికాలములో బ్రహ్మదేవుని ప్రేరణతో మహా తపస్సు చేశారు. ఇంద్రియములను జయించారు. గాలి, వాన, ఎండ, మంచు మొదలైనవి సహించారు. ఏకాకులై ఆకులు, అలములు తితి తీవ్రమైన మహా తపస్సును చేశారు. అలా పండ్రెండ్రు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా మీ రూపాలు ప్రకాశమానముగా వెలిగాయి. అలా నిష్ఠతో నా నామజపము చేసి నా తత్త్వాన్ని సమీపించగలిగారు. చక్కని రీతిలో నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్యస్వరూపాన్ని చూపి శ్రేష్ఠమైన వరాలు కోరుకొమ్మని అనుగ్రహించాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరుకొనలేదు. ఆ సమయములో నా మాయ మిమ్ములను ఆవరించినది. అప్పటికి మీకు బిడ్డలు లేరుగనుక మోహముతో నాతో సాటియైన కొడుకును ప్రసాదించమని మీరు నన్ను అర్థించారు. సృష్టి, సంతానము పొందడం అనేది నా సంకల్పము గనుక నేను మీ కోరికకు మెచ్చుకొన్నాను. అలాగే వరమునిచ్చాను. నా సాటివాడు అంటూ వేరొకడు లేడు గనుక నేనే మీ దంపతులకు కుమారుడిగా జన్మించాను. అప్పుడు నా పేరు 'పృశ్నిగర్భుడు.'

"రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేరులతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపములో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు.

"మూడవ జన్మలో ఇప్పుడు పూర్వము నేనిచ్చిన మాటప్రకారము మీకు కుమారుడిగా పుట్టాను. ఇక మీయందు ఎప్పటికీ నా జన్మము లేదు."

39. ఆదిత్యః, आदित्यः, Ādityaḥ



आदित्यां कश्यपादिन्द्रस्यानुजत्वेन याचितः ।
देवैर्वामनरूपेण जात आदित्य उच्यते ॥

Ādityāṃ kaśyapādindrasyānujatvena yācitaḥ,
Devairvāmanarūpeṇa jāta āditya ucyate.

One who was born as the younger brother of Indra to Aditi and Kaśyapa. Lord's incarnation as the Vāmana is such and hence He is Ādityaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे तृतीयोऽध्यायः ::
अदृष्ट्वान्यतमं लोकेशीलौदार्यगुणैः समम् ।
अहं सुतो वामभवं पृश्‍निगर्भ इति श्रुतः ॥ ४१ ॥
तयोर्वां पुनरेवाहमदित्यामास कश्यपात् ।
उपेन्द्र इति विख्यातो वामनत्वाच्च वामनः ॥ ४२ ॥
तृतीयेऽस्मिन्भवेऽहं वै तेनैव वपुषाथ वाम् ।
जातो भूयस्तयोरेव सत्यं मे व्याहृतं सति ॥ ४३ ॥

:: Śrīmadbhāgavate daśamaskandhe tr̥tīyo’dhyāyaḥ ::
Adr̥ṣṭvānyatamaṃ lokeśīlaudāryaguṇaiḥ samam,
Ahaṃ suto vāmabhavaṃ pr̥śˈnigarbha iti śrutaḥ. 41.
Tayorvāṃ punarevāhamadityāmāsa kaśyapāt,
Upendra iti vikhyāto vāmanatvācca vāmanaḥ. 42.
Tr̥tīye’sminbhave’haṃ vai tenaiva vapuṣātha vām,
Jāto bhūyastayoreva satyaṃ me vyāhr̥taṃ sati. 43.

(Revealing the secret behind His incarnation as Kr̥ṣṇa to Devakī and Vasudeva - Lord Viṣṇu explains) Since I found no one else as highly elevated as you in simplicity and other qualities of good character, I appeared in this world as Pṛśnigarbha, or one who is celebrated as having taken birth from Pṛśni (and Sutapa). In the next millennium, I again appeared from the two of you, who appeared as My mother, Aditi, and My father, Kaśyapa. I was known as Upendra, and because of being a dwarf, I was also known as Vāmana. O supremely chaste mother, I, the same personality, have now appeared of you both as your son for the third time. Take My words as the truth.

39. ఆదిత్యః, आदित्यः, Ādityaḥ

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

19 మే, 2014

562. హలాయుధః, हलायुधः, Halāyudhaḥ

ఓం హలాయుధాయ నమః | ॐ हलायुधाय नमः | OM Halāyudhāya namaḥ


హలాయుధః, हलायुधः, Halāyudhaḥ

హలమాయుధమస్యేతి బలభద్రాకృతిర్హరిః ।
హలాయుధ ఇతి విష్ణుః ప్రోచ్యతే విదుషం వరైః ॥

బలభద్రాకృతియందు హలము లేదా నాగలి హరికి ఆయుధమగుటచేట ఈయన హలాయుధుడుగా చెప్పబడుచున్నాడు.



हलमायुधमस्येति बलभद्राकृतिर्हरिः ।
हलायुध इति विष्णुः प्रोच्यते विदुषं वरैः ॥

Halamāyudhamasyeti balabhadrākr̥tirhariḥ,
Halāyudha iti viṣṇuḥ procyate viduṣaṃ varaiḥ.

In the form of Balabhadra, Lord Hari had plow for His weapon and hence He is called Halāyudhaḥ.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

18 మే, 2014

561. వనమాలీ, वनमाली, Vanamālī

ఓం వనమాలినే నమః | ॐ वनमालिने नमः | OM Vanamāline namaḥ


వనమాలీ, वनमाली, Vanamālī

భూతతన్మాత్రరూపాం తామ్ వైజయన్త్యాహ్వయాం హరిః ।
వనమాలాం వహన్ వనమాలీతి హరిరుచ్యతే ॥

వనమాల అనగా వైజయంతీ నామక మాల ఈతనికి కలదు. పంచభూతతన్మాత్రారూపమగు వైజయంతీ మాలను వహించియుండువాడుగనుక ఆ హరి 'వనమాలీ'.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుం డాశ్రిత పోషణుండు
లాలిత కాంచీకలాప శోభిత కటి మండలుం డంచిత కుండలుండు
మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుం డానంద దాయకుండు
సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ హస్తుండు భువన ప్రశస్తుఁ డజుఁడు
తే. గమ్ర సౌరభ వనమాలికా ధరుండు, హతవిమోహుండు నవ్యపీతాంబరుండు
లలిత కాంచన నూపురాలంకృతుండు, నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు. (251)

ఆ హరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతుంటాడు. ఆయన కటిప్రదేశం అందమైన మొలనూలు చేత ప్రకాశిస్తుంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలు ధరిస్తాడు. కౌస్తుభం అనే గొప్ప మణి కాంతులతో కమనీయమైన కంఠమాలికను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖం, చక్రం, గద, పద్మం అనే నాలుగింటినీ నాలుగు చేతులతో పట్టుకొని ఉంటాడు. ఆయన లోకాలలో ప్రశస్తికెక్కినవాడు. పుట్టుక లేనివాడు. కమ్మని సువాసనగల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆ హరి అజ్ఞానాన్ని పొగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు. మేలిమి బంగారు అందియలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. చూడదగిన వారిలో అగ్రగణ్యుడు. భక్తజన శరణ్యుడు.



भूततन्मात्ररूपां ताम् वैजयन्त्याह्वयां हरिः ।
वनमालां वहन् वनमालीति हरिरुच्यते ॥

Bhūtatanmātrarūpāṃ tām vaijayantyāhvayāṃ hariḥ,
Vanamālāṃ vahan vanamālīti harirucyate.

Since Lord Hari wears the Vanamāla or floral wreath - called Vaijayanti made out of the tanmatrās or categories of five subtle elements, He is called Vanamālī.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे सप्तमोऽध्यायः ::
वक्षस्यधिश्रितवधूर्वनमाल्युदार हासावलोककलया रमयंश्चविश्वम् ।
पार्श्वभ्रमद्व्यजनचामरराजहंसः श्वेतातपत्रशशिनोपरि रज्यमानः ॥ २१ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 7
Vakṣasyadhiśritavadhūrvanamālyudāra hāsāvalokakalayā ramayaṃścaviśvam,
Pārśvabhramadvyajanacāmararājahaṃsaḥ śvetātapatraśaśinopari rajyamānaḥ. 21.

Lord Viṣṇu looked extraordinarily beautiful because the goddess of fortune and a garland were situated on His chest. His face was beautifully decorated with a smiling attitude which can captivate the entire world, especially the devotees. Fans of white hair appeared on both sides of the Lord like white swans and the white canopy overhead looked like the moon.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

17 మే, 2014

560. ఆనన్దీ, आनन्दी, Ānandī

ఓం ఆనన్దినే నమః | ॐ आनन्दिने नमः | OM Ānandine namaḥ


ఆనన్దీ, आनन्दी, Ānandī

ఆనన్దః సుఖస్వరూపత్వాత్ సర్వసమ్పత్సమృద్ధిః సర్వ సంపదసమృద్ధి రూపమగు ఆనందము ఈతనికి తన స్వరూపముగనే కలదుగనుక ఆనన్దీ.

:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
మ. అరవిందోదర! తావకీన ఘన మాయామోహిత స్వాంతులై
      పరమంబైన భవన్మహామహిమముం బాటించి కానంగ నో
      పరు బ్రహ్మాది శరీరు లజ్ఞు లయి; యో పద్మాక్ష! భక్తార్తి సం
      హరణాలోకన! నన్నుఁ గావఁదగు నిత్యానందసంధాయివై.
(177)

ఓ పద్మనాభా! నీ మాయకు జిక్కి బ్రహ్మ మొదలైన శరీరధారులు కూడా నీ మహామహిమను గ్రహింప లేరు. చూపులచేతనే నీవు భక్తుల ఆపదలను తొలగింపగల పద్మాక్షుడవు. నాకు నిత్యానందాన్ని ప్రసాదించి నన్ను కాపాడు.



आनन्दः सुखस्वरूपत्वात् सर्वसम्पत्समृद्धिः / Ānandaḥ sukhasvarūpatvāt sarvasampatsamr̥ddhiḥ He is called Ānandī as He is of the nature of happiness or has a plenitude of it.

:: श्रीमद्भागवते तृतीय स्कन्धे नवमोऽध्यायः ::
नातः परं परम यद्भवतः स्वरूपम् आनन्दमात्रमविकल्पमविद्धवर्चः ।
पश्यामि विश्वसृजमेकमविश्वमात्मन् भूतेन्द्रियात्मकमदस्त उपाश्रितोऽस्मि ॥ ३ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 9
Nātaḥ paraṃ parama yadbhavataḥ svarūpam ānandamātramavikalpamaviddhavarcaḥ,
Paśyāmi viśvasr̥jamekamaviśvamātman bhūtendriyātmakamadasta upāśrito’smi. 3.

O my Lord, I do not see a form superior to Your present form of eternal bliss and knowledge. In Your impersonal Brahman effulgence in the spiritual sky, there is no occasional change and no deterioration of internal potency. I surrender unto You because whereas I am proud of my material body and senses, Your Lordship is the cause of the cosmic manifestation and yet You are untouched by matter.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

16 మే, 2014

559. భగహా, भगहा, Bhagahā

ఓం భగఘ్నే నమః | ॐ भगघ्ने नमः | OM Bhagaghne namaḥ


తదైశ్వర్యాదిషాడ్గుణ్యభగవాన్ పరమేశ్వరః ।
సంహారసమయే హన్తీత్యచ్యుతో భగహోచ్యతే ॥

భగవాన్ నామమునందు వివరించబడిన ఆరు లక్షణములను ప్రళయసమయమున నశింపజేయునుగనుక, ఆ అచ్యుతునకు భగహా అను నామము.



तदैश्वर्यादिषाड्गुण्यभगवान् परमेश्वरः ।
संहारसमये हन्तीत्यच्युतो भगहोच्यते ॥

Tadaiśvaryādiṣāḍguṇyabhagavān parameśvaraḥ,
Saṃhārasamaye hantītyacyuto bhagahocyate.

Since Lord Acyuta destroys the six attributes, as elucidated in the definition of the divine name 'Bhagavān', He is called Bhagahā.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

15 మే, 2014

558. భగవాన్, भगवान्, Bhagavān

ఓం భగవతే నమః | ॐ भगवते नमः | OM Bhagavate namaḥ


భగవాన్, भगवान्, Bhagavān

భగోఽస్యాస్తితి భగవానితి విష్ణుస్సమీర్యతే భగము అని చెప్పబడు ఆరు లక్షణముల సముదాయము గలదు గనుక శ్రీ విష్ణువు భగవాన్‍.

:: విష్ణు పురాణే షష్ఠాంశే పఞ్చమోఽధ్యాయః ::
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్శ్రియః ।
జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా ॥ 74 ॥

సమగ్రైశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములైన ఆరింటికిని భగమని వ్యవహారము. (ఇట్టి భగముగలవాడు విష్ణువు).

:: విష్ణు పురాణే షష్ఠాంశే పఞ్చమోఽధ్యాయః :
ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానామాగతిం గతిమ్ ।
వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి ॥ 78 ॥

భూతముల ఉత్పత్తి, ప్రళయములను గమనాఽఽగమనములను, విద్యాఽవిద్యలను ఎవడు ఎరుగునో ఆతడు 'భగవాన్‍' అని చెప్పబడదగియున్నాడు.



भगोऽस्यास्तिति भगवानिति विष्णुस्समीर्यते / Bhago’syāstiti bhagavāniti Viṣṇussamīryate Since Lord Viṣṇu has Bhaga which means the six attributes, He is Bhagavān.

:: विष्णु पुराणे षष्ठांशे पञ्चमोऽध्यायः ::
ऐश्वर्यस्य समग्रस्य वीर्यस्य यशसश्श्रियः ।
ज्ञानवैराग्ययोश्चैव षण्णां भग इतीरणा ॥ ७४ ॥

Viṣṇu Purāṇa - Part 6, Chapter 5
Aiśvaryasya samagrasya vīryasya yaśasaśśriyaḥ,
Jñānavairāgyayoścaiva ṣaṇṇāṃ bhaga itīraṇā. 74.

Bhaga means six attributes; abundant Aisvarya (riches), Vīrya (valor), Yaśas (fame), Śrī (prosperity), Vairāgya (dispassion) and Mókṣa (salvation). (He who has bhaga is bhagavan)

:: विष्णु पुराणे षष्ठांशे पञ्चमोऽध्यायः :
उत्पत्तिं प्रलयं चैव भूतानामागतिं गतिम् ।
वेत्ति विद्यामविद्यां च स वाच्यो भगवानिति ॥ ७८ ॥

Viṣṇu Purāṇa - Part 6, Chapter 5
Utpattiṃ pralayaṃ caiva bhūtānāmāgatiṃ gatim,
Vetti vidyāmavidyāṃ ca sa vācyo bhagavāniti. 78.

He knows the origination and dissolution of beings, their coming and going, both vidya and avidya; So He is said to be Bhagavān.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

14 మే, 2014

557. మహామనాః, महामनाः, Mahāmanāḥ

ఓం మహామనసే నమః | ॐ महामनसे नमः | OM Mahāmanase namaḥ


మహామనాః, महामनाः, Mahāmanāḥ

సృష్టిస్థిత్యన్తకర్మాణి మనసైవ కరోతి యః ।
మహామనా ఇతి విష్ణురుచ్యతే విదుషాం వరైః ॥

మహాశక్తిగల మనస్సు గలవాడు. శ్రీ విష్ణువు సృష్టి, స్థితి, లయ కృత్యములను తన మనో మాత్రముతోనే ఆచరించును గనుక మహామనాః అని కీర్తించబడును. మనసైవ జగత్సృష్టిం సంహారం చ కరోతి యః (విష్ణు పురాణము 5.22.15) తన మనస్సుతోనే ఏ విష్ణువు సృష్టిని, స్థితినీ, సంహారమునూ ఆచరించుచుండునో... అను విష్ణు పురాణ వచనము ఇట ప్రమాణము.



सृष्टिस्थित्यन्तकर्माणि मनसैव करोति यः ।
महामना इति विष्णुरुच्यते विदुषां वरैः ॥

Sr̥ṣṭisthityantakarmāṇi manasaiva karoti yaḥ,
Mahāmanā iti viṣṇurucyate viduṣāṃ varaiḥ.

By mere thought He accomplishes the actions of creation, sustenance and annihilation; therefore Mahāmanāḥ. मनसैव जगत्सृष्टिं संहारं च करोति यः / Manasaiva jagatsr̥ṣṭiṃ saṃhāraṃ ca karoti yaḥ (Viṣṇu Purāṇa 5.22.15) He who does the creation of the world and its destruction merely by His mind...

वेदास्स्वांगोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాంగోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṃgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

13 మే, 2014

556. పుష్కరాక్షః, पुष्कराक्षः, Puṣkarākṣaḥ

ఓం పుష్కరాక్షాయ నమః | ॐ पुष्कराक्षाय नमः | OM Puṣkarākṣāya namaḥ


పుష్కరాక్షః, पुष्कराक्षः, Puṣkarākṣaḥ

వ్యాప్త్యర్థాదక్షతేర్ధాతోః పుష్కరోపపదాదణి ।
పుష్కరాక్షపదోత్పత్తి ర్వైయాకరణసమ్మతా ॥
యో హృదయపుణ్డరీకే స్వరూపేణ ప్రకాశతే ।
చిన్తతస్సన్నితి విష్ణుః పుష్కరాక్ష ఇతీర్యతే ॥

వ్యాపించు అను అర్థమును ఇచ్చు 'అక్షూ' (అక్ష్‍) ధాతువునుండి హృదయ పదము ఉపపదముగా 'అణ్' ప్రత్యయమురాగా పైవ్యుత్పత్తిననుసరించి 'పుష్కరాక్ష' పదము నిష్పన్నమగును. హృదయ పుష్కరము లేదా పద్మమునందు వ్యాపించియుండువాడుగనుక శ్రీ విష్ణువు పుష్కరాక్షః. లేదా హృదయ పుండరీకమునందు దర్శించబడువాడు. హృదయ పుండరీకమున ధ్యానించబడినవాడగుచు స్వస్వరూపముతో ప్రకాశించును.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
తే. సత్త్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తియుతముగఁ జిత్తంబు భవ్య మగును
     హృదయపద్మంబునం దోలి నెఱుగఁబడిన, యట్టి నీకు నమస్కారమయ్య వరద! (428)

సత్త్వగుణంవల్ల మంచి భక్తి సంప్రాప్తిసుంది. భక్తితోకూడిన మనస్సు పవిత్రం అవుతుంది. అటువంటి భక్తియుక్తమైన పవిత్రహృదయ పద్మంలో భావించి సేవింపదగిన ఓ దేవదేవా! నీకు నమస్కారము.



व्याप्त्यर्थादक्षतेर्धातोः पुष्करोपपदादणि ।
पुष्कराक्षपदोत्पत्ति र्वैयाकरणसम्मता ॥
यो हृदयपुण्डरीके स्वरूपेण प्रकाशते ।
चिन्ततस्सन्निति विष्णुः पुष्कराक्ष इतीर्यते ॥ 

Vyāptyarthādakṣaterdhātoḥ puṣkaropapadādaṇi,
Puṣkarākṣapadotpatti rvaiyākaraṇasammatā.
Yo hr̥dayapuṇḍarīke svarūpeṇa prakāśate,
Cintatassanniti viṣṇuḥ puṣkarākṣa itīryate.

The root 'akṣū' (akṣ) which has the meaning of pervading is added to the word puṣkara; so we get Puṣkarākṣaḥ which means He who is spread in the lotus of heart. Or since He is meditated upon in the lotus of the heart where He shines in His native effulgence.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे नवमोऽध्यायः ::
त्वं भक्तियोगपरिभावितहृत्सरोज आस्से श्रुतेक्षितपथो ननु नाथ पुंसाम् ।
यद्यद्धिया त उरुगाय विभावयन्ति तत्तद्वपुः प्रणयसे सदनुग्रहाय ॥ ११ ॥

O my Lord, Your devotees can see You through the ears by the process of bona fide hearing, and thus their hearts become cleansed, and You take Your seat there. You are so merciful to Your devotees that You manifest Yourself in the particular eternal form of transcendence in which they always think of You.

वेदास्स्वांगोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాంగోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṃgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

12 మే, 2014

555. వృక్షః, वृक्षः, Vr̥kṣaḥ

ఓం వృక్షాయ నమః | ॐ वृक्षाय नमः | OM Vr̥kṣāya namaḥ


వృక్షః, वृक्षः, Vr̥kṣaḥ

వృక్ష ఇవాచలతయా స్థితో వృక్ష ఇతీర్యతే ।
వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేక ఇతి శ్రుతేః ॥

వృక్షము వలె కదలనివాడుగనుక వృక్షః. వృక్షము అనుటలో ఎన్ని సంవత్సరములు గడిచినను వృక్షమునుండి ఆకులు రాలుట, క్రొత్తవి పుట్టుట, పూచుట, కాచుట మొదలగునవి ఋతు ధర్మముననుసరించి జరుగుచున్నను, ఆకులు మొదలగునవి మారుచున్నను వృక్షము మాత్రము మార్పులేక అట్లేయుండును. అటులనే పరమాత్మ దేశకాల వస్తు కృత భేదమునకు పాత్రములగుచు ఎందరు జీవులు వచ్చుచు పోవుచున్నను ఎన్ని సృష్టులు జరిగినను పరమాత్ముడు మాత్రము ఏ మార్పును లేక స్థిరుడై యుండును.

:: శ్వేతాశ్వతరోపనిషత్ తృతీయోఽధ్యాయః ::
యస్మాత్పరం నాపర మస్తి కిఞ్చి ద్యస్మా న్నాణీయో న జ్యాయేఽస్తి కశ్చిత్ । వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వమ్ ॥ 9 ॥

ఏ బ్రహ్మముకంటే శ్రేష్ఠమైనది కానీ, వేఱైనదిగానీ, పెద్దది కానీ, చిన్నది కాని ఏదియునులేదో, ఏది ఆకాశమందు వృక్షమువలె నిలబడియున్నదో, అట్టి బ్రహ్మము చేత ఈ సమస్త ప్రపంచము పరిపూర్ణమై వ్యాప్తమైయున్నది.



वृक्ष इवाचलतया स्थितो वृक्ष इतीर्यते ।
वृक्ष इव स्तब्धो दिवि तिष्टत्येक इति श्रुतेः ॥ 

Vr̥kṣa ivācalatayā sthito vr̥kṣa itīryate,
Vr̥kṣa iva stabdho divi tiṣṭatyeka iti śruteḥ.

He stands firm like a tree and hence He is Vr̥kṣaḥ. Here a tree symbolizes that entity which stands firm even though the leaves appear and then fall going through different seasons as like the living beings that are born and then die in time. Even in spite of these cycles, the Paramātma is comparable to that tree that remains firm with its identity in tact.

:: श्वेताश्वतरोपनिषत् तृतीयोऽध्यायः ::
यस्मात्परं नापर मस्ति किञ्चि द्यस्मा न्नाणीयो न ज्यायेऽस्ति कश्चित् । वृक्ष इव स्तब्धो दिवि तिष्टत्येकस्तेनेदं पूर्णं पुरुषेण सर्वम् ॥ ९ ॥

Śvetāśvataropaniṣat - Chapter 3
Yasmātparaṃ nāpara masti kiñci dyasmā nnāṇīyo na jyāye’sti kaścit, vr̥kṣa iva stabdho divi tiṣṭatyekastenedaṃ pūrṇaṃ puruṣeṇa sarvam. 9.

The whole universe is filled by the Purusha, to whom there is nothing superior, from whom there is nothing different, than whom there is nothing either smaller or greater; who stands alone, motionless as a tree, established in His own glory.

वेदास्स्वांगोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాంగోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṃgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

11 మే, 2014

554. వారుణః, वारुणः, Vāruṇaḥ

ఓం వారుణాయ నమః | ॐ वारुणाय नमः | OM Vāruṇāya namaḥ


వరుణస్య సుతోఽగస్త్యో వసిష్ఠో వారుణోఽథవా వరుణుని పుంసంతానమగు అగస్త్యుడు కాని వసిష్ఠుడు కాని వారుణః; వీరునూ విష్ణుని విభూతియే!



वरुणस्य सुतोऽगस्त्यो वसिष्ठो वारुणोऽथवा / Varuṇasya suto’gastyo vasiṣṭho vāruṇo’thavā Agastya or Vasiṣṭha, who are the sons of Varuṇa, are called Vāruṇaḥ. They are also opulence of Lord Viṣṇu Himself

वेदास्स्वांगोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాంగోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṃgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

10 మే, 2014

553. వరుణః, वरुणः, Varuṇaḥ

ఓం వరుణాయ నమః | ॐ वरुणाय नमः | OM Varuṇāya namaḥ


వరుణః, वरुणः, Varuṇaḥ

స్వరశ్మీనాం సంవరణాత్ సాయఙ్గతదివాకరః ।
వరుణస్వరూప ఇతి విష్ణుర్వరుణ ఉచ్యతే ॥

తన కిరణములను కప్పివేసికొనునుగనుక సాయంకాలగతుడగు సూర్యునకు వరుణః అని శ్రుతులయందు వ్యవహారము ప్రసిద్ధము.

:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
వాయుర్యమోఽగ్నిర్వరుణశ్శశాఙ్కః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽపి నమో నమస్తే ॥ 39 ॥

వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయి యున్నారు. మీకు అనేక వేల నమస్కారములు. మఱల మఱల మీకు నమస్కారము.



स्वरश्मीनां संवरणात् सायङ्गतदिवाकरः ।
वरुणस्वरूप इति विष्णुर्वरुण उच्यते ॥ 

Svaraśmīnāṃ saṃvaraṇāt sāyaṅgatadivākaraḥ,
Varuṇasvarūpa iti viṣṇurvaruṇa ucyate.

As the Sun during dusk apparently draws to itself all rays when it sets, He is Varuṇaḥ.

:: श्रीमद्भगवद्गीत - विश्वरूप सन्दर्शन योग ::
वायुर्यमोऽग्निर्वरुणश्शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥ ३९ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 11
Vāyuryamo’gnirvaruṇaśśaśāṅkaḥ prajāpatistvaṃ prapitāmahaśca,
Namo namaste’stu sahasrakr̥tvaḥ punaśca bhūyo’pi namo namaste. 39.

You are Vāyu, Yama, Agni, Varuṇa, Śaśāṅka (Moon), Prajāpati (Lord of the creatures) and the great grandfather. Salutations! Salutations be to You a thousand times; salutation to You again and again! Salutation!

वेदास्स्वांगोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాంగోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṃgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

9 మే, 2014

552. సఙ్కర్షణః అచ్యుతః, सङ्कर्षणः अच्युतः, Saṅkarṣaṇaḥ Acyutaḥ

ఓం సఙ్కర్షణాచ్యుతాయ నమః | ॐ सङ्कर्षणाच्युताय नमः | OM Saṅkarṣaṇācyutāya namaḥ


సంహారకాలే యుగపత్ ప్రజాః సఙ్కర్షతీతిసః ।
న చ్యోతతి స్వరూపాత్స ఇతి సఙ్కర్షణోఽచ్యుతః ।
సఙ్కర్షణోఽచ్యుత ఇతి నామైకం సవిశేషణమ్ ॥

ప్రళయ సమయమున అఖిల ప్రాణులను తన దగ్గరకు లెస్సగా లాగికొనునుగనుక సంకర్షణః. తన స్థితినుండి తొలగడుగనుక అచ్యుతుడు. ఈ రెండు నామములును కలిసి సవిశేషణము అగు ఒకే నామము.



संहारकाले युगपत् प्रजाः सङ्कर्षतीतिसः ।
न च्योतति स्वरूपात्स इति सङ्कर्षणोऽच्युतः ।
सङ्कर्षणोऽच्युत इति नामैकं सविशेषणम् ॥

Saṃhārakāle yugapat prajāḥ saṅkarṣatītisaḥ,
Na cyotati svarūpātsa iti saṅkarṣaṇo’cyutaḥ,
Saṅkarṣaṇo’cyuta iti nāmaikaṃ saviśeṣaṇam.

At the time of annihilation of the worlds, He draws all beings to Himself and hence He is Saṅkarṣaṇaḥ. As He does not slide down from His nature and is infallible, He is Acyutaḥ. Saṅkarṣaṇācyutaḥ is one name with an adjective.

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

8 మే, 2014

551. దృఢః, दृढः, Dr̥ḍaḥ

ఓం దృఢాయ నమః | ॐ दृढाय नमः | OM Dr̥ḍāya namaḥ


దృఢః, दृढः, Dr̥ḍaḥ

స్వరూపసామర్థ్యాదేః ప్రచ్యుత్యభావాద్ దృఢో హరిః తన స్వరూపమునుండి కాని తన సామర్థ్యమునుండిగాని ప్రచ్యుతి అనగా తొలగుట లేని గట్టివాడు.

:: శ్రీమద్రామాయణే కిష్కిన్దకాణ్డే సప్తదశః సర్గః ॥
రామః కరుణవేదీ చ ప్రజానాం చ హితే రతః ।
సానుక్రోశో జితోత్సాహః సమయజ్ఞో దృఢవ్రతః ।
ఇతి తే సర్వభూతాని కథయన్తి యశో భువిః ॥ 16 ॥

శ్రీరాముడు కనికరముతో ఆశ్రితులను కాపాడుచుండువాడు. ఎల్లప్పుడును ప్రజలహితమునకే పాటుపడువాడు, దయామయుడు, గొప్ప ఉత్సాహశక్తిగలవాడు, సదాచారసంపన్నుడు. చేపట్టిన దీక్షను విడువనివాడు అని సకల ప్రాణులును ఈ భూమండలమున నీ కీర్తిని గానము చేయుచుందురు.



स्वरूपसामर्थ्यादेः प्रच्युत्यभावाद् दृढो हरिः / Svarūpasāmarthyādeḥ pracyutyabhāvād dr̥ḍo hariḥ Firm because there is no sliding in His nature or capacity.

:: श्रीमद्रामायणे किष्किन्दकाण्डे सप्तदशः सर्गः ॥
रामः करुणवेदी च प्रजानां च हिते रतः ।
सानुक्रोशो जितोत्साहः समयज्ञो दृढव्रतः ।
इति ते सर्वभूतानि कथयन्ति यशो भुविः ॥ १६ ॥

Śrīmad Rāmāyaṇa Book IV, Chapter 17
Rāmaḥ karuṇavedī ca prajānāṃ ca hite rataḥ,
Sānukrośo jitotsāhaḥ samayajño dr̥ḍavrataḥ,
Iti te sarvabhūtāni kathayanti yaśo bhuviḥ. 16.

Rama is mindful of mercy, delighter in people's welfare, sympathetic, greatly enthusiastic and assertively committed in doing good deeds, knower of time-and-action, all these living-beings on earth are thus relating your renown, aren't they.

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

7 మే, 2014

550. కృష్ణః, कृष्णः, Kr̥ṣṇaḥ

ఓం కృష్ణాయ నమః | ॐ कृष्णाय नमः | OM Kr̥ṣṇāya namaḥ


కృష్ణః, कृष्णः, Kr̥ṣṇaḥ

కృష్ణద్వైపాయన కృష్ణ ఇతి సఙ్కీర్త్యతే బుధైః ।
ఇతి విష్ణుపురాణే శ్రీ పరాశర సమీరణాత్ ॥

కృష్ణద్వైపాయన వ్యాసుడు.

:: శ్రీ విష్ణుమహాపురాణే తృతీయాంశే చతుర్థోఽధ్యాయః ::
కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుమ్ ।
కో హ్యన్యో భువి మైత్రేయ మహాభారతకృద్భవేత్ ॥ 5 ॥

కృష్ణ ద్వైపాయన వ్యాసుని ప్రభుడగు నారాయణునిగా ఎరుగుము. ఏలయన హరికాక మరి ఇతరుడెవ్వడు మహాభారత రచయిత కాగలడు?

57. కృష్ణః, कृष्णः, Kr̥ṣṇaḥ



कृष्णद्वैपायन कृष्ण इति सङ्कीर्त्यते बुधैः ।
इति विष्णुपुराणे श्री पराशर समीरणात् ॥

Kr̥ṣṇadvaipāyana kr̥ṣṇa iti saṅkīrtyate budhaiḥ,
Iti viṣṇupurāṇe śrī parāśara samīraṇāt.

The One with dark complexion and born on an island; Kr̥ṣṇadvaipāyana i.e., Sage Vyāsa.

:: श्री विष्णुमहापुराणे तृतीयांशे चतुर्थोऽध्यायः ::
कृष्णद्वैपायनं व्यासं विद्धि नारायणं प्रभुम् ।
को ह्यन्यो भुवि मैत्रेय महाभारतकृद्भवेत् ॥ ५ ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part III, Chapter 4
Kr̥ṣṇadvaipāyanaṃ vyāsaṃ viddhi nārāyaṇaṃ prabhum,
Ko hyanyo bhuvi maitreya mahābhāratakr̥dbhavet. 5.

Know Kr̥ṣṇadvaipāyana Vyāsa to be the Lord  Nārāyaṇa. For, who other than the Puṇḍarīkākṣa could have authored Mahābhārata?

57. కృష్ణః, कृष्णः, Kr̥ṣṇaḥ

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

6 మే, 2014

549. అజితః, अजितः, Ajitaḥ

ఓం అజితాయ నమః | ॐ अजिताय नमः | OM Ajitāya namaḥ


అజితః, अजितः, Ajitaḥ

న కేనాప్యవతారేషు జిత ఇత్యజితః స్మృతః ఏ అవతారముయందును ఎవరిచేతనూ జయించబడనివాడు అజితః.

:: శ్రీమద్రామాయణే యుద్ధ కాణ్డే విశన్త్యుత్తరశతతమః సర్గః ::
శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః ।
అజితః ఖడ్గదృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః ॥ 16 ॥
సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధిః క్షమా దమః ।
ప్రభవశ్చాఽప్యయశ్చ త్వమ్ ఉపేన్ద్రో మధుసూదనః ॥ 17 ॥

'శార్ఙ్గము' అను ధనుస్సును ధరించువాడవు, ఇంద్రియములను జయించినవాడవు, సర్వప్రాణుల హృదయములయందు నివసించియుండువాడవు. నిత్యానిత్యవస్తువులకు అతీతుడవైన పరమాత్మవు. ఆశ్రితులను రక్షించుటయందు భంగపాటు లేనివాడవు. ఎవ్వరిచే జయించబడనివాడవు. 'నందకము' అను ఖడ్గమును కలిగియుండువాడవు, విశ్వమునందంతటను వ్యాపించియుండువాడవు, జగత్తునకు ఊరట గూర్చువాడవు, మిగుల బలశాలివి, దేవతల సేనలకు సర్వాధిపతివి, సమస్తప్రాణికోటిని నడిపించువాడవు, సదసద్వీక్షణుడవు, శుద్ధ సత్త్వ స్వరూపుడవు. ఆశ్రితుల అపరాధములను మన్నించువాడవు. ఇంద్రియ నిగ్రహముగలవాడవు. జగదుద్పత్తికి స్థానమైనవాడవు. సర్వజగత్తునకు లయస్థానమైనవాడవు. ఇంద్రునకు సోదరుడిగా అవతరించిన ఉపేంద్రుడవు. 'మధువు' అను రాక్షసుడిని సంహరించినవాడవు.



न केनाप्यवतारेषु जित इत्यजितः स्मृतः / Na kenāpyavatāreṣu jita ityajitaḥ smr̥taḥ In no incarnation has he been conquered and hence He is Ajitaḥ.

:: श्रीमद्रामायणे युद्ध काण्डे विशन्त्युत्तरशततमः सर्गः ::
शार्ङ्गधन्वा हृषीकेशः पुरुषः पुरुषोत्तमः ।
अजितः खड्गदृद्विष्णुः कृष्णश्चैव बृहद्बलः ॥ १६ ॥
सेनानीर्ग्रामणीश्च त्वं बुद्धिः क्षमा दमः ।
प्रभवश्चाऽप्ययश्च त्वम् उपेन्द्रो मधुसूदनः ॥ १७ ॥

Śrīmad Rāmāyaṇa - Book VI, Chapter 120
Śārṅgadhanvā hr̥ṣīkeśaḥ puruṣaḥ puruṣottamaḥ,
Ajitaḥ khaḍgadr̥dviṣṇuḥ kr̥ṣṇaścaiva br̥hadbalaḥ. 16.
Senānīrgrāmaṇīśca tvaṃ buddhiḥ kṣamā damaḥ,
Prabhavaścā’pyayaśca tvam upendro madhusūdanaḥ. 17.

You are the wielder of a bow called Śārṅga, the lord of the senses, the supreme soul of the universe, the best of men, the invincible, the wielder of a sword named Nandaka, the all-pervader, the bestower of happiness to the earth and endowed with great might.

You are the leader of the army and the village headman. You are the intellect. You are the endurance and the subduer of the senses. You are the origin and the dissolution of all, Upendra the Divine Dwarf and the younger brother of Indra as also the destroyer of Madhu, the demon.

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

5 మే, 2014

548. స్వాఙ్గః, स्वाङ्गः, Svāṅgaḥ

ఓం స్వాఙ్గాయ నమః | ॐ स्वाङ्गाय नमः | OM Svāṅgāya namaḥ


న కేనాప్యవతారేషు జిత ఇత్యజితః స్మృతః స్వం అనగా తనే లేదా తానే. సృష్ట్యాదికార్యములందు సహకరించు అంగముగా తానే ఎవ్వనికిగలడో అట్టివాడు స్వాఙ్గః. విష్ణువు తను నిర్వహించు ప్రతీ కృత్యమునందూ తానే సహకారి గనుక స్వాఙ్గః.



न केनाप्यवतारेषु जित इत्यजितः स्मृतः / Na kenāpyavatāreṣu jita ityajitaḥ smr̥taḥ He who is the instrument of oneself is Svāṅgaḥ. Since Lord Viṣṇu is the instrument for Himself in actions like creation etc., He is called Svāṅgaḥ.

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

4 మే, 2014

547. వేధాః, वेधाः, Vedhāḥ

ఓం వేధసే నమః | ॐ वेधसे नमः | OM Vedhase namaḥ


వేధాః, वेधाः, Vedhāḥ

వేధా విధానాత్ పృషోదరాదిత్వాత్ సాధుతోచ్యతే లోకములను సృజించును అను వ్యుత్పత్తిచే విధాతా - వేధాః - రెండు రూపములును అగును. వేధాః అను రూపము వృషోదరాది గణమునందు పఠింపబడుచు సాధు రూపమే యగును.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
తే. సర్వ సత్తాయ దేవాయ సన్నిమాయ, కాయ బహిర న్తరాత్మనే కారణాత్మ
     నే సమస్తార్థ లిఙ్గాయ నిర్గుణాయ, వేధసే జితాత్మక సాధవే నమోఽస్తు. (704)

నీవు సర్వ సత్త్వుడవు. దేవుడవు. నియామకుడవు. బయటా లోపలా వ్యాపించి ఉంటావు. నీవు సమస్తార్థచిహ్న స్వరూపుడవు. నిర్గుణుడవు. సృష్టికర్తవు. జితాత్మక సాధు స్వరూపుడవు. నీకు నమస్కారం.



वेधा विधानात् पृषोदरादित्वात् साधुतोच्यते / Vedhā vidhānāt pr̥ṣodarāditvāt sādhutocyate As the progenitor of the worlds, He is Vidhātā - Vedhāḥ; both forms implying the same meaning.

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे सप्तदशोऽध्यायः ::
सर्गादि योऽस्यानुरुणद्धि शक्तिभिर्द्रव्यक्रियाकारकचेतनात्मभिः ।
तस्मै समुन्नद्धनिरुद्धशक्तये नमः परस्मै पुरुषाय वेधसे ॥ ३३ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 17
Sargādi yo’syānuruṇaddhi śaktibhirdravyakriyākārakacetanātmabhiḥ,
Tasmai samunnaddhaniruddhaśaktaye namaḥ parasmai puruṣāya vedhase. 33.

My dear Lord, by Your own potencies You are the original cause of the material elements, as well as the performing instruments (the senses), the workers of the senses (the controlling deities), the intelligence and the ego, as well as everything else. By Your energy You manifest this entire cosmic creation, maintain it and dissolve it. Through Your energy alone everything is sometimes manifest and sometimes not manifest. You are therefore the Supreme God, the cause of all causes. I offer my respectful obeisances unto You.

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

3 మే, 2014

546. చక్రగదాధరః, चक्रगदाधरः, Cakragadādharaḥ

ఓం చక్రగదాధరాయ నమః | ॐ चक्रगदाधराय नमः | OM Cakragadādharāya namaḥ


చక్రగదాధరః, चक्रगदाधरः, Cakragadādharaḥ

మనస్తత్త్వాత్మకం చక్రం బుద్ధితత్త్వాత్మికాం గదామ్ ।
ధారయన్ లోకరక్షకార్థముక్తశ్చక్రగదాధరః ॥

చక్రమును, గదను ధరించువాడు. మనస్తత్త్వరూపమగు చక్రమును, బుద్ధి తత్త్వమగు గదను లోక రక్షార్థము ధరించుచున్నందున విష్ణువు చక్రగదాధరుడని చెప్పబడుచున్నాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
వ. మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదర కరసరోరుహంబందు రాజహంస రుచిరంబయిన పాంచజన్యంబును, నరాతిభట శోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధురసుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకారనాద విరాజితంబైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వంబైన కౌస్తుభ మణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు, వెండియు భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్య మంగళ విగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయమండిత ముకురోపమాన నిర్మల గండ మండలంబును, సంతత శ్రీనివాసంబు లయిన లోచన పంకజంబులును గలిగి లాలితభ్రూలతాజుష్టంబును, మధుకర సమాన రుచి చికుర విరాజితంబును నైన ముఖకమలంబును ధ్యానంబు గావింపవలయు, మఱియు శరణాగతుల కభయ ప్రదంబు లగుచునెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁప వలయు. (937)

శత్రుసమూహాలకు సహింపరాని వేయి అంచుల సుదర్శన చక్రాన్నీ, సరోజనాభుని కరసరోజంలో రాజహంసవలె విరాజిల్లే పాఞ్చజన్య శంఖాన్నీ, నిశాచరుల నెత్తురు చారికలతోకూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకీగదనూ, హృదయంలో పదిలపరచుకోవాలి.

గప్పుమంటున్న క్రొంగ్రొత్త నెత్తావుల గుబుల్కొన్న కమ్మ తెమ్మరల పిలుపులందుకొని సంగీతాలు పాడే కోడె తుమ్మెదలతో కూడిన వైజయంతీ వనమాలికనూ, అఖిలలోకాలకూ ఆత్మస్వరూపమైన కౌస్తుభమణినీ, వైకుంఠనాథుని కంఠసీమలో వేర్వేరుగా ధ్యానించాలి.

భక్త రక్షణ పరాయణుడైన నారాయణుని దివ్య మంగళ స్వరూపానికి అనురూపమై మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమలతో, ఎలదేటి కదుపులవంటి నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి. ఆర్తులై శరణాగతులైన భక్తులకు అభయాన్ని ఇచ్చే చక్రపాణి పాణిపద్మాలను హృదయపద్మములో భావన చేయాలి.



मनस्तत्त्वात्मकं चक्रं बुद्धितत्त्वात्मिकां गदाम् ।
धारयन् लोकरक्षकार्थमुक्तश्चक्रगदाधरः ॥

Manastattvātmakaṃ cakraṃ buddhitattvātmikāṃ gadām,
Dhārayan lokarakṣakārthamuktaścakragadādharaḥ.

Cakram, the discuss is of the nature of manastattva; gadā the club is of the nature of the buddhi tattva. He is the bearer of the cakra and the gadā for protecting the world; so He is Cakragadādharaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे अष्टाविंशोऽध्यायः ::
बाहूंश्च मन्दरगिरेः परिवर्तनेन निर्णिक्तबाहुवलयानधिलोकपालान् ।
सञ्चिन्तयेद्दससतारमसह्यतेजः सङ्खं च तत्करसरोरुहराजहंसम् ॥ २७ ॥
कौमोदकीं भगवतो दयितां स्मरेत दिग्धमरातिभटशोणितकर्दमेन ।
मलां मधुव्रतवरूथगिरोपघुष्टां चैत्यस्य तत्त्वममलं मणिमस्य कण्ठे ॥ २८ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 28
Bāhūṃśca mandaragireḥ parivartanena nirṇiktabāhuvalayānadhilokapālān,
Sañcintayeddasasatāramasahyatejaḥ saṅkhaṃ ca tatkarasaroruharājahaṃsam. 27.
Kaumodakīṃ bhagavato dayitāṃ smareta digdhamarātibhaṭaśoṇitakardamena,
Malāṃ madhuvratavarūthagiropaghuṣṭāṃ caityasya tattvamamalaṃ maṇimasya kaṇṭhe. 28.

The yogi should further meditate upon the Lord's four arms, which are the source of all the powers of the gods who control the various functions of material nature. Then the yogi should concentrate on the polished ornaments, which were burnished by Mount Mandara as it revolved. He should also duly contemplate the Lord's discus, the Sudarśana cakra, which contains one thousand spokes and a dazzling luster, as well as the conch, which looks like a swan in His lotuslike palm.

The yogi should meditate upon His club, which is named Kaumodaki and is very dear to Him. This club smashes the demons, who are always inimical soldiers, and is smeared with their blood. One should also concentrate on the nice garland on the neck of the Lord, which is always surrounded by bumblebees, with their nice buzzing sound, and one should meditate upon the pearl necklace on the Lord's neck, which is considered to represent the pure living entities who are always engaged in His service.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

2 మే, 2014

545. గుప్తః, गुप्तः, Guptaḥ

ఓం గుప్తాయ నమః | ॐ गुप्ताय नमः | OM Guptāya namaḥ


గుప్తః, गुप्तः, Guptaḥ

వాఙ్గ్మనసాగోచరత్వాద్ గుప్త ఇత్యుచ్యతే హరిః ।
ఏష సర్వేషు భూతేషు గూఢోఽఽత్మేత్యాదికశ్రుతేః ॥

దాచబడియున్నవాడు లేదా రక్షించబడియున్నవాడు. వాక్కులకును మనస్సులకును కూడ అగోచరుడు లేదా అందరానివాడు.

:: కఠోపనిషత్ ప్రథమాఽధ్యాయః (3వ వల్లి) ::
ఏష సర్వేషు భూతేషు గూఢోఽఽత్మా న ప్రకాశతే ।
దృశ్యతే త్వగ్ర్యయా భుద్ధ్యా సూక్ష్మాయా సూక్ష్మదర్శిభిః ॥ 12 ॥

ఈ ఆత్మ సమస్త ప్రాణులయందును నిగూఢమైయున్నది. సులభముగా అందరికీ కనబడునది కాదు. సూక్ష్మదృష్టి గలవారు తీక్ష్ణమై, సూక్ష్మమైన బుద్ధితో యాత్మను దర్శించగలుగుతున్నారు.



वाङ्ग्मनसागोचरत्वाद् गुप्त इत्युच्यते हरिः ।
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मेत्यादिकश्रुतेः ॥ 

Vāṅgmanasāgocaratvād gupta ityucyate hariḥ,
Eṣa sarveṣu bhūteṣu gūḍo’’tmetyādikaśruteḥ.

The concealed, as He cannot be attained by speech and the mind.

:: कठोपनिषत् प्रथमाऽध्यायः (३व वल्लि) ::
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते ।
दृश्यते त्वग्र्यया भुद्ध्या सूक्ष्माया सूक्ष्मदर्शिभिः ॥ ३.१२ ॥

Kaṭhopaniṣat - Chapter 1
Eṣa sarveṣu bhūteṣu gūḍo’’tmā na prakāśate,
Dr̥śyate tvagryayā bhuddhyā sūkṣmāyā sūkṣmadarśibhiḥ. 3.12.

He is hidden in all beings, and hence He does not appear as the Self (of all). But by the seers of subtle things, He is seen through a pointed and fine intellect.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥