8 జన, 2013

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ

ఓం ప్రాణాయ నమః | ॐ प्राणाय नमः | OM Prāṇāya namaḥ


ప్రాణితి శ్వాసోచ్ఛ్వాసక్రియలు జరుపునది. క్షేత్రజ్ఞుడుగా జీవరూపమునందుండు విష్ణువు. లేదా జీవుల ప్రాణమునకు శక్తినిచ్చు పరమాత్మ. ముఖ్యప్రాణము అని కూడా అర్థము.

:: బృహదారణ్యకోపనిషత్ - చతుర్థాధ్యాయః - చతుర్థం బ్రాహ్మణం ::
ప్రాణస్య ప్రాణముత చక్షుష శ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం । మనసో యే మనోవిదుః । తే నిచిక్యుః బ్రహ్మ పురాణ మగ్ర్యం ॥ 18 ॥

అక్షర రూపమగునది ఏది ప్రాణమునకు ప్రాణమో (ప్రాణ వ్యాపారమునకు ఆధారమో), నేత్రమునకు నేత్రమో, శ్రోత్రమునకు (చెవికి) శ్రోత్రమో, మనస్సునకే మనస్సువంటిదో అద్దానిని తెలిసికొనినవారే పరబ్రహ్మమును నిశ్చయముగా దెలిపికొనువారు.

:: ఛాందోగ్యోపనిషత్ - పంచమః ప్రపాఠకః, ప్రథమ ఖండః ::
నవై వాచో నచక్షూంషి నశ్రోత్రాణి నమనాంసీత్యాచక్షతే ప్రాణా ఇత్యేవాచక్షతే ప్రాణో హ్యే వైతాని సర్వాణి భవతి ॥ 15 ॥

వాగింద్రియము, నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము, మనస్సు - ఇవన్నియు ప్రత్యేకముగా చైతన్యము కలిగి యుండవు. వీటన్నింటిని ప్రాణములని ప్రజలు పిలిచెదరు. ఈ ఇంద్రియములన్నియు ప్రాణమే గానీ, వేరు కాదు.



Prāṇiti Breathes. The name may refer to Kṣetrajña, the Jīva or the Paramātma. It may also mean Mukhyaprāṇa, the life principle.

Br̥hadāraṇyakopaniṣat - Section 4, Brāhmaṇa 4
Prāṇasya prāṇamuta cakṣuṣa ścakṣuruta śrotrasya śrotraṃ, manaso ye manoviduḥ, Te nicikyuḥ brahma purāṇa magryaṃ. (18)

Those who have known the Vital Force of the vital force, the Eye of the eye, the Ear of the ear and the Mind of the mind, have realized the ancient, primodial Brahman.

Chāndogyopaniṣat - 5.1
Navai vāco nacakṣūṃṣi naśrotrāṇi namanāṃsītyācakṣate prāṇā ityevācakṣate prāṇo hye vaitāni sarvāṇi bhavati. (15)

In the body of a living being neither the power to speak, nor the power to see, nor the power to hear, nor the power to think is the prime factor; it is life which is the center of all activities.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి