5 నవం, 2012

2. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ

ఓం విష్ణవే నమః | ॐ विष्णवे नमः | OM Viṣṇavē namaḥ


విశ్వ శబ్దముచే చెప్పబడదగు తత్వము ఏది అన్న ప్రశ్నకు 'విష్ణుః' అన్నదానిని సమాధానముగా చెబుతారు. వేవేష్టి - వ్యాప్నోతి అని విష్ణు శబ్ద వ్యుత్పత్తి. ప్రవేశించు - అను అర్థమునిచ్చు 'విశ్‌' (విశ) ధాతువునుండి 'ను' (క్‌) ప్రత్యయము చేరుటచే 'విష్ణు' అగుననియు చెప్పదగును.

:: విష్ణు పురాణం - తృతీయ అంశము, మొదటి అధ్యాయము ::
యస్మాద్విష్టమిదం విశ్వం యస్య శక్త్యా మహాత్మనః ।
తస్మాత్స ప్రోచ్యతే విష్ణుర్విశేర్ధాతోః  ప్రవేశనాత్ ॥ 45 ॥


ఈ సర్వమును ఆ మహాత్ముని శక్తిచే ప్రవేశించబడి యుండుటచే - ప్రవేశము అను అర్థమును ఇచ్చు 'విశ' ధాతువునుండి ఏర్పడిన 'విష్ణు' శబ్దముచే అతడు చెప్పబడుచున్నాడు.

ప్రవేశయతి స్వశక్తిం ఇమం ప్రపంచమ్‌ స్వశక్తిని ఈ ప్రపంచమున ప్రవేశింపజేయుచున్నాడు. ఆ విషయమును సమర్థించునదిగా ఋగ్వేదమునందు...

తము స్తోతారః పూర్వ్యమ్ యథావిద
ఋతస్య గర్భమ్ జనుషా పిపర్తన ।
ఆఽస్య జానన్తో నామ చిద్వివక్తన
మహస్తే విష్ణో సుమతిమ్ భజామహే ॥

(ఋగ్వే. 2-2-26) ఈ ఋక్కునకు అర్థము: అత్యంత ప్రాచీనుడగు అతనినే స్తుతించుచున్నవారగుచు సత్యమునకు సంబంధించిన సారభూతతత్వమును ఎట్లు ఉన్న దానిని అట్లే ఎరిగిన వారగుచు జన్మతో సమాప్తినందిన వారు అగుడు (లేదా జన్మరాహిత్యమునొందుడు). (తత్వమును) ఎరిగినవారగుచు సమగ్రముగా (లేదా ఎల్లప్పుడును) ఈతని (విష్ణుని) నామమును కూడ పలుకుచునేయుండుడు. ఓ విష్ణు! ఇతరులు నీ నామమును ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా శోభనమగు నీ తేజమును సేవింతుము.

ఈ మొదలగు శ్రుతులచే విష్ణుని నామ సంకీర్తనము సమ్యగ్‌ఙ్ఞాన ప్రాప్తికై (సరియగు తత్వ ఙ్ఞానము లభించుటకై) సాధనముగా చెప్పబడినది.

వ్యాసుడిని భాగవత రచన చేయమని ప్రేరణనందిస్తున్న నారదులవారు చెప్పిన మాటలు - పోతన భాగవతము.

సీ.విష్ణుండు విశ్వంబు; విష్ణుని కంటెను వేఱేమియును లేదు; విశ్వమునకు
భవవృద్ధి లయము లా పరమేశుచే నగు; నీ వెరుంగుదు గాదె నీ ముఖమున
నెఱిఁగింపఁ బడ్డది యేక దేశమున నీ భువన భద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము; రమణతో హరిపరాక్రమము లెల్ల.
ఆ.వినుతిసేయు మీవు వినికియుఁజదువును, దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుఁ, గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.

ఈ విశ్వమంతా విష్ణుమయం. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె అన్యమైనది ఏదీ లేదు. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి, స్థితి, సంహారాలు ఎర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు! నీకు తెలియనిది ఏమున్నది? నీవే ఒక చోట ఒక విషయాన్ని చెప్పి ఉన్నావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను సంస్తుతించు. మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన కమలనాభుని స్తుతించటమే.



When the question arises who is it that has become Viśvam, the All, the answer is given that it is Viṣṇuḥ.  As he pervades everything, vēvēṣṭi, He is called Viṣṇu. The term Viṣṇu is derived from the root viś (indicating presence everywhere) combined with the suffix nuk. So the Viṣṇu Purāṇa says:

Viṣṇu Purāṇa
Yasmādviṣṭamidaṃ viśvaṃ yasya śaktyā mahātmanaḥ,
Tasmātsa procyate viṣṇurviśerdhātoḥ praveśanāt. (3.1.45)

The power of  that Supreme Being has entered within the Universe. The root Viś means 'enter into'.

The following R̥igvēdic mantra (2.2.26) also advocates the adoration of Viṣṇu for the attainment of spiritual enlightenment:

Tamu stōtāraḥ pūrvyam yathāvida
R̥itasya garbham januṣā pipartana,
Ā’sya jānantō nāma cidvivaktana
Mahastē  Viṣṇō sumatim bhajāmahē.

It means: O hymnists! Put an end to your recurring births by attaining the real knowledge of that Ancient Being who is eternal and true. Understanding these names Viṣṇu, repeat them always. Let other people repeat or not repeat. Thy holy names; we, O Viṣṇu, shall adore Thy charming effulgence.

विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః  ॥ 1 ॥

Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి